'A Ammaye Navvithe' New Telugu Story
Written By Kidala Sivakrishna
ఆ అమ్మాయే నవ్వితే తెలుగు కథ
రచన: కిడాల శివకృష్ణ
(ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)
బ్రహ్మనందం గారు తన భార్య సుందరితో కాఫీ కేఫ్ లో కాఫీ తాగుతున్నారు.
తన భార్య సుందరి “వెళ్దామా అండీ?” అంది.
బ్రహ్మనందం గారు “సరే వెళ్దాం, ఇంటికి..” అన్నాడు.
సుందరి “ఇంటికి కాదు, షాపింగ్ కి” అంది.
“సరే పదా.. మోయాల్సిందే కదా” అన్నాడు బ్రహ్మనందం.
“ఏమిటండీ అన్నారు..?” అంది సుందరి.
“అబ్బే.. ఏమిలేదే నా ముద్దుల పెళ్ళామా.. బరువు బాధ్యతలు మోయాల్సిందే కదా.. అని అంటున్నాను” అన్నాడు బ్రహ్మనందం.
“సర్లేండి, పదండి..” అంటూ వెళ్ళిపోయారు షాపింగ్ మాల్ కి. అక్కడ సుందరి కొన్ని వస్తువులు కొంటుంది తన భర్త బ్రహ్మనందం గారికి కూడాను.
“నేను మన ఇద్ధరికి కావాల్సిన వస్తువులు కొంటున్నాను. మీరు కూడా నాకోసం ఏమైనా కొనివచ్చు కదా” అంటూ అడిగింది.
“నువ్వు కొనాల్సినవి ఇంకా ఉన్నాయా..” అంటూ నోట్లో చిన్నగా అనుకున్నాడు బ్రహ్మనందం గారు.
“ఏంటండీ?” అంది సుందరి.
“అబ్బే.. అదేం లేదు సుందరి” అంటూ ఒక అమ్మాయి వైపు చూస్తూ “ఆ అమ్మాయే నవ్వితే ఏమైనా కొనిస్తాను” అన్నాడు బ్రహ్మనందం గారు.
“ఏ అమ్మాయి అండి.. నన్ను మోసం చేసేలా ఉన్నారు” అంది సుందరి.
“అక్కడకు రా చూపిస్తా” అంటూ ఒక అమ్మాయి ఉన్న దగ్గరకు తీసుకెళ్ళాడు బ్రహ్మనందం.
“ఆ అమ్మాయి యేనా అండి” అంటూ ఉంది సుందరి. “అమ్మాయ్.. నువ్వు కొంచెం పక్కకి జరుగు” అంటూ అద్దంలో ఉన్న తన భార్య సుందరిని చూపిస్తూ “ఆ అమ్మాయే నవ్వితే ఏమైనా చేస్తాను, ఆ అమ్మాయి నవ్వు కోసం ఏమైనా కొంటాను. చూశావే ఎలా ఉందో ఆ అమ్మాయి నవ్వుతుంటే, ఎంత ముద్దుగా ఉందో” అన్నాడు బ్రహ్మనందం. (మనస్సులో బ్రతికిపోయా అనుకున్నాడు బ్రహ్మనందం) .
ఆ మాటలకు సుందరి తెగ సంబరపడుతూ నవ్వుకుంటూ “ఎప్పుడూ సరసాలే.. వెళ్దాం పదండి” అంది.
సంతోషంగా ఇల్లు చేరుకున్నారు బ్రాహ్మనందం, సుందరి గారు.
సర్వే జనా సుఖినోభవంతు
***
కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
30/10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ నవతరం రచయిత బిరుదు పొందారు.
Comments