top of page
Writer's pictureShilpa Naik

ఆ రోజు రాత్రి - పార్ట్ 2



'Aa Roju Rathri - Part 2/3' - New Telugu Story Written By Shilpa Naik

Published In manatelugukathalu.com On 24/06/2024

'ఆ రోజు రాత్రి 2/3' పెద్ద కథ

రచన: శిల్పా నాయక్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

యుట్యూబర్ నాగవల్లిక తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఉంటుంది.

అనుకోకుండా ఆ పార్టీకి వాసు అనే యువకుడు వస్తాడు.

అతను ఆకర్షణీయంగా ఉన్నా అనుమానాస్పదంగా కూడా ఉంటాడు.

అతన్ని తమ ఛానల్ కోసం ఉపయోగించుకోవాలనుకుంటుంది నాగవల్లిక.

తాను చెప్పిన రూల్స్ ప్రకారం ‘ట్రూత్ ఆర్ డేర్’ ఆడుదామంటాడు వాసు.



ఇక ఆ రోజు రాత్రి - పార్ట్ 2  చదవండి..



వల్లి "నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావా? " అని అడుగుతుంది. 


దానికి వాసు, "హా.. చేస్తున్నా కాని అప్పుడప్పుడు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా టైం లో నేను ఖాళిగానే ఉంటాను" అని సమాధానమిస్తాడు. 


వల్లి ఇదే ఛాన్స్ అనుకోని, "నా ఛానల్ లో వర్క్ చేస్తావా ? ఫ్రీగా కాదు. ప్రతి వీడియో కి అయిదు వేలు ఇస్తాము" అని మనసులో మాటని బయట పెట్టింది. 


వాసు, "ముందు నాతో గేమ్ ఆడు. ఆ తర్వాత కూడా నాతో వర్క్ చెయ్యాలనిపిస్తే నాకు ఓకే " అని అక్కడ నుంచి వెళ్లి బాటిల్ తీస్కుంటాడు. వాసు ఒక దుప్పటిని నేల పైన పరిచి దానిపై అందరూ సర్కులర్ గా కూర్చోవాలని చెప్తాడు. అందరూ అలాగే కూర్చుంటారు. వాసు గేమ్ రూల్స్ ని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 


"ఈ ఆటలో నేను బాటిల్ ని తిప్పుతాను. బాటిల్ ఎవరి వైపు ఆగుతుందో వారు నేను అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. నిజం చెప్పే ధైర్యం లేని వారు నేను చెప్పే టాస్క్ చెయ్యాలి. ఈ ఆటలో బాటిల్ ని 8 సార్లు నేనే తిప్పుతాను. ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్లకు గేమ్ చివర్లో ఒక్క చిన్న టాస్క్ చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి”.


మైన, "ప్రశ్నలు నువ్వు మాత్రమే అడుగుతావా లేకుంటే.. " తన మాటలు పూర్తయే లోపు వాసు, "నేనే ప్రశ్నలు అడుగుతాను. టాస్క్స్ కూడా ఇస్తాను. కాని నేను ఈ గేమ్ ఆడను. మీ నలుగురే ఆడతారు. ఓకేనా? " అని చెప్తాడు. 


వాసు లేచి నిల్చుని అందరి వైపు చూస్తాడు. అందరూ వల్లి వైపు కోపంగా చూసి, సరే అన్నట్టు సైగ చేస్తారు. 


వాసు బాటిల్ ని తిప్పుతాడు. అది ఒక నిమిషం దాకా తిరిగి గోపాల్ వైపు ఆగుతుంది. వాసు గోపాల్ ని చూస్తూ ‘ట్రూత్ ఆర్ డేర్?’ అని క్రీపీగా నవ్వుతూ అడుగుతాడు. 


గోపాల్ ధైర్యగా ట్రూత్ అని చెప్తాడు. 


అప్పుడు వాసు, "ఓకే, నువ్వు ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్న రోజుల్లో నీ క్లాస్ మెట్ అయిన సైనా వైట్ డ్రెస్ మీద రెడ్ ఇన్క్ పోసింది ఎవరు? " అని అడుగుతాడు. 


ఆ ప్రశ్న విన్నగానే గోపాల్ తో పాటు అందరూ షాక్ అవ్వుతారు. వల్లి కూడా వాసు గేమ్ లో ఛానల్ గురించో డబ్బుల గురించో అడుగుతాడని అనుకుందే గాని ఇలాంటి ప్రశ్నలు అడగుతాడని అసలు అనుకోలేదు. 


"చెప్పు గోపాల్.. ఇన్క్ పోసావా? లేదా? " అని గట్టిగా అరుస్తాడు వాసు. 


గోపాల్ కొంచెం తడబడుతూ "లేదు. ఆ పని చేసింది నా ఫ్రెండ్ రెహమాన్ " అని చెప్తాడు. 


ఆ మాటలకి వాసు నవ్వుతూ తన ఫోన్ తీసి ఏదో నెంబర్ కి డయల్ చేసి ఆ ఫోన్ ని గోపాల్ కి ఇచ్చి, "ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావో ఆదే ఈ ఫోన్ కి కూడా నీ పేరు చెప్పి జరిగింది చెప్పు" అని చెప్తాడు. 

గోపాల్ కొంచెం భయంగానే ఆ ఫోన్ ని తీస్కొని, "నా పేరు గోపాల్. నేను 8త్ క్లాస్ చదువుతున్నప్పుడు నా క్లాస్ అమ్మాయి సానియా వైట్ డ్రెస్ మీద నా ఫ్రెండ్ రెహమాన్ ఇన్క్ పోశాడు. అప్పటి నుంచి వాడితో మాట్లాడడం మానేశాను" అని మాటలని పూర్తి చేస్తాడు. 


కొన్ని సెకండ్స్ తర్వాత ఫోన్ లో నుంచి ఒక అమ్మాయి వాయస్ వినబడుతుంది. 


"గోపాల్! నువ్వు ఇంకా అబద్ధాలు చెప్తున్నే ఉన్నావా? ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను అంతలా ఎప్పుడూ ఏడ్చింది కూడా లేదు. నీ వల్లే ఆ రోజు నా జీవితంలోనే ఒక బాడ్ మెమరీ ఐయ్యింది. " అని ఆ అమ్మాయి ఏడుస్తుంది. వాసు గోపాల్ నుంచి ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్పడం ప్రారంభిస్తుంది. 


"నేను సానియా. నేను 8త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక రోజు హిందీ టీచర్ అందరి దగ్గర నుంచి హోంవర్క్ బుక్స్ తీసుకోమని, రాయని వాళ్ళు ఉంటే పేర్లు చెప్పమని నన్ను అడిగింది. నేను అందరి బుక్స్ తీస్కుంటూ గోపాల్ దగ్గరకు వచ్చాను. కానీ గోపాల్ హోంవర్క్ చెయ్యలేదు. టీచర్ కు పేరు చెప్పవద్దని రిక్వెస్ట్ చేశాడు. కాని టీచర్ హోంవర్క్ చెయ్యని వాళ్ళ పేర్లు చెప్పమని మరీమరీ చెప్పింది. సో.. నేను టీచర్ కి గోపాల్ పేరు చెప్పాను. టీచర్ గోపాల్ ని కొట్టింది. అది మనసులో పెట్టుకొని గోపాల్ ఆ రోజు సాయంత్రం లాస్ట్ బెల్ రింగ్ అయ్యేటప్పుడు నేను బుక్స్ ని నా లాకర్ లో పెట్టాలని బెంచ్ మీద నుంచి లేచినప్పుడు గోపాల్ నా బ్యాక్ సైడ్ స్కర్ట్ పైన రెడ్ ఇన్క్ పోసి అసహ్యంగా కామెంట్స్ చేస్తూ నవ్వాడు" అని అమ్మాయి ఏడుస్తుంది. 


కాసేపు ఏడ్చినా తర్వాత "కొన్ని నిమిషాల తర్వాత రెహమాన్ వచ్చాడు. తను నాకు తన కొత్త స్వెట్టర్ ని నడుముకి చుట్టుకో అని ఇచ్చి నాకు ఇంటి దాకా తన సైకిల్ పైన లిఫ్ట్ ఇచ్చాడు. కాని ఇప్పటికి కూడా రెహమానే అంతా చేసాడని చెప్తున్నావ్ కదా! సిగ్గు లేదా యూ ఇడియట్ ? "అని కోపంగా కాల్ కట్ చేస్తుంది. 


ఆ మాటలకి గోపాల్ తల దించుకుంటాడు. మైన గోపాల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వాసు, "ట్రూత్ చెప్పలేదుగా గోపాల్. ఓకే.. ఎనీవే లెట్స్ గో ఫర్ సెకండ్ రౌండ్" అని బాటిల్ ని మళ్ళీ తిప్పుతాడు. ఈసారి బాటిల్ అభి వైపు ఆగుతుంది. 


వాసు అభిని చూస్తూ ‘ట్రూత్ ఆర్ డేర్’ అని అడుగుతాడు. 


దానికి అభి ట్రూత్ అని చెప్తాడు. 


"సరే, నీ కాలేజ్ లో ఎవరినైనా ర్యాగింగ్ చేసేవా" అని వాసు అడుగుతాడు. 


దానికి అభి ముఖంలో ఏ ఎమోషన్ లేకుండా, "హ చేసాను. దానిని తట్టుకోలేని ఒక జూనియర్, కాలేజి మెనెజ్మెంట్ కి కంప్లెట్ చేశాడు. అప్పటినుండి నుంచి కాలేజ్ లో ఏ సీనియర్ ఐనా జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తే వారిని కాలేజ్ నుంచి పంపించేస్తామని ఒక రూల్ ని పెట్టడంతో నేను ర్యాగింగ్ చేయడం మానేశాను" అని సమాధానమిస్తాడు. 


"గూడ్, నెక్స్ట్ రౌండ్" అని బాటిల్ ని తిప్పుతాడు వాసు. 


ఆ బాటిల్ ఈసారి మైన వైపు ఆగుతుంది. 


మైన ని కూడా  ‘ట్రూత్ ఆర్ డేర్?’  అని అడుగుతాడు. 


మైన కాసేపు ఆలోచించి డేర్ అని చెప్తుంది. 


ఆ మాటకు వాసు, "ఒకే, మీ యుట్యూబ్ ఛానల్ లో 'మేము పెట్టే వీడియోలు అన్నీ ఫేక్. మేమే వీడియో లో దెయ్యాలని ఎడిటింగ్ చేస్తాం. అసలు ఇప్పటి వరకు మా ఛానల్ లో ఒక జెన్యూన్ వీడియో కూడా లేదు. ఇన్ని రోజులూ మిమ్మల్ని మోసం చేస్తూ డబ్బు సంపాదించాము' అని ఒక్క కమ్యూనిటీ పోస్ట్ రాసి అప్లోడ్ చేయి" అని చెప్తాడు. 


ఆ మాటలకి మైన, వల్లి, గోపాల్ షాక్ అవుతారు. వల్లి, "ఇలా చేస్తే మా ఛానల్.. " అనే లోపే వాసు బాటిల్ తీసుకుని అది అభి తలపై పెట్టి, " నేను ఇచ్చిన పని త్వరగా పూర్తి చేయి మైన.. లేకుంటే.. " అని బాటిల్ తో అభిని కొట్టేలా సైగ చేస్తాడు. 


మైన భయంగా, "ఆగు, తనని ఏం చెయ్యకు. మా ఛానల్ లో అన్నీ నిజమైన వీడియోసే  ఉన్నాయి. నువ్వెందుకు అలా అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు" అని అంటుంది. 


వాసు నవ్వుతూ, "ఏంటి.. మీ వీడియోస్ లో దెయ్యాలు నిజమైన దెయ్యాలా? ఏం అభీ.. అవన్నీ నిజమా? " అని ఆశ్చర్యంగా అభి ని అడుగుతాడు. 


అభి ఇప్పుడు కూడా ఏ ఎమోషన్ లేకుండా, "మైన చెప్తుందంతా అబద్ధం. మా ఛానల్ గ్రోత్ కోసం మైనాయే దెయ్యాలని ఎడిటింగ్ చేస్తుంది" అని చెప్పడంతో మైన తడబడి, "ఎడిటింగ్ చేసింది నేనే. కాని అలా చెయ్యమని వల్లియే చెప్పింది. "అని వల్లి వైపు చూస్తుంది. 


వల్లి కోపంగా, "అవును, ఎవరు ఏ పని చెయ్యలో మొత్తం నేనే చెప్తాను. మా వీడియోస్ లో కనిపించే దెయ్యాలన్నీ ఫేక్. ఐనా లేని దెయ్యాలని ఎక్కడ నుంచి తీసుకురావాలి? " మైన వైపు చూస్తూ, "ఇలాంటి పోస్ట్ చేస్తే మాత్రం ఫ్రెండ్ అని కూడా చూడను" అని బెదిరిస్తుంది. 


మైన ఏడుస్తూ, "చెప్పే ముందు కాస్త చూసుకుని మాట్లాడు. అభి.. " అని ఏడుస్తుంది. 


వల్లి కోపంగా, "నాకు నా ఛానల్ కన్నా ఏది ముఖ్యం కాదు" అని చెప్పడంతో మైన కి ఎక్కడ లేని కోపం వస్తుంది. 


ఆ ఆవేశంలో, "ఛీ! అవతల మన ఫ్రెండ్ కి ఆపద జరుగుతుందని తెలిసినా నీ ఛానల్, నీ డబ్బుల గురించే స్వార్థంగా ఆలోచిస్తున్నావు కదా", అని ఫోన్ అన్ చేసి వాసు చెప్పిన మాటల్ని పోస్ట్ రాసి దానిని అప్లోడ్ చేసి అందరికి చూపిస్తుంది. 


దానిని చూసి వాసు మళ్లీ బాటిల్ కింద పెడతాడు. వల్లి వెంటనే తన ఫోన్ ని తీసే లోపే వాసు ఆ ఫోన్ ని లాక్కుని, " డేర్ ఇజ్ డేర్ "అని బాటిల్ ని మళ్లీ తిప్పుతాడు. 

ఈసారి బాటిల్ వల్లి వైపు ఆగుతుంది. వల్లి వైపు చూస్తూ  ‘ట్రూత్ ఆర్ డేర్?’ అడుగుతాడు.


 వల్లి, "నేను ఈ గేమ్ ఆడను. ముందు నువ్వు ఇక్కడినుంచి వెళ్ళిపో" అని చెప్తుంది. 


వాసు నవ్వుతూ, "నేను లోపలికి రావడం వరకే మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు పోవాలో నేనే డిసైడ్ చేసేది. నాకు చిరాకు తెప్పించకు. త్వరగా చెప్పు ట్రూత్ ఆర్ డేర్? " అని కాస్త విసుగ్గా అడుగుతాడు. వల్లి కూడా ధైర్యంగా, "నా ఇల్లు, నా పార్టీ, నా ఛానల్. మధ్యలో నువ్వు ఎవడ్రా? " అని చెప్తుంది. 


వల్లి మాటలు పూర్తయ్యే లోపు అక్కడ గాలి బాగా వీస్తుంది. లైట్స్ కూడా ఫ్లిక్ అవుతుంటాయి. వాసు మారిన గొంతు తో, "రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నాగవల్లిక " అని పక్కన ఉన్న కెమెరాతో గోపాల్ తల పైన గట్టిగా కొడతాడు. 


ఆ దెబ్బకి వల్లి, మైన షాక్ అవ్వుతారు. 


"చెప్పు " అని వాసు మళ్ళి వల్లి వైపు అరుస్తాడు. 


వల్లి భయంగా, "డేర్ " అని చెప్పడంతో అక్కడ పరిస్థితి నార్మల్ అవ్వుతుంది. 


వాసు కూడా చిరునవ్వుతో, "చూసావా.. ఈ ముక్క ముందే చెప్పుంటే గోపాల్ ని కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదేమో. నీ వల్లే ఇదంతా. ఓకే అయిందేదో అయ్యింది. నీ డేర్ టాస్క్ ఎంటంటే, నీ పేరెంట్స్ కి కాల్ చేసి నా ఫ్రెండ్స్ ని నేను ఆవేశంలో చంపేశానని చెప్పాలి" అని చెప్తాడు. 


వల్లి భయంగా గోపాల్ వైపు చూస్తోంది. 


వల్లి చూడడం చూసిన వాసు కూడా గోపాల్ ని చూస్తాడు. గోపాల్ నొప్పితో తల పట్టుకొని అరుస్తూ ఉంటాడు. వాసు, "అరేయ్, నేనేం చెయ్యలేదు. మొత్తం నువ్వు ఇంకా నాగ నే చేశారు. ఉండు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. " అని ఇంట్లో కి వెళ్తాడు. 


వాసు అలా వెళ్లగానే మైన, "పోలీస్ కి కాల్ చేద్దామా? " అని వల్లి వైపు చూస్తూ అడుగుతుంది. 


వల్లి, "వద్దు, ఒకవేళ మన టైం బాగాలేక వాడు తిరిగి వచ్చేటప్పుడు నీ ఫోన్ డయల్ లిస్ట్ చెక్ చేస్తే.. 


ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి. త్వరగా ఆడేస్తే వాడే వెళ్ళిపోతాడు. అయినా వాడు చాలా డేంజరస్. పోలీస్ వచ్చే లోపే మనల్ని ఏదైనా చేస్తే.. " అని చెప్పడంతో మైన ఏడుస్తుంది. 


వల్లి అభి వైపు చూస్తూ, "అభి, సారీ రా. నాకు మీరే ఇంపార్టెంట్ కాని అలా చెప్తే వాడు నిన్ను వదిలేస్తాడేమో అని చిన్న ఆశా" అని ఏడుస్తుంది. 

గోపాల్ మెల్లగా అభి ని చూస్తు, "వీడు వచ్చినప్పుటి నుంచి ఇలాగే బొమ్మలా ఉన్నాడు" అని అభి చేయి పట్టుకొని ఊపుతాడు. అలా చేసిన కొన్ని సెకండ్స్ కే గోపాల్ అభి చేతిని వదిలేసి, "వీ.. వీ.. వీడి పల్స్ లేదు " అని భయంగా చెప్తాడు. 


ఆ మాటలకి వల్లి అభి చేతిని పట్టుకొని చూస్తుంది. నిజమే.. అభి కి పల్స్ లేదు. ఇక్కడ ఇంత జరుగుతున్నా అభి మాత్రం స్ట్రెయిట్ గానే చూడడం చూసిన మిగతా ముగ్గురికీ భయం మొదలవుతుంది. అంతలో వాసు రావడం గమనించిన వల్లి వెంటనే తన ప్లేస్ లో కూర్చుంటుంది. 


వాసు గోపాల్ కి డ్రెస్సింగ్ చేస్తూ, "ఈ ప్రపంచంలో నాకు నచ్చనిది రెండే విషయాలు. ఒకటి అబద్ధం, రెండు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం. నువ్వు మొదటి పని చేస్తే, నాగ రెండో పని చేసింది. అందుకే ఆలా రియాక్ట్ అయ్యాను. "అని చెప్పి వల్లి ఫోన్ తీసి, "నేను చెప్పింది చెప్పు. " అని ఫోన్ లో తన పేరెంట్స్ నెంబర్ డయల్ చేసి ఇచ్చాడు. 


వల్లి భయంగా ఫోన్ తీస్కుంటుంది. కాసేపటికే వల్లికి తన అమ్మ గొంతు హలో అన్నట్టు ఫోన్ లో వినిపిస్తుంది. వల్లి ఏం ఆలోచించకుండా, "నేను, నా ఫ్రెండ్స్ మైనా, గోపాల్, అభిలని ఆవేశం లో చంపేశాను" అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వెంటనే వాడు లాక్కొని బాటిల్ తిప్పుతాడు. 


ఈసారి బాటిల్ మైన వైపు ఆగుతుంది. వాసు మైన ని అడిగే లోపే తనే, "ట్రూత్" అని చెప్తుంది. 


