#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AksharaSathyaluAnimuthyalu, #అక్షరసత్యాలుఆణిముత్యాలు
Akshara Sathyalu - Animuthyalu - New Telugu Poem Written By Gadwala Somanna
Published In manatelugukathalu.com On 06/11/2024
అక్షర సత్యాలు - ఆణిముత్యాలు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
ఎంత అందమున్నా
ఫాయిదా ఏమున్నది?
సొగసైన గురవింద
మేనుకు మచ్చ ఉన్నది!
ఎంత వారికైనా
ఏదో ఒక లోటు!
లేకుంటే ఉండును
గర్వానికి చోటు!
అందాల గులాబీకి
ఒళ్ళంతా ముళ్లే!
లేకుంటే దానికి
అణువణువునా పొగరే!
ఎగసిపడే అలలకు
ఒక్కింత అహమే!
నిద్రలోని కలలకు
కరుగుదల నిజమే!
సుగుణమే లేకున్న
ఎంత ఉన్నా సున్న
ఈ సత్యం తెలుసుకో!
ఓ బంగారు కన్న!!
కలిగియున్న వినయము
జీవితాన విజయము
కష్టించే తత్వము
చవి చూచును ఫలితము
-గద్వాల సోమన్న
Commentaires