top of page
Writer's pictureMohana Krishna Tata

ఆల్ ఇన్ వన్

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #AllInOne, #ఆల్ఇన్వన్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


All In One - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 06/12/2024

ఆల్ ఇన్ వన్ - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ



ఎదురుగా ఉన్న ఫ్లాట్ ఎన్నో రోజులుగా ఖాళీగా ఉంది. ఆ టూలెట్ బోర్డుకి కూడా బూజు పట్టేసింది. ఒక్కడే ఉండే కళ్యాణ్.. ఎవరొస్తారా..? అని ఎప్పుడూ ఎదురు చూడడమే. ఒక రోజు..ఎదురు ఇంటి నుంచి ఒక అందమైన గొంతు వినిపించింది. ఎవరా..? అని కిటికీ లోంచి తొంగి చూసాడు. ఆమెను చూడగానే, అతడి ముఖం వంద వాట్స్ బల్బ్ లాగ వెలిగిపోవడం స్టార్ట్ అయ్యింది..పవర్ కట్ టైం లో కుడా. అప్పుడు తనకు కొన్ని రోజులు కిందట గురుజీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి..


******

"స్వామీజీ..! నమస్కారం.."


"ఎవరు నాయనా నువ్వు..నీ పేరు..?"


"నా పేరు కళ్యాణ్.."


"ఏమిటి నీ ప్రాబ్లం.."


"నా పేరులోనే కళ్యాణం ఉంది స్వామి..నాకు ఇంకా ఆ గడియలు రాలేదు..మీరు ఏదో దారి చూపిస్తారని నమ్మకం తో వచ్చాను.."


"సందేహం వద్దు..నా దగ్గరకు వచ్చిన అందరికీ హ్యాపీ డేస్ స్టార్ట్ అవుతాయి.."


"హ్యాపీ డేస్ తో పాటు..పెళ్ళి చూపులు, పెళ్ళి పందిరి, పెళ్ళిపీటలు, పచ్చని సంసారం అన్నీ నా జీవితంలో ఉండేలా చూడండి గురూజీ.."


"నీ గుడ్ టైం స్టార్ట్ అయింది..నీ కోసమే ఒక అమ్మాయి నీకు దగ్గరగా వస్తుంది..ఆ అవకాశాన్ని వదులుకోవద్దు..లేకపోతే సింగిల్ గా మిగిలిపోతావు.. "


"నిజమాస్వామి..! ఈ సారి వచ్చే అవకాశం వదలుకోను.."


******


గురుజీ చెప్పినట్టుగా తన కోసమే వచ్చిందేమో ఈ అమ్మాయి..అందుకే ధైర్యంగా ముందడుగు వేసాడు. బయట అమ్మాయిని చూస్తూ ఉండగా ..అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది..


"బాబూ..! ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు చెప్పు..! ఎప్పుడు ఎంజాయ్ చేయాల్సినవి అప్పుడు ఎంజాయ్ చెయ్యాలి.. వెంటనే పెళ్ళి చేసుకోవచ్చుగా. నేను ఇంక నీకు సంబంధాలు చూడలేను. బయటకు వెళ్తే, మీ అబ్బాయికి ఇంకా పెళ్ళి ఎప్పుడు..? అని అంటున్నారు..బెండకాయ ముదిరితే పనికిరాదని హేళన చేస్తున్నారు. నువ్వే ఒక అమ్మాయిని చూసుకో రా..! ఎవరైనా నచ్చితే చెప్పు..నాలుగు అక్షింతలు వేసి కాశీకి పోతాను.."


"అలాగే లే అమ్మా..! కొంచం ఓపిక పట్టు..నాలుగు కాదు నలభై అక్షింతలు వెయ్యడానికి రెడీ గా ఉండు.."


అప్పుడే..తలుపు తీసి, ఎదురింటి అమ్మాయి బయటకు వచ్చింది. కళ్యాణ్ కొంచం స్వరం పెంచి..ఇప్పుడే ఒక అమ్మాయిని చూసాను.. చాలా దగ్గరగా వచ్చేసింది .. ఓకే అయ్యాక చెబుతాను.."


"ఏమో నీ మాటలు ఏమీ అర్ధం కావు.."


ఈ లోపు ఆ అమ్మాయి ఫోన్ రింగ్ అయ్యింది..


"అమ్మా..! ఇంత పొద్దున్నే కాల్ చేసావేంటి.."


"నీ పెళ్ళి తప్ప నాకు ఏం ధ్యాస చెప్పు..! నన్ను సంబంధం చూడమంటావా..? నువ్వు లవ్ ఏమైనా చేస్తున్నావా..?"


"ఇంతవరకూ లేదు..అయినా నా పెళ్ళికి ఏం తొందర ఇప్పుడు?"


"కళ్యాణి అని పేరు పెట్టాను కానీ, ఇప్పటికీ నీకు ఇంకా కల్యాణం కాలేదు..ఎప్పుడు అడిగినా ఇంకా టైం ఉందంటావు.. నీ వయసెంతో తెలుసా..?"


"ముప్పయి రెండు... అంతేగా..అంతేగా "


"అంతేగా ఏమిటే..ఈ పాటికి ఇద్దరు బిడ్డలు తల్లి అవ్వాలి..రెండో పిల్లాడి స్కూల్ అడ్మిషన్ కోసం క్యూలో నిల్చొని ఉండాల్సిన వయసు నీది"


"మొదలెట్టావా అమ్మా ..చాలు ..! మా ఫ్రెండ్ స్నేహ కాల్ చేస్తోంది.. ఒక్కర్తిని బోర్ అంటే, ఇంటికి వస్తానంది. అందుకే ఫోన్ చేసిందేమో..ఉంటాను.."

