'Aa Roju Rathri - Part 1/3' - New Telugu Story Written By Shilpa Naik
Published In manatelugukathalu.com On 20/06/2024
'ఆ రోజు రాత్రి 1/3' పెద్ద కథ ప్రారంభం
రచన: శిల్పా నాయక్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
నాగవల్లిక ఘోస్ట్ ఎక్సప్లోరింగ్ వీడియోస్ ని అప్‌లోడ్ చేసే ఒక్క యుట్యూబర్. తను, తన స్నేహితులైన అభి, మైన, గోపాల్ తో కలిసి మనుషుల సంచారం లేని ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్ చేస్తూ వాటిని వీడియోస్ తీస్తూ యుట్యూబ్ లో అప్‌లోడ్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. తనకు యుట్యూబ్ లో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అభి పని, గోపాల్ తో కలిసి లొకేషన్ వెతకడం. ఆ లొకేషన్ ని మధ్యాహ్నం చూసి కన్ఫర్మ్ చేయడం తన పని. మరుసటి రాత్రి అందరు వెళ్లి ఆ ప్రాంతాల్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ వీడియో తీస్తారు. ఆ వీడియోలో లేని దెయ్యాలని ఉన్నట్టు ఎడిట్ చేసి యుట్యూబ్ లో అప్‌లోడ్ చేయడం ముఖ్యమైన పని. ఇలా అందరు కలిసి ‘ద హాంటింగ్ ఇండియా’ అనే ఛానల్ ని 3 సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ఐన సందర్బంగా అందరూ సెలెబ్రేట్ చేసుకోవాలని నాగవల్లిక తన ఇంటి టెర్రస్ పైన పార్టీ ని ఆరెంజ్ చేస్తుంది.
పార్టీ రాత్రి 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. ముందుగా గోపాల్ అండ్ మైన కేక్ తీసుకొని వస్తారు. వాళ్లని చూసి నాగవల్లిక చాలా సంతోషించి, అభి ఎక్కడని అడుగుతుంది.
“మాకు తెలీదు వల్లి, నేను బేకరీ షాప్ లో ఉన్నప్పుడు ఒకసారి వాడికి కాల్ చేశా. కాని కాల్ లిఫ్ట్ చెయ్యలేదు. నువ్వు ఒకసారి కాల్ చెయ్. మేము కేక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తాం” అని గోపాల్ అనడం తో వల్లి, అభి కి కాల్ చేసింది.
ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వల్లి మళ్ళీ కాల్ ట్రై చేద్దాం అని అనుకొని కాల్ డయల్ చేసేలోపే ఇంటి కింద ఎవరో బైక్ పార్క్ చేసినట్టు అనిపిస్తుంది. వల్లి కిందికి వంగి చూస్తోంది. వచ్చింది అభి. అభి తో పాటే ఇంకో వ్యక్తి రావడం గమినించిన వల్లి, "అభి, నీతో ఉన్నది ఎవరు?" అని అరిచింది.
ఆ మాటలకు అభి, అభి తో పాటే వచ్చిన ఆ వ్యక్తి కూడా పైకి చూస్తారు. చూడడానికి ఆ వ్యక్తి చాలా అందంగా ఉంటాడు. ముఖ్యంగా అతని కళ్ళు.
"వల్లీ! తను నా ఫ్రెండ్ వాసు. మిగతా విషయాలు పైకి వచ్చి చెప్తా " అని అభి, వాసు టెర్రస్ పైకి చేరుకుంటారు.
"వాడు నా రూమ్మేట్. పార్టీ కి వెళదాం అనుకునే లోపు బైక్ పాడయ్యింది. వాసు నే ఇక్కడి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. థాంక్స్ చెప్పే లోపే నువ్వు పిలిచావ్. నీకు విషయం మొత్తం చెప్పడానికి వాడిని కూడా తీస్కోచ్చా" అని అభి జరిగింది మొత్తం అందరికీ చెప్పాడు.
"నేనిక వెళ్తాను" అని వాసు వెళ్ళేలోపు వల్లి, "ఆగండి! మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ జరిగే కేక్ కటింగ్ ని రికార్డు చేస్తారా? మాకొక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో ఈ రికార్డింగ్ ని అప్లోడ్ చెయ్యాలి. అందరం ఒకేసారి కేక్ కట్ చెయ్యాలని అనుకుంటున్నాం కానీ కెమెరా యాంగిల్ బాగోలేదు. అందుకే మీరు కాస్త వీడియో రికార్డు చేస్తే.. జస్ట్ 10 మినిట్స్ లో అయిపోతుంది" అని సంకోచంగా అడిగింది.
ఆ మాటలకి వాసు ఆలోచనలో పడ్డాడు. వల్లి మాటలకి గోపాల్, అభి, మైనా కూడా అయోమయం లో పడ్డారు. ఎందుకంటే స్టాండ్ పైన నుంచి కెమెరా యాంగిల్ ని వాళ్ళు నిన్నే చెక్ చేశారు. మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది. కాని ఈరోజు వల్లి అలా మాట్లాడడం వారికి అర్ధం కాలేదు.
