ఆదర్శం
- Palla Venkata Ramarao
- 12 minutes ago
- 3 min read
#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #Adarsam, #ఆదర్శం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories

Adarsam - New Telugu Story Written By - Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 28/04/2025
ఆదర్శం - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పశ్చిమ కనుమల్లో 'తోరణ' అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు శేషుడు. అతనికి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. వాడికి శివుడు అని పేరు పెట్టాడు. కాబోయే రాజు కాబట్టి అతనికి యుద్ధ విద్యలు నేర్పాల్సిన అవసరం వచ్చింది. శివునికి తగిన వయసు రాగానే రణదేవుడు అనే గురువుని నియమించాడు శేషుడు. రణదేవుని పర్యవేక్షణలో యుద్ధ విద్యలు చక్కగా నేర్చుకుంటున్నాడు శివుడు.
శివునికి పదహారు సంవత్సరాల వయసు వచ్చింది. ఒకసారి వారలా యుద్ధవిద్యలు అభ్యాసం చేస్తూ పర్వతప్రాంతంపై ఉన్నారు. కాసేపటికి వారికి ఆకలి వేసింది. వెంట ఏమీ తెచ్చుకోలేదు. చుట్టుపక్కల కూడా ఏమీదొరకలేదు. అలాగే నీరసంగా ముందుకు సాగారు. కోట చాలా దూరంలో ఉంది. ఇంతలో వారికి ఒక మామిడి తోట కనిపించింది. అసలే ఆకలితో సతమతమవుతున్న రణదేవ్ ఒక చెట్టు వద్దకు వెళ్ళి గబగబా పండ్లు కోసుకుని తిన్నారు. ఆకలి తీరాక కాస్త నెమ్మదించాడు.
వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లు దిగ్గున లేచి దగ్గర్లో ఉన్న ఒక బండరాయి వద్దకు వెళ్లాడు. సర్రున ఒరలోని కత్తిని బయటకు లాగాడు. తన కుడి అరచేతిని బండరాయి పై ఉంచి రెండో చేత్తో కత్తిని పైకెత్తి నరుక్కోబోయాడు. అయితే కత్తి కుడిచెయ్యిపై పడలేదు. శివుడు అడ్డుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు.
"నావల్ల తప్పు జరిగింది. తోట యజమాని అనుమతి లేకుండా మనం మామిడి కాయలు కోసుకుతిన్నాం. ఇది దొంగతనం అవుతుంది. సంతానం తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. శిష్యులు తప్పు చేస్తే గురువుది అసమర్థత అవుతుంది. అలాంటిది నేనే తప్పు చేస్తే నేను నీకు ఏం నేర్పినట్లు?
పైగా నీవు కాబోయే పరిపాలకుడివి. నీవు నానుంచి నీతి నిజాయితీ నేర్చుకోవాలి. అందుకే నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. నా చేయి వదిలిపెట్టమ"న్నాడు.
అయితే శివుడు అందుకు ఒప్పుకోలేదు.
"ఆకలి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయేట్లు చేస్తుంది. అందువల్ల
మీరు చేసింది తప్పు కాదు" అన్నాడు.
ఇందుకు రణదేవ్ అంగీకరించలేదు. "పెద్దలెప్పుడూ సరైన మార్గంలోనే నడవాలి. అప్పుడే పిల్లలకు ఆదర్శంగా నిలబడతారు. నేను చేసిన ఈ తప్పుని ఈరోజు సమర్థించుకుంటే రేపు నువ్వెప్పుడైనా పరిపాలనలో తప్పు చేస్తే దాన్ని విమర్శించే అర్హత కోల్పోతాను. కాబట్టి శిక్ష అనుభవించాల్సిందేన"న్నాడు రణదేవుడు.
శివునికి ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది.
"తెలియకుండా కోశామని నేరమంటున్నారు. కొంటే నేరం అవదుకదా" అంటూ శివుడు తోటమాలి కోసం కేక వేశాడు.
దూరంగా ఉన్న తోటమాలి పరిగెత్తివచ్చాడు. విషయం చెప్పి తాము తిన్న పళ్లకు తగిన ఖరీదు చెల్లించాడు శివుడు.
అప్పుడు శాంతించాడు రణదేవ్.
ఒకరికి ఆదర్శంగా ఉండాలనుకుంటే ముందు మనం ఆచరించి చూపాలి అనే పాఠాన్ని నేర్చుకున్నాడు శివుడు.
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.