***


"హాయ్ కళ్యాణి..! నేను వస్తున్నాను..ఇంట్లో ఉన్నావా..? బోలెడన్ని కబుర్లు చెప్పుకోవాలి.." అంది స్నేహ. 


"మీ ఆయన క్యాంపు కెళ్ళిన ప్రతిసారీ నా దగ్గరకి వస్తావే..నేనంటే ఎంత ఇష్టమే నీకు..?" అంది కళ్యాణి.


"మీ అమ్మ ఏమో నిన్ను చూసుకోమని నాకు చెప్పింది. దానికోసమే వారానికోసారి నేను రావాల్సి వస్తోంది. పెళ్ళి లేక నువ్వు ఎక్కడ డిప్రెషన్ లోకి వెళ్లిపోతావేమోననే నా భయమే. నువ్వు తప్ప నాకూ ఎవరున్నారు చెప్పు.."


"తొందరిగా రావే..బోర్ గా ఉంది"

***


"మొత్తానికి ఈ కల్యాణి గారి దర్శనం అయింది. ఇంతకీ ఇక్కడ ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారా..?" అడిగింది స్నేహ. 


"ఇంకా లేదు గాని..ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడే.. నా మీదే తెగ ఫోకస్ పెడుతున్నాడు .."


"అబ్బాయి బాగున్నాడే.. నీకు సరి జోడీ. నిన్ను ప్రేమిస్తున్నాడేమోనే.. ఒప్పేసుకోవే..! పెళ్ళి లేకుండా ఎన్నాళ్ళు ఉంటావు..? పెళ్ళైతే.. మీ ఆయనతో లైఫ్ బాగుంటుంది.. నేను అసలు గుర్తుకు రాను.. ఇక్కడికీ రాను"


"నువ్వు రాకపోతే ఎలా..?"


"నా కన్నా మీ ఆయనతో కంపెనీ ఇంకా చాలా బాగుంటుందే..."


"నువ్వు కుడా మా అమ్మ లాగే పెళ్ళి పెళ్ళి అని గోల పెట్టకు.."


"అయితే విను.. నీ ప్రేమ తో పాటు..ఎప్పుడైనా కోపం చూపించడానికి ఇంట్లో ఒక మనిషి ఉండాలిగా..పనిమనిషి రాకపోతే ఇంట్లో పనులకి ఒక మనిషి ఉండాలిగా..పెళ్ళి చేసుకుంటే, భర్తే ఆల్ ఇన్ వన్ కదా ..! నిన్ను కోరి చేసుకుంటానని అబ్బాయి వస్తే, ఆల్ ఇన్ వన్ ఫుల్ సక్సెస్ అయ్యినట్టే..ఆలోచించు కల్యాణి "


"అంత బాగుంటుందే ఆ లైఫ్..అంత కంఫర్ట్ గా ఉంటుందా?" అడిగింది కళ్యాణి.


"పెళ్ళైన నేను చెబుతున్నాను..ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలే. మనం ఏమైనా వంద ఏళ్ళు బతికేస్తామా చెప్పు..? తొందరగా పెళ్ళి చేసుకుంటే, జబ్బులు వచ్చి..ఓపిక తగ్గే లోపే లైఫ్ ని కొంచమైన ఎంజాయ్ చెయొచ్చు..ఇప్పటికే నువ్వు లేట్.."


"మొన్నటి వరకూ ఏమో గానీ..నువ్వు చెబుతుంటే, నాకూ ఒక తోడు కావాలి అనిపిస్తోంది. ఇంట్లో పనులు కుడా ఒంటరిగా చేసుకోలేకపోతున్నాను. ఆలోచించగా.. ఆల్ ఇన్ వన్ ఆప్షన్ బాగుంది "


"నేనూ అంతే..! నీ దగ్గరకు వచ్చేసానా..నేను ఇంటికి వెళ్లేసరికి మా ఆయన ఇంట్లో పనులన్నీ చేసి పెడతారు. ఎంతైనా.. భర్తలకు భార్య ప్రేమ కావాలిగా.." అంది స్నేహ.


ఈ లోపు కాలింగ్ బెల్ మోగింది..


"ఎవరో వచ్చారే...నేను లోపల ఉంటాను...నువ్వు చూడవే కళ్యాణి.."


తలుపు తీసిన కళ్యాణికి..ఎదురుగా ఎదురింటి అబ్బాయి..నవ్వుతూ కనిపించాడు..


"నా పేరు కళ్యాణ్..మీ పేరు కళ్యాణి..మన ఇద్దరమూ పెళ్ళి చేసుకుందాము..మన పేర్లు కుడా మ్యాచ్ అయ్యాయి. డైరెక్ట్ గా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి.."


"ఎంత ధైర్యం మీకు.. నాతో ఇలా మాట్లాడడానికి.." అంటూ కోపం నటించింది కల్యాణి 


"మీ అమ్మగారు ఫోన్ లో చెప్పిందంతా విన్నాను లెండి కళ్యాణి గారు. సరే అనండి..మిమల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది..నాదీ మీ పరిస్థితే..ఒప్పుకోండి ప్లీజ్..." అంటూ వేడుకున్నాడు కళ్యాణ్ 


"హలో ఆంటీ..! నేను స్నేహ..మీ అమ్మాయికి ఆల్ ఇన్ వన్ తోడు దొరికేసాడు..మీరు ఇంక నిశ్చింతగా ఉండొచ్చు.." ఆనందంగా చెప్పింది స్నేహ 


***********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


70 views1 comment

1 Comment


Ra Sud
Ra Sud
Dec 09

Nice

Like
bottom of page