ఆడది అగ్నికణం అయితే
- Nallabati Raghavendra Rao
- Jan 3, 2024
- 10 min read
Updated: Mar 15, 2024
వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)

'Adadi Agnikanam Ayithe' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 03/01/2024
'ఆడది అగ్నికణం అయితే' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అక్కడికీ పట్టాభిరామయ్య చెప్పాడు. అది పెద్ద కంపెనీ అయినంత మాత్రాన, 20 వేల రూపాయల జీతం ఆఫర్ చేసినంత మాత్రాన, ఆ మహాపట్టణంలో ఓ నలుగురు సభ్యుల కుటుంబం బ్రతికి బట్టకట్టి నెగ్గుకురావడం చాలా కష్టమని.
కానీ అతని కొడుకు విగ్నేష్ అందుకు అంగీకరించ లేదు.
దాంతో పట్టాభిరామయ్య కొడుకుతో ఇలా అన్నాడు.. ఆడది అగ్నికణం అయితే
" ఒరేయ్ విగ్నేష్.. ఆ మహాపట్టణంలో మనకు గురివింద పూస ఎత్తు అన్యాయం జరిగినా మనం తిరగబడలేము. తిరగబడి నిలబడలేం. సుఖాన ఉన్నప్రాణం కష్టాలపాలు కావడమే అవుతుంది''
అంటూ అన్నాడు.
తండ్రి అలా అనగానే కొడుకు విగ్నేష్.. "ఎన్నాళ్ళిలా.. అందరూ అందలం ఎక్కేస్తున్నారు నీ పిరికి మందు తో.. నాలో "సాహసం " అన్న పదం మరుగున పడి పోయింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే.. చావో రేవో తేల్చుకుందాం నాన్న" అన్నాడు చిట్టచివరగా.
అంతే.. ఆ కుటుంబం అలా ఆ మహాపట్టణం చేరి సంవత్సరం పూర్తయింది. విగ్నేష్ సంపాదన 25 వేలతో సర్దుకు బ్రతికేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు నలు గురు.
పట్టాభిరామయ్య తను కొందరికి సంస్కృత పాఠాలు చెప్తూ వచ్చిన డబ్బులతో కూతురు రోజా కి చదువు చెప్పిస్తున్నాడు. ఆ అమ్మాయి ఇంటరు రెండోసంవ త్సరం. పట్టాభిరామయ్య భార్య మంగ మహాలక్ష్మి అప్పడాలకంపెనీలో పనిచేస్తూ సంపాదించే రోజుకూలీ ఆ కుటుంబం మందులు ఖర్చుకి సరిపోతుంది. అలా అలా ఆ కుటుంబం ఆ మహాపట్టణం లో చాలా కష్టంగా నెట్టు కొస్తున్నారు.
ఆ ఇంట్లో ప్రతి రోజు రకరకాల సమస్యల మీద తండ్రి కొడుకులకు చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. దాన్ని చల్లబరచి నీళ్ళు చల్లుతూ ఉంటాడు కొడుకు నెత్తి మీద తండ్రిపట్టాభిరామయ్య.
కుటుంబం అంతా డీలక్స్ బస్సు ఎక్కి ఈ మహా పట్టణం చేరే ముందు రోజే కొడుకుని తన జాగ్రత్త కోసం ఒక " గాడి" లో బంధించి పడేసాడు పట్టాభి రామయ్య.
" ఒరేయ్.. విగ్నేష్.. ఇలాకూర్చో. ఆనాడు గాంధీగారు మద్యం, మాంసం ఇంగ్లాండులో ముట్టను.. అని.. శపథం చేసి వెళ్ళాడు. అలాగే మెలిగాడు. నీకు తెలు సుగా.. అందుకనే ఆయన మహాత్ముడు అయ్యాడు. ".. అంటూ నీతి వాక్యాలు చెప్పబోయాడు.
విగ్నేష్ కు అర్థం అయింది.. " సరే నాన్న.. అర్థం అయింది. ఇదిగో విను నీ మనసు సంతోషం కోసం.. నేను కూడా మాటిస్తున్నాను. ఆ మహాపట్టణం లో నేను కూడా ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తగవు పడను.. తిరగబడను. ఇదిగో.. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను.. సరేనా. " అన్నాడు ఆ బయలుదేరే ముందే.
అదిగో.. ఆనాడు ఆ మహాపట్టణం వెళ్లే ముందే
కొడుకు దగ్గర అట్లా మాట తీసుకున్నాడు పట్టాభి రామయ్య. తనకు చిక్కిన ఆపదునైన "ప్రమాణ" ఆయుధంతో కొడుకును గాడిలో కట్టిపడేసి బాగానే నెట్టుకొచ్చాడు ఒక సంవత్సరం పట్టాభిరామయ్య.
రెండో సంవత్సరం మొదలైనమొదటిరోజు.. విగ్నేష్ జీతం 30వేలకు పెరిగింది.
అయినా రోజులు కష్టంగానే గడుస్తున్నాయి. ఆరోజు.. కూతురు రోజాస్నేహితురాలు విమల పరుగున వచ్చి.. కాలేజీ కి వెళ్లేటప్పుడు ఆటోవాడు రోజా తో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. ఏడిపించాడు.. అని చెప్పింది.
పౌరుషం గా పైకి లేచి బయటకు వెళ్ళడానికి షర్టు వేసుకున్నాడు విగ్నేష్.
పట్టాభిరామయ్య కొడుకు దగ్గరకు వచ్చి ఇలా బోధించాడు.. "ఎక్కడికి వెళ్తావు విగ్నేష్.. వెళ్లొద్దు.. వద్దు ఇప్పుడేమైంది అసలు.. ఆ వెధవెవడో దాన్ని ఏడిపించా డు అంతే కదా. అదివచ్చాక విషయంఅడిగి రేపటి నుండి ఆదారిలో అసలు వెళ్లొద్దని చెబుదాం. "
తండ్రి అన్న ఆ మాటలకు విగ్నేష్ ఏ మాత్రం ఒప్పంద పడలేదు. " నేను ఊరుకోను నాన్న.. ఈ విషయంలో పోలీస్ కేసు పెడతాను. " అన్నాడు కసిగా కోపంగా.
'' వాడలా ఊరుకుంటాడా. కాపుకాసి.. యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా నలుగురు ఆటో వాళ్ళని పోగేసి నీ చెల్లిని ఊరి చివర కొండల్లోకి తీసుకెళ్లి ఏదైనా చేస్తే.. అది చచ్చిపోతే. ? ".. తండ్రి ఎలా అంటుండగానే..
కాసేపటికి కాలేజీ నుండి రానేవచ్చింది రోజా.
''విషయంతెలిసింది. అమ్మా.. రోజమ్మా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావే. " అడిగాడు తండ్రి.
తండ్రి ప్రశ్నలోని పటుత్వాన్ని గ్రహించింది రోజా..
" కాలేజీ మానేస్తాను నాన్న.. " టక్కున జవాబు చెప్పి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.
మౌనం వహించాడు పట్టాభిరామయ్య.
అలా మరో వారం గడిచింది.
" అదేమిటి నాన్న జీవితంలో ప్రతి విషయం చచ్చి పోతూ బ్రతకమంటావు" అడిగాడు విగ్నేష్.
"దీన్ని చచ్చిపోతూ బ్రతకటం అనరురా. సర్దుకుపోతూ బ్రతకడం అంటే.. చాలా చాలా బాగుంటుంది. నీకు చాలా విషయాలు చెప్పాలి. రా ఇలా కుర్చీ మీద కూర్చో. '' అంటూ తండ్రి పట్టాభిరామయ్య కొడుకుకి కొన్ని గత చరిత్రలు చెప్పడం ప్రారంభించాడు.
పట్టాభిరామయ్య.. తన "ఫ్లాష్ బ్యాక్" చిట్టా కూడా విప్పాడు.
అతి భయంకరమైన, , , తన "గతం" పూర్తిగా వివ రిస్తూ గుర్తుచేశాడు కొడుక్కి పట్టాభిరామయ్య.
దాంతో విగ్నేష్.. " నాన్న.. మీరు చెప్పింది యదార్థమే. ఇప్పుడు చట్టాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. మనం భయపడవలసిన పనిలేదు. '' అన్నాడు విగ్నేష్.
"" నువ్వు సంసారబంధం లేని బుజ్జి గాడివి రా.
ప్రాణం రూపాయిపావలా కన్నా చవక అయి పోయిన ఈ రోజుల్లో కక్ష, కసి, ద్వేషం, అన్యాయం, దుర్మార్గత్వం ల బారిన పడొద్దు. హాయిగ బ్రతుకుదాం.. జరిగి పోయిన చిన్నపెద్ద నష్టాలని మరిచిపో. రాబోయే కష్ట నష్టాలను కూడా మర్చిపోవడానికి సిద్ధంగా ఉండు. '' అంటూ కొడుకు విగ్నేష్ ను చల్లబరిచి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాడు.
విగ్నేష్ తండ్రి చెప్పింది ఏమాత్రం నచ్చక అతని వైపు అదోలా చూశాడు.
. ''ఏమిటి అలా చూస్తున్నావు. నీ ఉద్దేశంలో ఏ మను కుంటున్నావో నాకు అర్థం అవుతుందిరా. ఈ మహా పట్టణం లో ఏ రోజుకా రోజు.. మన కుటుంబ సభ్యులు నలుగురం ప్రాణాలతో క్షేమంగా ఉండటమే నాకు ముఖ్యo.. '' అంటూ కరాఖండిగా చెప్పేసాడు పట్టాభిరామయ్య.
***
కొన్నాళ్ళకు.. విగ్నేష్ కు దగ్గర సంబంధం చూసి పెళ్ళి జరిపించేశాడు పట్టాభిరామయ్య. అయితే అదే..
విగ్నేష్ పాలిట శాపం అవుతుందని కలలో కూడా ఊహించలేదు విగ్నేష్.
పెళ్లయిన తర్వాత నెల గడిచాక భార్యతో సినిమా కెళ్లి రాత్రి ఇంటికి నడిచి వస్తుంటే వర్షం మొదలైంది. రోడ్డం తా బురదమయం అయింది.
అప్పుడే.. వాళ్ల పక్కనుంచి దూసుకెళ్లింది.. టాటాసుమో.
విగ్నేష్ భార్య మల్లిక తెల్లచీర ఖరాబు అయ్యింది.
విగ్నేష్ ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు.
ముందుకు వెళ్ళి పోయిన టాటా సుమో అలాగే వెనక్కు వచ్చింది.
విగ్నేష్ ఏదో అడుగుదాం అనుకుంటుండగా తండ్రికి చేసిన ప్రమాణం.. భార్య వెనక్కులాగే తత్వం.. అడ్డు వచ్చాయి.
అతను.. ' ఎర్రి నాయుడు'. ఎమ్మెల్యేగారి అను చరుల్లో ప్రథముడు.. కుడి, ఎడమ భుజం కూడా!!.
" ఏందిరా అట్టా సూత్తున్నావు.. ?" అరిచాడు అద్దాల ప్రేమ్ క్రిందకు దింపి ఎర్రినాయుడు.
" అన్నా, ఈడు.. మనల్ని మనసులో తిట్టు కుంటున్నా డన్నా.. " ఎర్రినాయుడుని రెచ్చగొట్టాడు గుబురు మీసాల అనుచరుడు.
వికటంగా నవ్వాడు ఎర్రినాయుడు.
అంతే.. ఎర్రినాయుడు బలవంతంగా వాళ్ళిద్దర్నీ
కారు ఎక్కించి తన పాతబంగళాకి తీసుకెళ్ళి పోయాడు.
అనుచరులు.. ఎర్రినాయుడు కలసి వాళ్ళిద్దరినీ చాలాసేపు ఏడిపించారు.
* **
ఇంటికి వచ్చిన విగ్నేష్ మల్లిక ముభావంగా గడుపు తున్నారు.
పట్టాభిరామయ్యకు ఏదో అనుమానం వచ్చింది.. మొత్తానికి.
వారం నుండి.. కొడుకు కోడలు ప్రవర్తన అర్థం చేసు కోలేకపోతున్నాడు. ఏదో పెద్ద సమస్యే అని గుర్తించ గలిగాడు. విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమూ చేశాడు.
ఒకరోజు వాళ్ళిద్దరి దగ్గర కూర్చొని ఇలా అన్నాడు.
" విగ్నేష్.. సమస్య ఎంత జటిలమైన ఈ మాయా నగరంలో మనం ఏమి చేయలేమురా. ఒకవేళ చేసినా.. తెల్లారేసరికి లారీ మనమీదకు యాక్సిడెంటల్
గా వచ్చేయొచ్చు. ఆ యాక్సిడెంట్లో మనం చచ్చి పోవచ్చు.
లేదా రకరకాల సమస్యలతో మన జీవితాలు అల్ల కల్లోలం కావచ్చు. అలా ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా అవమానాలు భరిస్తూ బ్రతకడమే బెటరేమో.
పిరికిమందు నూరినూరి బాగా పోస్తున్నాను.. అని అనుకుంటున్నావు కదూ. వ్యవస్థ మొత్తం కుళ్లి పోయిందిరా. మామూలోడు ఎదిరించి నిలబడ లేడు. ఈమాయానగరం సాలె గూడురా! ఇదొక చదరంగం.. పద్మ వ్యూహం!
కోడలా మల్లికా.. అబ్బాయి ఎలాగూ నోరు మెదపడం లేదు. కాస్త నువ్వైనా చెప్పమ్మా. వారం క్రితం ఏం జరిగింది అసలు?" అడిగాడు కోడలు వైపు తిరిగి.
"ఏం జరగలేదు మామయ్య గారు.. అంతా బాగానే ఉంది. "
కోడలు కొసరికొసరి అన్న మాటలు బాగానే అర్థం అయ్యాయి పట్టాభిరామయ్య కు.
*** *** **
తన ట్యూషన్ పనులన్నీ ముగిశాక రాత్రి నడుచు కుంటూ ఇంటికి వస్తున్నాడు పట్టాభిరామయ్య
ఈ రోజు కూడా వర్షం కురిసి వెలసింది. రోడ్డంతా బురదబురద మయమైంది. మళ్లీ అదే టాటా సుమో
ఈసారి పట్టాభిరామయ్య పంచె ఖరాబైంది బురదతో.
పట్టాభిరామయ్య ఆగిపోయి వెనక్క తిరిగి చూశాడు.
ముందుకు వెళ్లి పోయిన టాటా సుమో అలాగే వెనక్కు వచ్చింది.
ఫ్రేమ్ బిల్వారి అద్దం క్రిందకు దిగింది.
" ఒరేయ్.. వారం క్రితం తగిలినోడులాగే వీడు కూడా పెద్ద వి. పి గాడులాగే ఉన్నాడురా.. పిచ్చిగా, వెకిలిగా నవ్వుతూ అన్నాడు ఎర్రినాయుడు.
"గురువా.. ఆడికి ఈడు తండ్రేమో. వాలకం చూస్తే అట్లనే ఉంది గురువా. ఈ ముసలాడితో మనకు పని ఏంటి? పోదాం పద.. '' ఎర్రినాయుడు అనుచరులు నీరసంగా అన్నారు.
మారుతి కారు కదలబోతోంది.
" ఆగండి.. వారం క్రితం ఏం జరిగింది అసలు? సమా ధానం చెప్పి కదలండి. " అరిచాడు కోపంగా పట్టాభి రామయ్య.
దాంతో ఆ అనుచరులలో ఒకడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు.. " ఎవడ్రా నువ్వు.. మా ఎర్రినాయుడు అన్న తోనే మాట్లాడే ధైర్యమా? అయినా సరదాసరదా
ఇసయం అడిగావు కనుక చెప్తుండా. వారంక్రితం
సరిగ్గా ఇదే సమయం, ఇదే వర్షం, ఇదే చోటు, ఇదే బురద..
ఆ పిల్ల.. పేరు ఆళ్ళు మాట్లాడుకుంటే మా కెరుక అయినది. " మల్లిక అంట.. ఆళ్ళు ఇద్దరితో మేమం తా బాగా ఆడుకున్నాం. ఇంతకన్నా నీకు అనవసరం ఎళ్ళు. " అంటూ చిరాకుగా అరిచాడు.
" మల్లిక నా కోడలు.. విగ్నేష్ నా కొడుకు. నిజం చెప్పండి వాళ్లని ఏం చేశారు? ఎర్రినాయుడు నీది తప్పుదారి.. నాశనం అయిపోతావు. " పిచ్చిగా కేక పెట్టాడు పట్టాభిరామయ్య.
"ఓరి.. మాకే శాపాలు పెడుతువా. అన్నా.. ఈడు పెమాదం చేయగలడు. హూ.. అను.. పురుగులమందు పట్టించి రైలు పట్టాల మీద దింపుతాo'' అంటూ ఎర్రి నాయుడుని రెచ్చ కొట్టారు అనుచరులు.
" చెప్పి చేస్తుండ్రు.. సిగ్గు లేదురా. " అనుచరులనూ తను కూడా రెచ్చగొట్టాడు ఎర్రినాయుడు.
అంతే.. అంతే..
జరగరాని ఘోరం అన్యాయం జరిగిపోయింది!
*
కడుపులో పురుగులమందు తో కాసేపట్లో రైలు పట్టాల మీద పడున్న పట్టాభిరామయ్య.. నిస్సత్తు వగానే జేబులోంచి ' సెల్' తీశాడు.
" నా.. య.. నా.. విగ్నే.. ష్.. నేను.. నేను కాసేపట్లో.. చచ్చిపోతానురా. కానీ ఒకందుకు సంతోషిస్తున్నాను బాబు.. ఈ మహాపట్టణం లో నువ్వు నన్ను పోగొట్టు కొంటున్నావు గాని.. నిన్ను నేను పోగొట్టు కోవడంలేదు కదరా. అలా నేనే మహా విజయం సా.. ధించాను.. రా..
నీ పాలిట నీ భార్య పాలిట యముడు ఆ దుర్మా ర్గుడు.. ఎర్రి నాయుడు. ఆడే.. నా పాలిటకూడా కాల యముడయ్యాడు. మీ ఇద్దరు గురించిన విషయం నాకు తెలిసినందుకే.. నాకు పురుగులమందు పట్టించి రైలు పట్టాల మీదప.. డే.. సాడు.
బాబు.. వద్దురా.. ఏమీ.. ఆలోచించొద్దు. పోలీసులు ప్రశ్నిస్తే.. అడిగి.. ఏదో చెప్పేసి.. నువ్వు, నీ పెళ్ళాం, తల్లి చెల్లి తో.. పారిపోండిరా.. '' అంటూ ఒక పక్కకు ఒరిగి పోయిన పట్టాభిరామయ్య చేతినుండి ' సెల్' జారి పోయి కింద పడిపోయింది.
***
ఈ సంఘటన ఇలా జరిగిన నాలుగు గంటల తర్వాత..
"శవాన్ని.. గుర్తుపట్టండి.. గుర్తుపట్టండి.. ".. అంటూ గుమికూడిన జనాన్ని అడిగారు పోలీసులు.
"మా నాన్నే.. పట్టాభి.. రామయ్య.. ".. అక్కడ చేరిన వారిలో కలిసిపోయి ఉన్న విగ్నేష్ నెమ్మదిగా చెప్పాడు
కళ్ళు తుడుచుకొంటూ.
"ఎలా చనిపోయాడు అంటారు.. ఎవరైనా శత్రువులు ఉన్నారా? " మళ్లీ ప్రశ్నించారు పోలీసులు.
"ఎవరూ లేరు.. అప్పుల బాధ భరించలేక చచ్చి పోతానని అనేవాడు. చివరికిలా పురుగుల మందు తాగి తనకు తానే ఎవరి బలవంతం లేకుండా ఆత్మ హత్య చేసుకున్నాడు. ".. అన్నాడు రోదిస్తూ విగ్నేష్.
పోలీసులు చేయవలసిన కార్యక్రమాలన్నీ ముగిశాక శవాన్ని తనకు అప్పచెప్పాక.. బాధతో కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు విగ్నేష్.
ఆ రాత్రే భార్య, చెల్లి, తల్లి తో.. రైల్వే స్టేషన్కు వచ్చాడు.
ఆ మాయానగరానికి దూరంగా వెళ్లి పోవాలనేది విగ్నేష్ ఆలోచన.
' వివాహబంధం' అంటూ ఒకటి ఏర్పడ్డాక గతంలో ఉండే పౌరుషం, కసి, పట్టుదల అన్నీ చచ్చిపో యాయి.. విగ్నేష్ లో.
**
కానీ.. తాను ఎక్కవలసిన రైలు ఇంకాసేపట్లో వస్తోంది
అనగా విగ్నేష్ భార్య మల్లిక అక్కడ బల్లమీద కూర్చు ని తదేకంగా ఒక "దృశ్యం" చూడసాగింది. !
ఒక చీమ.. తనకన్నా నాలుగురెట్లు పెద్దది అయిన పంచదార పలుకును తన గమ్యానికి చేర్చే ప్రయత్నం లో దొర్లిస్తుంది. ఆ పలుకు.. తన దారిలో అడ్డొచ్చిన ఎత్తు పల్లాలకి జారి జారి ఎక్కడికో వెళ్లి పడిపోతుంది. అయినా రెట్టించిన ఉత్సాహంతో వెనక్కువెళ్లి ఆ పలుకును మళ్లీ గమ్యానికి చేర్చే మొక్కవోని దీక్షా ప్రయత్నం అలా అలా చేస్తూనే ఉంది. మళ్లీ మరింత మరింత పాతాళానికి జారిపడి పోతుంది. అయినా మళ్లీమళ్లీ అదేఅదే ప్రయత్నం! చిట్టచివరికి విజయం సాధించింది. ఆ పంచదార పలుకును తాను అనుకున్న గమ్యానికి చేరవేసింది. ! చీమ చాలా చిన్నది.. ఆ పంచదార పలుకు దాని కన్నా 10 రెట్లు పెద్దది.. ఇది ఎలా.. ఇది ఎలా సాధ్యం?
