#AyyalaSomayajulaSubrahmanyam, #అమ్మబహునామాలులలితాసహస్రం, #AmmaBahunlalithaSahasram, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము
'Amma Bahunlalitha Sahasram' - New Telugu Article Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/10/2024
'అమ్మ బహునామాలు లలితా సహస్రం' తెలుగు వ్యాసం
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
ఎవరైనా ఓ ప్రసిద్ధ వైద్యుడుంటే అనారోగ్యం వచ్చిన వ్యక్తికున్న ఆ వ్యాధి లక్షణాలన్నింటినీ శ్రద్ధగా గమనించి, ఒక్కో ఔషదం చొప్పున సిద్దం చేసి, అన్ని లక్షణాలు పూర్తిగా నయం కావడం కోసం ఓ ఔషదాన్ని సిద్దం చేస్తాడు.
అవును కదా: అమ్మ కూడా మనందరికీ నిత్య జీవితంలో వచ్చే సమస్యలెన్నున్నాయో, ఎన్ని ఉంటాయో ఎన్ని ఉండే వీలుందో గమనించి, ఆ సమస్య లన్నీ పూర్తి గా నివారింపబడేందుకు తానే "లలితా సహస్ర నామాలు "పేరిట ఓ వేయి నామాలని, తనతో నిత్యమూ ఉండే వాగ్ధేవతలు
ఎనమండుగురి ద్వారా సిద్ధపరచింది.పై ఉదాహరణలో తానే సిద్ద పరచిన ఔషదాన్ని ఆ వైద్యుడు ఎలా ఆ తీరు అనారోగ్యమున్న వ్యక్తి మీద ప్రయోగించి, ఆ ఔషదం పనిచేసిందని నిర్ణయించుకున్నాక లోకానికి విడుదల చేస్తీడో, సరిగ్గా అమ్మ కూడా, ఆ సహస్ర నామాలని
తానే స్వయంగా విని 'బాగుంది- లోకం లోని అందరికీ పని చేస్తాయి ' అని ధ్రువపరిచింది .
ఆ లలితాత్రిపురసుందరి రూపాలు "బాలాత్రిపురసుందరి పూర్ణ ఆయుష్షును, గాయత్రీదేవి యశస్సు, తేజస్సును- అన్నపూర్ణాదేవి ఆరోగ్యాన్ని, లలితాపరమ ఈశ్వరీ వైభవాలను, మహాచండి ధైర్యస్థైర్యాలను, శ్రీమహాలక్ష్మి-సర్వ సంపదలను, సరస్వతీదేవి-సకల విద్యలను, దుర్గాదేవి కీర్తిప్రతిష్ఠలను, మహీషాసూరమర్దని మనో వాంఛలను, రాజరాజేశ్వరీదేవి సమస్త విజయాలను- మనకందరకూ ప్రసాదించాలని ప్రార్థిస్తూ
"విజయదశమి శుభాకాంక్షలతో "
----------------------------------------------
అయ్యలసోమయాజుల
సుబ్రహ్మణ్యము మరియు
ఉదయసుందరి.
--------------‐--------------‐-----------------
Comments