#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #అబద్ధంఅపాయం, #AbaddhamApayam, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 36
Abaddham Apayam - Somanna Gari Kavithalu Part 36 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 16/03/2025
అబద్ధం అపాయం - సోమన్న గారి కవితలు పార్ట్ 36 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అబద్ధం అపాయం
అబద్ధమే ఉప్పెన
చివరికి ముంచుతుంది
ఉంచాలోయ్! దూరాన
చోటియకోయ్! హృదయాన
అబద్ధాలకలవడితే
వాటిలోనే బ్రతికితే
కుటుంబాలు విచ్చిన్నము
జీవితాలు నాశనము
అంటు వ్యాధి అబద్ధము
కావొద్దోయ్!దాని వశము
ఒక్కసారి సోకిందా!
బ్రతుకిక కకావికలము
ఎంత కాలం దాగదు
అబద్ధమిక ఆగదు
ఎప్పుడైనా తెలియును
అవమానాలు తెచ్చును
అబద్ధాలు ప్రమాదము
దూరంగుంటే మోదము
చిక్కుల్లో పడివేయును
బంధాలను త్రుంచేయును

నాన్న ప్రబోధం
----------------------------------------
గుండెలో బాధలకు
మానసిక వ్యాధులకు
ధైర్యమే అవసరము
నియంత్రణే ముఖ్యము
మితిలేని దుఃఖానికి
ఎనలేని అశాంతికి
కోరికలు కారణము
అక్షరాల సత్యము
వ్యక్తుల అనైక్యతకు
విపరీత కలహాలకు
ఓర్వలేనితనమే!
ఓర్పులేని గుణమే!
ఉంటే క్షమాగుణము
పూస్తే ప్రేమగుణము
వసుధైక కుటుంబము
అరుదెంచును శీఘ్రము

అందరితో సమాధానం
----------------------------------------
ఇరుగుపొరుగుతో పోరు
తిలకిస్తే బేజారు
హెచ్చు మీరితే గనుక
పరిస్థితులు దిగజారు
అందతితో సమాధానము
కల్గియుంటే శ్రేష్టము
జీవితాల్లో క్షేమము
పారిపోవును క్షామము
మేలు కాదు శత్రుత్వము
హానికరం దానవత్వము
వదిలివేస్తే మనశ్శాంతి
జీవితాల్లో నవకాంతి
వైరాన్ని వదిలిపెట్టి
ద్వేషాన్ని చుట్టిపెట్టి
సమైక్యత పండగా!
జీవించాలి హాయిగా!

హృదయ భద్రత!
----------------------------------------
దైవానికి మందిరం
పవిత్రమైన హృదయం
పనికిరాని పనులతో
చేయరాదోయ్! మలినం
ముఖ్యమైనది హృదయం
కావాలి అరుణోదయం
మకిలమైన తలవులతో
చేసుకోవద్దు పతనం
సున్నితమైన హృదయం
కాకూడదోయ్! కఠినం
చేసుకోవాలి భద్రం
లేకపోతే ఛిద్రం
హృదయాన్ని విషపూరితం
కాకుండా చూసుకో!
అనవసర విషయాలకు
దూరంగా ఉంచుకో!

రోబో ప్రబోధ గీతి
----------------------------------------
ప్రమిద వెలుగుడానికి చమురు
కసువు ఊడ్చడానికి చీపురు
నిశ్చయముగా అవదరమే!
వాటి వాటి వినియోగమే!
చదవడానికి పుస్తకాలు
ఆలోచింప మస్తకాలు
జీవితంలో ముఖ్యమే!
నూటికి నూరుపాళ్లు నిజమే
పొలం దున్నడానికి హలం
కవితలు వ్రాయడానికి కలం
ఉంటేనే పని కాస్త జరుగును
జీవించేందుకు స్వచ్ఛ జలం
పాడుకునేందుకు తీపి గళం
కాపాడేందుకు రక్షణ దళం
ఉన్న సురక్షితంగా ఉండును
కొండంత భరోసా నిచ్చును
-గద్వాల సోమన్న
コメント