అమ్మానాన్నలందరికీ అంకితం
'Amma Nanna' - New Telugu Story Written By Chandana Sanju
'అమ్మ నాన్న' తెలుగు కథ
రచన : చందన సంజు
ఈ లోకంలో ఎక్కువ గా ఇష్టం అయింది ఏంటి అంటే.
దాని గురించి మనం ఎంతలానో ఆలోచిస్తాం కాని నేను మాత్రమే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒక పేరు చెప్తాను.
ఆ పేరు విన్న వెంటనే నా మనసు నదిలా పొంగుతూ ఉంటుంది..
అసలు ఆ పేరుకి వున్న శక్తి అలాంటిది. ఆ పేరు నాకు ఎంతో ధైర్యానికి ఇస్తుంది..
ఆ పేరు,, ఆ శక్తి ఏదో కాదు.. నాన్న.
చిన్నపాటి నుండి మన కోసం యెన్నో త్యాగాలు చేస్తారు కాని మనల్ని ప్రేమించే వ్యక్తి ఈ లోకం ఎవరైనా వున్నారు అంటే అది ఒక అమ్మా - నాన్న మాత్రమే.
మనం పుట్టిన క్షణం నుండి వాళ్ళు, వాళ్ళ సంతోషం కంటే మన సంతోషం గురించి ఆలోచిస్తారు.
మనకి ఏది కావాలి అంటే అది ఇస్తారు. వాళ్ళకి యెంత కష్టం అయినా కూడా దాని వల్ల మనకి సంతోషం కలుగుతుంది అంటే, వాళ్ళు ఆ కష్టాన్ని కూడా సంతోషంగా భావించి మన కోసం ఆ వస్తువు ఇస్తారు.
అమ్మ-నాన్నల గురించి మాటలో చెప్పినా, కవిత రూపం లో చెప్పినా కుడా అది సరిపోదు. అసలు వాళ్ళ స్థానాన్ని ఎవరూ పూర్తి చేయలేరు.
నాన్న మన కోసం రేయి అనక పగలు అనక కష్టపడతారు. అమ్మ మనకి కావాల్సింది దగ్గర ఉండి మరీ చూసుకుంటుంది. వాళ్ళు మన పైన చూపించే ఈ ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించరు.
అంత ఎందుకు.. ఆ దేవతలు కూడా వాళ్ళ పిల్లల పైన అంత ప్రేమ చూపిస్తారు. పార్వతి దేవి గణేశుడి పైన ఎంత ప్రేమ చూపించింది..
అలాంటి మన అమ్మ-నాన్న ల ప్రేమ ఈ లోకాన్ని మార్చిపోయేలా చేస్తుంది.
అమ్మా- నాన్నా!
మీరు లేకుండా ఒక క్షణం కూడా వుండలేను అలాంటిది ఈ 2 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను, కాని నా మనసు మాత్రమే యెల్లపుడు మిమల్ని తలుచుకుంటుంది.
నాన్నా, లవ్ యూ నాన్నా.
నేను రోడ్డు మీద అలా నడుస్తు వెళ్ళేటప్పుడు యెంతో మంది తండ్రులు వాళ్ళ కూతుర్ల మీద ప్రేమ చూపిస్తు వుంటే, ఆ క్షణం నాకు నువ్వు గుర్తు వచ్చేవాడివి నాన్నా. నువ్వు నా పైనా చూపించిన ప్రేమ గుర్తు వచ్చేది. యెందుకో తెలీదు ఆ క్షణంలో నా కళ్ళలో నుండి నీళ్ళు కూడా వచ్చేవి కాని, అవి నేను దాచి పెట్టుకునే దానిని నాన్నా.. చిరునవ్వుతో ముందుకు వెళ్లే దాని. నాన్నా! నీ ప్రేమ నన్ను ఈ లోకాన్ని మర్చిపోయేలా చేసింది.
లవ్ యూ నాన్నా.. లవ్ యూ అమ్మా..
***
చందన సంజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు చందన సంజు. నేను జహీరాబాద్ అనే టౌన్ లో వుంటాను. నాకూ కథలు రాయడం అంటే చాలా ఇష్టం. సమయం వున్నప్పుడు అలా ఏదో ఒక కథ రాస్తూనే వుంటాను.
నేను కథలు రాయడానికి ముఖ్య కారణం సంజు. అతనే నా ప్రపంచం. అలానే నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కథలు కూడా రాస్తూ వుంటాను.
Comments