వాసు నవ్వుతూ, "నీ వల్లే ఒక అబ్బాయి సూసైడ్ చే.. " తన మాటలు పూర్తయ్యేలోపే మైన, "అవును. తన పేరు శివ. నా కాలేజీ మేట్. ఎలాగైనా తనని నా లవ్ ట్రాప్ లో పడేలా చేస్తానని నా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను. చెప్పినట్టుగా తనని లవ్ చేస్తున్నట్టు నటించి మోసం చేశాను. తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. "అని చెప్పడం పూర్తి చేసింది. 


వాసు ఏం మాట్లాడకుండా మళ్ళీ బాటిల్ తిప్పుతాడు. ఈసారి గోపాల్ వైపు ఆగుతుంది. గోపాల్ ట్రూత్ ని ఎంచుకుంటాడు. 


వాసు, "నువ్వు మైన బట్టలు మార్చుకుంటునప్పుడు తనకు తెలియకుండా వీడియో రికార్డు చేసావా? ఎస్ ఓర్ నో? " అని అడుగుతాడు. 


గోపాల్ సిగ్గుతో తల దించుకొని, "ఆ క్షణంలో తన పైన కోపంలో 1 మినిట్ వీడియో తీసాను. అంతేగాని నేను అలాంటి వాడిని కాదు. " అని చెప్తాడు. 


మైనా ఏడుస్తూ, "ఇంకా ఆ వీడియో నీ ఫోన్ లో ఉందా? " అని అడుగుతుంది. 


దానికి గోపాల్ లేదని చెప్తాడు. వాసు బాటిల్ ని తిప్పుతాడు. ఈసారి అది వల్లి వైపు ఆగుతుంది. వల్లి కూడా ట్రూత్ ని ఎంచుకుంటుంది. 


"లాస్ట్ మంత్ పౌర్ణమికి మీరందరు ఒక ఘోస్ట్ టౌన్ కి వెళ్ళారు కదా. అక్కడ ఏం చేసారు? మొత్తం నాకు చెప్పు? " అని కొంచెం కోపంగా అడుగుతాడు. 


వల్లి కాసేపు ఆలోచించి, "లాస్ట్ మంత్ మా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ఒక మెసేజ్ వచ్చింది ఆ టౌన్ ని ఎక్స్ప్లోర్ చెయ్యమని. ఎందుకంటే ఊరి వారి ప్రకారం అక్కడ ఎన్నో ఆత్మలు ఉన్నాయని, అందుకే వాళ్ళు అక్కడ వెళ్ళడానికి బయపడుతున్నారు అని మెసేజ్ లో ఉంది. మేము కూడా వెళ్ళాము. ఊహించినట్టుగా అక్కడ పారానార్మల్ ఆక్టివిటీ లేదు. అందుకే మేము కాస్త హద్దు మీరి ప్రవర్తించాము " అని చెప్పడం పూర్తి చేస్తుంది. 


వాసు తల దించుకొని ఏం మాట్లాడకుండా బాటిల్ ని తిప్పుతాడు. బాటిల్ అభి వైపు తిరుగుతుంది. అభి డేర్ ని ఎంచుకుంటాడు. వాసు ఆకాశం వైపు చూస్తూ ఏదో మంత్రాలు జపిస్తూ, "నాగ ని తప్ప అందర్నీ చంపెయ్" అని చెప్పడం తో అందరు షాక్ అవ్వుతారు. 


అసలు ఏం జరుగుతుందో అర్ధం చేసుకొనే లోపే అభి బాటిల్ ముక్కతో గోపాల్, మైన గొంతు కోసి, తన కూడా అలానే సూసైడ్ చేసుకుంటాడు. వాసు ఆ గ్లాస్ ముక్కని వల్లి చేతిలో పెట్టి ఏవో మంత్రాలు జపిస్తూ ఉంటాడు. వల్లి ఏం చెయ్యాలో కూడా అర్ధం కాని టైం లో పోలీస్ కార్ సైరన్ విన్పిస్తుంది. వల్లి చూస్తూ ఉండగా వాసు తన కళ్ళు ముందు నుంచి మాయం అవుతాడు.



=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================


శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

 విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

 


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.



30 views0 comments

Comments


bottom of page