top of page
Writer's pictureNamani Sujana devi

అలల చాటు ఉప్పెన - పార్ట్ 3 



'Alala Chatu Uppena - Part 3/3' - New Telugu Story Written By Namani Sujana Devi

Published In manatelugukathalu.com On 04/09/2024

'అలల చాటు ఉప్పెన - పార్ట్ 3/3' తెలుగు కథ

రచన: నామని సుజనాదేవి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



జరిగిన కథ:

తన ప్రేమను వ్యక్తపరచిన సాయిని నలుగురిలో చులకన చేస్తూ మాట్లాడుతుంది శ్రీజ అనే అమ్మాయి. 

ఆమెతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటాడు సాయి. 

ఆమె తిరస్కారాన్ని భరించలేక  ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.

తల్లి అతన్ని వారిస్తుంది.



ఇక అలల చాటు ఉప్పెన పెద్దకథ చివరి  భాగం చదవండి.


“కన్నా! నువ్వు నా గురించే ఆలోచించావు. నిజమే! కాబట్టి నీకు అవమానమే గుర్తొస్తుంది కానీ ఆమె చెప్పిన మంచి మాటలు గుర్తు రావడం లేదు. ఆమె అన్న ప్రతీ మాటా నిజమే కదా! 


గాలి మనకు ప్రాణవాయువు ఇస్తుంది. కానీ మనం ఏమీ ఇవ్వడం లేదు. నదులు మనకు తాగడానికి నీరిచ్చి  మన జీవాన్ని నిలుపుతుంది.  కానీ మనం తిరిగి ఏమీ ఇవ్వడం లేదు.  అలాగే సూర్యకాంతి మనకు జీవితాన్ని ఇస్తుంది కానీ మనం ఏమీ ఇవ్వడం లేదు.  భూమి నిలబడడానికి, మన జీవనం సాగడానికి ఊతమిస్తుంది  కానీ మనమేమీ ఇవ్వడం లేదు.  కొంచెం అయినా మనం ఇవ్వగలిగేది వేరే వారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఆమె బస్సులో అలా సీటు ఇచ్చింది అంటే, ఆమె డబ్బు రూపేణా ఏ సాయం చేయలేని స్థాయిలో ఉంది కావచ్చు. అందుకే తన చేతనయిన సాయం ద్వారా తృప్తి పొందింది. అలాగే వరద బాధితుల విషయంలో కూడా. మిగతా వారి ద్వారా అయినా సాయం అందడానికి సాయం చేసింది. అలాగే ఇలాంటి పిచ్చి పని కాకుండా ఆ వైపు ఆలోచించు. నీకే గమ్యం దొరుకుతుంది” అంది. 

*****

   నిజంగా అమ్మ అంతగా చదువుకోకపోయినా ఎంత చక్కగా విశ్లేషణ చేసింది? నిజమే నేనూ ఈ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా!  


ఎగసెగసి తీరాన్ని దాటడానికి  అలుపెరగని ప్రయాణం చేస్తున్న అలలను  అలానే చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను, వాటి నిరంతర పోరాటాన్ని. 


ఒక్కో అల  నింగిని తాకాలని ఉవ్వెత్తున్న ఉరకలెత్తుతూ వస్తూనే ఉన్నాయి. తాకలేక ఎగిరి మళ్ళీ అదే సముద్రంలో లీనమవుతూనే ఉన్నాయి. అయినా  మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.  ఎంత ప్రయత్నం చేసినా తీరం  దాటలేదని  తెలుసు దానికి. అయినా ఊరుకుంటుందా? ఊహు...

ఆగక అలుపెరగక నిరంతరం  క్షణక్షణం తన శాయ శక్తుల ప్రయత్నిస్తూనే ఉంటుంది.  


చిన్నప్పటి  నుండి కష్టమైనా,  సుఖమైనా  సముద్రంతో చెప్పుకోవడం  నాకలవాటు.  ఎందుకంటే సముద్రాన్ని చూస్తే చాలు ఎన్నో కథలు చెబుతుంది అనిపిస్తుంది.  ఎందుకంటే అందులో ఉన్న  అనంత కోటి జీవుల్లా మనిషి జీవితంలో ఆలోచనలు అనేకం.  తీరం చేరని  కెరటంలా జీవితంలో పరమార్థం చేరుకోవడానికి మనిషి ఎప్పుడూ  ఆరాటపడుతూనే ఉంటాడు.  తీరం చేరాలని ఎగసిపడుతున్న అలల్లా  నాలో ఆలోచనలు అలా ఎగసెగసి పడుతూనే ఉన్నాయి.  తీరని చేరాలని ఒక కొలిక్కి రావాలని ఆరాట పడుతూనే ఉన్నాయి. 


గోలగోలగా  అల్లరి వినబడితే తల తిప్పి చూసాను.  ఎవరో మాలాంటి కాలేజీ బృందమే, చైతన్యమే ఊపిరిగా వచ్చారు.  అందరి చేతుల్లో బాటిల్స్.  వారు మంచి ఎంజాయ్మెంట్ కి వచ్చారని చూడగానే తెలిసిపోతుంది.  అందరూ సముద్రం ఒడ్డున కూర్చున్నారు.  కూర్చుని కూల్ డ్రింక్స్ తమ చేతిలో ఉన్న వాటర్ బాటిల్స్ లోని నీళ్ళు తాగుతున్నారు.  తినడానికి తినుబండారాలు కూడా తెచ్చుకున్నారు. అవి తింటూ తాగుతూ మజా చేస్తున్నారు. 


ఎందుకో అమ్మ మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. 


“చూడునాన్నా! వెలుతురు  వెంట నీడ ఉన్నట్లే,  అపజయం వెంట జయం, కష్టం వెనక సుఖం ఉంటాయి.  నీకీ కష్టం ఈ రోజు వచ్చిందంటే దీనిని అంటుకుని ఏదో మంచి కూడా నీకు రాసిపెట్టి ఉంది. నన్ను తాగి కొట్టే మీ నాన్న  నన్ను  వదిలిపోయినప్పుడు దిక్కుతోచక ఏడ్చాను. కాని నేను అలాగే ఉంటే  మీ నాన్నతో తన్నులు తింటూ,  జీవితాంతం ఆయన మోచేతి నీళ్ళు తాగడం కోసం,  నీ కోసం అన్నీ భరిస్తూ, నిన్ను మరో తాగుబోతును చేస్తుంటే కొట్లాడుతూ,  చెడిపోతున్న నిన్ను బాగుచేయడానికి ఏం చేయాలోనని చూస్తూ ఉండేదాన్ని. కాని ఆ కష్టం వెనక ఇదిగో నన్ను బలంగా,  ధైర్యంగా ఇలా  నా కాళ్ళపై నన్ను నిలిపే ఈ సుఖం వచ్చింది.


మీ నాన్నతో ఉన్న దానికన్నా మంచిగా మనం ఉన్నాం. అలాగే ఆ కష్టం నీకు వచ్చింది అంటే,  ఆ పిల్ల అన్న మాటలు ఆలోచించు. అందులో నీకు పరమార్థం దొరుకుతుంది. అంతే గానీ ఇలా చేతగాని వాడిలా, పిరికివాడిలా సావడం గాదు. ఆలోచించు. నీ గమ్యం,  నీ లక్ష్యం నీకే బోధ పడతది”


అమ్మ  మాటలు, ఎదురుగా బీచ్ లో వారంతా చేస్తున్న  చేతలు పదే పదే మార్చి మార్చి కనబడుతున్నాయి.   వాళ్ళు తిన్నాక అక్కడ వేసిన ప్లాస్టిక్ గిన్నెలు, పళ్ళాలు, బాటిల్స్ అన్నీ ఒక్కోసారి అలలకు తాకుతూ ఉన్నాయి. వారు వెళ్ళి పోయారు. ఈసారి పెద్దగా వచ్చిన అలలో అవన్నీ సముద్రం లోకి కొట్టుకొని పోయాయి. ఇటీవల నేను చదివిన ఆర్టికల్ గుర్తొచ్చింది. 


అదేంటంటే సముద్ర కాలుష్యం!  ఈమధ్య అన్ని దేశాలను విపరీతమైన కలవరానికి గురిచేస్తుంది అని. 

ఐపీసీసీ నివేదిక ప్రకారం కొన్ని దేశాలు ఇప్పటికే సముద్ర కాలుష్యం గురించి ఆలోచిస్తూ పర్యావరణాన్ని అది దెబ్బతీయడాన్ని చాలా తీవ్రంగా పరిగణించి సముద్ర కాలుష్యం నివారించడానికి కమిటీలు కూడా వేశారు. 


