top of page

అమ్మ ఆశీస్సులు

Writer's picture: Ayyala Somayajula SubramanyamAyyala Somayajula Subramanyam

పాఠకులకు, రచయితలకు విజయదశమి శుభాకాంక్షలు

'Amma Asissulu' - New Telugu Poem Written By Ayyala Somayajula Subrahmanyam

Published In manatelugukathalu.com On 23/10/2023

'అమ్మ ఆశీస్సులు' తెలుగు కవిత

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


అమ్మ ఎలా వుంటుందని అడుగుతే

ఆ జగదంబ రూపాన్ని తేలికగా చూపవచ్చు. ఇది నిజం.

కనిపించే మన అమ్మ మరెవరో కాదు.స్పష్టంగా కల ఆ కనిపించిన

కుండా ఉన్న రూపమే.


రాత్రి ఎలా చిమ్మచీకటితో ఉంటుందో ఆ చీకటిలో

స్పష్టంగా కనిపించని రాక్షసులని

వధించింది జగదంబ.


మన అమ్మ కూడా కనేంతవరకూ

కూడా తనక్కూడా కనిపించని

ఆ గర్భంలోని క్రిములతో

కీటకాలతో పోరాడి, పోరాడి

ఆయా వ్యాధులు రాకుండా

తట్టుకునేలా చేసుకుని మనని

ప్రసవించింది కదా:


అందుకని ఆ జగదంబే మన అమ్మ

కూడా.


మన బాల్యంలో ఉన్నప్పుడు, చక్కగా తలంటి,కురులు దువ్వి

అలంకరించి ఆటలాడుకోడానికి

పంపించింది మన అమ్మ...


ఆ జగదంబ కూడా"బాలా

త్రిపురసుందరి".


బువ్వ పెట్టాక-చదువుకోవాలి

సుమా;అంటూ తగిన జాగ్రత్తలని

చెప్పి బడికి పంపించేది మన అమ్మ.

ఏ కష్టం వస్తే ఎలా ఎదురుకోవాలో

ఎవరెవరినుండి వేటివేటిని

నేర్చుకుని, మనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవాలో అనుభవం

మీద తెలుసుకోగలిగామంటే మన

అమ్మ చలవే కదా:మన మీద

మన ఇక్కడి అమ్మకి-వీడు/ఇది

నామాట వింటాడు/వింటుంది

అనే నమ్మకం కలిగాక మంచి

మాటలని చెబుతుంది.


ఇది మంచి-ఇది కాదు..

అంటూ జ్ఞాన బోధని చేసిందో, ఎన్ని

మెళుకువలని ఉపదేశించిందో

మనకి తెలుసు.


అమ్మని నమ్ముకుంటే చాలు.

తప్పక అనుకున్న ఫలితాన్ని

వరంగా అనుగ్రహించగలుగుతుంది.


కావున ఇలా ప్రతీ తల్లి తన సంతానాన్ని, పెంచి పెద్ద చేసి

నట్లయితే తాను జీవితంలో

"అపరాజిత "గా వుంటూ,మనం

ఓటమి పాలు గాకుండా ఉంటాం.


"అమ్మ వలన ఎన్ని నిజాలు,

గుణాలు, సుగుణాలు నేర్చుకున్నాం

'ఎంత గొప్ప నిజం, ఇది.

ఇవన్నీ అమ్మ ఆశీస్సులే కదా:

అంటే జగదంబ ఆశీస్సులే కదా;;


విజయదశమి శుభాకాంక్షలు

--‐అయ్యలసోమయాజుల

సుబ్రహ్మణ్యము &ఉదయసుందరి.

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







79 views0 comments

Comentários


bottom of page