top of page

ఆమె హృదయం... !

Updated: Dec 22, 2023

ఆమె హృదయం... ! (లోపలి కథ)


'Ame Hrudayam' - New Telugu Story Written By Undavilli M

Published In manatelugukathalu.com On 20/12/2023

'ఆమె హృదయం' తెలుగు కథ

రచన: ఉండవిల్లి.ఎమ్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సెలయేటి మీద వెన్నెల తెల్లగా కురుస్తుంది... ఆమెలో ఎంతకీ తెగని భావధార... చెరగని ముద్రల్లా… సుదీర్ఘ జ్ఞాపకంలా... రెప్పల మాటున కన్నీరు చూపును మసక చేస్తూ,  దృశ్యాలు కమ్ముకు పోతుంటే…,  ఆమె అతని ధ్యానం లోకి వెళ్ళిపోయింది. 


 "అనంత ఆలోచన్లు దేనికీ!?" గుండెను కుదుపుతూ ఆ స్వరం ఆమెను తాకింది. ఆమె శరవేగంగా అతని కళ్ళలోకి చూసింది. 


 వలయాలు వలయాలుగా మాయా కాంతేదో ఆమెని చుట్టేసినట్టు ఒక ఉద్విగ్నానికి లోనయింది!


 "నీ మనసు స్పర్శ లేని నన్ను ఊహించుకోలేను!! ఇద్దరికీ ఉన్న దూరాన్ని చిదిమేయాలని ఉంది" ఆర్తిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది. 


 "అనుబంధ రాహిత్యమనే దాహం లోంచి జ్ఞాపకాలు బైట పడేస్తాయి. అవి దేహానికి ఊపిర్లు పోస్తాయి కదా!" అన్నాడతను. 


 "కాలమంతా ఇలా స్వప్నించలేను" చెంపలపై ధారల్ని కారుస్తూ చెప్పింది. 


 "నీ మనసు దృఢం లేక!చరాచర ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలకి ఒరిగిపోతున్నావ్!" అన్నాడతను. 


 "అవును,  సహజమైన ప్రేమోద్వేగానికే లోనవుతున్నాను" సూటిగా చూస్తూ అంది ఆమె. 


 "ప్రేమైక ధారగా లిప్తపాటు కాలం బతికిన చాలు,  కాలంలోకి స్మృతుల్ని మోసుకుంటూ సాగిపోవడానికి"   అతనన్నాడు. 


 "ఆ కాలమే జ్ఞప్తికి వస్తూ,   మనసు దగ్ధమవుతూ,  నీటి తెరలై విడుస్తుంది" కరిగిపోతున్న మనసుతో అంది ఆమె. 


 "బుగ్గయ్యే దేహం కోసం బ్రమలో జీవించే కన్నా,  మనసుతో గడిపిన గుర్తుల్ని జీవించినంత కాలం అనుభూతులుగా ఆస్వాదించాలి" అన్నాడు. 


 "మరువలేని అభౌతిక స్మృతి,  దేహమున్నంత సేపూ ఎప్పుడూ పచ్చగా చిగురిస్తూనే ఉంటుంది!" అంది ఆమె. 


 "దేహంతో అన్నీ శుస్కించుకు పోతాయి. ఐనా,   ఈ దేహం ఉన్నంత సేపూ మనసున పట్టి మాయలా మురిపిస్తుంది" అన్నాడు. 


 "ఈ బంధం నన్ను చుట్టుకుని,   ఈ భౌతిక ప్రపంచంలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది!" అందామె. 


 "జ్ఞాపకాల అనుభూతుల్ని స్వప్నిస్తూనే లౌకికంలో కల్సిపోవాలి!" అన్నాడతను. 


 "ఇప్పుడు!ఇద్దరం కలవని దూరాలం,   అదే కదా దానర్ధం!" అంది ఆమె. 


 అతని నేత్రాలు నీటితో నిండిపోయాయి!


 సెలయేటి వంతెన మీంచి అలానే నీట్లోకి తొంగి చూస్తుంది ఆమె,  పైనంతా వెన్నెల…


 నీటిమయమైన అతను ఆ సెలయేటి వెన్నెల్లో కనుమరుగయ్యాడు!


 ఆమె కళ్ళను తుడుచుకుంది. అతని జాడల్ని తనలోకి మోసుకుంటూ,  ఆలోచన్ల సంద్రమై అతీతంలోకి ఒలిగిపోతూ…

 ౼౼౼౼౼

ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్

ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి. 

'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. 

 నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 


చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి. 

 అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం! 


1件のコメント


Surekha Arunkumar
Surekha Arunkumar
2023年12月20日

ఎంతో గూడార్థం కల్గిన కథాంశం.. గుడ్.

いいね!
bottom of page