 వర్షానికి నదుల నుండి సముద్రంలో కలుస్తున్న నీటి ద్వారా అత్యధిక కాలుష్యం సముద్రంలో చేరుతుంది.  వ్యవసాయానికి వాడే ఎరువులు,  పురుగుల మందులు ఇవన్నీ కూడా నీటితో కలిసి సముద్రంలో కలవడం వల్ల అందులో ఉన్న రసాయనాల వల్ల సముద్రంలోని జీవులకు ముప్పు వాటిల్లి వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.  జనాభా పెరుగుదల వల్ల తలసరి ప్రపంచ జి.ఎం.ఏ  పెరుగుదల.


 సముద్ర కాలుష్యానికి శిలాజ ఇంధన వినియోగం, చమురుచిందడం,రసాయన కాలుష్యం ఇవన్నీ సముద్రజీవుల మనుగడను ప్రభావితం చేస్తున్నాయి.  


బొగ్గు దహనం దగ్గర నుండి చేపలు పట్టడం,  ఆమ్లీకరణ,  ప్లాస్టిక్ ద్వారా చెత్త చేరడం,  ఓడలు ధ్వంసం కావడం వల్ల తుప్పు పట్టిన లోహ శిథిలాలు చేరడం  లాటి రకరకాల కారణాల వల్ల కాలుష్యం పెరుగుతుంది. 


99.8% కాలుష్యం ప్లాస్టిక్ ద్వారానే వస్తుంది అని,  దాదాపు 38 మిలియన్ల ప్లాస్టిక్ ప్రతిరోజు జమ అవుతుందని,  ప్రతిరోజు లక్షకు పైగా కొత్త వస్తువులు కొట్టుకుపోతున్నాయని,  అందులో ఫిషింగ్ సామాన్లు,తాడులు,  వలలు,  డబ్బాలు,  ప్లాస్టిక్స్,  గాజు సీసాలు,  బాటిల్ టాప్ లు,  బూట్లు,  ఏరో సోల్ డబ్బాలు,  షిప్ మునిగిపోవడం వల్ల షిప్ లోని సామాన్లు,  సిగరెట్ లైటర్లు,  లైట్ బల్బులు ఇలా ఎన్నో వస్తువులు ప్రతిరోజు కొట్టుకొని పోతున్నాయి.  ఈ ప్లాస్టిక్లు చిన్నచిన్న మైక్రో ప్లాస్టిక్లుగా విడిపోయి సముద్ర పక్షులు,  సముద్ర జీవుల కడుపులో చేరడం ద్వారా సంతాన ఉత్పత్తి చేసే ఆ జీవులను దెబ్బతీస్తున్నాయి.  ఇవి వాటి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  పెరుగుతున్న కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల కారణంగా గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. 


మైనింగ్ నుండి మానవజన్య పాదరసము విడుదల కావడం వల్ల రసాయన కలుషితాల ద్వారా సముద్ర కాలుష్యం బాగా పెరుగుతుంది.  అంతేకాకుండా చమరుచిమ్మడం వల్ల,  ఆ చమురంతా  సముద్ర ఉపరితలంపై పేరుకుపోయి అందులోకి సూర్య రష్మి చేరకుండా అడ్డుకుని అందులో జీవజాలం పెరగకుండా, జీవజాలం బ్రతకడానికి అవసరమైన సూర్యరష్మీ,  ఆక్సిజన్ అందకుండా చేస్తున్నాయి. దీనివల్ల సముద్ర క్షీరదాలు,  పక్షులు,  చేపలు ఇవన్నీ కూడా మనుగడ సాగించడం కష్టమవుతుంది. దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.  


ఐక్యరాజ్యసమితి ఈ విషయంపై సదస్సు నిర్వహించినా  ఇంకా ప్రయోజనాలు అనుకున్నంతగా రాలేదు.  సముద్ర ఆమ్లీకరణ తగ్గించడము, సముద్ర జీవులను రక్షించడము లాంటి పనులన్నీ చేయడానికి ఐక్యరాజ్యసమితి కొన్ని ప్రణాళికలను కూడా తయారు చేసింది.  కాలుష్యంలో కాంతి కాలుష్యం, శబ్దము, రసాయన కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, చమురుచిందడం, వ్యవసాయ వ్యర్ధాలు, సేంద్రియ రసాయన పదార్థాలు కలుషితం కావడం వల్ల, జలం విషతుల్యం కావడం నీటిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ కంటెంట్ల ఉత్పత్తి తదితరాల ద్వారా  జీవవైవిద్యం కోల్పోవడం.