ఇదిలా ఉండగా వాసు, "ఓకే, జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉంటాను. ఎందుకంటే నేను మళ్లీ వేరే చోటుకి వెళ్ళాలి" చెప్తాడు.
దానికి వల్లి, "10 మినిట్స్ లో మొత్తం అయిపోతుంది, ఐ ప్రామిస్" అని నవ్వుతూ సమాధానమిస్తుంది.
"సరే, నేను వెళ్లి బైక్ ని కరెక్ట్ గ పార్క్ చేసి వస్తా. " అని వాసు కిందకి వెళ్తాడు.
వాసు అలా వెళ్లగానే మైన, "నిన్ననే కదా కెమెరా యాంగిల్ చెక్ చేసి ఓకే చెప్పావ్.. ఈరోజు ఏంటి వాడిని వీడియో షూట్ చేయమని అడుగుతున్నావు? " అని మెల్లగా అడిగింది.
వల్లి గోపాల్, అభి ల వైపు చూస్తూ మీకు కూడా ఇదే డౌటా? అన్నట్టు చూస్తుంది. ఇద్దరు అవున్నటు తల ఊపారు.
వల్లి కిందికి వంగి వాసు ని చూస్తుంది. వాసు తన బైక్ ని కరెక్ట్ ప్లేస్ లో పార్క్ చేస్తున్నాడు. అప్పుడే వల్లి తన ఫ్రెండ్స్ వైపు తిరిగి, "ఈ మధ్య మనం అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కి ఎక్కువు వ్యూస్ రావట్లేదు. కామెంట్స్ కూడా దాదాపుగా నెగటివ్ గానే వస్తున్నాయి. ఇలాంటి టైం లో వీడియో ఎడిటింగ్ లో దెయ్యాలని యాడ్ చెయ్యడం కన్నా రియల్ లొకేషన్ లో ఎవరైనా ఆరెంజ్ చేసి సౌండ్స్ క్రియేట్ చేయిస్తే మన కంటెంట్ కి వేరే లెవెల్ లో రీచ్ వస్తుంది. అందుకే బయట మనిషి కన్నా అభి ఫ్రెండ్ అయిన వాసూయే కరెక్ట్ మనిషని నాకు అనిపించింది. ముందు ఆ వాసు ని మెల్లగా మాటల్లోకి దించి ఒక 3-4 గంటలు మాకోసం పని చేస్తే 5కే మనీ ఇస్తామని, ఆఫర్ ఇద్దామని అనుకోని తనని ఇక్కడే లాక్ చేశా. ఎలా ఉంది నా ఐడియా?" అని వల్లి తన ప్లాన్ అంత రెవీల్ చేస్తుంది.
అందరు సూపర్ గా ఉంది అన్నట్టు తల ఊపారు. అప్పుడే వాసు పైకి రావడం గమినించిన గోపాల్ అందరిని సైలెంట్ గా ఉండమని సైగ చేస్తాడు.
వాసు రాగానే కెమెరా ఎక్కడని అడుగుతాడు.
తన స్పీడ్ చుసిన వల్లి, " అరే! అంత తొందరెందుకు?ఇప్పుడు టైం ఎనిమిదే ఐయ్యింది. అప్పుడే కేక్ కట్ చేసి, తిని, పడుకోవాలా? " అని నవ్వుతూ సమాధానమిస్తుంది.
ఆ మాటలకి వాసు, "మరి అంత సేపు ఏం చేయాలి?" అని కొంచెం అసహనంగా అడుగుతాడు.
వాసుని అసహనంగా చూసిన గోపాల్, "ఏదైనా గేమ్ ఆడదాం, ఆ గేమ్ ఆడుతున్నంత సేపు మనకి టైం గురించే తెలియకూడదు" అని సలహా ఇస్తాడు.
వల్లి అలాంటి గేమ్ ఏంటబ్బ అన్నటు ఆలోచిస్తున్న టైం లో మైన, " ట్రూత్ ఆర్ డేర్ " అని ఉత్సాహంగా అరుస్తుంది. ఆ మాటలకి వాసు ఫక్కున నవ్వుతాడు. వాసు నవ్వడం చూసి మైన ఎందుకలా నవ్వుతున్నావని కోపంగా అడుగుతుంది.
వాసు నవ్వుని కంట్రోల్ చేస్కుంటూ, "లేదు, నార్మల్ గ ఇలాంటి గేమ్స్ లో అడిగే ప్రశ్నలకి ఎదుటివాడు నిజాన్ని చెప్తాడని ఏంటి గ్యారంటీ? అయినా ఈ గేమ్ లో ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏముంటాయి.. ‘మీ ఫస్ట్ లవ్ ఎవరు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావ్?..’ ఇవే కదా అడిగేది. ఆ ఆన్సర్ చెప్పే వాడు కూడా నిజాన్ని చెప్పకుండా ఏదో సినిమా స్టోరీ ని చెప్తూ అందర్నీ ఫూల్స్ ని చేస్తాడు. ఇలా అబద్దాలు ఆడే గేమ్స్ ని నేను ఆడను. మీరు త్వరగా కేక్ కట్ చేస్తే నేను షూట్ చేస్తాను" అని చెప్తాడు.
వాసు మాటల్ని విని వల్లి ఆలోచనలో పడ్డింది, తన కోసం పని చెయ్యమని వాసుని అడిగితే, చేస్తాడా? లేదా? అని. వల్లి ఆలోచిస్తున్న టైం లో గోపాల్ వాసు తో, "కొంచెం ఆలోచించు, నీకు ఇది జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే కానీ మాకు ఒక ఎమోషన్. మా యూట్యూబ్ ఛానల్ కోసం మేము పడ్డ కష్టం మాకే తెలుసు. ఇలాంటి ఒక మూమెంట్ ని అంత త్వరగా అండ్ సింపుల్ గ సెలెబ్రేట్ చేసుకోలేము. "అని చెప్తాడు. ఆ మాటలకి వాసు మళ్ళి చిన్నగా నవ్వుతాడు.
ఆ నవ్వుని చూసిన మైన కి కోపం వచ్చి ఏదో అనబోయే టైం లో వల్లి, “సరే నువ్వే చెప్పు, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? కేక్ కటింగ్ మాత్రం మిడ్నైట్ 12 కే అవుతుంది. అప్పటి వరకు నువ్వు చెప్పింది చేస్తాం "అని చెప్తుంది.
వాసు కాసేపు ఆలోచించి, "ఫస్ట్ కేక్ కట్ చేసి, ఆ తర్వాత నేను పెట్టే కొత్త రూల్స్ తో ‘ట్రూత్ ఆర్ డేర్’ ఆడుతాం. ఓకేనా? " అడుగుతాడు. గత్యంతరం లేక వల్లి సరే అంటూ తల ఊపడంతో వాసు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి కేక్ తిస్కోరావడానికి వెళ్తాడు. తను వెళ్ళిన తర్వాత మైన వల్లి తో, "ఏంటి వల్లి, వాడి మాటల్ని ఎందుకు వింటున్నావ్? ప్రపంచంలో వీడు తప్ప వేరే మనిషే లేడా మన కోసం పని చెయ్యడానికి?" అని కోపంగా అడిగింది.
గోపాల్ కూడా మైన మాటలకి అవునట్టుగా, "మైన చెప్పింది కరెక్ట్. ఇంత త్వరగా కేక్ కట్ చెయ్యడం ఏంటో నాకు అర్ధం కావట్లేదు. అయినా వాడు మన ఆఫర్ ని ఒప్పుకుంటాడని నమ్మకం కూడా లేదు" అని చెప్తాడు.
వల్లి ఇద్దరికి సర్ది చెప్తూ, "మన ఛానల్ చాలా పెద్దది. బయట మనిషి ని అంత ఈజీగా నమ్మలేము. వాడు అభి ఫ్రెండ్ అనే ఒక కారణం వల్లే వాడిని ఇంత సేపు భరిస్తున్నా. లేకుంటే వాడిని గేట్ లోపలకి కూడా రానిచ్చే దానిని కాదు" అని చెప్తుంది.
గోపాల్ అభి ని చూస్తు, "నీకు ఇలాంటి ఫ్రెండ్ ఎలా దొరికాడ్రా?" అని అసహనంగా అడుగుతాడు.
అభి ఏం మాట్లాడడు. మైన అభిని చూస్తూ ఏదో చెప్పబోయే టైం లో వాసు కేక్ తో పాటు ఒక్క ఖాళీ బాటిల్ తీస్కొని వస్తాడు. అందరు ఏదో నవ్వుని నటిస్తూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. వల్లి కూడా వాసు ని కెమెరా పక్కన పెట్టి వచ్చి కేక్ తినమని చెప్తుంది. వాసు తను డైట్ లో ఉన్నానని, మీరు కడుపు నిండా కేక్ తినమని చెప్పి రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. అందరు కేక్ తిని, మిగిలిన కేక్ ని ఫ్రిడ్జ్ లో పెటేస్తారు. వాసు కూడా కెమెరా పక్కన పెట్టి ఆకాశం వైపు చూస్తూ ఏదో చెప్తూ ఉంటాడు.
వాసుని అలా చూసిన వల్లి, తన భుజం పైన చేయి వేసి ‘ఏం చేస్తున్నావ్?’ అని అడుగుతుంది.
వాసు చిన్నగా నవ్వి ఏం లేదు అని చెప్తాడు. ఆ నవ్వుతో వల్లికి ఏదో తెలియని భయం మొదలవుతుంది. అయినా వల్లి ఆ భయాన్ని కవరప్ చేస్తూ నవ్వుతుంది.
=======================================================================
ఇంకా వుంది..
ఆ రోజు రాత్రి - పార్ట్ 2 త్వరలో
=======================================================================
శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.
Comments