కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Abhimanam Anumanamga Marithe' New Telugu Story Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
రాజేష్ కి పెళ్లి కుదిరింది. అతను సాఫ్టు వేర్ కంపెనీ లో పని చేస్తాడు. నెలకు యాభై వేల రూపాయల జీతం వస్తుంది. రాజేష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ప్రియ. ఆమె ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ప్రియకి పాతిక వేల రూపాయల జీతం వస్తుంది. పెళ్లి కుదిరిన తరువాత రెండు నెలల లోపే వారి వివాహం జరిగింది. ఇద్దరూ అనోన్యంగా వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు.
అయితే ప్రియకు డే టైం లో మాత్రమే వర్క్ ఉంటుంది. రాజేష్ కు సిఫ్ట్ వైజ్ ఉండటంతో అతడి టైం వేరే అవుతుంది కాబట్టి ఒక వారం ప్రియను డ్రాప్ చేసే వాడు. ఒక వారం వీలు అయ్యేది కాదు. అలా ఆరు నెలల సమయం గడిచింది. ఇదిలా కొనసాగుతుంటే ప్రియ నా కొలీగ్స్ అంటూ తన ఫెండ్స్ ని పరిచయం చేసింది. ఒకరోజు తన మిత్రుడు ఉదయ్ ని లిఫ్ట్ అడిగి ఇంటికి వచ్చింది ప్రియ.
రాజేష్ కి ఉదయ్ తెలియక పోవడంతో “ఎవరు అతడు?” అని అడిగాడు.
“నా కొలీగ్ ఉదయ్” అని చెప్పింది ప్రియ.
“చాలా మంచి వాడిలా ఉన్నాడే” అన్నాడు రాజేష్.
“హా.. చాలా మంచి వాడు రాజేష్! చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా. ఉదయ్ మంచి వాడే” అంది ప్రియ.
రాజేష్ కి ప్రియ మీద ఎంత నమ్మకం ఉన్నా ఆవగింజంత అనుమానం అయితే కలిగింది. సరేలే లేట్ అవుతుందేమో అనుకుని లిఫ్ట్ అడిగి వచ్చి వుంటుందేమో అనుకున్నాడు. ఇదిలా ఉంటే రాజేష్ కి ప్రియను పికప్ చేసుకోవడానికి వీలు కుదరడం లేదు. అలా మూడు వారాలు గడిచాయి. ఉదయ్ ఇల్లు అటువైపు ఉండటంతో ప్రతి రోజూ డ్రాప్ చేసేవాడు ఉదయ్. ఈ విషయాన్ని గమనించిన రాజేష్ ఎక్కడ లేని అనుమానం పెంచుకున్నాడు.
కోపం పట్టలేక ఒకరోజు “ప్రతి రోజూ నువ్వు ఉదయ్ బైకు పై రావడం నాకు నచ్చలేదు. ఎందుకు వస్తున్నావు?” అంటూ ప్రశ్నించాడు రాజేష్.
“నాకు పరిచయం కాబట్టి, మంచి వాడు కాబట్టి వస్తున్నాను. మా ఇద్దరి మదిలో ఏ విధమైన చెడు ఆలోచనలు లేవు” అని చెప్పింది ప్రియ.
“చీ చీ... నీ మీద చాలా ప్రేమ ఉండేది. అభిమానం ఉండేది.అవన్నీ ఇప్పుడు ద్వేషంగా మారాయి” అన్నాడు రాజేష్.
ఆ మాటలు విన్న ప్రియ “చీ చీ... నువ్వు చాలా మంచి వాడివి అనుకున్నాను. ఇలా అపార్థం చేసుకుంటావు అనుకోలేదు. నువ్వు నన్నే అనుమానిస్తున్నావా” బాధగా అంది ప్రియ. ఇద్దరి మధ్యన మాటల ఘర్షణ జరిగింది. ఆ విధంగా వివాహ బంధం కాస్తా విడిపోయే వరకు వచ్చింది. కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉదయ్ రాజేష్ ను పర్సనల్ గా కలవడానికి ఫోన్ చేసి రమ్మన్నాడు.
అప్పుడు రాజేష్ “నేను రాను. నీతోమాట్లాడను. నీ వల్లే నా భార్య నాకు దూరం అవుతోంది. నాకు ఫోన్ చేయకు” అంటూ ఫోన్ కట్ చేశాడు.
సమస్యను అర్థం చేసుకున్న ఉదయ్ నేరుగా రాజేష్ ను కలిశాడు.
“నాకు ప్రియ చెల్లులు లాంటిది. తన మీద నాకు ఎలాంటి దురభిప్రాయం లేదు. తను కూడా అలాంటిది కాదు. నువ్వు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశం తోనే తను తొందరగా ఇంటికి వచ్చేది, అంతే కానీ మరే చెడు ఉద్దేశ్యంతో అయితే కాదు. ఈ విషయాన్ని చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అంతే! ఇంకేమీ కాదు, తను నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది, నువ్వంటే చాలా ఇష్టం ప్రియకి. ఉద్యోగాలు చేసేవాళ్ళు లిఫ్ట్ ఇవ్వడం, లిఫ్ట్ అడగడం చాలా సాధారణమే కదా! కాస్త నిదానంగా ఆలోచించు. నీకె తెలుస్తుంది.” అంటూ వెళ్లిపోయాడు ఉదయ్.
ఉదయ్ మాటలు విన్న రాజేష్ ఆలోచనలో పడ్డాడు. అతను చెప్పింది నిజమే. తను కూడా కొలీగ్స్ కి ఎన్నోసార్లు లిఫ్ట్ ఇచ్చాడు. ఆ విషయం ప్రియ గమనించింది కూడా. కానీ ఆమె ఏనాడూ ఇదేమిటని తనను ప్రశ్నించలేదు. తనే సంకుచితంగా ఆలోచించినందుకు బాధతో చిన్నబోయాడు రాజేష్. . తన తప్పును తెలుసుకొని ప్రియను క్షమించమని కోరాడు. తన తప్పును తెలుసుకున్న రాజేష్ ను ప్రియ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి వెంటనే కలిసిపోయింది. అక్కడి నుండి వారిరువురు ఇంటికి చేరుకుని, తమ తమ లాయర్లకు ఫోన్ చేసి, తమ విడాకుల పిటిషన్లను కాన్సిల్ చేశారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవించసాగారు.
ఒక చిన్న అపార్థం రెండు జీవితాలను మార్చేసేది అందుకనే ఆవేశాన్ని వదలి, ఆలోచనతో తప్పొప్పులు తెలుసుకొని జీవించాలని కోరుకుంటూ…
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comentarios