'Akka Maro Amma' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 03/02/2024
'అక్క మరో అమ్మ' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చిన్నప్పటినుంచి మా అక్కా. . నేను ఈ ఊరిలోనే ఉన్నాము. ఇప్పుడు నాకు ఉద్యోగం రిత్యా. . వేరే ఊరు వెళ్ళాల్సి వస్తోంది. మా అక్కంటే, నాకు చాలా ఇష్టం. అమ్మ తర్వాత నన్ను అంతే ప్రేమగా చూసుకుంది అక్క. అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడం చేత, అక్కే అమ్మ లాగ నా కోసం అన్నీ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, తన సొంత కొడుకు లాగ చూసుకుంది. ఇంత చేసిన అక్క కి నేను ఏమిటి చెయ్యగలను. . ? ఇక్కడే, ఈ ఊరిలోనే ఉంటే, అక్కకి, బావగారికి సహాయపడుతూ. . నా మేనల్లుడుని ఆడిస్తూ ఉండేవాడిని. కానీ, ఏం చేస్తాం. . ? నా భార్య సుజాత మాట వినాలి. అసలే చాలా పట్టుదల, ముక్కు మీద కోపం గల అమ్మాయి సుజాత. .
*****
నాకు ఎప్పటికి ఉద్యోగం రాకపోతే, మా నాన్న కన్నా. . మా అక్క చాలా బాధ పడింది. మా నాన్నగారికి తెలిసిన సర్కిల్ లో ఒక సంబంధం ఉందంటే, నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళాను. అమ్మాయి ఒక మోస్తరుగా ఉంది. . చామన చాయగా ఉంది. కానీ, మంచి కుటుంబం అని నాన్న చెప్పడం తో, పెళ్ళికి ఒప్పుకున్నాను. పైగా, ఉద్యోగం లేని నాకు. . పిల్లనిచ్చి ఉద్యోగం వేయిస్తానని నాకు కాబోయే మావగారు అన్నారు. మా నాన్న, అక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసి. . సంబంధం ఓకే చేసాను.
నా పెళ్ళి బాగానే జరిగింది. ఇప్పుడు నాకు మా మవగారు తన పలుకుబడి తో బెంగుళూరు లో ఉద్యోగం వేయించారు. ఇప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చింది. మా అక్క, బావగారికి, ముద్దుల మేనల్లుడుకి బాయ్ చెప్పి. . నేను, సుజాత బయల్దేరాము. ఒక రోజు ట్రైన్ లో ప్రయాణం తర్వాత బెంగుళూరు చేరుకున్నాము. సుజాత కుడా అక్కడే ఉద్యోగం చేస్తోంది. మా మావగారి పలుకుపడి అక్కడ బాగా ఉందని నాకు అర్ధమైంది. ఒక విధంగా నేను చాలా లక్కీయే అనిపించించి.
*****
నా భార్య తో నా జీవితం చాలా హ్యాపీ గా సాగిపోయింది. ఇద్దరమూ కలిపి సంపాదించడం తో, మాకు డబ్బుకు లోటు లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అక్క ని చూడడానికి ఊరు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు ఎన్నో కానుకలు తీసుకుని వెళ్ళేవాడిని. అందరూ చాలా హ్యాపీ అయ్యేవారు. నా మేనల్లుడుకి ఇష్టమైన కొత్త రకం వాచ్
ని ఎప్పుడూ వాడికోసం తీసుకునేవాడిని.
కొంత కాలానికి మాకు ఒక పాప పుట్టింది. నా అక్కకి కోడలు పుట్టిందని నా మనసులో నేను అనుకున్నాను. కానీ, సుజాత మాత్రం ఎప్పుడూ అలా అలోచించలేదు. కాలం తో పాటు సుజాతకి స్టేటస్ ఫీలింగ్ కుడా బాగా ఎక్కువ అయ్యింది. ఇంట్లో ఏ పనీ చేసేది కాదు. పనిమనిషి ఉన్నా, ఇంట్లో మిగతా పనంతా నేనే చేసేవాడిని. పిలిచి పిల్లనిస్తే. . ఇంతేనేమో అనుకునేవాడిని.
