'Ammaku Vandanam' New Telugu Story Written By Pitta Gopi
'అమ్మకు వందనం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
పద్మ పాఠశాల లో అడుగు పెట్టి ఐదేళ్లు అయినా అవ్వలేదు. అప్పుడే ఆమెకు చదువు పై ఎంతో ఏకగ్రత, ఎంతో నమ్మకం కలిగింది.
దీంతో పాటు సమాజాన్ని చదవటం నేర్చుకుంది.
అందుకేనేమో.. పెద్ద అయి పదిమంది ఆరోగ్యం గా ఉండాలి, వారికి తన చేతుల్లో వైద్యం చేసి బతికించాలి.. అలా మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలని తన కల.
ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ చదువు కొనసాగిస్తుంది.
పద్మది మధ్యతరగతి కుటుంబం కావడం వలన పదిహేడు ఏళ్ళకే పెళ్ళితో పీఠముడి పడింది.
పెళ్ళి పై తనకు తొందర లేకున్నా పెద్దల మాట కాదనలేక తన మనసులో కలను చంపుకుని అత్తింటికి పోయింది..
భర్త రాజు చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబం పోషణ చేస్తున్నాడు.
పద్మ, ఇల్లు కదలలేని అత్త- మామలకు, భర్తకు సేవలు చేస్తోంది.
బాధ్యతలన్ని తక్కువ వయసులో మోస్తున్న పద్మ కు జీవితం పై ఒక క్లారిటీ వచ్చింది. అర్థం చేసుకుంది.
భర్త సంపాదన సరిపోకపోవటంతో "తాను డాక్టర్ కావాలి" అనే కలను భర్తకు చెప్పింది.
"ప్రస్తుతానికి నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా.. బయట అడుగు పెట్టి చెడిపోదాం అనుకుంటున్నావా" అని గద్దించాడు.
ఆ మాటలకు పద్మ చెమ్మగిల్లిపోయింది.
ఏం మాట్లాడకుండా భర్త మాటకు ఎదురు చెప్పలేదు.
రోజులు గడిచాక ఒక రోజు భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
రెండు నెలలు వరకు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అది కూడా ఆ రెండు నెలల్లో సగం రోజులు వైద్యులు పర్యవేక్షణ చేయల్సి వచ్చింది.
పద్మ బెదరలేదు. భర్తను అత్త-మామలను చూసుకునేందుకు బయట కాలు మోపింది.
తన కల నెరవేరకపోయినా..
తన కష్టాలు ఎవరూ అర్థం చేసుకోపోయినా.. తాను భాదపడలేదు కానీ.. తన వారికి కష్టం వచ్చిందని మనసులో కన్నీరు కార్చింది.
పొద్దున లేచి ఇంట్లో వాళ్ళకు సవర్యలు చేసి కుటుంబం గడిపేందుకు రకరకాల పనులు చేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చి మరలా ఇంట్లో వాళ్ళకి సవర్యలు..
ఇలా ఆదనంగా మూడు నెలలు గడిచాయి. భర్త కోలుకున్నాక పద్మ ఆరోగ్యం దెబ్బతిన్నది.
ఆమె ఐదు నెలల గర్భిణీ.
ఎంతో ఆనందించింది. కానీ.. తనకంటూ విశ్రాంతి లేదు.
అలా మరో నాలుగు నెలలు పిండం మోసింది.
తనకు కొడుకు పుట్టాడు.
తాను చూసుకోవల్సిన వారి సంఖ్య నాలుగుకి చేరింది.
రెండేళ్ళకి మరో ఆడపిల్ల..
మరో ఏడాది కి మరో కొడుకు..
అలా పద్మ ముగ్గురు పిల్లల తల్లి అయ్యింది.
అందరికీ సేవలు చేస్తూ కుటుంబ భాద్యతలు మోస్తూ, అప్పుడప్పుడు భర్త చీవాట్లు తింటూ ఎన్ని కష్టాలు పడినా పిల్లలతో సరదాగా గడుపుతూ తన కష్టాన్ని కనపడనిచ్చేది కాదు.
నిజంగా ఇల్లాలు అంటే ఇలాగే ఉండాలి అనేలా ఉంది పద్మ.
అత్త-మామలు స్వర్గస్తులు అయ్యారు.
పిల్లలు పెద్దోళ్లు అయ్యారు.
భర్త ఉద్యోగ వయస్సు అయిపోయి ఇంట్లోనే కాలం లెక్కిస్తున్నాడు.
ముందు చెల్లి పెళ్ళి చేసి కొంత కాలానికి పెద్దోడు పెళ్ళి చేసుకున్నాడు.
కోడలికి భర్త పై ప్రేమ తప్ప ఇంకెవరి పై ప్రేమ లేదు. కొడుకు భార్య మాటే తప్ప తల్లి మాట వినేవాడు కాదు.
అంతటితో ఆగక
"అమ్మా! నా సంపాదన సరిపోవటం లేదు. నువ్వు ఏదైనా పాఠశాల లో పాఠాలు చెప్తే ఇల్లు గడుస్తుంది" అన్నాడు.
"నీ భార్య కూడా ఉద్యోగం చేస్తుంది కదరా.. ఇంటి పనులు చేసే సరికి నాకు బోలెడు సమయం పడుతుంది. మరి నేనెందుకు" అన్నది.
మౌనంగా ఊరుకున్నాడు పెద్దోడు.
చిన్నోడికి పెళ్ళి.. పెద్దోడికి పిల్లలు.. కూతురి పిల్లలు కూడా ఇక్కడే చదువుతుండటంతో పద్మ వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరిగాయి.
కొడుకు కోడలు ఏ రాత్రికో వస్తారు.
భర్త ని చూసుకోవాలి..
మనుమల్లో ఇద్దరిని బడికి ఏర్పాట్లు చేయాలి..
మిగిలిన పిల్లలు కు ఇంట్లో సవర్యలు చేయాలి..
మరలా వాళ్ళందరూ వచ్చే సరికి వండి, వడ్డించి పెట్టాలి.
ఎన్నో చేసింది. అలా భర్త పోయాక పద్మ మంచం పట్టింది.
అప్పుడు కోడలు భాద్యత తీసుకుని కొన్నాళ్ళకి పద్మ కాళ్ళ పై పడి ఏడవసాగింది.
ఇంట్లో ఇద్దరు పిల్లలని చూసుకోటానికే ఇన్ని కష్టాలు పడుతుంటే.. తాను బలం ఉన్నంత వరకు అంతమందిని భాద్యత గా మోసింది.
పద్మ కోడలిని ఓదార్చి తన గతం చెప్పింది.
"తన ఇష్టాలను దాచుకుని కన్నవాళ్ళను, అత్తమామలను, భర్త, పిల్లలను, మనుమలు కోడళ్ల ని ఇంత చక్కగా నడిపించింది. తన చేసిన పని నేను చేశాకే కష్టం ఏంటో నాకు తెలిసిందే తప్ప నిన్ను ఎవరు అర్థం చేసుకోలేపోయామని" కోడలు ఏడవసాగింది.
విషయం తెలుసుకుని పద్మ కొడుకులు, చిన్న కోడలు, మనుమలు అందరూ పద్మను హత్తుకున్నారు.
“అమ్మా! నీకు వందనం. ఈ రోజు నుండి మేము అత్త అని పిలవకుండా అమ్మ అనే పిలుస్తా”మని అంటూ.. కోడళ్ళు పద్మకు పాదాబినందనం చేశారు.
పద్మ ఆనందం తో కన్నీరు తుడుచుకుని ఆశీర్వదించింది.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Y Ramu • 6 hours ago
అమ్మకు వందనం సూపర్