top of page
Writer's pictureParimala Kalyan

అమ్మ బాట

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Amma Bata' - New Telugu Story By written by Parimala Kalyan

రచన: పరిమళ కళ్యాణ్


"ఇంకెందుకు నేను బ్రతికి ఉండటం, నాకు ఆత్మహత్యే శరణ్యం. ఒరేయ్ కన్నా.. నువ్వు ఈ లోకంలోకి రాక ముందే నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాను రా. క్షమించరా కన్నా, ఈ చేతగాని తల్లిని!" అంటూ బాధతో కడుపులో ఉన్న బిడ్డని తలచుకుంటూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ, రైలు వస్తున్న వైపుగా వెళ్తూ ఉంది రాధిక.


రాధిక, గౌతమ్ ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఒకే టీం లో వర్క్ అవ్వటం తో ఇద్దరి మధ్యా చనువు ఏర్పడింది. ఆ చనువు స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఆరు నెలలు గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు.


అదే విషయం ఇంట్లో చెప్పింది రాధిక. రాధిక తల్లి పద్మావతి ఒప్పుకోలేదు. ప్రేమ వివాహానికి ఆమె పూర్తి వ్యతిరేకి. రాధిక తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడు. రాధికకి అమ్మ మీద నమ్మకం ఎక్కువే అయినా, గౌతమ్ విషయంలో మాత్రం అమ్మ మాట లెక్కచేయ్యలేదు.


"నేను చెప్పేది అర్థం చేసుకో రాధికా, పైకి కనిపించే మనిషే మనిషి కాదు. లోపల మనకి తెలియని ఇంకో కోణం కూడా ఉంటుంది. అది బాగా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే బయట పడుతుంది. నువ్వు గౌతమ్ ని పూర్తిగా తెలుసుకోలేదని నా అనుమానం. అందుకే ఇప్పుడే ఈ పెళ్ళి వద్దు అంటున్నాను. నీ భవిష్యత్తు ఆలోచించే చెప్తున్నాను!" అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది పద్మావతి.


ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా తలకెక్కదు అంటారు కదా అలా, రాధిక గౌతమ్ ని గుడ్డిగా నమ్మింది. అమ్మ మాటలకి కోపంగా,


"అవును. ప్రతి మనిషిలో మనకి కనపడని ఇంకో కోణం ఉంటుంది, నీలో నాకు తెలియని కోణం ఇప్పుడు చూస్తున్నాను. నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని, నా జీతం కూడా నీకు రాదని ఆలోచిస్తున్నావు. అందుకే నన్ను పెళ్ళి చేసుకోవద్దని అంటున్నావు. నువ్వు వద్దన్నా కానీ నేను గౌతమ్ నే పెళ్ళి చేసుకుంటా!" అంటూ ఇంట్లో నుంచీ వెళ్ళిపోయింది.


సరాసరి గౌతమ్ రూమ్ కి వెళ్ళింది. గౌతమ్ లేడు, తన రూమ్మేట్ ని అడిగితే గౌతమ్ ముంబై ప్రయాణంలో ఉన్నాడని తెలిసింది. అంతేకాదు ఏదో లెటర్ కూడా ఇచ్చాడు. ముంబై నుంచీ మంచి ఆఫర్ రావటంతో గౌతమ్ అక్కడకి వెళ్తున్నట్టు, అలాగే అన్నిటికీ నస పెట్టే రాధికని వదిలించుకుని మరీ వెళ్తున్నట్టు ఆ లెటర్ చదివిన రాధికకి అర్థమైంది. హఠాత్తుగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యి, పడిపోయింది రాధిక.


గౌతమ్ రూమ్మేట్ కాశీ వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లగా, రాధిక తల్లి కాబోతున్న విషయం తెలిసింది. కాశీ వెంటనే గౌతమ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. గౌతమ్ మాత్రం అసలు తనకి ఏ మాత్రం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి ఫోన్ కట్ చేసాడు.


గౌతమ్ గురించీ అర్థమైన రాధిక వెంటనే అక్కడినుంచి వచ్చేసింది. చనిపోవాలని నిర్ణయించుకుని రైలు పట్టాల మీదకి వెళ్ళింది.



అంతలో వెనుక నుంచీ ఒక చెయ్యి తనని ఆపింది. వెనక్కి చూసిన రాధిక తన తల్లి పద్మావతి ని చూసి కన్నీరు మున్నీరయ్యింది.



"అమ్మా నన్ను క్షమించమ్మా. నువ్వు ముందే చెప్పావు అతని గురించీ.. కానీ నేనే నీ మాట వినలేదు. నాకు తగిన శాస్తి జరిగింది. నేను బ్రతికి లాభం లేదు. నన్ను చనిపోనీ అమ్మా!" అంది ఏడుస్తూ.


"పిచ్చిదానా! ఎవరు నిన్ను కాదనుకున్నా ఈ అమ్మ మాత్రం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది తల్లీ. *జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా ఒక్కటి మాత్రం మిగిలే ఉంటుంది.... అదే భవిష్యత్తు*. నీ భవిష్యత్తునీ, ఇంకా నీ బిడ్డ భవిష్యత్తు ని కూడా పాడు చేస్తావా?


చూడు రాధికా, *భగవంతుడు దేనికోసం సృష్టించాడో! అది నెరవేర్చకుండా అర్థాంతరంగా వెళ్ళిపోకూడదు.!* నన్ను చూసి నేర్చుకో. ఒకప్పుడు నేను కూడా మీ నాన్న కోసం ఇలాగే ఏడ్చాను. చనిపోదామని కూడా అనుకున్నాను. కానీ కడుపులో నువ్వున్న సంగతి గుర్తొచ్చి, నీకోసం నేను ఒంటరి పోరాటం చేశాను. అందరూ అనుకున్నట్టుగా, నీకు తెలిసినట్టుగా మీ నాన్న నీ చిన్నప్పుడే చనిపోలేదు. నన్ను మోసం చేసి, నీ గురించీ తెలియగానే పారిపోయాడు. కానీ నీ కోసం నీ భవిష్యత్తు నాలాగా కాకూడదు అని ఎంతో కష్టపడి నిన్ను చదివించాను, ఈ స్థితిలోకి తీసుకుని రాగలిగాను. కానీ ఇప్పుడీ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఏదేమైనా జరిగిందంతా మర్చిపో, రేపటినుంచి కొత్తగా జీవితాన్ని ప్రారంభించు. ఈ అమ్మ నీ తోడుగా ఉంటుందని మాత్రం మర్చిపోకు. నీ కోసమే నేను బ్రతుకుతున్నది. నన్ను ఒంటరి దాన్ని చెయ్యకు రాధికా!" కళ్ళు తుడుచుకుంటూ తన గతాన్ని కూతురికి చెప్పి, దిశానిర్దేశం చేసింది.


"అమ్మా! ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఇప్పటివరకు నాకూ తెలియకుండా దాచి పెట్టావేమ్మా?" కన్నీరు తుడుచుకుని అమ్మని అడిగింది రాధిక.


"నీకు చెప్పే సందర్భం వస్తే చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు వచ్చింది. అందుకే ఇక గౌతమ్ గురించీ వదిలేయ్. నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకో!" అంది పద్మావతి.


"తప్పకుండా అమ్మా. ఇకమీదట నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను, నేనూ నీ బాటలోనే నడిచి నాలాగా ఇంకెవ్వరూ బాధ పడకుండా ఉండేలా చేస్తాను. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించమ్మా!" అంటూ తల్లిని హత్తుకుంది.


** సమాప్తం **

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.


73 views0 comments

Comments


bottom of page