top of page
Writer's pictureDivakarla Padmavathi

అల్లరి ప్రేమికుడు

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #AllariPremikudu, #అల్లరిప్రేమికుడు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు




'Allari Premikudu' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 01/11/2024

'అల్లరి ప్రేమికుడుతెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సెటెల్మెంట్ కింగ్, గ్యాంగ్ స్టర్ గంగరాం ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు అతని అసిస్టెంట్ సాంబయ్య.


"ఒరే సాంబా! ఇప్పుడే కోటేశ్వర్రావుగారి నుండి ఫోన్ వచ్చింది. అతని కూతురు ఐశ్వర్యని ఎవడో బడుద్ధాయి ప్రేమించానని వెంటపడుతున్నాడట! ఆ ఆకతాయి పనిపట్టాలి నువ్వు! మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి. కావలిస్తే కాళ్ళూచేతులు విరిచేసినా సరే! ఆ అల్లరి ప్రేమికుడి పీడ విరగడ చేస్తే పదిలక్షల రూపాయలు ఇస్తానన్నాడతను. వెంటనే ఆ పనిమీద ఉండు!" అదేశించాడు గంగారాం.


"అలాగే అన్నా! ఇప్పుడే నలుగురు మెరికల్లాంటి వాళ్ళని పంపిస్తాను. ఆ అమ్మాయి వెంటపడిన వాడి పనిపట్టి కాళ్ళూ చేతులు కట్టేసి గంటలో నీ ముందు ఉంచుతాను అన్నా!" అన్నాడు సాంబయ్య.


కోరమీసం దువ్వుకుంటూ తలూపాడు గంగారాం.


సరిగ్గా గంట తర్వాత నీరసంగా తిరిగి వచ్చిన సాంబయ్యను చూసి, "ఏమైందిరా సాంబా! అలా మొహం వేళ్ళాడేసుకున్నావ్? ఆ కుర్రాడేమైనా సినిమా హీరోలా మిమ్మల్నందర్నీ పిచ్చకొట్టుడు కొట్టాడా ఏమిటి కొంపతీసి?" అతృతగా అడిగాడు గంగారాం.


"లేదన్నా..." అని చేతులు నులుపుకున్నాడు సాంబయ్య.


వాడిపోయిన సాంబయ్య మొహం చూసి, "నీళ్ళు నములుతున్నావెందుకు? చేతులు నులుపుకుంటావెందుకు? ఏం జరిగిందో వివరంగా చెప్పు? నీవల్ల కాకపోతే చెప్పు, నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్తాను." పళ్ళు నూరుతూ చెప్పాడు గంగారాం.


ఒక్కక్షణం తర్వాత నోరు విప్పాడు సాంబయ్య.


"అన్నా!...కోటేశ్వర్రావు కూతురు వెంటపడిన అల్లరి ప్రేమికుడు మరెవరో కాదన్నా...మీ అబ్బాయి కోటిగాడే!" నసుగుతూ చెప్పాడు సాంబయ్య తన వెనకే తలవంచుకొని నిలబడిన కోటిని, ఐశ్వర్యని చూపిస్తూ.


వాళ్ళిద్దర్నీ చూడగానే కంగుతిన్నాడు గంగారాం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, కోటి ఎవరో తెలియక వాడికి బుద్ధిచెప్పే పని కోటేశ్వర్రావు తనకే అప్పచెప్పాడని బోధపడింది గంగారాంకి. ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకున్నాడు గంగారాం.


ఇదే అదుననుకొని, పెద్దవాళ్ళతో మనకి పనేమిటని అక్కణ్ణుంచి ఉడాయించారు ఆ అల్లరి ప్రేమికులిద్దరూ.


సాయంకాలనికల్లా గుళ్ళో పెళ్ళి చేసుకొని, మెళ్ళో దండలతో తన ముందుకు వచ్చిన ఆ జంటను ఆశీర్వదించక తప్పలేదు గంగారాంకు. కోటేశ్వర్రావుకి ఏం సమాధానం చెప్పాలా అని అలోచించుకోసాగాడు. 


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


39 views0 comments

Comments


bottom of page