 మురుగునీరు వచ్చి సముద్రంలో చేరడం వల్ల అందులో ఉండే సముద్ర జీవులకు ప్రమాదం.  అలాగే ఓషన్ మైనింగ్ అంటే వెండి, బంగారం, రాగి, కోబాల్ట్ , జింక్ కోసం డ్రిల్లింగ్ చేస్తే అది సల్ఫేట్ నిక్షేపాలను సృష్టిస్తాయి.  అవి  వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. సముద్రంలో ప్రతి చదరపు మైలులో 46 వేల తేలియాడే ప్లాస్టిక్ ముక్కలను కలిగి ఉంటున్నాయి.  ఈ ప్లాస్టిక్, సూక్ష్మ( మైక్రో) ప్లాస్టిక్లుగా విడిపోయి ఆ ప్రాంతాల జీవ జంతువులపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


 తీర ప్రాంత పర్యాటకం, ఓడరేవు,  నౌకాశ్రయ అభివృద్ధి,  నదులు ఆనకట్టలు,  పట్టాభివృద్ధి నిర్మాణం, మైనింగ్,  చేపల పెంపకం,  ఆక్వా కల్చర్,  తీర ప్రాంత సముద్ర నివాసాలు,  సముద్ర జంతువులపై ప్రభావం చూపుతున్నాయి.  క్యాన్సర్  ముప్పు, పునరుత్పత్తి తగ్గిపోవడం,  మరణం,  పగడపు దిబ్బల చక్రానికి భంగం కలగడం, చమురు మొక్కలకు ఆక్సిజన్ అందకుండా చేయడం,  అందులోని శిథిలాలు సూర్యరశ్మి  తాకక కుళ్ళిపోయి,  


ఏళ్ల తరబడి అందులోనే ఉండడం వల్ల ఆక్సిజన్ తగ్గి తిమింగలాలు,  తాబేలు,   చేపలు,  డాల్ఫిన్స్,  పెంగ్విన్స్ ఎక్కువ కాలం జీవించే అవకాశాన్ని కోల్పోతున్నాయి. అందుకే డ్రిల్లింగ్ పరిమితం చేయాలి అంటే సౌరశక్తి లాంటి పునరుత్పాదక ఇంధనం అమలు చేయాలి. 


అనుకూలమైనటువంటి పురుగుల మందులు లేదా సేంద్రియ వ్యవసాయం చేయాలి.  పర్యావరణ అనుకూలమైన  విధంగా మురుగునీటిని శుద్ధి చేయాలి.  పరిశ్రమల వ్యర్ధాలు తగ్గించడానికి,  పల్లపు ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్వహించడం కానీ బయోటెక్నాలజీ ఉపయోగించి విషపదార్థాలు రాకుండా చేయడం కానీ చేయాలి.  ఆకుపచ్చ జీవనశైలిని అనుసరించాలి.  కార్బన్ పాదముద్రను తగ్గించాలి.  సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై నిషేధం విధించడంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక్కతాటిపైకి  రావాలి’


ఇలా ఆర్టికల్ లోని అన్ని విషయాలు తనకు శ్రీకృష్ణుడు భోదించిన గీతలా ఏదో చేయమని ఆదేశిస్తున్నాయి.  నిజమే! ఈ విషయం తనకు కూడా ఆర్టికల్ చదివితేనే తెలిసింది. చిన్నప్పటి నుండి సముద్రంతో సావాసం చేసిన నాకే ఇలా ఉంటే  మరి అసలు ఎంతో మంది చదువుకున్న వాళ్ళు వచ్చి ఇలా బాటిల్స్ అన్నీ ఇలా పారేస్తున్నారు అంటే వారికి ఆ విషయం తెలియదనే కదా! ఈ పర్యావరణాన్ని జాగ్రత్తగా తమ తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ విషయంగా ప్రజల్లోకి బాగా విస్తృత ప్రచారం చేయాలి. ముందు తను నడుం బిగించి ముందడుగు వేసి, ఫేస్ బుక్ ద్వారా, ట్విట్టర్  లాంటి మాధ్యమాల ద్వారా బలంగా యువతలోకి తీసుకెళ్ళాలి. వారు తలచుకుంటే సాధించలేనిది లేదు. 


ఇలా ఆలోచిస్తున్న కొలదీ నాకు కర్తవ్యం బోధపడింది. ఇక నేను ఆగలేదు.  వెంటనే అలా కొట్టుకుపోతున్న ప్లాస్టిక్స్ ని ఒడిసిపట్టుకున్నాను .


