top of page
Writer's picturePitta Govinda Rao

ఆదర్శ దంపతులు



'Adarsa Dampathulu' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 17/05/2024

'ఆదర్శ దంపతులు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పెళ్ళి అనేది తప్పనిసరి. ప్రేమించిన వాళ్ళలో ఎక్కువ మంది వేరే వ్యక్తులను పెళ్ళి చేసుకోవటం జరుగుతుంది.ఎక్కడో ఒక చోట తక్కువ వ్యవధిలో మాత్రమే ప్రేమ వివాహాలు జరుగుతుంటాయి.


చాలామంది ఆడపిల్లలు ఎవరితో ప్రేమాయణం కొనసాగించినా.. పెళ్ళి మాత్రం డబ్బున్నవాడు లేదా బాగా డబ్బు సంపాధించే వాడినే కోరుకుంటున్నారు.ఇక అమ్మాయి తల్లిదండ్రులు అయితే మరీను.. జాబ్ ఉన్నోడికో లేక ఏదైనా బిజినెస్ చేసేవాడికో ఇవ్వటానికి మొగ్గు చూపుతారు.డబ్బు తప్ప మంచోడికి ఇస్తామని ఎవరు అనరు. ఎందుకంటే..! ఈ నూతన ప్రపంచంలో ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంది. మంచితనంతో కాదు కదా..?


ఒక అబ్బాయి జీవితంలో స్థిరపడాలంటే  ఇల్లు ఉండాలి, కుటుంబ బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాలి, డబ్బులు సంపాదించాలి, జీవితం గూర్చి తెలుసుకోవాలి. అదే అమ్మాయి జీవితంలో స్థిరపడాలంటే పెళ్ళి చేసుకుంటే సరి.


బాగా డబ్బు సంపాదించే అబ్బాయిలు, లేదా జాబ్ ఉన్న అబ్బాయిలకు పెళ్ళి విషయంలో ఏ తంటా ఉండదు. వాళ్ళు మంచోళ్ళు అవ్వని ,చెడ్డవాళ్ళు అవ్వని.

అదే ఒక అబ్బాయి మంచివాడై ఉండి, ఒకరి కింద పనిచేస్తు, చాలీచాలని జీతంతో నెట్టుకొచ్చే వాళ్ళని ఎవరైనా పెళ్ళి చేసుకుంటారా..? రఘు పరిస్థితి దాదాపు పైన చెప్పిన విధంగానే ఉంది.


రఘు ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తుండటంతో అతడి ప్రేమ ఎవరు అంగీకరించలేదు. కానీ..! ఎవరో ఒకరు తనను పెళ్ళైనా చేసుకోకపోతారా..? అని అనుకుంటు తల్లిదండ్రులను చూసుకునేవాడు. మంచివాడు కావటం కూడా రఘు కి ప్లస్. పెళ్ళి వయస్సు రావటంతో రఘుకు ఒక మంచి సంబంధం చూడ్డానికి ప్రయత్నించారు రఘు తల్లిదండ్రులు. అలా ఒకటి పదికి పెరిగిందే తప్ప ఏ అమ్మాయి కానీ.. అమ్మాయి తల్లిదండ్రులు కానీ రఘుతో పెళ్ళికి ఒప్పుకోలేదు. 


కారణం..? అమ్మాయి తల్లిదండ్రులు ఎంత పేదోళ్ళు అయినా.. ఎంతో కొంత కట్నం కట్టబెట్టి డబ్బు ఉన్నోడికే ఇస్తే కూతురు జీవితం సుఖంగా ఉంటుందని నమ్మేవాళ్ళే తప్ప కష్టపడేవాడు మంచివాడు, అర్థం చేసుకునేవాడని ఆలోచించలేదు.అందుకే రఘుకి పది సంబంధాలు పోయాయి. ఇక తనకు జీవితంలో పెళ్ళి జరగదని అనుకుంటున్న వేళ ఎవరు రాసి పెట్టి ఉంటే వాళ్ళే వస్తారన్నట్లు సంధ్య అనే ఒక మధ్యతరగతి అమ్మాయి రఘుతో పెళ్ళికి ఒప్పుకుంది.


ఇప్పుడు రఘు చాలా బాధపడుతున్నాడు. చాలీచాలని జీతం అని పదిమంది అమ్మాయిలు తిరస్కరించినా.. సంధ్య మాత్రం తనను ఏం చూసి ఇష్టపడిందో రఘుకి అర్థంకాక తన గూర్చి తెలియకుండా ఇష్టపడిందని ఆమె పై జాలి చూపాడు. కానీ..! ఎలాగైనా ఆమెను బాగా చూసుకోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు. అతడి నిర్ణయం కేవలం మాటల వరకే పరిమితం అయ్యింది. ఈరోజుల్లో ఆనందంగా ఉండాలంటే డబ్బు ఉండాలి కదా..?  ఆ విషయం రఘుకి తెలుసు. 

అయితే.. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఉండాల్సింది డబ్బు కాదని భార్యాభర్తల మధ్య అన్యోన్యత అని సంధ్య రఘుకి అర్థం అయ్యేలా చేసింది. అవును.. రఘు సంపాదన తక్కువే అయినా.. పద్దతిగా ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తూ వచ్చింది. అలా వారి జీవితంలోకి ఒక పాప కూడా వచ్చి చేరింది.


 కొంతకాలం గడిచాక రఘు తల్లిదండ్రులు పోయారు. పెద్దవాళ్ళు.. పైగా జీవితానుభవం ఉన్నోళ్ళు, వాళ్ళ అరకొర సంపాదన కూడా రఘుకి కాస్త ఊరటనిచ్చేది. ఇప్పుడు అది లేదు. వాళ్ళు ఉన్నారనే ధైర్యం కూడా లేదు.  భార్య ఏమీ సంపాదించకున్నా ఆమె రూపంలో అర్థం చేసుకునే మనిషి తన పక్కన ఉందని ధైర్యం తెచ్చుకున్నాడు. పాప రమ్యని కూడా ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. 


రఘు రోజూ రెస్టారెంట్ కి వెళ్ళటం, మరలా రాత్రి 8గంటలకు తిరిగి రావటం.. వాళ్ళు వచ్చే వరకు  భార్య,పిల్లలు భోజనం కూడా చేయరంటే రఘుపై వారికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థం అవుతుంది. బయట ఎంత కష్టం అయినా.. ఎన్ని అవమానాలు పడినా..ఇంట్లో వాతావరణం రఘుకి అవన్నీ మర్చిపోయేలా చేయటమే కాదు, కుటుంబం కోసం ఎంత కష్టమైనా ,ఎన్ని అవమానాలైనా భరించగలననే గొప్ప ధైర్యం అతడిలో నింపుతాయి. 


ఒకరోజు సంధ్య పాప పుట్టినరోజు అని  పాపతో కలిసి రఘు పని చేస్తున్న రెస్టారెంట్ కి వెళ్ళింది. వాళ్ళని చూడగానే ఆనందంతో వారి దగ్గరకు వెళ్ళబోగా.. యజమాని రఘుని

" ఎక్కడికి " గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో రఘు భార్య ,పాపకు రఘు ఇక్కడ ఎన్నో అవమానాలు పడుతున్నాడని అర్థం అయిపోయింది. యజమాని ఆ అరుపులతో వాళ్ళు కూడా  భయపడుతున్నారు.


" నా భార్య, కూతురు వచ్చారు సార్ " వినయంగా చెప్పాడు రఘు.


అయినా సరే..

"వాళ్ళు వస్తే నీకు ఇష్టం వచ్చినట్లు ఇలా వెళ్ళిపోతే ఇక్కడ పని ఎవడు చేస్తాడు ..? మర్యాదగా నీ పని నువ్వు చూసుకో " చీవాట్లు పెట్టాడు యజమాని.


అక్కడితో ఆగకుండా సంధ్య, కూతుర్ని కూడా 

"వెళ్ళండి వెళ్ళండే.. సొంత ఆఫీసులా దర్జాగా లోపలికి వచ్చేస్తున్నారు" అని కోప్పడ్డాడు.


మాకు స్వతంత్రాన్ని ఇచ్చి తాను స్వతంత్రాన్ని కోల్పోతున్నాడని భర్త రఘు పై సంధ్య జాలి పడింది. అంతేనా..ఇన్ని అవమానాలు మా కోసం భరిస్తూ ఇంట్లో మాత్రం ఎంతో కలివిడిగా మాతో కలసిపోతారు. నిజంగా ఇలాంటి భర్త కోసం ఏదైనా త్యాగం చేయాలనీ భర్త కష్టాల్ని, అవమానాల్ని దూరం చేయాలని మంచి ఆలోచన చేసింది.


 తాను తల్లిదండ్రుల ఇంట్లో ఎక్కడ అయితే  చదువు ఆపిందో అక్కడ నుండి మళ్ళీ చదువు కొనసాగించి IPS శిక్షణ కోసం కఠోర సాధన చేసింది. అందుకు రఘు మద్దతు ఉండటంతో తల్లి కూతుళ్లు రాత్రనక పగలనక పుస్తకాలతో కుస్తీ పడ్డారు.అప్పుడు వారికోసం రఘు గొడ్డు చాకిరీ చేయల్సి వచ్చింది.  

చివరకు కూతురు పదోతరగతిలో తొలి స్థానంలో నిలవగా.. సంధ్య IPS అర్హతకి  కావల్సిన ర్యాంక్ సాధించింది.



రెండేళ్ళ తర్వాత ఆమె కోరిక మేరకు రఘు,రమ్య తో పాటు సంధ్య ఓ రెస్టారెంట్ లో భోజనం చేయటానికి వెళ్ళారు. వాళ్ళ వెనుక కొంతమంది పోలీసులు  కూడా ఉన్నారు. తాను ,తన కుటుంభం ఏ రెస్టారెంట్ లో అయితే అవమానపడిందో.. అక్కడికే వెళ్ళింది.అక్కడ కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే వెయిటర్స్ ఉండగా వాళ్ళని,యజమాని వాళ్ళపై అరుస్తున్న  విషయాలను గమనిస్తుంది. సంధ్య. రఘుకి ఏం చేయాలో అర్థంకాక

  మాట్లాడకుండా కూర్చున్నాడు. తనతో వచ్చిన ఒక పోలీసు ఆఫీసర్ కి చెవిలో ఏదో  చెప్పింది. అంతే..! క్షణంలో రెస్టారెంట్ మొత్తం పోలీసులు తో నిండిపోయింది. వాళ్ళంతా భోజనాలకు కూర్చున్నారు. వెయిటర్స్ సరిపోకపోవటంతో సంధ్య యజమానిని పిలిచింది.

"రేయ్... ఎంతసేపు వెయిట్ చేయాలి మాకు కావల్సినవి త్వరగా తీసుకురా " అంటూ అరిచింది.


వాళ్ళని చూడగానే రెస్టారెంట్ యజమాని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తగిన సమయంలో భోజనం తీసుకురానందున వాడి చెంప చెళ్లు మనిపించింది. 

"ఇంత తక్కువ మంది వెయిటర్స్ ని పెట్టి వాళ్ళు ఎంత కష్టపడుతున్నా..కనీసం కాసింత కనికరం చూపని నీకు ఇది కరక్టే " అని తాను చేసిన పనిని సమర్ధించుకుంది. 


మరలా " నీకు నీ కుటుంబం ఎంత ముఖ్యమో.. వాళ్ళకి వారి కుటుంబం కూడా అంతే ముఖ్యం. డబ్బు ఉంది కదా అని అహంకారం చూపితే ..నీవు ఇక్కడే ఉండిపోతావు. నీతో అవమానించబడిన వాడిని ఎప్పుడు కాలం నీకంటే ఉన్నత స్థానంలో ఉంచుతుంది గుర్తుపెట్టుకో "అని వెళ్తుంది.


కష్టంలో తోడు ఉండటమే కాక తాను పడిన కష్టాలను,అవమానాలను గుర్తించి వాటి నుంచి తప్పించిన తన భార్యను కూతుర్ని రఘు హత్తుకున్నాడు.ఈ ఆదర్శ దంపతులను అక్కడ ఉన్న పోలీసులు చప్పట్లతో అభినందించారు.

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం





45 views0 comments

Comments


bottom of page