top of page
Writer's pictureMohana Krishna Tata

ఆఖరి కోరిక



'Akhari Korika' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 07/04/2024

'ఆఖరి కోరిక' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అసలే నాకు ఈ సిటీ కొత్త. ఈ హిందీ బాష అసలే రాదు. ఇక్కడ ఒక్కరికి కుడా తెలుగు రాదు. ఉద్యోగం కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది.. ఏం చేస్తాం.. ? మన హైదరాబాద్ లో ఉన్నంత హాయి, సుఖం ఎక్కడా లేదు. వీధిలోకి వస్తే, పది మంది ఫ్రెండ్స్.. "ఏరా మామా అంటారు.. " ఎన్ని అనుకున్నా.. ఎన్ని తిట్టుకున్నా.. మేమంతా ఒక్కటే.. ! 


ఇక్కడ.. ఒకో మాటకు ఒకో లాగ చూస్తున్నారు. ఏం మాట్లాడితే, ఏం కొంప మునుగుతుందో తెలియదు. దూరదర్శన్ లో చిన్నప్పుడు చూసిన ఆ హిందీ సినిమాల పుణ్యమా అనీ.. హిందీ ఆ మాత్రమైనా అర్ధమవుతోంది. ఇప్పటికి నాకు అది ఉపయోగపడింది. దానికి థాంక్స్ చెప్పుకోవాలి. 


******


"డిగ్రీ అయి ఇన్ని సంవత్సరాలు అయినా.. ఇంకా ఏమిటి రా.. ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చెప్పు.. ! ఏ జావానో కాఫీనో కోర్స్ చేసి అందరూ.. ఎంచక్కా విమానం లో పై దేశాలకు పోతున్నారు. నువ్వూ అలాంటిదేదో అఘోరించొచ్చు కదా.. " అని నాన్న రోజూ చెప్పే డైలాగ్స్.


"దేనికైనా.. టైం రావాలి నాన్నా.. అప్పుడు నువ్వు వొద్దన్నా.. నేను గాలిలో ఎగిరిపోతాను.. "

"ఎప్పుడు వస్తుందో ఆ టైం.. ?"


"చూస్తూ వుండు.. నాన్న.. "


"పోనీలెండి.. కొత్త వాచ్ కొన్నాడు కదా.. మంచి టైం వస్తుంది లెండి.. " అంది తల్లి కొడుకుని సమర్దిస్తూ.. 


"అదేదో ఛానెల్లో చూసి.. అదృష్టం వస్తుందని దానిని కొన్నారు.. దానికి ఒక మూడు వేలు తగలేశారు.. "


"అమ్మా.. ! ఇక్కడుంటే, బొత్తిగా నన్ను ఎంజాయ్ చెయ్యనివ్వట్లేదు. మా ఫ్రెండ్ చేసిన కోర్స్ చేసి.. ఎవ్వరు లేని ఆ సిటీ కి పోతాను.. హిందీ రాకపోయినా, నా తిప్పలేవో నేను పడతాను.. "


******


మొదటి రోజు ఆఫీస్ లో అవే పాట్లు. సెక్యూరిటీ నుంచీ అందరూ హిందీలోనే మాట్లాడుతున్నారు. ఆ తియ్యటి తెలుగు విని ఎన్ని రోజులైందో.. ? వచ్చేటప్పుడు ముప్పై రోజుల్లో హిందీ ఎలా.. ? అన్న పుస్తకం కొని చదవడం మొదలుపెట్టాను. తెలుగు వినాల్సి వచ్చినప్పుడు తెలుగు పాటలు వినడం ఒక్కటే దారిగా తోచింది. ఫోన్ తీసి ఫ్రెండ్స్ తో తెలుగు లో కబుర్లు.. అమ్మ తో కష్టసుఖాలు. నాన్న తిట్టే ఆ తెలుగు తిట్లు.. ఒకప్పుడు బాధగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఎందుకో మధురంగా ఉన్నాయి.. 


ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే.. ఫోన్ మోగింది.. 


"హలో.. ! క్యాన్ హాయ్ ఉదాహర్.. ?"


"నీకు ఇంకా హిందీ రాలేదా.. ?" అని అవతల అందమైన గొంతులో.. 


"ఇంత అందమైన గొంతు ఎవరిదబ్బా.. ?"


"ఇందాక మాట్లాడింది నా కూతురే.. నేను ఎవరా అని ఆలోచిస్తున్నావా.. ? నీకు మావయ్యను అవుతాను. మీ అమ్మ ఫోన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యావని చెప్పింది.. "


"నాకు మావయ్య ఉన్నాడా.. ?"


"అవును.. రేపు ఆదివారం మా ఇంటికి భోజనానికి వచ్చెయ్.. "

"అలాగే మావయ్యా.. !"


ఆదివారం రోజు.. నీట్ గా రెడీ అయి.. బస్సు నెంబర్ చూసుకుని.. మావయ్య ఇంటికి వెళ్ళాను. ఆ అందమైన గొంతు మళ్ళీ నన్ను పలకరించింది.. 


"బావా.. ! ఎలా ఉన్నావు.. ?"


"నీ పేరు ఏమిటి మరదలా.. ?"


"ప్రతిభ.. "


"పేరు బాగుంది.. "


"ఇంతకీ ఏమిటి చదువుతున్నావు.. ?"


"డిగ్రీ.. బావ.. "


"పేరు లోనే ప్రతిభ అంతా.. చదువులో ఏమీ లేదు ప్రకాష్.. " అన్నాడు మావయ్య.

 

"ఊరుకోండి మావయ్యా.. అదే వస్తుంది లెండి.. "


సాయంత్రం నా రూమ్ కి రిటర్న్ బయల్దేరాను. ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్న నాకు.. ఏమి తోచక.. టీవీ చూస్తున్నాను. అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. మళ్ళీ అదే ఆ తీయని గొంతు. 


"బావా.. ! ఎలా ఉన్నావు.. ? ఇంటికి వెళ్ళావా.. ? నాన్న అడగమన్నారు.. "


"నాన్న కి చెప్పు అయితే.. ఇంటికి వచ్చేసానని. నా కోసం ఏమీ అడగడానికి లేవా ప్రతిభ.. ?"


"నువ్వు చాలా బాగుంటావు బావా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్నుపెళ్ళి చేసుకుంటావా.. ?"


విన్న నాకు షాక్.. ఏదో అంటుందేమో అంటే, ఇలా అనేసిందేమిటి.. ? అయినా, అందమైన ఆ తెలుగు గొంతు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. నేనేమో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుదాము అని వస్తే, ఈ అమ్మాయి ఏమిటి నన్ను ప్రేమిస్తున్నాను అంటోంది.. ? అనవసరంగా ఇరుక్కుపోతానేమో.. ? అసలే ప్రతిభకు పెద్దగ ప్రతిభ లేదని మావయ్య అన్నాడు. దూరంగా ఉంటేనే మంచిది.. లేకపోతే, నాలో ఉన్న ప్రతిభ కాస్తా పోతుంది. 


రోజులు గడిచిపోతున్నాయి.. ఒక రోజు మావయ్య ఇంటి నుంచి ఫోన్.. 


"హలో బావ.. ! నేను నీ మరదలు ప్రతిభ.. "


"ఏమిటి ఇప్పుడు ఫోన్ చేసావు.. ? చెప్పు.. "


"నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది.. హాస్పిటల్ లో జాయిన్ చేసాము.. నిన్ను చూడాలని అంటున్నారు.. "


"అయ్యో.. ! ఇప్పుడు ఎలా ఉంది.. ?"


"ఒక రోజు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేము అని డాక్టర్స్ అంటున్నారు. నాకు భయంగా ఉంది బావా.. "


"భయపడకు.. వస్తున్నాను.. "

***


హాస్పిటల్ కు చేరుకున్న నాకు.. బయట నా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్న ప్రతిభ కనిపించింది. నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి.. గట్టిగా పట్టుకుంది. నాకు ఎలా రియాక్ట్ కావాలో తెలియలేదు. 


"ఊరుకో ప్రతిభా.. ! అంతా సర్దుకుంటుందిలే.. " అని అన్నాను. 


ఆ తరువాత అత్త వచ్చి నన్ను చూసి లోపలికి వెళ్లిపోయింది. ప్రతిభ నన్ను మావయ్య ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళింది. మావయ్య ముఖానికి ఆక్సిజన్ పెట్టి ఉంది. చూస్తుంటే, చాలా సీరియస్ గా ఉన్నట్టు అనిపించింది. డాక్టర్ తో మాట్లాడిన తర్వాత ఆ విషయం నాకు పూర్తిగా తెలిసింది. హార్ట్ లో అన్ని వాల్వ్స్‌ మూసుకుని పోయి.. పెద్ద స్ట్రోక్ వచ్చిందని చెప్పారు డాక్టర్. మనసులో బాధతో మావయ్య దగ్గరకు వెళ్ళాను.. 


"మావయ్యా.. ! ఎలా ఉంది ఇప్పుడు.. ? " అని మెల్లగా అడిగాను.

 

"ప్రకాష్.. ! ఎలా ఉన్నావు.. ? నీకు ప్రమోషన్ వచ్చిందంట కదా.. ! సంతోషం.. "


"అవును.. వచ్చింది.. "


"నీకు ఒక విషయం చెప్పాలి.. " అని దగ్గరకు పిలిచాడు.


"ఏమిటది మావయ్యా.. ?"


"నీ మరదలు ప్రతిభ చాలా అమాయకురాలు. మీ అత్త ఏమో దానిని తన తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని చూస్తోంది. వాడికి లేని పాడు అలవాటు అంటూ లేదు. ఎంతైనా, పెళ్ళాం మాటే నెగ్గుతుంది కదా ఈ లోకంలో.. అదే నా భయమంతా.. ! నేను పోయాక.. నా కూతురి జీవితం ఏమైపోతుందో అని.. ? నా ఈ పరిస్థితి కి కుడా మీ అత్త మొండితనమే కారణము. ఆయాసంతో ఉన్న నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళమని చాలా సార్లు అడిగాను.. కానీ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. 


"ప్రతిభకు నువ్వంటే చాలా ఇష్టం. ఆడపిల్ల కదా.. బయటపడలేదు అంతే.. ! దానిని నువ్వే పెళ్ళి చేసుకోవాలి.. అదే నా ఆఖరి కోరిక.. "


"అలా మాటలాడకు మావయ్యా.. నువ్వు కోలుకున్నాకా.. అన్నీ మాట్లాడుదాము" అని అన్నాను.

 

"నీ లాంటి మంచివాడు ఎక్కడా దొరకడు. మా అక్కలాగే నువ్వు కుడా చాలా మంచి వాడివి. నేను పై లోకం నుంచి మీ జంటని ఆశీర్వదిస్తాను.. " అంటూ చివరి శ్వాస వదిలాడు.. 


మావయ్య కోరిక మీదట.. అత్తకు అంతగా ఇష్టం లేకపోయినా, ప్రతిభను పెళ్ళి చేసుకున్నాను. త్వరలో ఇద్దరమూ ఎంచక్కా విమానం లో పై దేశాలకు పోతున్నాము.. 


*******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


177 views0 comments

ความคิดเห็น


bottom of page