కాలం చాలా వేగంగా గడిచిపోయింది. మా అమ్మాయి శాంతి అప్పుడే కాలేజీలో చదువుతోంది. నా మేనల్లుడు అక్కడే ఊరిలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. ఉద్యోగం లేక చాలా బాధ పడతూ. . ఈ జీవితం వద్దని ఆత్మహత్య చేసుకునే టైం లో నా అక్క. . . ధైర్యం చెప్పి, నేను ఉన్నానని చెప్పి, నాకు పెళ్ళి చేసి జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నా అక్క ఋణం తీర్చుకునే టైం వచ్చిందని అనిపించింది. ఇక్కడ బెంగుళూరు లో నాకు తెలిసిన కంపెనీ లో ఉద్యోగం కోసం అప్లై చేయమని కిరణ్ కి చెప్పాను. వెంటనే, బయల్దేరి రమ్మని కుడా చెప్పాను.
ఒక వారం లో నా మేనల్లుడు కిరణ్ బెంగుళూరు కి వచ్చాడు. స్వతహాగా తెలివైన కిరణ్, వెంటనే ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోయాడు. తన ఫ్రెండ్స్ తో పాటు ఆఫీసు కి దగ్గరలో హాస్టల్ లో ఉన్నాడు. చిన్నప్పటినుంచి కిరణ్ గురించి ఎక్కువగా చెప్పడం చేత, ఇంకేమో మరి. . . శాంతికి బావంటే, చాలా ఇష్టం ఏర్పడింది. సుజాతకి ఎప్పుడూ కిరణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ నేను మాత్రం అప్పుడప్పుడు హాస్టల్ కి వెళ్లి కిరణ్ ని కలిసేవాడిని. వెళ్ళేటప్పుడు కిరణ్ కి ఇష్టమైన వంటకాలు నేనే చేసి తీసుకుని వెళ్ళేవాడిని.
నాకు కుడా తెలియని విషయం ఏమిటంటే, నా శరీరంలో పెరుగుతున్న అనారోగ్యం. ఒకరోజు డాక్టర్ దగ్గరకు జనరల్ చెకప్ కోసం వెళ్తే, విషయం తెలిసింది. డాక్టర్ చెప్పిన విషయం సుజాత కు చెప్పాను. మీకు ఏమీ అవదని కొట్టి పడేసింది. భర్త అంటే, అంత ప్రేమ మరి. . . ! భర్త ను దగ్గరుండి కాపాడుకోవాల్సిన భార్య ఇలా అనేసరికి. . నాకూ నా ఆరోగ్యం పైన ఆసక్తి పోయింది. ఎందుకో, ఆఖరిసారిగా కిరణ్ దగ్గరకు వెళ్ళాలనిపించింది.
ఆ రోజు నన్ను చూసిన కిరణ్ . . .
"మావయ్యా. . ! ఏమిటి అలా ఉన్నావు. . ? ఏమైంది. . ?" అని అడిగాడు
"ఏమీ లేదు. నా కూతురు శాంతి కి నువ్వంటే, చాలా ఇష్టం. ఏది ఏమైనా. . ఎవరు ఏమనుకున్నా. . నీకు నీ మరదలు మీద పూర్తి హక్కు ఉంది. ఎప్పటికైనా అది నీదే. దానికి నువ్వంటే ఎంతో ప్రేమ. పెళ్ళి చేసుకో . . " అని నా మనసులో మాట చెప్పాను. .
ఆ రోజు రాత్రి. . అక్క తో చాలా సేపు మాట్లాడాను. కిరణ్ అంటే శాంతికి చాలా ఇష్టమని చెప్పాను. మా అమ్మాయిని కోడలిగా చేసుకోమని అక్క దగ్గర మాట తీసుకున్నాను. సుజాత తో ఎదురుగా చెప్పలేక, ఇదంతా నా డైరీ లో రాసాను.
'మంచి ఉద్యోగం లో సెటిల్ అయిన కిరణ్ కి. . నా కూతురిని అప్పగించాను. అక్క ఋణం ఈ విధంగా తీర్చుకుంటున్నాను. . ఈ జీవితానికి ఇది చాలు. . ఇంక నాకు ఏమైనా పర్వాలేదు. . ' అని అనుకుని ఆ రోజు రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఆ తర్వాత నేను ఇంక లేవలేదు. .
*********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments