top of page
Writer's pictureMohana Krishna Tata

అదృష్టం అంటే నాదే


'Adrushtam Ante Nade' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 11/11/2023

'అదృష్టం అంటే నాదే' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సినిమా లో చూపించినట్టుగా స్టంట్స్‌ చెయ్యడమంటే చాలా ఇష్టం నాకు. ఈ మధ్య ఒక సినిమా చూసాను. హీరో బండి మీద స్పీడ్ గా వెళ్తూ...బైక్‌ హ్యాండిల్‌ వదిలేసి స్టంట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన నాకు.. అలాగే చెయ్యాలని ఊపు వచ్చింది. మర్నాడు ట్రాఫిక్ లేని ప్లేస్ కు వెళ్ళి, నా సూపర్ బైక్ తో ఆ హీరో ను తల్చుకుని, స్టంట్ చేసాను. ముందు ఇసుక ఉండడం సరిగ్గా గమనించలేదు. ఒక పెద్ద శబ్దం..నేను కింద, బైక్ నా మీద. ఎవరో, దయ కలిగిన మనిషి అంబులెన్స్ కు కాల్ చేసాడు.


హాస్పిటల్ లో కళ్ళు తెరిచాను. అంతా బాగానే ఉంది..కానీ ఒక కాలు కదలట్లేదు. చాలా బాధ అనిపించింది. నా చుట్టూరా, నాలాంటి వాళ్ళు చాలా మంది బెడ్ మీద నొప్పి భరించలేక ఆర్తనాదాలు చేస్తున్నారు.


ఈలోపు డాక్టర్ రూప వస్తున్నారని ఎవరో అనుకుంటుండగా విన్నాను. పేరు బాగుంది. ఈలోపు కళ్ళు మూసుకుంటే, గతం గుర్తొచ్చింది.


*****


ఒరేయ్ బాబు! ఎందుకు రా అమ్మను రోజూ అరిపిస్తావు చెప్పు! బాగా చదువుకున్నావు..మంచి ఉద్యోగం వెతుక్కోవొచ్చుగా!"


"ఎందుకు టెన్షన్ అమ్మా! ఇంజనీర్ చదువు అయ్యింది కదా...కాస్త లైఫ్ ని ఎంజాయ్ చెయ్యనీ.."


"మీ నాన్న ఉండి ఉంటే, నీకు నాలుగు చివాట్లు పెట్టి...రెండు తగిలించి చెప్పేవారు...నువ్వేమో నాతో ఇలా మాట్లాడతావు"


"నా జాతకం లో అదృష్టం రాసి పెట్టి ఉంది. ఏమో, ఏ మహారాణి యో నాకోసం వస్తుందేమో...ఎంతైనా కొంచం అందగాడినే కదా!..అంతా నీ పోలికే కదా! అమ్మా!"


"అందం విషయం లో నువ్వు చెప్పింది నిజమే అనుకో...నేను అందంగా ఉంటాననే మీ నాన్నగారు గోడ దూకి మరీ నన్ను ప్రేమించారు..నీ అదృష్టం అంటావా...నాకు తెలియదు.."


"ఏమో...నాన్న గోడ దూకినట్టు...ఏ అమ్మాయైనా..నా మనసులోకి దూకుతుందేమో!..దెబ్బకి పెళ్ళి..లైఫ్ రెండూ సెటిల్ అయిపోతాయేమో!"


"భలే కలలు కంటున్నావు..మీ నాన్న కొన్న ఈ ఇల్లు..ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి కనుక.. మనం ఇప్పటికి ఇలా బతికేస్తున్నాము"


"నో టెన్షన్...కష్టాలు అన్నీ తీరిపోతాయి...చూస్తూ ఉండు!" అన్నాడు వంశీ


*****


"హలో వంశీ గారు..అని అందమైన గొంతు నన్ను పిలిచినట్టు అనిపించి, కళ్ళు తెలిచాను"


ఎదురుగా స్టెతస్కోప్ వేసుకుని...ఒక అందమైన అమ్మాయి..తెల్ల కోట్ మీద 'రూప' అని పేరు కుట్టి ఉంది. రూప అంటే, తెల్లబడ్డ జుట్టు తో ఎవరో సీనియర్ డాక్టర్ అనుకున్నాను..ఇప్పుడే కాలేజీ నుంచి డాక్టర్ కోట్ వేసుకుని వచ్చినట్టుగా ఉంది ఈ అమ్మాయి..చూడగానే నచ్చేసింది..


"ఇతనికి ఎక్స్ –రే రాస్తున్నాను...అర్జెంటు గా తీయించండి"... అని ఆర్డర్ వేసింది డాక్టర్ రూప.


ఆమె గురించి ఆలోచిస్తూనే ఉన్నాను...వీల్ చైర్ లో నన్ను తీసుకుని వెళ్లి ఎక్స్ –రే తీయించారు.


నా వీల్ చైర్ తోస్తున్న బాయ్ తో కొంచం నవ్వుతూ మాటలు కలిపాను..చేతిలో ఒక వంద పెట్టి...టీ తాగమని చెప్పాను. పనిలో పని..డాక్టర్ గురించి అడిగాను..ఎలా చుస్తారని?


"డాక్టర్ రూప బాగా చూస్తారు...ఆవిడ రివ్యూస్ చూసారా? సూపర్ గా ఉంటాయి...ఉదయం నుంచి రాత్రి వరకు హాస్పిటల్ లోనే ఉంటారు. ఎప్పుడూ బిజీయే..మంచి హస్తవాసి గల డాక్టర్..."


నేను లెక్కలు వెయ్యడం మొదలుపెట్టాను..ఒక్క రోజు సంపాదనే చాలా ఎక్కువ...నా అదృష్టం ఈ 'రూప'లో వచ్చిందేమో! అయినా.. ఈ రూప నా రూపం చూసి ప్రేమిస్తుందా? నా వెర్రి గాని…


ఎక్స్ –రే రిపోర్ట్ వచ్చింది. నన్ను డాక్టర్ ని కలవమన్నారు...మా అమ్మకు చెబితే కంగారు పడుతుందని ఇంకా చెప్పలేదు. డాక్టర్ ని కలవడానికి నన్ను లోపలికి తీసుకుని వెళ్లారు...


"మీకు కాలు విరిగింది...ఆపరేషన్ చేసి కట్టు కడతాము..."


"ఓకే డాక్టర్...మీరే చేస్తారు కదా!"


"అవును నేనే చేస్తాను!"


"మీరు చేస్తే.. దేనికైనా ఓకే!"


"అంటే...?"


"అదే..మీ హస్తవాసి మంచిదని అందరూ అంటుంటే..."


అది విని..ఒక చిన్న స్మైల్ ఇచ్చింది నా రూప..ఆ స్మైల్ చూస్తే చాలు, పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు!


ఆ స్మైల్ కు నేను ఫిక్స్ అయిపోయాను...ఈవిడే మా ఆవిడా అని!


ఆపరేషన్ బాగా జరిగింది..కట్టు వేసారు..రూమ్ కు షిఫ్ట్ చేసారు..ఇప్పుడు ఫోన్ తీసి అమ్మకు కాల్ చేసాను...అడ్రస్ చెప్పాను..వస్తున్నానని కంగారుగా చెప్పింది.


నా రూప రూమ్ విసిట్ కి ఎప్పుడు వస్తుందా! అని చూస్తున్నాను...సడన్ గా నర్స్ ను వెంట బెట్టుకుని వచ్చింది.


"వంశీ! ఎలా ఉన్నావు ఇప్పుడు? రెండు రోజుల్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తాం..కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి"


ఎందుకో..నర్స్ ని ఏదో తెమ్మని బయటకు పంపించింది డాక్టర్..


"వంశీ! నన్ను గుర్తుపట్టావా?"


డాక్టర్ ఏమిటి.. నాతో ఇలా మాట్లాడుతున్నాదేమిటి? అనిపించింది.


"నేను రూపవతి...నీ ఇంటర్ కాలేజీ..." అని వేసుకున్న మాస్క్ తీసింది రూప.

"రూపవతి.. ఇప్పుడు డాక్టర్ రూపవతి అనమాట..గ్రేట్! ఇప్పటివరకు మాస్క్ లేకుండా నిన్ను చూడలేదు కదా!..గుర్తు పట్టలేదు.."


"గ్రేట్ ఏమిటి వంశీ...అప్పట్లో మనం ఎలా మాట్లాడుకేనేవాళ్ళం..నీ రూపస్ నేను.."


"రూపస్.. ఎలా ఉన్నావు? పెళ్ళి అవలేదు కదా!"


"పెళ్ళి అవలేదు ఇంకా!"


"ఈ చీర లో, ఆ కట్టు..బొట్టు..సూపర్ రూపస్.."


"అప్పట్లో నేనంటే ఇష్టం అన్నావు...ఇప్పుడు చేసుకుంటావా?” అంది రూప.


"రూపస్!నేనంటే ఇంకా ఇష్టం ఉందా? నువ్వు పెద్ద డాక్టర్ కదా!"


"డాక్టర్ అయితే ఏంటి! నేనూ మనిషినే కదా! ఆడదానినే కదా! సంసారం చెయ్యాలి కదా!"


"మాటలు నేర్చావ్ రూపస్"


ఈలోపు అమ్మ కంగారుగా రూమ్ లోకి వచ్చింది…


"నమస్తే డాక్టర్! మా అబ్బాయికి ఎలా ఉంది?"


"బాగానే ఉంది..కంగారు పడకండి అత్తయ్యా!"


"అత్తయ్యా!!!?"

"నేను చెప్పలేదా అమ్మా! నా అదృష్టం గురించి.." అని తన కళ్ళతోనే సైగ చేసాడు వంశీ


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ





53 views0 comments

Comments


bottom of page