#PittaGopi, #పిట్టగోపి, #అమ్మనాన్నఓఅద్భుతం, #AmmaNannaOAdbhutham, #TeluguKathalu, #తెలుగుకథలు
Amma Nanna O Adbhutham - New Telugu Story Written By - Pitta Gopi
Published In manatelugukathalu.com On 01/12/2024
అమ్మ నాన్న ఓ అద్భుతం - తెలుగు కథ
రచన: పిట్ట గోపి
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ అని విన్నాం కదా..! ఆ రెండక్షరాలే అమ్మ - నాన్న. ఈ అమ్మనాన్నలు ఉంటే వాళ్ళు పేదలైనా.. ధనికులైనా పిల్లలకు ఏ కష్టం రానీయరు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో ఆ పిల్లలు పెద్దైన వరకు తెలియదు. ఎందుకంటే..? పుస్తకాలు చదివి నేర్చుకున్నది కేవలం విజ్ణానం మాత్రమే. అలాగే ఒకరు చెప్పేది విని నేర్చుకున్నది కూడా పెద్దగా ఏమి ఉండదు. కష్టసుఖాలు ఎరగాలంటే మాత్రం ఖచ్చితంగా అనుభవం ఉండాలి. అనుభవం ఉండాలంటే ఏదైనా అనుభవించి తీరాల్సిందే. అప్పుడే అన్నీ ఉట్టిపడతాయ్. జీవితం అంటే ఏంటో.., కష్టసుఖాల్లో ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అనే విషయాలు తెలుస్తాయ్. మరి ఆ అనుభవం ఎలా వస్తుంది..? మనకు ఒక కుటుంబం ఉండాలి. దాన్ని మనమే నడిపించాలి. మనం తల్లిదండ్రులై ఉంటే మరింత మంచిది.
దేవుడు ప్రతి మనిషిని చూడలేక ప్రతి మనిషికి అమ్మ నాన్నలను సృష్టించాడు. ఆ అమ్మనాన్నలే మనల్ని దేవుడి కంటే గొప్పగా చూసుకుంటుంటారు.
నాన్న తనను తాను మరిచిపోయి భార్య, పిల్లల సంతోషమే లక్ష్యంగా తన జీవితాన్ని మనకు ధారపోస్తాడు. నాన్నకు విశ్రాంతి అంటూ ఎప్పుడూ ఉండదు. మనకు కనపడకుండా మన కోసం, మన సంతోషం కోసం పరితపించే ఏకైక వ్యక్తి నాన్న. నాన్న మనల్ని పట్టించుకోడని, పడుకునే టైంకి నాన్న రాడని, నిద్రలేచే సరికి నాన్న ఉండడని, అన్నీ తమకు అమ్మే చేస్తుందని చెబుతుంటాం. ఇక్కడే నాన్న త్యాగం మనకు అర్థం కావాలి. కానీ..! మనం నాన్న అయ్యే వరకు మనకు అర్థం కాదు. మనకు యుక్త వయసు వచ్చి వంద కిలోల బరువును అవలీలగా మోయగలిగే శక్తి ఉన్నా..! ఆ శక్తి నాన్న యాభై ఏళ్ళ వయసులో కూడా కుటుంబ బాధ్యత మోసే శక్తికి సరితూగదు.
నిజంగా నాన్న బలం ఎలాంటిదంటే ఒక ఇంటికి పునాది వంటిది. నాన్న లేని ఇల్లు పునాది లేని ఇల్లుతో సమానమే మరి.
ఇక అమ్మ అయితే నాన్న తెచ్చే సంపదనకు ఒక చెయ్యి అందిస్తూ.. మరో చేత్తో మనల్ని కంటికిరెప్పలా కాచుకుంటూ అటు భర్తకు ఇటు పిల్లలకు బానిసగా మారి కరుగుతుంది. చిన్నప్నుడు మనం చేసే అల్లరి ఒక ఎత్తు, మనకు చేసే సవర్యలు మరో ఎత్తు. మనం ఏం చేసినా.. విసిగెత్తకుండా, అసహ్యపడకుండా మనల్ని తన గుండెకాయలో ఉంచి పెంచుతుంది.
