#AkasameHaddu, #ఆకాశమేహద్దు, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Akasame Haddu - New Telugu Story Written By Palla Deepika
Published In manatelugukathalu.com On 05/02/2025
ఆకాశమే హద్దు - తెలుగు కథ
రచన: పల్లా దీపిక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అప్పుడే వర్షం కురిసి వెలిసింది. ఒక పది సంవత్సరాల అమ్మాయి తన ఇంటి మేడమీద నిలబడి చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తోంది. అంతలో ఆకాశంలో విహరిస్తున్న ఒక విమానం కంటబడింది. దాన్ని ఆసక్తిగా చూసింది. చూస్తూ అనుకుంది ‘ఏదో ఒకరోజు నేను కూడా ఆకాశంలో ఎగురుతాను’ అని.
ఆ తర్వాత వాళ్ళ పదిహేను సంవత్సరాల అన్నతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు "నేను కూడా పెద్దయ్యాక పైలెట్ అవుతాను" అని చెప్పింది.
దానికి ఆ అబ్బాయి నవ్వుతూ “అమ్మాయిలు ఎవరైనా పైలట్ అవుతారా” అని అన్నాడు.
అక్కడే ఉన్న ఆర్మీ ఆఫీసర్ అయిన వాళ్ళ నాన్న "ఏం.. అమ్మాయిలు పైలెట్ లు అవ్వకూడదా? ఏరోప్లేన్ ని ఎవరు నడిపినా పైలెట్ అనే అంటారు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా" అని అన్నాడు. అంతేకాదు, "పైలెట్ అవ్వాలి అంటే నువ్వు కష్టపడి సాధించాలి. అంతకంటే ముందు నువ్వు చదువుకోవాలి మా చిన్న పైలెట్" అని అన్నాడు.
సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ చిన్నారి కల మాత్రం మారలేదు. ఈలోపు చుట్టూ ఉన్నవారి నుంచి రకరకాల కామెంట్లు విన్నది. ఎలాంటివి అంటే "అమ్మాయిలు ఫైటర్లు, పైలెట్లు అవుతారా ఏంటి? అయినా ఈ పైలెట్ ఉద్యోగం పురుషులకే కఠినమైన పని. మరి మహిళలకు అవసరమా?" అని అనేవారు.
సమాజమే కాదు తన బంధువులు, ఆఖరికి తన స్నేహితులు కూడా తను ఎంపిక చేసుకున్న మార్గాన్ని చూసి నవ్వేవారు. ఇదంతా చూసిన అమ్మాయి ఒకరోజు నిరుత్సాహంతో తండ్రితో "బహుశా వాళ్ళు చెప్పింది నిజమేనేమో నాన్నా! నేను ఒక సులభమైన కెరీర్ ఎంచుకోవాల్సింది" అని చెప్పింది.
దానికి వాళ్ళ తండ్రి తన కూతురి చేతిలో ఒక చిన్న విమానం ఆట బొమ్మ పెట్టి "విమానం ఎగరడానికి గాలిని అనుమతి అడుగుతుందా? లేదు, అది నేరుగా ఆకాశంలోకి దూసుకుపోతుంది. అలానే నీ కలలను నెరవేర్చుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు" అని అన్నాడు.
ఆ మాటలు ఆమెకు నూతన ఉత్సాహాన్ని కలిగించాయి. కష్టపడి, ఇష్టపడి చదివింది. 1996 లో భారత వైమానిక దళంలో మొదటి మహిళగా చోటు సంపాదించుకుంది. ధైర్యంగా శిక్షణ పొందింది. ఆమె ఎవరో కాదు "గుంజన్ సక్సేనా". వైమానిక దళంలో మొదటి మహిళ కావడం వల్ల అక్కడ కూడా ఎన్నో అవమానాలను భరించింది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరు తనని ఎంకరేజ్ చేసేవారు కాదు. అమ్మాయికి సెల్యూట్ చేస్తే వారి గౌరవం తగ్గుతుందేమో అని ఎదురుపడినా పక్కకి తప్పుకొని వెళ్లి పోయేవారు.
ఎంత ఆనందంగా అక్కడికి వెళ్ళిందో అంతే బాధతో తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో "నేను ఇంక వెళ్ళను అక్కడికి. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాను" అని చెప్పింది.
అది విన్న వాళ్ళ నాన్న "నువ్వు అందరిలాగే ఆలోచిస్తున్నావు. అందరూ అమ్మాయిలు ఇవి చేయాలి, అది చేయకూడదు అని చెప్తున్నా కూడా నేను నిన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ, నిన్ను నమ్మి, నువ్వు కన్న కల సాధించాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు వెళ్ళను అని అంటున్నావు. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే అది నువ్వు మాత్రమే ఓడిపోయినట్టు కాదు. నేను కూడా ఓడిపోయినట్టే" అని చెప్పాడు. అది విని గుంజన్ ఆలోచనలో పడింది.
తండ్రి మాటల వల్ల కలిగిన ప్రేరణతో గుంజన్ మళ్లీ వైమానిక దళంలోకి వెళ్ళింది. 1999 లో కార్గిల్ యుద్ధ సమయంలో పాల్గొనింది. శత్రు ప్రదేశంలోకి తన హెలికాప్టర్ నడిపి గాయపడిన జవాన్లను ఎంతోమందిని కాపాడింది. ఈ సేవలకు గాను శౌర్య చక్ర అందుకున్న తొలి మహిళగా పైలెట్ గా నిలిచింది. 1996 నుంచి 2004 అంటే ఎనిమిది సంవత్సరాలు పైలెట్ గా పనిచేసింది.
అప్పట్లో మహిళలకు శాశ్వత కమిషన్లు అందుబాటులో లేకపోవడం వలన ఆమె కెరియర్ అక్కడితో ముగిసింది. ఆ తర్వాత ఆమె 'కిరణ్ నిర్వాణ్' తో కలిసి ఒక పుస్తకం రాసింది. అదే "ది కార్గిల్ గర్ల్ ". పెంగ్విన్ పబ్లిషర్స్ ద్వారా విడుదల అయింది.
ఆమె తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా భవిష్యత్తులో మరెందరో మహిళలకు మార్గదర్శకురాలిగా నిలిచింది. అలాగే యువతులు కొన్ని రంగాలకే పరిమితం అన్నవారికి పట్టుదల, శ్రమ మరియు తన తండ్రిలాగా ప్రోత్సహించే ఒక వ్యక్తి ఉంటే ఏ రంగంలో అయినా రాణించగలరు అని నిరూపించింది.
***
పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక
వయసు: 21
చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్
హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం
నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.
Veeraiah Katam
•1 hour ago
good