'Amma Kosam Eduruchupulu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 08/08/2024
'అమ్మ కోసం ఎదురుచూపులు' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఏం మావా? ఈయాల ఇంత పొద్దెక్కినా బేరానికి పోక ఇంకా తొంగున్నావే?” తన భర్తను నిద్రలేపుతూ అంది సుగుణ.
“ఉండవే. కూసింత తొంగోనీ ! మాంచి నిద్ర సెడగొట్టావే” అన్నాడు కాస్త చిరాకుగా జంగయ్య.
“సూడు మావా! రెక్కాడితే గానీ డొక్కాడని పానాలు మనవి. లేసి సూడు. సూరీడు ఎంత చిర్రుబుర్రులాడుతున్నాడో? బారెడు పొద్దెక్కినా ఇలా తొంగుంటే ఎలా మావా? ఈయేల గంజినీళ్లే పొయ్యాల మన ధరణికి”. అంది సుగుణ.
తనకు ప్రాణమైన కూతురి పేరు వినగానే నిద్రని విదిలించుకుని చెంగున లేచికూర్చున్నాడు జంగయ్య.
“ఛ! అలా ఎందుకు సేస్తనే! అది నా పానమే. నా బంగారు తల్లి ధరణిని నేను సక్కగా సూసుకుంటాను” అని లేచి తన కాలకృత్యాలు పూర్తిచేసుకుని కూర్చున్నాడు.
“ధరణీ! నా బంగారులచ్చిమి. రా “ పెద్దగా కేకేశాడు కూతురిని.
బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల ధరణి పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చి అతని ఒడిలో కూర్చుంది. కూతుర్ని చూసి మురిసిపోతున్న తన భర్త ముఖం చూసి సంతోషంతో ఉంది సుగుణ.
“అంతేలే మావా ! నీకు నా కంటే కూడా మన పిల్లే ముఖ్యమైంది “ అంది కూసింత అలుక వహిస్తూ.
“అదేంటే సుగుణా! అలా అంటావు? అది మన ఇంటి లచ్చిమి. మన వరాల తల్లి. ” అన్నాడు ధరణిని ముద్దుపెట్టుకుంటూ.
“సరదాగా అన్నాను మావా. నీకే గాదు అదంటే నాకూ పానమే. ” అంది నవ్వుతూ సుగుణ వేడివేడి గంజిపోసిన గ్లాసుని భర్త చేతికందిస్తూ.
ఆ గంజిని త్రాగి జంగయ్య కండువా తలకు చుట్టుకుని భార్యకి, కూతురికి చెప్పి బయటికి నడిచాడు. వాకిలి ముందు ఉన్న రిక్షాని తోలుకుని ఊళ్లో బేరాలకెళ్లాడు.
పగలంతా కష్టపడి రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బుతో తన భార్యను, పిల్లని ప్రేమగా చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
సుగుణ కూడా నాలుగిళ్లల్లో పనిచేసుకుంటూ వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా తన భర్తకు సాయంగా ఉంటోంది.
కొన్నాళ్లకు ధరణిని స్కూలులో చేర్చారు. ధరణి చక్కగా అక్షరాలు దిద్దుతోంది. రోజులు గడుస్తున్నాయి. స్వతహాగా తెలివితేటలు, చురుకైన పిల్ల అయిన ధరణి క్రమేపీ శ్రధ్ధగా చదువుకోవడం చూసి జంగయ్య, సుగుణలు చాలా సంతోషిస్తున్నారు. చూస్తూండగా ధరణి రెండవ తరగతిలోకి వచ్చింది.
ఒకనాడు జంగయ్యకు కామెర్లు సోకింది. గవర్నమెంటు హాస్పిటల్ లో చూపించుకుని మందులు వాడుతున్నాడు. కొన్నాళ్లకు అది తగ్గకపోగా మరింత ముదిరి పోయింది.
తను పనిచేసే అమ్మగార్ల వద్ద తన పరిస్థితిని చెప్పి వాళ్లని అప్పు అడిగింది సుగుణ. వాళ్లిచ్చిన డబ్బులుతో ప్రక్క ఊరిలో పెద్ద హాస్పిటల్ లో తన భర్తను చూపించి వైద్యంచేయించింది. కానీ ఫలితం దక్కలేదు. వారం రోజులు పోయాక దురదృష్టవశాత్తు జంగయ్య తనువుచాలించాడు. ఆ దారుణానికి సుగుణ, ధరణి కన్నీరుమున్నీరుగా విలపించారు. తర్వాత తనని తానే సంబాళించుకుని ధరణిని ఓదార్చి జరుగవలసిన కార్యక్రమాన్ని జరిపించింది సుగుణ.
కుటుంబ బాధ్యత పూర్తిగా సుగుణమీద పడింది. ఆమె ఇంకా కష్టపడి తన కూతుర్ని చక్కగా చదివించుకోవాలనే తలంపుతో ఉంది. రిక్షాని దాని యజమానికి అప్పగించింది. తను చేస్తున్న ఇళ్లు కాక ఇంకా రెండు ఇళ్లల్లో కూడ పనికి చేరింది సుగుణ. ధరణి చదువులో చక్కగా రాణిస్తోంది. తనకున్నంతలో కూతురికి ఏలోటూ లేకుండా చూసుకుంటోంది సుగుణ.
కాలం ఎల్లప్పుడూ ఒకటిగా ఉండదుకదా! తను పనిచేసే ఒక ఇంట్లో బంగారు హారం పోయింది. వాళ్ల బంధువులెవరో కాజేసి ఆ నేరాన్ని సుగుణ మీదకు నెట్టేశారు. సుగుణ తను తీయలేదని ఎంత చెప్పినా వాళ్లు నమ్మలేదు సరికదా ఆమెమీద పోలీసు కేసు పెట్టారు. పోలీసులు సుగుణను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
స్కూలు నుంచి వచ్చిన ధరణికి విషయం తెలిసి తన ఇంటి పక్కావిడను వెంటబెట్టుకుని పోలీసు స్టేషనుకు వెళ్లింది.
అక్కడ కటకటాల్లో ఉన్న తల్లిని చూసి ఏడ్చి తన తల్లిని విడిచిపెట్టమని దీనంగా పోలీసులను వేడుకుంది. వాళ్లు తమకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ల వద్దకు వెళ్లి చెప్పుకోమన్నారు.
వెంటనే ధరణి ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ల వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుని వాళ్లమ్మని విడిపించమని ప్రాధేయపడింది. కానీ నిర్దయగా వాళ్లు ధరణి చిన్నపిల్లని కూడా చూడకుండా గదమాయించి ఆమెని వెళ్లగొట్టారు.
ఈ ప్రపంచంలో డబ్బులకు లొంగనిదెవరు? ఆ యజమానులు ఇచ్చిన లంచంతో లాయరు వాదించి కోర్టులో సుగుణను దోషిగా నిరూపించాడు. పాపం సుగుణ వైపు అండగా వచ్చిన బీద లాయరు నిజాయితీగా వాదించినా ధనం ముందు నిజాయితీ గెలవలేకపోయింది. సుగుణకు ఆర్నెల్లు జైలుశిక్ష పడింది. విషయం విని ధరణి తన అమ్మ కోసం విలపిస్తూ జడ్జి గారిని దీనంగా వేడుకుంది. ఆయన ధరణిని ఓదార్చి, ధైర్యం చెప్పి బాలికల శరణాలయంలో ఉండేట్టు ఏర్పాటుచేశారు. అక్కడ ఆమె చదువుకూడా కొనసాగే ఏర్పాట్లు కూడా చేశారు జడ్జిగారు.
ధరణి ఆ శరణాలయంలో తలదాచుకుంటూ అక్కడే శ్రధ్ధగా చదువుకుంటోంది. తన అమ్మ విడుదల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది చిన్నారి ధరణి. ఆరోజు త్వరలో రావాలని ఆశిద్దాం.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
గత 5సం.. నుంచి “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో నేను కధలు వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు🙏.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Comments