'Aa Patha Madhuram' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 16/08/2024
'ఆ పాత మధురం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"కట్టుకున్న భర్తని సుపారీ ఇచ్చి చంపించిన భార్య.. ఏమిటో ఈ రోజుల్లో ఈ ఆడవారు ఇలా తయారయ్యారు.. ?" అంటూ పేపర్ లో న్యూస్ బయటకు చదువుతున్నాడు గిరి.
"అదే పేపర్లో పక్క పేజీలో చూడండి.. ఎక్కువ కట్నం ఇవ్వలేదని, పెళ్ళాన్ని.. అడ్డొచ్చిన అత్తను చంపిన భర్త.. ఆ న్యూస్ కనిపించలేదా తమరికి పాపం?" అంది పక్కనే ఉన్న పెళ్ళాం కావేరి
"అవును మరి.. మొగుడు కన్నా.. మిగతా మగాళ్ళందరూ అందంగా కనిపిస్తారేమో మీ ఆడవారికి.. అందుకే పాపం చంపించేస్తున్నారు.. !"
"మరి.. పెళ్ళాం కన్నా మిగతా ఆడవారు అంతా అందంగా, ఇంపుగా కనిపించట్లేదూ.. మీ మగవారికి.. అందుకేనేమో వారి మోజులో పడి.. కట్టుకున్న పెళ్ళాన్ని చంపేస్తున్నారు.. ఎంతటి వారైనా కాంత దాసులే కదా.. " అంది కావేరి
"నేను మాత్రం అలాంటి వాడిని కాదోయ్ శ్రీమతి గారు.. అయినా, ఎక్కడో జరిగిన దానికి మనం కొట్టుకోవడం దేనికి.. ఈ కలికాలంలో.. ఈ లోకం మొత్తం ఇలాగే ఉంది. పాత రోజుల్లో మంచివాళ్ళలో ఎక్కడో నామమాత్రానికి చెడ్డవారు ఉండేవారు. ఇప్పుడేమో ఉన్న చెడ్డవారిలో భూతద్దంతో వెతికినా, మంచివారి జాడే లేదోయ్.. ఎక్కడో కోటికొక్కరు ఉంటారేమో.. నాలాగ. ఏమిటో ఈ వార్తలు.. పేపర్ లోనూ అవే.. టీవీ లోనూ అవే.
మొన్నటికి మొన్న.. చిన్న ఆడపిల్లల పై మగవారి అఘాయిత్యాలు.. బంగారం కోసం హత్యలు.. చైన్ స్నాచింగ్స్, భూమి కోసం హత్యలు, కక్ష పూరిత హత్యలు. ప్రేమ తిరస్కరించిందని ఆడవారి పై యాసిడ్ దాడులు.. హత్యాయత్నాలు. ఇంకా.. నేటి తరం చిన్నపిల్లలు, యువత.. చిన్న చిన్న ఇబ్బందులకే ఆత్మహత్యలు.. ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలు.. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో ఆత్మహత్యలు. ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ వస్తే సూసైడ్.. జీవితం ఎంతో విలువైనదని ఎప్పుడు అర్ధం చేసుకుంటారో.. !
మరో పక్క మందు, సిగరెట్, డ్రగ్స్ కు బానిసలవుతున్న జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. తాగి బండి నడపి.. యాక్సిడెంట్లు చేసి జనాల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు. మత్తు లో కొట్టుకోవడం, చంపుకోవడం.. క్రైమ్ న్యూస్ లో కామన్ అయిపోయాయి.
ఒకరిని చంపడానికో.. బలవంతంగా ప్రాణం తీసుకోవడానికో అయితే.. మనిషిగా పుట్టడం ఎందుకో.. ? మనిషికి ఎంత డబ్బున్నా సుఖం లేదు.. తృప్తి లేదు. ఇంకా డబ్బు కోసం ఆరాటం.. దానికోసం మోసాలు.. ఘోరాలు.. కల్తీలు. ఎక్కడో గాని మంచివారు కనిపించట్లేదు. ఉన్నా.. ఈ ప్రపంచాన్ని చూసి, వారూ మారిపోక తప్పదు.
కావేరి.. ! ఏమిటో ఈ కాలంలో రోజులు చూస్తుంటే.. భయమేస్తోంది.. "
"ఎందుకండీ అంతలాగా ఫీల్ అవుతున్నారు?"
"ఏం చెయ్యమంటావు.. ? టెక్నాలజీ అంటూ మనిషి చాలా డెవలప్ ఐనా.. మనిషిగా ఉండాలన్న ప్రకృతి ధర్మానికి మాత్రం రోజు రోజుకూ దూరం అయిపోతున్నాడు. నీకు తెలియనిది ఏముంది చెప్పు.. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలే కదా.. మంచితనం లోకంలో కరువైంది. ఒక మనిషి ఇంకొక మనిషిని మోసం చెయ్యడం.. దోచుకోవడమే. మానవత్వం కనుచూపు మేరలో కుడా ఉండట్లేదు.
మనుషులతో మంచిగా ఉండాల్సిన ప్రకృతి ధర్మం, దేవుడు ప్రసాదించిన ప్రకృతిని కాపాడుకోవడం.. రెండిటిని మనిషి ఏనాడో మరచాడు. సాటి మనిషి అపాయంలో ఉన్నా.. పట్టించుకోకుండా తన స్వార్ధం చూసుకుంటున్నాడు. ప్రకృతిని కుడా హింసించి నాశనం చేస్తున్నాడు. కోపం వస్తే, ఆ ప్రకృతి కుడా విలయ తాండవం చేస్తుంది కదా మరి.. !"
"అంతలాగా ఎందుకు అనిపిస్తోంది.. ? కొంచం వివరంగా చెప్పండి వింటాను.. "
"నా చిన్నతనంలో వానలు టైం కి వచ్చేవి. రైతులు లెక్క ప్రకారం పంటలు వేసేవాళ్ళు. వర్షాలు బాగా కురిసేవి.. పంటలూ బాగా పండేవి. నీటి సమస్య ఉండేది కాదు.. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణమే. ఈ కాలంలో, ఎప్పుడు వానలు పడతాయో తెలియట్లేదు.. ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు. వాతావరణశాఖ హెచ్చరించినా.. మనిషి ప్రకృతికి తలవంచక తప్పదు.. అందరం భరించాల్సిందే.. ఆ నష్టం.. ఆ కష్టం.. "
"ఇదంతా నేనూ ఒప్పుకుంటాను. అవును.. ఈ రోజుల్లో వర్షాకాలం లో వర్షాలు సరిగ్గా కురవట్లేదు.. కురిస్తే, ఒకేసారి ఊరినే ముంచేస్తున్నాయి.. రైతులకి ఎప్పుడూ కన్నీరే మిగులుతున్నాది.. " అంది కావేరి
"మరి ఎండాకాలంలో ఎండలు.. బాగా మండిపోతున్నాయి. జనాలు వేడికి ఉండలేకపోతున్నారు. కొంతమంది వేడికి తట్టుకోలేక మరణిస్తున్నారు. నా చిన్నతనంలో ఇంత వేడి లేదు.. అప్పట్లో చెట్లు బాగా ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఇప్పుడైతే, గ్లోబల్ వార్మింగ్ చేత అన్నీ తిప్పలే. దేశంలో ఒక చోట ఎండలు మండిపోతుంటే, వేరే చోట వర్షాలు.. వరదలు. కాంక్రీట్ జంగల్ గా మారుతున్న మన దేశంలో.. పాపం.. చెట్లు ఉండడానికి స్టానం కరువైంది. పేరుకే మొక్కలు నాటడం అంతే.. !
మరోపక్క పొల్యూషన్.. నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం.. పంచభూతాలు కాలుష్యమే.. ఇదంతా చేసి మనిషి సాధించినదేమిటి.. ? జబ్బులు, రోగాలు, అల్పాయిషు జీవితాలు.
ఎక్కడ చూసినా అన్నీ కల్తీయే. బయట ఏమి కొనాలన్నా, ఏమి తినాలన్నా భయమే. మనిషి ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి అన్నీ. డబ్బు కోసం అన్నీ కల్తీ చేసేస్తున్నారు. మనుషుల మనసులు కుడా కల్తీ మయమే. ఎంత బతికినా, చివరకు కలిసేది మట్టిలోనే. పోతూ ఏమీ వెంట తీసుకుని వెళ్ళలేమనీ అందరికీ తెలుసు.
టైం మెషిన్ సహాయంతో ఒక యాభై అరవై సంవత్సరాలు వెనక్కు పొతే బాగున్ను. అప్పుడు టెక్నాలజీ పెద్దగా లేకపోయినా.. కాలుష్యం లేని వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి.. ప్రశాంతమైన జీవితం.. కల్తీ లేని ప్రేమలు.. కలుషితం లేని ప్రపంచంలో కొన్ని రోజులు బతికినా ఆనందమే కావేరి.. !"
"సైంటిస్ట్ అయిన మీరు.. చాలా సంవత్సరాల నుంచి టైం మెషిన్ కోసం చేస్తున్న ప్రయత్నం నాకు తెలియదా చెప్పండి.. ! మీ ప్రయత్నం సక్సెస్ అయిన తర్వాత, నన్ను కూడా ఆ టైం మెషిన్ లో మీ వెంటే తీసుకుపొండి.. " అంది కావేరి
*********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments