#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #అమెరికామోజు, #AmericaMoju, #TeluguSpecialArticle, #NRI
America Moju - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 11/11/2024
అమెరికా మోజు - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడినవారు తిరిగి ఇండియా రారు. రావలసిన అవసరమూ లేదు. తల్లి తండ్రి ఉన్నంతవరకే. అదీ ఆరోజుల్లో పెద్దకుటుంబాలు కనుక ఒకరు విదేశాలకు వెళ్లినా, పెద్దవాళ్ళను చూసుకోడానికి ఎవరో ఒకరు ఉండేవారు. అలాంటివారు అసలు వచ్చేవారుకాదు. ఇప్పుడు ఒకరో ఇద్దరో కనుక ఆర్ధికంగా బాగా సంపాదించడం వలన చదువుకోవడం ఉద్యోగాలు చేయడం వల్లనూ సులువుగా తల్లి తండ్రులే వెళ్లి వస్తున్నారు. ఇష్టం ఐతే సిటిజెన్ షిప్ తీసుకుంటున్నారు.
ఇంతవరకూ సజావుగా గడిచిపొఇన్ది. కోవిడ్ వచ్చాక అన్ని దేశాల్లోనూ పరిస్థితి తారుమారు అయ్యింది. విదేశాలకు వెళ్లేవారి సంఖ్యా పెరిగింది. కానీ వీరికి అక్కడ జాబ్ లేదు. వీసాలు రావు. ఇప్పుడు వెళ్ళినందువల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇక్కడ చేస్తున్న వుద్యోగం వదిలిపెట్టి మరీ వెళ్లిపోవడం తెలివితక్కువ కాదా ?
అమెరికాలో ఉద్యోగాలు లేవు. ఉన్నవారినే తొలగిస్తున్నారు. కారణం ఏమంటే మాన్ పవర్ కంటే ఆటోమేషన్ రోబో టెక్నాలజీ ఇంప్రూ అయ్యింది. ఖర్చుతక్కువ. ఎక్కువ పనిచేస్తాయి. వాటి వాడకం పెరిగింది. కొన్ని కంపెనీలో పనిచేసే వారికంటే సగం రోబోలే వున్నాయి. వాల్మార్ట్ లాంటి చోట చిన్న ఉద్యోగాలు కూడా రావడంలేదు. రెస్టారెంట్స్ సినిమా థియేటర్లు చాలా మూతపడ్డాయి. పిల్లలతో వుండే కుటుంబాలకు తీరని ఇబ్బందులు వచ్చాయి.
ఇక తల్లి తండ్రులను ఏమి తీసుకెడతారు? అంతేకాదు. వీసాలు కూడా ఇవ్వడంలేదు. వీలైనంత డిలే చేస్తున్నారు. ఇరుకు అపార్టుమెంటలలో ఆరు ఎనిమిది మంది ఉంటూ కష్టం మీద రోజులు గడుపుతున్నారు. నిజమే. కొన్ని సదుపాయాలు భారత్ కంటే ఎక్కువగా వున్నాయి. అవేమి వూరికే రావు. డబ్బుతోనే వస్తాయి. ఎన్నో ఏళ్లుగా స్థిరపడిన వారే జాగ్రత్తగా వున్నారు. తల్లితండ్రులు వెళ్లి వారికి బరువు కాలేరు.
భారత్ లోనే హైదరాబాద్ నగరం ఉపాధి కల్పనకు కేంద్రంగా వుంది. ఏదో ఒక జాబ్ రాకపోదు. అసలే క్వాలిటీ లేని చదువులు. గతంలో అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు, వీసా వున్నవారు కూడా అతి తక్కువ పే మెంటుకి లేబర్ వర్క్ చేసే ఈ రోజుల్లో కొత్తగా వెళ్లి అగచాట్లు పడవలసిన అవసరం ఏముంది?
ట్రంప్ మళ్ళీ వచ్చారు. వీసాలు ఇంకా కఠినతరం చేస్తాడు. అక్కడ వుండే వారు మనవారిని చూసి మన ఉద్యోగాలు పోగొట్టే శత్రువులుగా భావించి అటాక్ చేస్తుంటే ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబాలకు తీరని లోటు చేస్తున్నారు. అంతకంటే వెనక్కి రావడం మంచిది. ఈ రోజు అమెరికా స్వర్గం కాదు. బలిపీఠం. సదుపాయాలు మన భారత్లోనూ వున్నాయి. భవిష్యత్తు బాగుంది. పిల్లలను చక్కగా పెంచవచ్చు.
నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు అమెరికాలో సిటిజెన్ అయినా అక్కడి ఆకర్షణలకు చెడిపోతారని ఇండియా వచ్చి పిల్లల ఇష్టం మీద వాళ్ళను మాత్రమే పంపుతున్నారు. వాళ్ళు తిరిగి ఎప్పుడైనా రావచ్చు. లేదా అక్కడే ఉండనే వచ్చు. కానీ వాళ్లకి పెళ్లి కష్టం అవుతోంది. ఇక్కడ ఇమడలేరు. అక్కడ ఎవరిని నమ్మలేరు. వయసు దాటి ఒంటరిగా మిగిలి పోతున్నారు. అంటే అటూ కాకుండా పోతున్నారు. అక్కడి తల్లి తండ్రి పరిస్థితి ఇలా వుంది. ఇవన్నీ చూస్తుంటే అమెరికా మోజు కూడదు అనే చెప్పాలి. వున్నా చోటే ఎదగండి.
స్వదేశాన్ని తీర్చి దిద్దండి. కొత్త ట్రెండును సృష్టించండి. ఆదర్శంగా నిలవండి. తల్లి తండ్రులను అనాధలుగా చేయకండి. మీరు ఆనందంగా ఉండాలి. మీ అమ్మా - నాన్నలను సంతోషంగా ఉంచండి. ఇది నేటి యువత బాధ్యత. ముఫై ఏళ్ళు అమెరికా లైఫ్ చూసి అక్కడ వుండే అనుభవం నాది. ఎన్నో వున్నాయి బాధలు.
అందరికి ఒకేలాంటి జీవితం లభించదు. ఉన్నచోటే సుఖ పడండి! ఒయాసిస్సుల వెంట పరుగులు పెడితే చివరకు మిగిలేది శూన్యమే!
********
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
コメント