top of page
Writer's pictureNamani Sujana devi

అలల చాటు ఉప్పెన - పార్ట్ 2 



'Alala Chatu Uppena - Part 2/3' - New Telugu Story Written By Namani Sujana Devi

Published In manatelugukathalu.com On 31/08/2024

'అలల చాటు ఉప్పెన - పార్ట్ 2/3' తెలుగు కథ

రచన: నామని సుజనాదేవి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



జరిగిన కథ:

తన ప్రేమను వ్యక్తపరచిన సాయిని నలుగురిలో చులకన చేస్తూ మాట్లాడుతుంది శ్రీజ అనే అమ్మాయి. 

ఆమెతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటాడు సాయి. 



ఇక అలల చాటు ఉప్పెన పెద్దకథ రెండవ  భాగం చదవండి.


ఆరోజు మొట్టమొదటిసారిగా కాలేజీకి బీటెక్లో జాయిన్ కావడానికి వెళుతున్న రోజు.

“అబ్బా! ఏంటమ్మా నీ చాదస్తం! నేనేదో ఐ ఏ యస్ చేసి కలెక్టర్ గా వెళుతున్నట్లు, కేవలం  మొదటిసారి బీ టెక్ లో జాయిన్ కావడానికి వెళుతుంటే, ,  ప్రసాదం చేయడం , గుడికి తీసుకెళ్ళడం ఇవన్నీ అవసరమా? చూడు, బస్ కి టైం దాటిపోతుంది. ఇప్పుడు పరుగెత్తితే గానీ అందుతుందో లేదో తెలీదు” ముద్దుగా విసుక్కుంటూ పరుగెత్తాను. 


అల్లంత దూరంలో బస్సు ఉండగా పరుగెత్తి  ఎక్కేసాను.  ఎక్కగానే లోనికి వెళ్లి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చొని, ఆయాసం తీర్చుకుని  కొంచెం స్థిమితపడ్డాను.  ఆ బస్సులోకి ముందు నుండి  ఎక్కిన నలుగురు, ఐదుగురు ఆడవాళ్లు  నెమ్మదిగా వెనక్కి వస్తున్నారు.  వాళ్లలో ఒక పెద్దావిడ ఉంది.  ఆమె సీట్ కోసం అటు ఇటు చూస్తుంటే ఒక అమ్మాయి ముందు సీట్ నుండి లేచి నిలబడింది.  దానిని చూడగానే ఆమె దిగుతుందేమోనని ఆ పెద్దావిడ అందులో కూర్చుంది.  కానీ తర్వాత స్టేజి వచ్చినా  ఆమె దిగలేదు.  ఇంతలో ఆ స్టేజ్ లో దిగాల్సిన ఇద్దరు ముగ్గురు దిగిపోవడంతో మళ్లీ ఆ అమ్మాయి ఖాళీ అయిన సీట్లో కూర్చుంది.  దానితో  నాకు  అర్థమైంది,  ఆ అమ్మాయి కావాలని ఆ సీటు ఆ పెద్దావిడకు ఇచ్చిందని.  అంతేకాదు తర్వాత కూడా సీటు దొరికినప్పుడు కూర్చోవడం , మళ్ళీ ఎవరైనా రాగానే లేచి నిలబడడం చేస్తుంది ఆ అమ్మాయి.  నాకు   వింతగా అనిపించింది.  ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా?  అసలు అలా ఎందుకు నిలబడుతుంది?  దొరికినప్పుడు సీటులో  కూర్చోవచ్చు కదా!  అది గవర్నమెంట్ బస్సు  కదా!  ఆమె కూడా టికెట్ తీసుకుంది కదా!  కూర్చునే అధికారం ఉంది కదా!


 కనీసం అదే వికలాంగుల సీటో,  వయోజనులు,  సీనియర్ సిటిజన్స్  కూర్చునే సీటో కాదు.  కాబట్టినాకు ఆశ్చర్యంగా  అనిపించింది.  తర్వాత  నేను  దిగే  స్టేజ్ రావడంతో దిగిపోయాను.  ఆశ్చర్యంగా ఆ అమ్మాయి కూడా అదే స్టేజిలో దిగింది.  నేను కాలేజీకి వైపు నడుస్తూ ఈ అమ్మాయి కూడా అదే కాలేజోమో అనుకున్నాను.  అదేంటో తధాస్తు దేవతలు ఉంటారన్నట్టుగా ఆ అమ్మాయి కూడా అదే కాలేజీలోకి ప్రవేశించడం,  వెనక నుండి చూసి ఆశ్చర్యపోయాను.  తర్వాత నా క్లాస్మేట్ కావడం కూడా యాదృచ్ఛికమైనా,  వెనక ఏదో దైవసంకల్పం ఉండి ఉంటుంది అనిపించింది. 


 ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అప్పుడు, ఇప్పుడు ఆమెను గమనించడం మొదలుపెట్టాను.  అది ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు తెలియకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నాను.  నా అదృష్టం ఏమిటంటే ఆమె వెళ్లే దారి నేను వెళ్లే దారి ఒకటే కావడం.  దానితో ఇద్దరం దాదాపుగా ఒకే బస్సులో వెళ్లడం,  ఒకే బస్సులో రావడం జరుగుతూ ఉండేది.  అంతేకాదు ఆమె చర్యలను దగ్గర నుండి పరిశీలించడానికి ఎక్కువ అవకాశం  దొరికింది. ఆమె పనులన్నీ వింతగా అనిపించేవి నాకు.  వింతగానే కావు అవి చాలావరకు సంతృప్తిగా,  ఆహ్లాదంగా, ఆనందంగా కూడా  అనిపించేవి. 

 కాలేజీలో డిబేట్లో, ‘ఆడవారి తల్లిదండ్రులని మగవాళ్ళలాగా ఆడపిల్లలు కూడా ఎందుకు చూసుకోకూడదు?’  అనే విషయంపై  ఆమె వాదించిన విధానం నన్ను ఆకట్టుకుంది.  అలాగే చదువులో నేనెప్పుడూ చాలా చురుగ్గా ఉంటాను. 


పర్సెంటేజ్ కూడా బాగానే వస్తుంది.  ఎందుకంటే అమ్మ కష్టం తెలిసిన వాడిని.  ఎంత కష్టపడి అమ్మ నన్ను చదివిస్తుందో నాకు బాగా తెలుసు.  అందుకే నా దృష్టి ఎప్పుడూ చదువు పక్కకు పోనివ్వలేదు.  ఇప్పుడు కూడా అలా  వెంట పడడం కాకుండా, విచిత్రంగా అనిపించడంతో  ఆమెను దగ్గర నుండి పరిశీలించడం మొదలుపెట్టాను. 


 ఒకరోజు బస్ స్టాప్ కు నడిచి వెళుతుంటే అల్లంత దూరంలో బస్సు ఉంది నేను పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కాను.  ఆ బస్ పోతే మరో అరగంట వరకు బస్సు లేదు.  కానీ నేను బస్ ఆపి  చూస్తే ఆ అమ్మాయి రాలేదు.  అదేంటి అనిపించింది.  బస్సు కదులుతుంటే వెనక్కి తిరిగి చూసాను.  ఆ అమ్మాయి ఎవరో ఒక ముసలావిడ రోడ్డు దాటడానికి అవస్థ పడుతుంటే ఆవిడను దాటిస్తుంది.  అంటే కేవలం ఆమెను దాటించడం కోసం తను  బస్సు కూడా వదులుకుందా? అనుకున్నాను. 