ప్రతిరోజూ అలా చేయడం వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేయడంతో నన్ను చాలా మంది అనుసరించి ఆ సంఖ్య కాస్తా వేల నుండి లక్షల్లోకి చేరింది. కొన్ని వేల టన్నుల చెత్తను తీసివేసాం. ఇది ఎక్కడివరకు వెళ్ళింది అంటే  ప్రధానమంత్రిని కూడా ఆకర్షించి మా అసోసియేషన్ కి జాతీయ స్థాయి అవార్డ్ ప్రకటించి చేయూత నిచ్చెంతగా. 

 ***** 

నన్ను ప్రేమించే శ్రీజ కేవలం నాకు దిశా నిర్దేశం చేయడం కోసమే ఇలా పరుషంగా మాట్లాడినట్లు తెలిసి ఇద్దరం ఒక్కటవడం,  వెదుక్కుంటూ వచ్చిన నాన్నను, అమ్మ కడిగేయడం నేను ఊహించని కొసమెరుపులు. 


=================================================================================

                                                    సమాప్తం

=================================================================================

నామని సుజనాదేవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.        

రచయిత్రి పరిచయం :

తెలంగాణా లో రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి పరిచయం క్లుప్తంగా.

   పూర్తి పేరు : నామని సుజనాదేవి

   విద్యార్హతలు : B.Sc.,B.Ed.,M.A.(English),LL.B.,PGDCA., FIII(Fellow of Insurance Institute of India) M.Sc.(Psychology),M.A.(Telugu) English&Telugu Type Writing lower.

 వృత్తి :భారతీయ జీవితబీమా సంస్థలో పరిపాలనాధికారి

   ప్రవృత్తి : కధలు,కవితలు వ్రాయడం,చెస్,క్యారమ్స్,టి‌టి ,అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడటం,వ్యాసరచన,వక్తృత్వం లాంటి అన్నిపోటీల్లోపాల్గొనటం మూడు కధా సంపుటాలు రెండు కవితా సంపుటాలు వెలువరించడం. ‘మనో స్పందన’ కధా సంపుటికి రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం రావడం.

