#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AndalaVindyaIcchinaChitka, #అందాలవింధ్యఇచ్చినచిట్కా, #పిల్లలకథలు, #TeluguChildrenStories
అందాల వింధ్య ఇచ్చిన చిట్కా (మాధవ్ ను కాపాడింది)
Andala Vindya Icchina chitka - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 06/01/2025
అందాల వింధ్య ఇచ్చిన చిట్కా - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1). మూడు రోజుల నుండీ హిందీ పద్యం - కవిత బట్టీ పట్టాలని చూస్తున్నాడు ఆరవ తరగతి విద్యార్థి మాధవ్. నాలుక మీద నిల్చి పదాలు జారీ పోతున్నాయి కానీ స్థిరంగా నిలబడటం లేదు. కంఠస్తం కావటం లేదు.
తరగతిలో దాదాపు అందరూ ఇలాగే కుస్తీ పడుతున్నారు ఆ హిందీ పద్యం తో. అందరి పరిస్థితి ఇదే!
హింది - ఉపాధ్యాయుడు గిరి గారు ఆశ్చర్యం గా "బాబు మాధవ్.. ఎప్పుడూ అందరికంటే ముందు కవిత అప్ప చెబుతావు. ఈసారి కంఠస్తం కావటం లేదంటున్నవు. ఇప్పుడు అప్ప చెప్పకున్నా, ఎల్లుండి పరీక్ష లో వ్రాయాలి కదా", అన్నారు.
--- X X X ----
2). సాయింత్రం ఇంటి ముందు దిగులుగా కూర్చున్నాడు మాధవ్. అతడి సహ విద్యార్థిని 'చిన్నారి అందాల వింధ్య' అటుగా వెడుతూ అతడిని దిగులుగా చూసి అతడి చెవిలో ఒక చిట్కా ఊది వెళ్ళిపోయింది.
మరునాడు మాధవ్ తరగతిలో సునాయాసంగా హిందీ పద్యం - కవిత గడ - గడ అప్ప చెప్పేశాడు అందాల వింధ్యకు.
హింది ఉపాధ్యాయుడు గిరి గారు, పిల్లలు ఆశ్చర్యంగా అడిగారు "ఒక్క రోజులో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది"?, అని.
మాధవ్ సంతోషం చిందిస్తూ చిరు నవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు,
"నిన్న మా ఇంటి దగ్గర నన్ను దిగులుగా చూసి, 'అందాల చిన్నారి వింధ్య' నాకు ఒక చిట్కా చెప్పింది. ప్రతి పదం అర్థం తెలుసుకొని చదవమని. అప్పుడు కంఠస్తం చేయటం - బట్టీ పట్టటం తేలిక అని. నేను ఆంగ్లం - హిందీ నిఘంటువు లో కొన్ని కష్టమైన హిందీ పదాల అర్థం ఆంగ్లంలో తెలుసుకొని.. పాఠ్య పుస్తకంలో ఆ హిందీ పదాల పైన పెన్సిల్ తో ఆంగ్లంలో అర్థాలు వ్రాసుకొని.. అర్థం చేసుకుంటూ రెండు కు - మూడు సార్లు బట్టీ పట్టాను హిందీ పద్యం".. ఈసారి సునాయాసంగా వచ్చేసింది పద్యం. నాలుక పై మరియు మెదడులో స్థిరంగా నిల్చుంది", అన్నాడు.
"ఎక్కడైనా ఆగినప్పుడు అందాల వింధ్య (కిల కిల నవ్వుతూ) పదాలు అందించి.. ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్మాణాత్మక నిర్వహణ చేసి.. నేను పద్యం చెప్పటంలో సఫలం అయ్యేలా చూసింది" అంటూ ముగించాడు మాధవ్ చిరు నవ్వుతో, ఆమెను కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ.
---------- X X X -----------
3). ఉపాధ్యాయుడు చిన్నారి అందాల వింధ్యను, "అబ్బో, మన 'చిన్నారి అందాల వింధ్య' సంతోష పూరిత నిర్వాహుకురాలు - మేనేజర్", అని
మెచ్చు కొలు గా కొనియాడారు. అందరూ పిల్లలు అందాల వింధ్యకు జే జేలు పలికారు.
అదే తరహాలో హిందీ పదాల అర్థం ఆంగ్లంలో తెలుసుకొని.. అర్థం చేసుకుంటూ చదివి బట్టీ పట్టేశారు. అప్ప చెప్పేశారు. మూడు రోజుల తరువాత అందరూ హిందీ పరీక్షలు కూడా బాగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు (అర్థం చేసుకొని చదివారు కాబట్టి.. అందాల వింధ్య చిట్కా పాటించి).
--------- X X X -----------
నీతి:
i) అర్థం తెలుసుకొని పాఠాలు చదవాలి. తేలికగా జ్ఞానం - విజ్ఞానం వస్తుంది. పరీక్షల్లో మార్కుల కొరకు బట్టీ పట్టి చదవ రాదు.
ii) ఎల్లప్పుడూ అందరూ మేనేజర్ లు - మనుషులూ.. కేవలం సంతోష పూరిత నిర్వహణ మరియు ప్రోత్సాహం మాత్రమే చేయాలి. అవి మంచి ఫలితాలు ఇస్తాయి (అందరికీ).
---XXX-- అయిపోయింది ---XXX ---
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Comments