top of page

అమ్మ చెప్పిన సూక్తులు

Writer: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #అమ్మచెప్పినసూక్తులు, #AmmaCheppinaSukthulu, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 44

Amma Cheppina Sukthulu - Somanna Gari Kavithalu Part 44 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 24/03/2025

అమ్మ చెప్పిన సూక్తులు - సోమన్న గారి కవితలు పార్ట్ 44 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అమ్మ చెప్పిన సూక్తులు

----------------------------------------

శ్రేష్టమైన యోచనలు

మిక్కిలి లాభకరములు

అందించు ఆశీస్సులు

బంధించు విఘ్నములు


పనికిమాలిన చేతలు

చూడ మురికి పేలికలు

ఆదిలోన వదిలితే!

జీవితాల్లో ప్రగతే!


మకిలమైన హృదయాలు

దయ్యాలకు నిలయాలు

పవిత్రమైతే గనుక

దేవునికి ఆలయాలు


వక్ర జనులతో పొత్తులు

అత్యంత ప్రమాదకరము

విలువలు లేని మనుషులు

సత్యానికి బహు దూరము
























పుస్తక నేస్తం!

----------------------------------------

ఆసక్తిని పెంచుకో

పుస్తకాలు పట్టుకో

విజ్ఞాన క్షేత్రంలో

అజ్ఞానం త్రుంచుకో


చదువు విలువ తెలుసుకో

సంస్కారం నేర్చుకో

విద్యావంతుడుగా

విజయ శిఖరం చేరుకో


పుస్తకాల ఒడిలోన

అక్షరాల మడిలోన

ఆనందం పొందుకో

గురుదేవుల గుడిలోన


పొత్తాలను చేర్చుకో

మిత్రులుగా చేసుకో

పుస్తకాల పఠనంలో

ఆహ్లాదం అందుకో


వెలలేనిది పుస్తకము

బలమైన ఆయుధము

అలవాటుగా మార్చుకో

అనునిత్యం చదువుకో















పూల సజ్జ పట్టుకుని..

----------------------------------------

సిగలోన కుసుమాలను

అందంగా పెట్టుకుని

చేతిలోన పూలసజ్జ

సుతారంగా పట్టుకుని


కొలనులోని కలువలకై

వంగింది కోయుటకై

కనువిందు చేయంగా

హృదయమే మురియంగా


అమ్మలాంటి లతాంగి

కోసింది వంగి వంగి

పూల సజ్జ నింపింది

మనసెంతో పొంగింది


మితిలేని మోదంతో

ఇంటి దారి పట్టింది

ఒక్కొక్కటి తీసి తీసి

పూదండలు అల్లింది


గుడికి బయలుదేరింది

దైవానికి మ్రోక్కింది

మాల ఒకటి తీసుకుని

మెడలోన వేసింది
















అన్నయ్య అభిలాష

----------------------------------------

చెల్లి నాకు ప్రాణము

దేవుని బహుమానము

తినిపిస్తా! ప్రేమగా

మారుతా! పాటగా


ఆడుతా! హాయిగా

చూస్తా! జాగ్రత్తగా

అమ్మ లేని లోటును

పూరిస్తా! అమ్మగా


ముద్దులొలుకు మా చెల్లి

విరబూసిన సిరిమల్లి

మా ఇంట్లో వెలసిన

బంగారు చిన తల్లి


పాపాయి సర్వస్వము

మా అందరి నేత్రము

చక్కగా చదవాలి

గొప్పగా ఎదగాలి























పూలసజ్జ పాపాయి!

----------------------------------------

పూలసజ్జ పూలసజ్జ

పరికించుము పూలసజ్జ

పాపాయి చేతిలోన

అందగించు పూలసజ్జ


ఒక చేతితో పట్టుకుని

పూలలెన్నో నింపుకుని

ఆకును గొడుగు రీతిని

చిట్టి తల్లి చేసుకుని


గంభీరంగా చూస్తూ

మందహాసం చేస్తూ

నడుచుకుంటూ వెళ్ళింది

దేవుని గుడి చేరింది


పూలాభిషేకంతో

దైవ సేవ చేసింది

భక్తి పొంగు మనసుతో

జన క్షేమం కోరింది


-గద్వాల సోమన్న


Comments


bottom of page