#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AiduPrasnalu, #ఐదుప్రశ్నలు, #TeluguKathalu, #తెలుగుకథలు, #TeluguQuiz
Aidu Prasnalu - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 30/12/2024
ఐదు ప్రశ్నలు - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
అందాల వింధ్య యువరాణి. ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమె అడిగిన 5 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇది స్వయంవరం యొక్క షరతు. వింధ్య ది అందాన్ని మించిన అందం. చామన-ఛాయ. దానికి తోడు మైమరిపించే చిరునవ్వు ఆమె పెదాల పై ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉంటుంది. కోకిల కంఠం. మృధువైన వాక్కు. పైగా ఎల్లప్పుడూ మంచి తో, అనురాగం నిండిన మనస్సు మరియు హృదయం. తెలివితో నిండిన మెదడు. ధనవంతు రాలు మరియు గుణవంతురాలు అనటం సబబు.
ఆమెను ఒక్కసారి చూస్తే చాలు, లోకం లో ఎవరైనా సరే కళ్ళార్పకుండా అలాగే తదేకంగా చూస్తూనే ఉంటారు. (బుట్టలో పడిపోతారు. ఐస్ అయి పోతారు. విగ్రహంలా గడ్డ కట్టిపోతారు). అయస్కాంతం ను మించిన ఆకర్షణ ఆమెది.
ఎందరో చుట్టు పక్కల దేశాల రాకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశతో వచ్చారు. ఉవ్విళ్లు - ఊరుతూ). కానీ ఆమె అడిగిన 5 ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిరాశతో వెనుదిరిగారు.
***
అందాల వింధ్య ఐదు - ప్రశ్నల - స్వయంవరం విషయం తెలుసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు - ప్రేమికుడు, ఆమెను దేవతలా కొలిచే మాధవ్... స్వయంవరానికి వచ్చాడు, (రాజ - సభకు).
(సభ లో) అందాల వింధ్య అడిగిన...
మొదటి ప్రశ్న: "ఎన్నో సున్నాలు ఉన్నాయి. (0 0 0....). వాటిని అలాగే ఉంచి, చెరప-కుండా, ఒకే సున్నా గా చేయాలి. ఎలా"?
మాధవ్ జవాబు) "ప్రతి రెండు సున్నాల మధ్యలో కూడిక లేక
గుణకారం చిహ్నం పెట్టాలి. 0+0+0... = 0 మరియు 0x0x0... =0. మరియు 0+0x0+0+0x0 = 0 కదా!"
రెండవ ప్రశ్న) "(సున్నాల గురించి వేసిన) ఈ మొదటి ప్రశ్న - జవాబుల తాత్పర్యం ఏమిటి"?
మాధవ్ జవాబు) "ప్రతి మనిషి ఒంటరి గా ఒక సున్నా. ఏదీ పెద్దగా సాధించ లేడు. అందరు మనుషులూ ఓ స్నేహపూరిత జట్టు గా కలసి - మెలసి పని చేస్తేనే, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం గా మలచొచ్చు. ఏ పెద్ద కార్యాన్నైనా తేలికగా సాధించగలరు. అనురాగ-పూరిత జట్టు - రీతి - పనికి... అంత సామర్థ్యం ఉన్నది".
మూడవ ప్రశ్న) "ఓ పెద్ద ఏనుగును నా ఉంగరం యొక్క చిన్న రంధ్రం గుండా ఆవలి వైపుకి తీయాలి. ఎలా"?
మాధవ్ ఒక కాగితం మీద ఓ పెద్ద ఏనుగు బొమ్మ వేశాడు. "పెద్ద ఏనుగు" అని వ్రాసాడు. దాన్ని మడిచి చిన్నగా చేశాడు. యువరాణి యొక్క ఉంగరం రంధ్రం (ఒక - వైపు) నుండి సునాయాసంగా ఇంకో (అవతలి) వైపుకు తీసాడు.
నాల్గవ ప్రశ్న) "ముల్లు (కొన) కంటే కుస్సగా ఉండేది ఏది"?
మాధవ్ జవాబు) "ఇంకో ముల్లు (కొన)"
అందాల వింధ్య సందేహం) "అదెలా"?
మాధవ్) "ఒక ముల్లును ఇంకో ముల్లు తో తీయొచ్చు కదా. అలా- అందుకే"!
ఐదవ ప్రశ్న) "ఈ పెద్ద సభ మరియు భవంతి నిండా దేనితో నైనా నింపాలి వెంటనే... అదీ కేవలం ఒక్క క్షణంలో? ఎలా? దేనితో?
మాధవ్ రాజ - సభ, భవంతి యొక్క అన్ని తలుపులు మూయించి వేశాడు. ఆ పెద్ద సభ మరియు భవంతి లోపల చిమ్మ చీకటి అయిపోయింది. మాధవ్ ఒక్క కొవ్వొత్తి వెలిగించాడు.
ఇలా అన్నాడు మాధవ్) "చూసారా. వెలుగు - వెలుగు కిరణాలతో, చీకటిగా ఉన్న పెద్ద భవనం అంతా నిండి పోయింది... అదీ
ఒక్క క్షణంలో".
యువరాణి తో సహా అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు.
వెంటనే యువరాణి అందాల వింధ్య ఒక పుష్ప-మాల మాధవ్ మెడలో వేసి - అలంకరించి, వెంటనే అతడిని పెళ్లాడింది (గాంధర్వ వివాహం చేసుకుంది).
***
"ఒక్క క్షణం ఆగండి"... అంటూ... ఇలా కొనసాగించాడు మాధవ్...
"అంతేకాదు, మంచి మరియు నిర్మాణాత్మక మాటలు, చేతలు, ఆచరణ, నిర్వహణ తో మంచిని పంచ వచ్చు - పెంచవచ్చు. ప్రపంచమంతటా సుపరిపాలన తో... మంచి- మానవత్వం - ప్రగతి, అభివృద్ధి - అభ్యుదయం - సౌభాగ్యం - సుఖసంతోషాలతో నింపవచ్చు", అని.
సభ అంతా మరోసారి చప్పట్లతో మారు మ్రోగిపోయింది. "మాధవ్ - వింధ్య లకు జై" అంటూ (అక్కడ ఉన్న ప్రజల) సంతోష-పూరిత నినాదాలతో - హర్షధ్వానాల తో సభా-ప్రాంగణం నిండి పొయింది.
సమాప్తం
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
ఈ కథ "ఐదు ప్రశ్నలు" పాఠకులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందాల వింధ్య, ఆమె స్వయంవరం, మాధవ్ తెలివితేటలకు సంబంధించిన విశేషాల సమాహారం ఈ కథను మరింత ప్రత్యేకంగా మార్చాయి.
ముఖ్యంగా వింధ్య అడిగిన ప్రశ్నలు, మాధవ్ వాటికి ఇచ్చిన సృజనాత్మక సమాధానాలు చాలా బాగున్నాయి. ఈ కథ కేవలం ఒక రొమాంటిక్ స్వయంవరం మాత్రమే కాకుండా, తెలివితేటలతో కూడిన నైపుణ్యాన్ని, ప్రేమను, చూపించింది.