1.భారత మహిళా శిరోమణి అవార్డ్ ౩. సంపూర్ణ మహిళా అవార్డ్ 4 . అలిశెట్టి ప్రభాకర్ స్మారక కవితా పురస్కారం 5. శ్రీ శ్రీ సాహితీ పురస్కారం 6. గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) అవార్డ్ 7. ఉగాది పురస్కారం , రుద్రమదేవి మహిళా పురస్కారం 8. శ్రీ అయితా చంద్రయ్య సంప్రదాయ కధా పురస్కారం 9. బెస్ట్ సిటిజెన్ అవార్డ్ 10. ‘విశ్వ శాంతి సేవా పురస్కారం ‘ 11. శాతవాహన విశ్వ విద్యాలయ కధా పురస్కారము 12. సోమరాదాక్రిష్ణ స్మారక వ్యాస పురస్కారం 13. ‘గురజాడ సాహిత్య పురస్కారం ‘ 14. సైదా సాహెబ్ స్మారక మినీ కవిత లో ప్రధమ బహుమతి 15. ఆంద్ర ప్రదేశ్ మాసపత్రిక హాస్య కధల పోటీలో ప్రధమ బహుమతి 16. రెండు సార్లు నెలవంక నెమలీక కధా పురస్కారం 17. ప్రతిలిపి ద్వారా ‘కధా కిరీటి ‘, ‘ కవి సుధ ‘ బిరుదులు, సహస్ర కవిమిత్ర బిరుదు 18. ‘సాహితీ రత్న’ అవార్డ్ 19. కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ అవార్డ్ 20. ఇప్పటివరకు దాదాపు 70 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లో ,6 విశాఖ ఆకాశవాణి లో,3 హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రసారం చేయబడినాయి. 21. 225 కధలు,175 కవితలు,25 ఆర్టికల్స్ ఈనాడు,తెలుగువెలుగు ,విపుల ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి,కధాకేళి, ముంబైవన్,ఉషోదయ వెలుగు ,వైఖానసప్రభ మొదలగు పత్రికల్లో ప్రతిలిపి, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, వసుధ ,మామ్స్ ప్రేస్సో వంటి వెబ్ మాగజీన్ లలో ప్రచురించబడ్డాయి. 22. LIC డివిజన్ లెవల్ చెస్ లో 10 సార్లు, అధ్లేటిక్స్ 3 సార్లు,టి.టి.లో 5 సార్లు ప్రధమ స్థానం పొంది జోనల్ లెవెల్ లో పార్టీసీపేట్ చేయడం. 23. రాష్ట్రస్థాయి జాతీయ వెటరన్ అధ్లేటిక్ మీట్లలో 2000 నుండి 2003 వరకు దాదాపు 15 నుండి 20 వరకు గోల్డ్,సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందడం. జోనల్ లెవల్ అధ్లేటిక్ మీట్లో 400మీటర్ల పరుగుపందెంలోబ్రాంజ్ మెడల్ 24. 11 వ్యాసాలకు, దాదాపు 27 కధలకు , 12 కవితలకు కొన్ని ఆర్టికల్స్ కు బహుమతులు పొందడం. 25. దూరదర్శన్ హైదరాబాద్ , వరంగల్ సప్తగిరి చానల్స్ ద్వారా ఇంటర్వ్యులు, మనమాట- మన పాట కార్యక్రమం, ఉగాది కవిసమ్మేలనాలలో పాల్గొనడం 26. మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సాహిత్య అవార్డ్ 27. క్రియేటివ్ ప్లానెట్ జాతీయ కవితా పురస్కారం 28. .శ్రీరామదాసి సాహిత్యపురస్కారం , ఎడపల్లి, నిజామాబాద్ 29. 405 కధలు వచ్చిన ప్రతిష్టాత్మక నవ్య ఉగాది పోటీలో ‘అనుబంధం’ కధ కు బహుమతి 30.అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ అమెరికా వారు జూన్ 2019 లో నిర్వహించిన కధల పోటీలో ‘తేడా’ కధకు బహుమతి రావడం. 31. గో తెలుగు వెబ్ సైట్ వారు వారు నిర్వహించిన పోటీ లో ‘ప్రేమ నేర్పిన పాఠం ‘ కి జూన్ 2019 లో బహుమతి 32. కెనడా డే 2019లో నిర్వహించిన పోటీలో ‘వాగార్దావివ సంత్రుప్తౌ’ కధ కు బహుమతి 33. తెలుగు కళా సమితి అమెరికా వారు నిర్వహించిన కధల కవితల పోటీలో , ‘చేయనితప్పు’ కధకు, ‘అలుపెరుగని పోరాటం’ కవితకు ప్రధమ బహుమతులు. 34. నిడదల నీహారికా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో 2020 ‘కుజ దోషం’ సంక్రాంతి కదల పోటీలో 20౦౦ నగదు బహుమతి. 35. ప్రతిష్ట్మాత్మక ఈనాడు కధావిజయం పోటీలో వెయ్యి కధల్లో నాకధ ప్రచురణకు సెలక్ట్ కావడం. 36. పుప్పాల ఫౌండేషన్ కధా పురస్కారం ‘వ్యత్యాసం' కధకు 18-1-20లో 37.హాస్యానందం చక్కరకేలీ పోటీలో ‘ఆనందం –ఆరోగ్య రహస్యం’ కధకు 5-1-20 లో బహుమతి ప్రధానం. 38. అంపశయ్య నవీన్ గారి ప్రధమ నవలల పోటీలో నా నవల ‘ఐ లవ్ మై ఇండియా’ కు పదివేల బహుమతి 24-12-19న స్వీకరించడం. 39. ‘తెలుగు పునర్వైభవం ‘ అంశం పై సాహితీ కిరణం నిర్వహించిన కవితల పోటీలో నా కవితకు ఫిబ్రవరి 2020లో బహుమతి రావడం. 40. ‘పొడుస్తున్న పొద్దు’ కధకు మామ్స్ ప్రేస్సో వెబ్ సైట్ లో ఏప్రిల్ 2020లో బహుమతి రావడం 41. రెండు తెలుగు రాష్టాల వారికి పెట్టిన పోటీలో నా కధా సంపుటి ‘స్పందించే హృదయం’ కు ‘సుందరాచారి స్మారక పురస్కారం’ 42. మామ్స్ ప్రేస్సో లో ‘ఇంటింటి రామాయణం’ బ్లాగ్ కి బహుమతి 43. తెలుగు సాహితీ వనం నిర్వహించిన పోటీలో నా కధ ‘తేడా’ కి జూన్ 20 లో బహుమతి 114. ప్రియమైన కధకుల గ్రూప్ లో ‘అనుబంధం’ కధకి జూలై 20 లో తృతీయ బహుమతి


26 views0 comments

Comments


bottom of page