అందరం కలుద్దాం.. ఆనందం పంచుకుందాం - ఏ. అన్నపూర్ణ.
'Andaram Kaluddam' - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 06/03/2024
'అందరం కలుద్దాం' తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
పుట్టినరోజు అనేది అందరికి ఉంటుంది. అంటే వయసు పెరుగుతోంది అని కాలం మనకు గుర్తు చేస్తుంది అన్నమాట.
ఒకప్పుడు పుట్టినరోజులు చిన్నపిల్లలకు అయిదేళ్ళు వచ్చేవరకూ చేసేవారు. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ యువత ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడం మొదలు పెట్టేరు. అలా 50 -60 -70 -80 అంటూ పదేళ్లకోసారి పిల్లలో అన్నాతమ్ములో ఫ్రెండ్స్ ఎవరో ఒకరి సరదాతో పుట్టినరోజు పండుగను జరుపుతున్నారు.
సీనియర్ సిటిజన్స్ అయ్యాక నలుగురూ కలిసే అవకాశం కల్పించే విధంగా ఇప్పుడు ఎవరికీ వాళ్ళే ఇలాగ పార్టీలు ఇస్తున్నారు. దీనివలన వయసును మరిచి ఉత్సాహంగా అందరితో గడుపుతున్నారు.
అవును, వయసు శరీరానికే కానీ మనసుకి కాదు. జీవితం అనేది అనేక అనుభవాల సారం. అందులో సంతోషాలు చిలిపితనపుదుడుకుదనాలు విషాదాలు ఎదురు దెబ్బలు నేర్చుకునే పాఠాలు ఎన్నో ఎన్నెన్నో.
వాటిని గుర్తు చేసుకుని రాబోయిన తరానికి విశదపరచడం బాధ్యతగా అనుకుంటూ ఎన్నో సందేశాలు ఇస్తారు. వాటిని స్వీకరించడం ఇప్పటి తరానికి మార్గ దర్శకత్వం కాగలదు.
ఈ మధ్య మాతో బాటే ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు బాగా పరిచయం వున్న ఒకరి పుట్టినరోజును చేయాలని అమెరికానుండి వచ్చినవారికుమారులు ప్లాన్ చేశారు.
బంజారా హిల్స్ తాజ్మహల్ హోటల్లో లంచ్ ఆరెంజ్ చేశారు.
నాకు తెలిసి పుట్టినరోజున దేవాలయానికివెళ్ళి అభిషేకం చేయిన్చుకునే వారినే చూసాను. అది వ్యక్తిగతం.
దేవుడి ఆస్సీస్సులు కోరుకుంటారు. కుటుంబం బాగుకోరి పూజలు చేస్తుంటారు. తాహతు సరదానుబట్టి చీర నగా కొనుక్కుంటారు. లేదా ఒక వస్తువును కొంటారు.
అమెరికాలో స్థిరపడిన చాలామంది పిల్లలు ఉండటం వలన తరచుగా పేరెంట్స్ అమెరికా వెళ్లడం వలన చాలా నేర్చుకున్నారు. అక్కడి సరదాలు తెలిసాయి.
అమెరికన్స్ ఏదైనా మానేస్తారేమో కానీ బర్త్ డే, వెడ్డింగ్ యానివెర్సరీ మాత్రం తప్పక జరుపుకుంటారు.
మనవాళ్ళు కూడా అదే అనుకరిస్తున్నారు. కారణాలు ఏవో ఒకటి.. వేడుకలు చేసుకోవడం, బంధు మిత్ర పరివారంతో మరపురాని అనుభూతిని స్వంతం చేసుకోవడం జరుగుతోంది.
ఆనందాన్ని వెదుక్కోడం మన చేతుల్లో వుంది. కనుక ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ చిన్న చిన్న సరదాలు తీర్చుకోడం బాగుంటుంది.
పాత రోజులనుంచి సినిమాలు అందరికి జీవితంలో ఒక ముఖ్యమైన వినోదం. నటులు పాటలు అందరూ ఇష్టపడేవారు. అలాగే పుట్టినరోజు జరుపుకునే గాయత్రీ గారు తన చిన్న నాటి నటీ నటుల సినీమా పాటలను సెలక్ట్ చేసి మ్యూజిక్ పెట్టేరు. ఆపాట ఏమిటో అతిధులు చెప్పాలి. పాడటం వస్తే పాడాలి.
అలా ఆ పాత మధురాలతో గంటన్నర సమయం తెలియకుండానే సందడిగా గడిచి పోయినది.
ఫోటోలు తీసుకుని కేక్ కట్ చెయిన్చారు. మేము వెళ్లినవాళ్ళం గిఫ్ట్స్ ఇచ్చాం.
లంచ్ చేసాక అందరిచేత తంబోలా ఆడించారు. ఆరోజంతా చాలా హ్యాపీగా గడిచింది అందరికీ.
ఇలాంటి సరదాలు మనుషులను ఆనందంగా ఉంచుతాయి.
ఇద్దరు పెద్దవాళ్ళు కలిస్తే అనారోగ్యం గురించి కాకుండా సంతోషంగా వుండే కబుర్లు చెప్పుకోవాలి. అన్నివిషయాలు పంచుకోవాలి.
పురాణాలు, దేవుడి భక్తి కొంతవరకే పరిమితం చేసుకుని జీవితాన్ని నచ్చిన విధంగా ఆస్వాదించాలి. ఎలా గడిపితే ఆనందంగా ఉండగలమో ఆలోచించాలి.
ఇలాంటి న్యూ ట్రెండును ఆహ్వానిద్దాం!
అందరం కలుద్దాం.. ఆనందం పంచుకుందాం !
**********************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments