top of page

నాకో ఉత్తరం రాయి నేస్తం

Writer's picture: Bulusu Ravi SarmaBulusu Ravi Sarma

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #నాకోఉత్తరంరాయినేస్తం, #NakoUttharamRayiNestham

Nako Uttharam Rayi Nestham - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 04/02/2025

నాకో ఉత్తరం రాయి నేస్తంతెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


నాకో ఉత్తరం రాయి నేస్తం 

ఊరకే- విషయాలు లేకపోయినా 

నువ్వు నాకో ఉత్తరం రాయాలి !

పోస్ట్ మాన్ సైకిల్ చప్పుడు విని 

పరిగెత్తు కొచ్చి  ఆత్రంగా అందుకోవాలి 

కవర్ మీద  ముత్యాలలాంటి 

నీ అక్షరాలు చూసి మురిసిపోవాలి 

మంచం మీద వెల్ల కిలా పడుకొని 

గుండెల మీద కాసేపు ఉత్తరం పెట్టుకొని 

ఊహల్లోకి పరిగెత్తాలి 

నాకో ఉత్తరం రాయి నేస్తం ! 

కవర్ చింపి 

నువ్వు మడత పెట్టిన కాగితంలో 

నీ పరిమళం ఆఘ్రాణించాలి 

కాగితం మీద నువ్వు ఏమీ రాయకపోయినా 

తెల్లటి స్వచ్చమైన నీ ఊహలు నేను చదవాలి 

నాకో ఉత్తరం రాయి నేస్తం 

చదివి- నా ఉత్తరాల పెట్టెలో 

భద్రంగా దాచుకోవాలి 

నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా  

మళ్ళీ మళ్ళీ చదువుకొని పరవశించాలి 

నాకో ఉత్తరం రాయి నేస్తం 

నువ్వు పంపుతున్న 

వాట్సాప్ సందేశాలు- మెయిల్లు 

క్షణాల్లో చేరి 

భూతాల్లా భయపెడుతున్నాయి 

ఏదో లోటు ఏదో వెలితి 

అందుకే 

మళ్ళీ వేడుకుంటున్నాను 

అసలు సిసలైన 

ఉత్తరం రాయమని అర్థిస్తూ  వున్నాను



-బులుసు రవి శర్మ 




25 views0 comments

Comments


bottom of page