'Adarsa Dampathyam' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana Published In manatelugukathalu.com On 28/05/2024
'ఆదర్శ దాంపత్యం' తెలుగు కథ
రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
భాస్కర్, రేణుక భార్యాభర్తలు. పెళ్ళై పదేళ్ళవుతోంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఏడేళ్ల కొడుకు వికాస్ కూడా ఉన్నాడు. వారిది సిటీలో ఒక మధ్య తరగతి కుటుంబం. భాస్కర్ పనిచేసే బహుళ జాతీయ కంపెనీ ఉద్యోగమే వారి జీవనాధారం! దానితోనే ఏ లోటూ లేకుండా గడిచిపోతోంది వారి జీవనం.
కానీ.. ముందు చూపుగా, పెరగబోయే సంసారపు ఖర్చుల అవసరాలకై జాగ్రత్త పడటం, కూడబెట్టడం అవుసరం అని యోచిస్తున్న సమయంలోనే భాస్కర్ కు వారి కంపెనీ, అమెరికాలోని కాలిఫోర్నియాకు ఏడాది డిప్యుటేషన్ ఆఫర్ ఇచ్చింది!
డిప్యుటేషన్ సమయంలో… దేశంలో జీతమే కాకుండా అమెరికాలో ఉండే సమయానికి డాలర్లలో బాగానే చెల్లింపులు చేస్తుంది ఆ కంపెనీ. జాగ్రత్త పడితే, బాగానే మిగుల్చుకోవచ్చు! దానితో, తమ సొంతింటి కల కూడా నెరవేర్చుకోవచ్చు! అదే విషయం భార్యకు నచ్చజెప్పి, అమెరికా ప్రయాణానికి సంసిద్దుడయ్యాడు భాస్కర్. భార్య రేణుకకు కూడా… అయిష్టంగానైనా ఒప్పుకోక తప్పలేదు.
ప్రియుడు దూరదేశం వెళ్తున్నాడు… ప్రేయసి కళ్ళు ఎర్రబడ్డాయి…
“ఏమైంది?.. ఎందుకూ?..” ఆదుర్దాగా అడిగాడు భాస్కర్.
“నీ కోసం… రెండు ఎర్ర కలువలు” చిరునవ్వుతో సమాధానం చెప్పింది రేణుక.
ఆ కలువల మాటున కొలనూ ఉంది… విమానం టేకాఫ్ కాగానే… పొంగి పొర్లింది.
ఇక వారికి… ఏడాది వరకు, ఫోను సంభాషణలే ఉపశమనం!, మరో శరణ్యం లేదు మరి!!
“హలో…రేణూ…భోంచేసావా?..”
“ఇప్పుడే… బాబుకు పెట్టి… నిద్రపుచ్చాను. …మరి… మీకక్కడ ఆఫీసుకు టైమ్ అవుతోంది కదా!... మీతో మాట్లాడి సాగనంపి.. ఆ తర్వాత తీరికగా…చేస్తాను..” అంది.
“అయితే.. నా మామూలిచ్చేయ్!. వెళ్తాను!!”
“అంత దూరంలో ఉన్నా… మీ చిలిపితనం పోలేదు!..” అంటూ నోటితో ముద్దు శబ్దం చేసింది.. సెల్ ఫోనులో.. సిగ్గుపడుతూనే!...
“హలో… శ్రీ వారూ…ఈ రోజుకు… ఆఫీసు నుండి.. మీ బసకు చేరుకున్నారా?.. భోంచేసారా?…” అని కుశల ప్రశ్నలతో భర్తను వివరాలడిగింది.
“ఆ… బయటే డిన్నర్ చేసి, ఇప్పుడే ఇంటికి చేరాను! నువ్వు… టిఫిన్ చేసావా?. మన బాబిగాడు ఎలా ఉన్నాడు?”
“ఇప్పుడే.. వాడిని తయారుచేసి, స్కూలుకు పంపించాను! మరి.. ఇక నా పెదబాబుగా మీరున్నారుగా!... మీ సంగతి కూడా చూసి!.. ఆ తర్వాత, తీరికగా చేస్తాను” అంది గోముగా రేణుక.
“అయితే.. వెంటనే వీడియో ఆన్ చేసి… రాణిగారు.. దర్శనమిచ్చి.. నా కివ్వాల్సిన బహుమతి నాకిచ్చేయ్! ఈరోజుకు.. శాంతిగా నిద్రపోతాను!” అని తోందర పెట్టాడు.
“మరీ…కుర్రాడైపోతున్నారు!” అంటూనే, వీడియో ఆన్ చేసింది.
ఇద్దరి పెదాలు సున్నాల్లా చుట్టుకున్నాయి… సెల్ ఫోను స్క్రీన్ల ముందు!
రెండు పడకల మధ్య దూరం సప్తసముద్రాలను దాటి,
ఖండాంతరాలకు ఆవల!. వారి ప్రేమాభిమానం, ప్రేమాభినివేశం పల్లవించి, ప్రేమోపశమనం జరిగింది వారికి, ఆనాటికలా!, సెల్ ఫోను ద్వారా, వీడియో కాల్ పుణ్యమా అని.
తరచూ.. అంత దూరంలో ఉన్న వారిరువురికి, ఆ ఫోను సంభాషణలు, వీడియో దృశ్య మాధ్యమాలే తాత్కాలిక ఊరట!,
శారీరకంగా దగ్గరయ్యే రోజుకై ఎదురుచూస్తూ, నిశ్చింతగా కాలం గడపటానికి, తగిన మనోబలంతో నిబ్బరంగా, మానసికంగా శాంతిగా రోజులు లెక్కపెడుతూ జీవనం గడపటానికి.
జయహో… ఆధునిక విజ్ఞానం!
లాంగ్ లివ్… డిస్టెన్స్ లవ్!!
అంతే.. ఏడాది గడువు గడిచే వరకూ, వారి ముద్దుమురిపాలు, ఇలాగే.. సాగాయి నిరాటంకంగా!
ఏడాది వరకు.. తిరిగి సముఖంలో కలుసుకునే రోజుకై, రోజులు లెక్కపెడుతూ, గడిపారా అన్యోన్య దంపతులు, మరే చీకూ చింతా లేకుండా!!
🙏🙏🙏🙏🙏🙏🙏
గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!
నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.
వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.
ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!
Comentarios