మనం పెద్దవాళ్ళమై ఏం కావాలన్నా అది తెచ్చి పెట్టడానికి ముందే అమ్మనాన్నలు తమ ఒళ్ళును గుల్ల చేసుకుంటారు. డబ్బు ఉన్న తల్లిదండ్రులు అయినా, లేని తల్లిదండ్రులు అయినా.. తమ పిల్లలకు ప్రేమను పంచటంలో ఎప్పుడూ ఓడిపోరు. అది అమ్మనాన్నలకు ఉండే అద్భుతమైన శక్తి.
చివరకు మనల్ని కని ప్రేమగా పెంచి మనకు అంగరంగ వైభవంగా పెళ్ళి చేసి మురిసిపోయే అద్భుతమైన శక్తి గల అమ్మనాన్నలను ఏం చేస్తున్నామంటే..! వారికి శక్తి ఉన్నంత వరకు ఇంట్లో ఉంచి శక్తి క్షిణించాక వృద్ధాశ్రమంలో వేసేయటం.
ఇంకొందరు తాము భార్య పిల్లలతో వేరే ఇంట్లో ఉండటం అమ్మనాన్నలను ఇంకో ఇంట్లో వదిలేయటం. మరికొందరు ప్రభుద్దులైతే ఆఫీసు పని ఆంటు పిల్లలను అమ్మనాన్నలు వద్ద పెడుతు వాళ్ళు వేరే చోట ఉండటం. అయినా.. ఆ పిల్లలకు ఏం కావాలన్నా.. తామే కొని పెడుతూ, పాఠశాలకు రెడీ చేస్తూ శక్తి లేని ఆ అమ్మనాన్నలు వారి అల్లరి భరిస్తూ ఇంత చేసినా.. చివరకు వాళ్ళు మంచాన పడితే చూసేవాళ్ళు కరువౌతున్నారు.
ఎవరికైనా అమ్మనాన్నలు ఉన్నంత వరకే వాళ్ళకి ఒక ఉపయోగం. వాళ్ళు శక్తి కోల్పోయి మంచానికి పరిమితం అయితే మాత్రం అంతే. ఈ నూతన ప్రపంచానికి అమ్మనాన్నల విలువ నిజంగా తెలిస్తే.. వాళ్ళని చివరి వరకు సంతోషంగా చూసుకుంటారు.
తమ కోసం కాకుండా పిల్లల కోసమే బతికే ఈ అమ్మనాన్నలకు వృద్దాప్యంలో తిండి కూడా పెట్టని ప్రభుద్దులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఇంత కష్టపడి పెంచినా.. మనం వాళ్ళని పట్టించుకోకపోయినా.. వాళ్ళు బతికున్నంత వరకు మనం, మన పిల్లలు బాగుండాలని, సంతోషంగా బతకాలని మాత్రమే కోరుకుంటారే తప్పా మమ్మల్ని పట్టించుకోలేదని ఎప్పుడు కలలో కూడా అనుకోరు.
అందుకు ఒక ఉదాహరణ.. రవి తనకు చిన్నప్పటినుండి ఏ కష్టం రానీయకుండా అమ్మనాన్నలు పెంచి మంచి విద్యలు నేర్పించి ప్రయోజకుడ్ని చేశారు. అయితే భార్య, పిల్లలు వచ్చాక అమ్మనాన్నలను వృద్దాశ్రమంలో పడేశాడు. అక్కడ కూడా ఆ అమ్మనాన్నలు కోరుకుంది ఒక్కటే. మేం ఎక్కడ ఉన్నా.. కొడుకు సంతోషంగా ఉండాలని. అయితే ఒకరోజు వృద్దాశ్రమంలో వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటానికి బైక్ పై వెళ్ళాడు. ఆ ఆశ్రమం దగ్గర ఒక అరుగు పై అమ్మనాన్నలు కూర్చుండగా రెండు దుప్పట్లను బైక్ దిగకుండానే వాళ్ళపైకి విసిరి తిరిగి వెళ్ళసాగాడు.
ఈ క్రమంలో బైక్ తిప్పే క్రమంలో అదుపుతప్పి బైక్ తో సహా కింద పడ్డాడు. అది చూసిన అమ్మనాన్నలు కంగారుతో తమ శక్తి మేరకు పరుగుపరుగున వచ్చి బైక్ కింద పడిన రవిని కష్టపడి పైకి లేపి సవర్యలు చేశారు. అదృష్టం కొద్దీ దెబ్బలు తగలలేదు. రవిని లేపి తిరిగి వృద్దాశ్రమ అరుగు పైకి నడుస్తూ వెళ్ళిపోయారు.
ఈ సంఘటన రవిని ఆలోచనలో పడేసింది. కొడుకునకు తాము ఎంత మంచి చేసినా చివరకు మేం వెళ్ళల్సిన ప్రదేశం, ఉండాల్సిన ప్రదేశం ఇదే అని వాళ్ళకి బాగా అర్థం అయింది. తాము కొడుకు దగ్గర ఉంటే నిజంగా కొడుకు బాధపడితే వృద్దాశ్రమంలో ఉండటానికి ఆ అమ్మనాన్నలకు ఇబ్బందేం కాదు.
ఒకవేళ ఇబ్బంది ఉన్నా.. కొడుకు సంతోషం కోసం జీవితాన్నే త్యాగం చేసిన వాళ్ళు చివరి రోజులను త్యాగం చేయలేరా.. అమ్మనాన్నలను చూసుకోవటానికి స్థోమత ఉన్నా.. మరి ఎందుకు వృద్దాశ్రమంలో ఉంచాడనేది ఇక్కడ బాధపడాల్సిన విషయం. ఇక్కడ ప్రతి అమ్మనాన్నలది ఇదే కథ.
వాళ్ళకి చివరి రోజుల్లో ఏం అవసరం అవుతాయని, ఏం బరువైపోతారని దూరం పెడతారు ఈ పిల్లలు.. ? వాళ్ళకు ఆ సమయంలో కావల్సింది కాసింత ప్రేమ, కాసంత గంజినీళ్ళు. ఇవి కూడా పెట్టలేని ఈ పిల్లల కోసమా వాళ్ళు తమ జీవితాలను పిల్లల కోసం పణంగా పెట్టింది..?
అమ్మనాన్నలు ఆరోజుల్లో తమకోసం పొదుపు చేసుకుని, తమ సంతోషాలు, సరదాల కోసం ఆలోచిస్తే ఈరోజు మనం గొప్పవాళ్ళం అవుతామా.. ? అమ్మనాన్నలు ఉన్నంతవరకు మనం బతికే ఉంటాం. కానీ.. ! మనం బతికినంత కాలం అమ్మనాన్నలు ఉండరు కదా..? మనం వాళ్ళని చూసుకునే రోజులు కంటే వాళ్ళు మనల్ని చూసుకునే రోజులే ఎక్కువ. ఈ లెక్కన వాళ్ళు పెంచిన రోజుల్లో సగం రోజులు మనం వాళ్ళని పెంచలేమా..?
చివరగా ఒక్క విషయం.
ఈ ప్రపంచంలో ఎన్ని అద్బుతాలు ఉన్నా మనకు జన్మనిచ్చి పెంచి పెద్దచేసిన అమ్మనాన్నలు ఒక అద్భుతం. వీళ్ళ కంటే గొప్ప అద్భుతం ఈ సృష్టిలో ఎక్క డా ఉండదు ఆంతే.
*** *** *** *** *** *** ***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments