#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaHithabodhaGeethika, #అమ్మహితబోధగీతిక
Amma Hithabodha Geethika - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 08/01/2025
అమ్మ హిత బోధ గీతిక - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
సెలయేరుల పరుగుల్లా
మునుముందుకు సాగిపో!
ఉదయ కాల కిరణాల్లా
బ్రతుకులో దూసుకుపో!
పున్నమి నాటి వెన్నెల్లా
మనసుల్లో నిలిచిపో!
బడుగు వర్గాల పట్ల
వెన్నముద్దల్లా! కరిగిపో!
సజ్జనుల స్నేహంలో
పెద్దల సన్మార్గంలో
దివ్వెల్లా వెలిగిపో!
పువ్వుల్లా మారిపో!
కన్నవారి సేవలో
జన్మ సార్థకం చేసుకో!
గురుదేవుల బోధలో
నడవడి సరిదిద్దుకో!
మహనీయుల స్పూర్తితో
మంచి పనులు కీర్తితో
నలుగురికి ఆదర్శము
పొందుకో! ఆనందము
మనిషి జన్మ కడు శ్రేష్టము
ప్రతి నిమిషం అమూల్యము
చేసుకోరాదు వ్యర్థము
ఉండాలోయ్! పరమార్ధము
-గద్వాల సోమన్న
コメント