top of page
Writer's pictureBVD Prasada Rao

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 7


'Amavasya Vennela - Episode 7 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.


నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది.


చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.


మాజీ రూమ్ మేట్ వెంకట్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని తెలిసి పరామర్శిస్తాడు.


పార్వతమ్మకు తన గతం చెబుతాడు శ్రీరమణ.

చంద్రికను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళతారు. ఆమె తొందరగా రికవర్ అవుతోందని చెబుతారు డాక్టర్..


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 7 చదవండి.

టాక్సీ స్టాండ్ లో ఉండగా.. శ్రీరమణ ఫోన్ మోగుతుంది.

కాల్ నెంబర్ చూస్తూ..

'మధుసూదన్ సార్.' అనుకున్నాడు.

కాల్ కు కనెక్ట్ ఐ.. "హలో సార్." అన్నాడు.


"రమణ.. ఇంటికి రాగలవా." అటు మధుసూదన్ చెప్పాడు.


"తప్పక సార్. ఇప్పుడే బయలు దేరి వస్తాను." చెప్పేసాడు శ్రీరమణ.


కాల్ కట్ చేసేసి.. కారును అటు పోనిచ్చాడు.

పది నిముషాలు పిదప..

ఆ ఇంటి ముందు కారు ఆపాడు. ఆ ఇంటి డోర్ బెల్ నొక్కాడు.

తలుపు తీసింది ఒక యువతి.. సాగర.

ఆమెనే చూస్తూ ఉండిపోయాడు శ్రీరమణ.


***

"నీకు జాబ్ ఇస్తే.. నాకేంటి." వెకిలిగా నవ్వుతున్నాడు కామేశం.

జాబ్ కై వచ్చిన ఆమె గుబులవుతుంది.

అయోమయంగా అతడ్నే చూస్తుంది.


"మాట్లాడు. చెప్పు. నేను ఇచ్చే జాబ్ తో నెల నెల నాలుగు అంకెల జీతం దొబ్బుతావు. మరి అది ఇచ్చే నాకు ఏంటి. మరి నాకు ఒక మారే ముట్ట చెప్పుకుంటే ఉభయలకు ఇచ్చిపుచ్చుకొనేలా ఉంటుంది." ఇంకా అలానే నవ్వుతున్నాడు కామేశం.


అతడి ఎదురుగా కూర్చుని ఉన్న ఆమె కూడా ఇంకా అలానే అతడ్ని చూస్తుంది.

"అంత నంగనాచి చూపులు ఎందుకులే. నీకు నేను అంటుంది అర్ధమైందిలే. బెట్టు వద్దు." అన్నాడు కామేశం. ఈ మారు ఆమె వైపుకు తన కుడి చేతిని చాపాడు.


అప్పుడే.. ఆమె లేచి నిల్చుండిపోయింది.

"నేనేమీ ఇచ్చుకోలేను." అనేసింది.


"ఐతే నీకు నేను జాబ్ ఇవ్వలేను." టక్కున చెప్పేసాడు కామేశం.


ఆమె తంటాలు పడుతుంది.

కామేశం మంకుగా ప్రవర్తిస్తున్నాడు.

"చూడమ్మాయి. నువ్వు ఇంటర్వ్యూ బాగా చేయలేదు. ఫో." చివరికి అనేసాడు.


ఆమె చిన్నగా ఏడ్చుకుంటూ బయటికి నడిచింది.

కామేశం నోటిని గుండ్రంగా చేసి.. 'హుష్' అన్నాడు.


***

ఇంటి ముందల కారును చూస్తూ..

"రమణ" అంది సాగర. తను చిన్నగా నవ్వుతుంది.


రమణ తలాడించాడు.

"డాడీ.. ద కార్ ఏజ్ ఎరైవ్డ్." అంది సాగర.. ఇంట్లోకి చూస్తూ.


అర నిముషం లోపే మధుసూదన్ అక్కడికి వచ్చాడు.

"నమస్కారం సార్." అన్నాడు శ్రీరమణ.. రెండు అర చేతుల్ని జోడించి.


"హలో రమణ." పలకరించాడు మధుసూదన్.

ఆ వెంబడే..

"ఈమె నా కూతురు.. సాగర. డిల్లీలో మెడికల్ కోర్స్ చదువుతుంది. సెలవులతో వచ్చింది. నెల రోజులు ఉంటుంది. స్కూటీ వచ్చు. కారు డ్రయివింగ్ నేర్చుకో తలుస్తుంది. డ్రయివింగ్ స్కూల్లో పెట్టే కంటే.. నీకు అప్పగిస్తే బాగుంటుందని నిన్ను ఇలా రమ్మన్నాను." టకటకా చెప్పేసాడు మధుసూదన్.


శ్రీరమణ విన్నాడు.


"నీ డ్రయివింగ్ బాగుంది. నువ్వే నేర్వాలి. పేమెంట్ లో లోటు రానీయను. నువ్వు ఎంతంటే అంతే." చెప్పాడు మధుసూదన్.