ఈ సంఘటన తదేకంగా చూడటంతో మల్లిక శరీరం జలదరించినట్లు అయింది.
ఏదో కర్తవ్యం బోధపడిందినట్లయింది.
ఆ సమయంలోనే ఎక్కవలసిన రైలు అప్పుడే వచ్చి ప్లాట్ ఫామ్ మీద ఆగింది. అందరూ కదిలి రైలు ఎక్కబోతున్నప్పటికీ మల్లిక మాత్రం కదలలేదు. చలించలేదు.. పైకిలేవలేదు.
" రా మల్లిక.. ఏమిటి అలాఉండిపోయావు. ? రైలు కదులుతుంది. త్వరగా రా.. " చాలా గట్టిగా అరిచాడు విగ్నేష్.
" ఒరేయ్ విగ్నేష్.. ఇక్కడ కొచ్చి మీ నాన్న గారిని పోగొట్టుకున్నాను. ఇక్కడ వద్దురా దూరంగ వెళ్లి పోదాం. రైలు కదులుతుందిగా.. మల్లికను త్వరగా రమ్మన రా" విగ్నేష్ తల్లి కంగారు పెట్టింది.
" అన్నయ్య.. ఈ మహాపట్టణం చాలా భయం కరంగా
కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉండొద్దు అన్నయ్య. వదిన కదలడం లేదు.. త్వరగా రమ్మని పిలువు. " చాలా బాధగా కంగారుగా అంది రోజా.
" ఆగండి.. మీ బాధలు.. కంగారులు.. అన్ని కట్టి పెట్టండి. ఎక్కడికివెళ్ళినా.. ఎంతదూరం వెళ్ళినా ఈమనుషులే ఉంటారు.. అందుకనే ఇక్కడే ఉండి చచ్చేవరకు పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. కెరటం సైతం పడిలేస్తూ తీరానికి చేరుతుంది. అలాగే మనిషి కూడా. " అంటూ విగ్నేష్ భార్య మల్లిక గట్టిగా అరిచింది.
ఖచ్చితమైన అభిప్రాయంతో పైకి లేచి కంచుగంట లా మాట్లాడిన మల్లిక మాటలకు.. విస్తుపోయారు మిగిలిన ముగ్గురు. కదులుతున్న ట్రైన్ నుంచి దిగిపోయి మల్లికను చేరారు.
ఆమె వదనం ఏదో సాధించాలన్న గుర్తుగా ప్రస్ఫు టంగా కనిపిస్తుంది.
"నేను మహిళాసంఘాలు, స్త్రీవాదసంఘాలు, అభ్యు దయసంఘాల సమాలోచనతో ఆ ఎర్రి నాయుడి ఇంటికి వెళ్తాను. అందరం అక్కడ ధర్నా చేసేలా చేస్తాను. వాడికి సంకెళ్ళు వేసి లాక్కొని తీసుకు వెళుతున్న.. ఆ.. " దృశ్యం".. అన్ని టీవీ ఛానళ్లలో రాష్ట్ర ప్రజలంతా చూడాలి. తర్వాత జరిగేది కాలమే నిర్ణయిస్తుంది. ఇదే నా నిర్ణయం"
ఓ వీరవనితలా ఉరుము ఉరిమినట్లు అంది మల్లిక.
అంతే.. ఆమెలో సాహసానికి, వీరత్వానికి, ధీరత్వా నికి, తెగింపు కి ఆశ్చర్యపోయారు ఆ ముగ్గురు. ఆమెలో వాళ్లకి ఓ వీరనారి ఝాన్సీ కనబడుతుంది. ప్రతీకారం తీర్చుకున్న ఓ ద్రౌపది కనబడుతుంది.
ఎర్రినాయుడు ఇంటికి త్వరగాచేరి అతన్ని బజారు పాలు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు పడు తున్నాయి మల్లిక అడుగులు!
ఆమె కుటుంబ సభ్యులు అందరూ మరింత ధైర్యం తెచ్చుకుని ఆమెను అనుసరించారు. ll
" ఆడది అగ్నికణం ఐతే
ఈ దూదిప్రపంచం
భగ్గుమనక తప్పదు. ''
****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Commenti