top of page

అందమైన పొదరిల్లు


'Andamaina Podarillu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'అందమైన పొదరిల్లు' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఏయ్ స్విగ్గీ!" ఈరోజు మన పెళ్లిరోజు కదా! సాయంత్రం ఏదైనా సినిమాకి వెళదామా"? అడిగాడు జొమాటో.


"తప్పకుండా!" అంది స్విగ్గీ.


సాయంత్రం ఇద్దరూ సరదాగా సినిమాకి వెళ్లి ఇంటికి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ తమ ఫాస్ట్ ఫుడ్ ని కమ్మగా ఆరగించి హాయిగా నిద్రపోయారు.


స్విగ్గీ, జొమాటో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. వాళ్ల అన్యోన్యమైన కాపురాన్ని చూసి "ముచ్చటైన జంట" అని ఇరుగుపొరుగు అందరూ మెచ్చుకుంటున్నారు.


చూస్తూ ఉండగానే ఏడాది గడిచింది. స్విగ్గీ గర్భవతి అయింది. జొమాటో ఫంక్షన్ ఏర్పాటుచేసి అందరికీ సంతోషంగా విందు ఇచ్చాడు. వచ్చినవాళ్లందరూ ఆ దంపతులను దీవించి కమ్మని విందు ఆరగించి వెళ్లారు. స్విగ్గీకి నెలలు నిండి సుఖప్రసవం జరిగి పండంటి కొడుకు పుట్టాడు. వాడికి "పొటాటో" అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పొటాటో క్రమేణా పెరుగుతూ తన ముద్దుముద్దు మాటలతో, ఆటపాటలతో అందరినీ అలరిస్తున్నాడు.


రోజులు గడుస్తున్నాయి. పొటాటోకి మూడు సం.. నిండగానే అక్షరాభ్యాసం చేసి దగ్గరలో ఉన్న మంచి స్కూలులో చేర్చారు స్విగ్గీ, జొమాటోలు. పొటాటో చక్కగా అక్షరాలు దిద్దుతూ శ్రధ్దగా చదువుకుంటున్నాడు. మరో రెండు సం.. లకు స్విగ్గీ గర్భం దాల్చింది. జొమాటో ఆనందానికి అవధులు లేవు. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. నెలలు నిండి సుఖప్రసవం జరిగి స్విగ్గీకి మరో కొడుకు పుట్టాడు. వాడికి "టొమాటో" అని పేరు పెట్టుకొని ప్రేమగా పెంచుకుంటున్నారు స్విగ్గీ, జొమాటోలు. తమ్ముడు పుట్టాడని సంబరంగా ఉంటున్న పొటాటో స్కూలు నుంచి రాగానే తమ్ముడిని ఎత్తుకొని ముద్దుచేస్తూ కాలం గడుపుతున్నాడు.


టొమాటో క్రమేణా పెరిగి పెద్దవుతూ తన మాటలు, ఆటపాటలతో ఇంటిల్లిపాదినీ సంతోషపెడుతున్నాడు. టొమాటోకి మూడు సం.. నిండగానే అక్షరాభ్యాసం చేసి పొటాటో చదువుచున్న స్కూలులోనే టొమాటోను కూడా చేర్చారు స్విగ్గీ, జొమాటోలు.


ప్రతిరోజూ పొటాటో, టొమాటోలు చక్కగా స్కూలుకు వెళ్లి వస్తూ చక్కగా చదువుకుంటున్నారు. కాలం గడుస్తోంది. ఇద్దరూ కష్టపడి చదువుతూ మంచిమార్కులతో పాసవుతున్నారు. రోజులు సాఫీగా గడుస్తున్నాయి. పొటాటో డిగ్రీ పాసయి బాంకు పరీక్షలు వ్రాసి బాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.


మరికొన్ని రోజులకు టొమాటో గ్రూపు పరీక్షలు వ్రాసి కలెక్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. పిల్లలవృధ్ధిని చూసి చాలా సంతోషంగా ఉంటున్నారు స్విగ్గీ, జొమాటోలు.

ఇద్దరూ తాము ప్రేమించిన అమ్మాయిలు ఉల్లి, చిన్నుల్లిలను తల్లితండ్రుల అంగీకారంతో పెళ్లిచేసుకొని సంతోషంగా కాపురం చేస్తున్నారు. కవలపిల్లలయిన ఉల్లి, చిన్నుల్లిలు తమ భర్తలతో అన్యోన్యంగా ఉంటూ అత్తమామలను ప్రేమగా చూసుకుంటున్నారు.


ఆడపిల్లలు లేని స్విగ్గీ, జొమాటో లు తమ కోడళ్లను కూతుర్లుగా చూస్తున్నారు. వాళ్లు తమ కొడుకులు, కోడళ్లను చూసి సంతోషంగా ఉంటూ ఆనందంగా జీవితం గడుపుతున్నారు.


తమ అందమైన పొదరిల్లు ఇలాగే నిండునూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నారు స్విగ్గీ, జొమాటోలు.

గమనిక.. ఈ కధని నేను సరదాగా వ్రాశాను. ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. ఎవరి మనసులనీ నొప్పిద్దామనీ కాదు.


.. నీరజ హరి..

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


Comments


bottom of page