శ్రీరమణ ఏదో చెప్పేలోగానే..

అక్కడికి మధుసూదన్ భార్య లక్ష్మి వచ్చింది.


"రమణ.. నువ్వు ఎరిగిన వాడివి. మంచోడివి. సో. అమ్మాయికి నువ్వు కారు డ్రయివింగ్ నేర్పి తీరాలి." ఆర్డర్ లా అనేసింది.


శ్రీరమణ మాట్లాడలేక పోయాడు.

"నువ్వు ఉన్నావనే.. అమ్మాయి డిల్లీలో నేర్చుకుంటానంటే వద్దన్నాం." చెప్పింది లక్ష్మి.


"ఈ రోజు మంచిది. ఈ రోజు నుండే నేర్పడం మొదలెట్టేసి." చెప్పాడు మధుసూదన్.


శ్రీరమణ మరి తప్పదనుకున్నాడు.

"సరే" అనేసాడు.


"నీకు ఇంగ్లీష్ వచ్చుగా." అడిగింది లక్ష్మి.


"రాదు మేడమ్." బిడియ పడ్డాడు శ్రీరమణ.


"లేదులే. అమ్మాయి మాట్లాడ లేదు కానీ.. తెలుగు మాటలు అర్థం చేసుకుంటుంది." తేలిక పరిచాడు మధుసూదన్.


ఆ వెంబడే..

సారికను చూస్తూ..

"హి డస్నాట్ స్పీక్ ఇంగ్లీష్. హి స్పీక్స్ ఇన్ తెలుగు. యు అండర్స్టాండ్ స్లోలి. హి ఈజ్ ఎ గుడ్ స్కిల్. సో లెర్న్ ఫ్రమ్ హిమ్. సిన్స్ ఇట్ ఈజ్ ప్రాక్టికల్, యు కెన్ లెర్న్ ఇట్. ఓకే." చెప్పాడు.


'సరే' అన్నట్టు తలాడించింది సారిక.


టైమింగ్స్ చెప్పి.. "ఆ టైమింగ్స్ లో నువ్వు వస్తూ.. తనకు నేర్పు. పేమెంట్.. సర్ నీ ఇష్టమే అన్నారుగా. సరేనా." అంది లక్ష్మి.


"సరే మేడమ్." ఒప్పేసుకున్నాడు శ్రీరమణ.


సారికను తోడ్చుకొని కారు వైపు కదిలాడు.


***

రెండు రోజుల పిమ్మట..

శ్రీరమణకి ఫోన్ చేస్తున్నాడు అబ్దుల్.

రింగ్ అవుతున్న ఫోన్ ని జేబు లోంచి తీసుకున్నాడు శ్రీరమణ.

ఆ కాల్ కు కనెక్ట్ ఐ.. "హలో" అన్నాడు.


"రమణ.. కిరాయిలో ఉన్నావా." అడిగాడు అబ్దుల్.


"అవునన్నా." చెప్పాడు శ్రీరమణ.


"నువ్వు ఖాళీ అయ్యేక చెప్పనా. లేదా ఇప్పుడు మాట్లాడ వచ్చా." అడిగాడు అబ్దుల్.


"అర్జంట్ కాకపోతే.. ఈ కిరాయి దించేక.. నేనే కాల్ చేస్తాను." చెప్పాడు శ్రీరమణ.


"సరే. నీకు ఖాళీ అయ్యేకనే మాట్లాడదాం. కానీ మర్చిపోకు." చెప్పాడు అబ్దుల్.


"అరె. అలా కాదులే అన్నా." అనేసాడు శ్రీరమణ.


ఆ కాల్ ను కట్ చేసేసాడు అబ్దుల్.

అతడు టాక్సీ స్టాండ్ లో తన కారు చెంత ఉన్నాడు.

పక్కనే తన కారు వద్ద ఉన్నాడు కాశిం.

"రమణ బాయ్ ఏమంటాడో." అన్నాడు అబ్దుల్.. కాశింతో.


"అడిగి చూడు." చెప్పాడు కాశిం.


ఆ వెంబడే..

"అతడికి ఆ యాక్సిడెంట్ తో ఖర్చులు పెరిగాయి. ఐనా సర్దగలడేమో అడుగు." అన్నాడు.


"అర్జంట్ గా వెయ్యి కావాలి." నసిగాడు అబ్దుల్.


ఆ వెంబడే..

"గిరాకీలు అంతంతై పోతున్నాయి. ఇది వరకులా కిరాయిలు కుదరడం లేదు." చెప్పాడు.


దానికి కాశిం ఏమీ అనక.. "రా. టీ తాగుదాం." అన్నాడు.


ఆ ఇద్దరూ టీ కై కదిలారు.

పావుగంట గడుస్తుండగా..

శ్రీరమణ కాల్ చేసాడు.. అబ్దుల్ కు.

ఆ కాల్ కు కనెక్ట్ అవుతూనే.. 'రమణ బాయ్.' అన్నాడు కాశింతో.


"మాట్లాడు." చెప్పుతున్నాడు కాశిం.


"హలో బాయ్." అన్నాడు అబ్దుల్.


"చెప్పు అన్న. ఏమిటి." అడిగాడు శ్రీరమణ అటు నుండి.


"బాయ్.. పిల్లగాడికి స్కూల్ ఫీజ్ కట్టాలి. వెయ్యి సర్దవా. ఇక మీదిటి అందే ప్రతి కిరాయి కట్టి తొందరిగా తీర్చేస్తాను." చెప్పేసాడు అబ్దుల్.


"వెయ్యా. అలానే." అనేసాడు శ్రీరమణ.


"పర్వాలేదుగా బాయ్. నువ్వు కష్టం కావుగా." అడిగాడు అబ్దుల్.


"లేదన్నా. కారు డ్రయివింగ్ నేర్పే అవకాశం కుదిరింది. వాళ్ల ఇచ్చిన అడ్వాన్స్ సొమ్ము ఉందిలే." చెప్పాడు శ్రీరమణ.


"సంతోషం బాయ్. నేనూ త్వరత్వరగానే తీర్చేస్తాను." చెప్పాడు అబ్దుల్.


"స్టాండ్ కు వచ్చేక ఇస్తాను." చెప్పాడు శ్రీరమణ.


"బాయ్.. ఇప్పుడే గూగుల్ పే చేయవా. అలా ఐతే.. ఇలా స్కూలుకు పోయి కట్టేస్తాను. ఇప్పటికే టైం మించింది. పిల్లాడు అవస్థవుతున్నాడు." చెప్పాడు అబ్దుల్ ఆత్రంగా.


'సరే' అనేసాడు శ్రీరమణ.


***

"ఇది వరకటిలా బట్టలు కుట్టి సమయానికి ఇవ్వడం లేదు." చిరాకవుతుంది తులసమ్మ.


"చెప్పాగా అమ్మా. మా అమ్మాయికి బాగోక పనిలో జల్దీ తప్పిందని." నొచ్చుకుంటుంది సావిత్రి.


"మా అమ్మాయి పెళ్లి. మా ఇంటి బట్టలు నువ్వు కుట్టి పెడతావని వచ్చా. పైగా నువ్వు బాగా కుట్టి పెడతావు." ఆగింది తులసమ్మ.


"పెళ్లి ఎప్పుడమ్మా. నేనప్పటికి మీ బట్టలు తప్పక అందిస్తాను. పని ఇవ్వండమ్మా." వేడుకుంటుంది సావిత్రి.


"నాగా ఉండ కూడదు. పది రోజుల్లో బట్టలు కుట్టి ఇచ్చేయాలి." కచ్చితంగా మాట్లాడుతుంది తులసమ్మ.


"తప్పక అమ్మా. రాత్రులు కూడా కూర్చుంటాను. సకాలంగానే ముట్ట చెప్పుతాను." చెప్పింది సావిత్రి.


"పనిమంతురాలువని నిన్ను వదులుకోలేక పోతున్నా. కుట్టవలసినవి మొత్తం పాతిక శాల్తీలు వరకు ఉన్నాయి. సాయంకాలం ఇంటికి రా. కుట్ట వలసినవి అప్పగిస్తాను." చెప్పి.. తులసమ్మ వెళ్లి పోయింది.


"ఈ పని సక్రమంగా కానివ్వాలి. కొంత సొమ్ము సర్దుబాటు అవుతుంది." అనుకుంటున్నట్టుగానే బయటికే అనేసింది సావిత్రి.


అప్పుడే ఇంద్రజ.. "నేను సాయ పడతాలే." అంది.


"అంతకంటెనా." కుదురవుతుంది సావిత్రి.


ఆ వెంబడే..

"అక్క మంచాన పడడం గుర్తిస్తున్నావు. నువ్వు ఆసరాగా మారుతున్నావు." అనేసింది సావిత్రి.


ఇంద్రజ ఏమీ అనలేదు.


***

పక్షం గడిచింది.

మధుసూదన్ ఇంటి డోర్ బెల్ నొక్కాడు శ్రీరమణ.

సాగర తలుపు తీసింది.

"ఐ థాట్ ఇట్ వజ్ యు. యువర్ టైం ఈజ్ టైం." మెత్తగా నవ్వింది.


సాగరతో ఒబ్బిడిగా మెసులుకుంటున్నాడు శ్రీరమణ.

తనను తన శ్రేయోభిలాషి కూతురుగా గౌరవిస్తున్నాడు.

చిన్నగా నవ్వేసి.. "వెళ్దామా అండీ." అన్నాడు.


"హేయ్. వెర్ ఇంగ్లీష్. యు షుడ్ టాక్ టు మి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్," గలగలా చెప్పింది సాగర.


========================================================================

ఇంకా వుంది..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









120 views0 comments

Comments


bottom of page