        అలా అదొక్కటే కాకుండా తనకు తోచినంతలో ఏదో ఒక సహాయం చేయడం ఆమె అలవాటుగా గుర్తించాను.  వరదలు  వచ్చినప్పుడు   ఆమె  ముందు ఇనిషియేటివ్ తీసుకుని ప్రిన్సిపల్ గారికి వరదబాధితుల సహాయార్థం సాయం చేయడానికి అనుమతి ఇవ్వమంటూ  ఒక అనుమతి పత్రం (విజ్ఞాపన పత్రం)  వ్రాసి, దానిని  నోటీస్ బోర్డ్ లో కూడా పెట్టించి,  కాలేజీ తరఫున ఎవరికి తోచినంత వారు డబ్బు రూపేనా,  వస్తురూపేనా,  దినుసుల రూపేనా,  బట్టల రూపేనా ఏ రకంగా నైనా వరద బాధితులకు,  భూకంప బాధితులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చి,  అలా అందరి దగ్గర నుండి సేకరించిన వాటన్నింటినీ  కాలేజీ మినీ బస్సులో తీసుకెళ్ళి   ప్రిన్సిపాల్ తోని మరియు కాలేజీలో విద్యార్థి సంఘ నాయకులతోని  కలెక్టరేట్ కి పంపించడంలో చాలా చైతన్యవంతమైన పాత్ర పోషించింది. 


      అసలు అలాంటి  ఆలోచనలు  ఆమె చేసేంతవరకు వేరే ఎవరికీ రాకపోవడం అలాగే ఒక్క వరద బాధితులప్పుడే కాకుండా,  తుఫాన్లు వచ్చినప్పుడు,  భూకంపం వచ్చినప్పుడు  కూడా అలాగే స్పందించింది.  అంతేకాకుండా ఏదైనా విశేషమైన రోజులలో అంటే పుట్టినరోజుగాని,  వాళ్ళింట్లో ఎవరిదైనా పెళ్లి రోజులకు గానీ,  పార్టీ లంటూ ఫ్రెండ్స్ తో కలిసి డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా, ‘పెద్ద వాళ్ళ ఆశీర్వాదం,  అనాధల ఆశీర్వాదం తీసుకోవడం కోసం అలాంటి వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనకి తొందరగా మన కష్టాల్లో ఆదుకుంటాడు’  అంటూ సెలబ్రేట్ చేసుకోవడం ఆమె ద్వారానే మొదలయ్యిందని చెప్పొచ్చు.  అలా ప్రతి దాంట్లో తనకంటూ ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంది.  ఏదైనా కాలేజ్ మీటింగ్ లో కూడా ఆమెనే మాట్లాడమనేవారు.  తెలుగులో స్పష్టమైన ఉచ్చారణతో మంచివక్తగా ఎన్నోసార్లు పేరు తెచ్చుకుంది. 


       మంచి వక్తగా ఉన్నవారు జీవితంలో ఎదుగుతారు అన్నది నిరూపిస్తూ ఆమెకు క్యాంపస్ సెలక్షన్ లో ఫైనల్ ఇయర్ లో  జాబ్ కూడా వచ్చింది. 


   నిజానికి నేను గమ్యం అంటూ నిర్ణయించుకోకపోవడం,  ఆ సెలక్షన్స్  వచ్చినప్పుడు అమ్మకి ఆరోగ్యం బాలేక పోవడం వల్ల హాజరు  కాలేకపోయాను.  అమ్మకు విషయం తెలిసి ఉంటే,  తప్పనిసరిగా వెళ్ళమని పోరేదేమో,  కానీ నేనే చెప్పలేదు.  ఆ రకంగా క్యాంపస్ సెలక్షన్స్ రెండు మూడు కంపెనీలకి కూడాహాజరు కాలేక పోయాను. 


   ఇప్పుడు ఇక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఆమె ఎక్కడ కనబడకుండా  దూరం అవుతుందోనని  ఇంతవరకు నా  మదిలో దాచుకున్న మాటని ఆమెకు తప్పనిసరిగా తెలియజేయాలని ఆత్రుతతో  మాట్లాడినందుకు ఘోర పరాభవం చవి చూసాడు.  


   నిజానికి ఆమెలో  నాకు  ఆత్మీయురాలు, అమ్మ కనపడుతుందని,    ఇప్పటికీ సమాజానికి ఏదో చేయాలనే తపనా,  తనకున్న దాంట్లో కొంచెమయినా మరొకరికి సహాయం చేయాలనే  ఆ గుణమే, నన్ను  ఆమె వైపు ఆకర్షించేలా చేసిందని చెప్పాలనుకున్నాడు.   అది నాకు ప్రియురాలిగా,  భార్యగా ఉండడం కన్నా,   కలకాలం నా  తోడుగా, సహచరిగా జీవిత భాగస్వామిగా ఉంటే అమ్మ పడే ఆనందం కోసం ఇష్టపడ్డాడు.   ఎందుకంటే అమ్మ కూడా సరిగ్గా ఆ అమ్మాయిలాగే ఆలోచిస్తుంది.  అలా మా ఇద్దరి జీవితాలు సాఫీగా సాగిపోవాలంటే ఆమె నా  జీవిత భాగస్వామిని అయితే బాగుండు అనిపించింది.  


అలా ఎక్కువగా ఊహించుకొని, చాలా ఎక్కువ ఆశలు పెంచుకోవడం వల్లనేమో ఆమె ఛీ కొట్టింది.  ఇంతకాలం చక్కగా మాట్లాడే ఆమెను చూసిన నేను, ఆమెలోని  కోపాన్ని, నాపై ద్వేషాన్ని  భరించలేకపోయాను. 


ఆ ఆవేశంతో ఏమీ గుర్తురాలేదు. కేవలం నాకు జరిగిన అవమానం కళ్ళముందు కదలాడుతుంటే, ఇంటిలో   గదిలోకెళ్ళి ఉరి బిగించుకున్నాను. ఒక్క క్షణం, ఒక్క క్షణం  అయితే తనువు అనంతంలో లీనమయ్యేదే!  అమ్మ దేవతలా వచ్చింది. దేవతా ఏంటి? ఎప్పుడూ తన జీవితంలో అమ్మ దేవతే! 

కళ్ళ ముందు ఆ సజీవ దృశ్యాలు కదలాడాయి. 

*****

“అయ్యో! ఏందిరా కన్నా ఇది? ఏమయ్యిందిరా? ఈ పిచ్చి పనేంటి? నీ మీదే ఆశలు పెట్టుకున్న నేనేమై పోవాల్రా?” అంటూ అతి కష్టం పై నా  కాళ్ళు పట్టుకుని పాకులాడి,  నన్ను అతికష్టంపై  స్టూల్ పై నుండి దించి అక్కున చేర్చుకుంది అమ్మ. 


“నన్ను సావనియ్యమ్మా! నాకు బతకాలని లేదు.  నన్ను చూపుల్తో పొడుస్తున్న ఈ లోకాన్ని సూడాలనీ లేదు. బతుకుమీద ఆశ లేదు. ఇంత అవమానం జరిగాక బతికి నా మొహం ఎవ్వరికీ చూపించలేను”    అన్న నన్ను 

“నా బంగారం రా నాన్నా నువ్వు! నా పానం బిడ్డా నువ్వు! ఏం జరిగిందో చెప్పు బిడ్డా”  వెక్కెక్కి ఏడుస్తున్న  నన్ను అనునయించింది.   


   కరువుదీరా ఏడ్చిన తర్వాత వెక్కిళ్ళ మధ్య విషయం చెప్పాను. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


      అలల చాటు ఉప్పెన - పార్ట్ 3 త్వరలో

=================================================================================

నామని సుజనాదేవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.        

రచయిత్రి పరిచయం :

తెలంగాణా లో రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి పరిచయం క్లుప్తంగా.

   పూర్తి పేరు : నామని సుజనాదేవి

   విద్యార్హతలు : B.Sc.,B.Ed.,M.A.(English),LL.B.,PGDCA., FIII(Fellow of Insurance Institute of India) M.Sc.(Psychology),M.A.(Telugu) English&Telugu Type Writing lower.

 వృత్తి :భారతీయ జీవితబీమా సంస్థలో పరిపాలనాధికారి

   ప్రవృత్తి : కధలు,కవితలు వ్రాయడం,చెస్,క్యారమ్స్,టి‌టి ,అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడటం,వ్యాసరచన,వక్తృత్వం లాంటి అన్నిపోటీల్లోపాల్గొనటం మూడు కధా సంపుటాలు రెండు కవితా సంపుటాలు వెలువరించడం. ‘మనో స్పందన’ కధా సంపుటికి రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం రావడం.

1.భారత మహిళా శిరోమణి అవార్డ్ ౩. సంపూర్ణ మహిళా అవార్డ్ 4 . అలిశెట్టి ప్రభాకర్ స్మారక కవితా పురస్కారం 5. శ్రీ శ్రీ సాహితీ పురస్కారం 6. గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) అవార్డ్ 7. ఉగాది పురస్కారం , రుద్రమదేవి మహిళా పురస్కారం 8. శ్రీ అయితా చంద్రయ్య సంప్రదాయ కధా పురస్కారం 9. బెస్ట్ సిటిజెన్ అవార్డ్ 10. ‘విశ్వ శాంతి సేవా పురస్కారం ‘ 11. శాతవాహన విశ్వ విద్యాలయ కధా పురస్కారము 12. సోమరాదాక్రిష్ణ స్మారక వ్యాస పురస్కారం 13. ‘గురజాడ సాహిత్య పురస్కారం ‘ 14. సైదా సాహెబ్ స్మారక మినీ కవిత లో ప్రధమ బహుమతి 15. ఆంద్ర ప్రదేశ్ మాసపత్రిక హాస్య కధల పోటీలో ప్రధమ బహుమతి 16. రెండు సార్లు నెలవంక నెమలీక కధా పురస్కారం 17. ప్రతిలిపి ద్వారా ‘కధా కిరీటి ‘, ‘ కవి సుధ ‘ బిరుదులు, సహస్ర కవిమిత్ర బిరుదు 18. ‘సాహితీ రత్న’ అవార్డ్ 19. కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ అవార్డ్ 20. ఇప్పటివరకు దాదాపు 70 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లో ,6 విశాఖ ఆకాశవాణి లో,3 హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రసారం చేయబడినాయి. 21. 225 కధలు,175 కవితలు,25 ఆర్టికల్స్ ఈనాడు,తెలుగువెలుగు ,విపుల ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి,కధాకేళి, ముంబైవన్,ఉషోదయ వెలుగు ,వైఖానసప్రభ మొదలగు పత్రికల్లో ప్రతిలిపి, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, వసుధ ,మామ్స్ ప్రేస్సో వంటి వెబ్ మాగజీన్ లలో ప్రచురించబడ్డాయి. 22. LIC డివిజన్ లెవల్ చెస్ లో 10 సార్లు, అధ్లేటిక్స్ 3 సార్లు,టి.టి.లో 5 సార్లు ప్రధమ స్థానం పొంది జోనల్ లెవెల్ లో పార్టీసీపేట్ చేయడం. 