#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaCheppinaNeethi, #అమ్మచెప్పిననీతి
Amma Cheppina Neethi - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 09/01/2025
అమ్మ చెప్పిన నీతి - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
చెరువుకు రక్షణ గట్టు
ప్రాణం పోయును చెట్టు
ఆత్మవిశ్వాసం మనిషి
విజయానికి తొలి మెట్టు
చీమలు నేర్పును పొదుపు
కలసి ఉంటేనే గెలుపు
చరిత్ర బాగా చదివిన
ఈ సత్యం మనకు తెలుపు
సంస్కారమిచ్చును చదువు
చదువులో మేలులు కలవు
విద్యాలయాలు మహిలో
విజ్ఞానానికి నెలవు
చెడు వ్యసనాలే చేటు
అభివృద్ధికవే పోటు
జీవితంలో ఎప్పుడూ
ఇవ్వకూడదోయ్! చోటు
-గద్వాల సోమన్న
సోమన్న గారి "అమ్మ చెప్పిన నీతి" కవిత బాగుంది .. చెట్ల సహాయం .. DOs & Don'ts of LIFE (మంచి - చెడు రెండూ ఇమిడ్చారు: .. అమ్మ పేరు చెప్పి .. EXCELLENT)
ఈ కవిత
..
ప్రతి మనిషి హృదయం లో అతుక్కు పోతుంది .. మరీ ఎక్కువగా .. అమ్మ చెబితే. ..
P V Padmavati Madhu Nivriti