#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AksharalaAkaknksha, #అక్షరాలఆకాంక్ష
Aksharala Akaknksha - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 09/11/2024
అక్షరాల ఆకాంక్ష - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
పున్నమి నాటి చంద్రునిలా
వెలుగులు పంచే సూర్యునిలా
జీవించాలోయ్! మనమంతా
హర్షించాలోయ్! జగమంతా
పువ్వుల్లోని పరిమళంలా
నవ్వుల్లోని అందంలా
జీవితమంతా వెలగాలోయ్!
దివ్వెల్లోని వెలుతురులా
మాతృభాషలో మధురిమలా
అందెలలోని నాదంలా
ఆదర్శంగా నిలవాలోయ్!
మాతృమూర్తి త్యాగగుణంలా
మల్లెలోని తెల్లదనంలా
పల్లెలోని పచ్చదనంలా
స్ఫూర్తినెంతో నింపాలోయ్!
ఎల్లలులేని సుగుణంలా
మచ్చలేని మాణిక్యంలా
అచ్చు తెలుగు నుడికారంలా
పవిత్రమైన నడవడికతో
అద్దం వోలె మారాలోయ్!
-గద్వాల సోమన్న
Comentarios