23. రాష్ట్రస్థాయి జాతీయ వెటరన్ అధ్లేటిక్ మీట్లలో 2000 నుండి 2003 వరకు దాదాపు 15 నుండి 20 వరకు గోల్డ్,సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందడం. జోనల్ లెవల్ అధ్లేటిక్ మీట్లో 400మీటర్ల పరుగుపందెంలోబ్రాంజ్ మెడల్ 24. 11 వ్యాసాలకు, దాదాపు 27 కధలకు , 12 కవితలకు కొన్ని ఆర్టికల్స్ కు బహుమతులు పొందడం. 25. దూరదర్శన్ హైదరాబాద్ , వరంగల్ సప్తగిరి చానల్స్ ద్వారా ఇంటర్వ్యులు, మనమాట- మన పాట కార్యక్రమం, ఉగాది కవిసమ్మేలనాలలో పాల్గొనడం 26. మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సాహిత్య అవార్డ్ 27. క్రియేటివ్ ప్లానెట్ జాతీయ కవితా పురస్కారం 28. .శ్రీరామదాసి సాహిత్యపురస్కారం , ఎడపల్లి, నిజామాబాద్ 29. 405 కధలు వచ్చిన ప్రతిష్టాత్మక నవ్య ఉగాది పోటీలో ‘అనుబంధం’ కధ కు బహుమతి 30.అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ అమెరికా వారు జూన్ 2019 లో నిర్వహించిన కధల పోటీలో ‘తేడా’ కధకు బహుమతి రావడం. 31. గో తెలుగు వెబ్ సైట్ వారు వారు నిర్వహించిన పోటీ లో ‘ప్రేమ నేర్పిన పాఠం ‘ కి జూన్ 2019 లో బహుమతి 32. కెనడా డే 2019లో నిర్వహించిన పోటీలో ‘వాగార్దావివ సంత్రుప్తౌ’ కధ కు బహుమతి 33. తెలుగు కళా సమితి అమెరికా వారు నిర్వహించిన కధల కవితల పోటీలో , ‘చేయనితప్పు’ కధకు, ‘అలుపెరుగని పోరాటం’ కవితకు ప్రధమ బహుమతులు. 34. నిడదల నీహారికా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో 2020 ‘కుజ దోషం’ సంక్రాంతి కదల పోటీలో 20౦౦ నగదు బహుమతి. 35. ప్రతిష్ట్మాత్మక ఈనాడు కధావిజయం పోటీలో వెయ్యి కధల్లో నాకధ ప్రచురణకు సెలక్ట్ కావడం. 36. పుప్పాల ఫౌండేషన్ కధా పురస్కారం ‘వ్యత్యాసం' కధకు 18-1-20లో 37.హాస్యానందం చక్కరకేలీ పోటీలో ‘ఆనందం –ఆరోగ్య రహస్యం’ కధకు 5-1-20 లో బహుమతి ప్రధానం. 38. అంపశయ్య నవీన్ గారి ప్రధమ నవలల పోటీలో నా నవల ‘ఐ లవ్ మై ఇండియా’ కు పదివేల బహుమతి 24-12-19న స్వీకరించడం. 39. ‘తెలుగు పునర్వైభవం ‘ అంశం పై సాహితీ కిరణం నిర్వహించిన కవితల పోటీలో నా కవితకు ఫిబ్రవరి 2020లో బహుమతి రావడం. 40. ‘పొడుస్తున్న పొద్దు’ కధకు మామ్స్ ప్రేస్సో వెబ్ సైట్ లో ఏప్రిల్ 2020లో బహుమతి రావడం 41. రెండు తెలుగు రాష్టాల వారికి పెట్టిన పోటీలో నా కధా సంపుటి ‘స్పందించే హృదయం’ కు ‘సుందరాచారి స్మారక పురస్కారం’ 42. మామ్స్ ప్రేస్సో లో ‘ఇంటింటి రామాయణం’ బ్లాగ్ కి బహుమతి 43. తెలుగు సాహితీ వనం నిర్వహించిన పోటీలో నా కధ ‘తేడా’ కి జూన్ 20 లో బహుమతి 114. ప్రియమైన కధకుల గ్రూప్ లో ‘అనుబంధం’ కధకి జూలై 20 లో తృతీయ బహుమతి


28 views0 comments

Comentários


bottom of page