#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AndarikanteAndamainaVaruEvaru, #అందరికంటేఅందమైనవారుఎవరు, #TeluguChildrenStories
Andarikante Andamaina Varu Evaru - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 09/01/2025
అందరికంటే అందమైన వారు ఎవరు? - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1). ఆ సభ - వేడుక లో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. చాలా దేశాల నుండి అందగత్తెలు వచ్చారు. రకరకాల రంగులు దుస్తులు వేసుకున్నారు. ఒకరిని మించిన అందగత్తె ఇంకొకరు. జుట్టును కొంత మంది విరబోసుకుని బార్బీ డాల్ లా ఉన్నారు. ఇంకొంత మంది జడలు వేసుకున్నారు. మరి కొంతమంది తలకి స్కార్ఫ్ (రంగురంగుల బట్టలు) కట్టుకున్నారు. వయ్యారంగా నడుస్తుంటే ఆ అప్సరసలు - గాంధర్వ కన్యలు దివి నుండి భువికి దిగి వచ్చారా !.. అన్నట్టు ఉన్నది. కొందరైతే ఇదే స్వర్గం అంటున్నారు. అందరి చెవుల్లో, మది లలో "రంగు రంగుల పూలు.. " పాట రింగు మంటున్నది.
అలా ఓ గంట సేపు నడకలు, వయ్యారాలు ఒలక-బోయటం, నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు వారు కిల - కిల నవ్వులతో మంచి - మంచి జవాబులు ఇవ్వటం ఇతరత్రా కార్యక్రమాలు.. క్రమ పద్ధతి లో జరిగి పోయాయి.
నిర్వాహకులు ఇలా ప్రకటించారు, "ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి. ఈ 'అందాల భామలు' పోటీలకు విచ్చేసిన న్యాయమూర్తులు (జడ్జిలు) ముగ్గురూ చర్చించుకొని.. కాసేపటిలో.. 'మొట్ట మొదటి ముగ్గురు అందాల భామలు ఎవరు ???'.. ఆ విజేతల పేర్లు ప్రకటిస్తారు. ఓ ఐదు - పది నిమిషాలు సహనంతో కూర్చోవాలి అందరూ అని మా విజ్ఞప్తి".
---- X X X ----
2). ఒక నిర్వాహకుడు ఇలా అన్నాడు, "మొదటి వరుస కుర్చీలలో ఒక చిన్న బాబు కూర్చున్నాడు.. నువ్వే మా.. ఇక్కడ స్టేజ్ మీదికి రా", అన్నారు.
చిన్న బాబు స్టేజీ మీదకు వచ్చాడు.
"ఇంతమంది అందాల భామలలో.. అదే! అలా స్టేజ్ పై పక్కగా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.. వారందరిలో, నీకు ఎక్కువగా నచ్చిన ఒక్క వయ్యారి - భామని చూపించు.. చెప్పు", అని అడిగాడు నిర్వాహకుడు.
బాబు అలా ఓ సారి నడిచి అందరినీ పరకించి చూసాడు. మళ్లీ మైక్ దగ్గరికి వాపసు వచ్చాడు.
"నీకు ఎవ్వరూ నచ్చలేదా?.. ఇంతాంది ముద్దుగుమ్మల లో", నిర్వాహకుడు ఆశ్చర్యంగా అడిగాడు.
"ఒక్క భామ నచ్చింది", అన్నాడు బాబు.
"ఎవరది? చెప్పు తొందరగా.. ", అడిగాడు నిర్వాహకుడు.
సభలో కూడా కుతూహలం పెరిగింది.
"మా అమ్మ", అన్నాడు ఆ బాబు.
ప్రేక్షకుల చప్పట్లతో సభ మారు మ్రోగింది.
"ఈ భామలలో నీ అమ్మ ఎవరు?", ఇంకా చకితంగా అడిగాడు ఆ నిర్వాహకుడు.
"మా అమ్మ స్టేజీ మీద లేదు.. ప్రేక్షకులలో కూర్చుని ఉన్నది", అన్నాడు ఆ బాబు.
"ఈ బాబు యొక్క అమ్మ గారు ఎవరో కాస్త నిల్చుంటారా.. అందరూ ఓ సారి చూస్తారు ఆ అదృష్ట జాతకురాలిని", అని విన్నపం చేశాడు ఆ నిర్వాహకుడు.
మొదటి వరుసలో ఉన్న ఓ యువతి లేచి నిల్చుంది. చూడటానికి పెద్ద అందంగా లేదు. కాస్త వయస్సు కూడా మళ్లింది.
సభలో అందరూ ప్రేక్షకులు మళ్లీ చప్పట్లు కొట్టారు, ప్రోత్సాహకరంగా. అందరికీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నిర్వాహకుడు ఆశ్చర్య పోయాడు. అతడి బుర్ర తిరిగి పోయింది.
ఇలా అన్నాడు, "బాబు!.. ఎందుకు మీ అమ్మను అందరి కంటే అందగత్తె అంటున్నావు? వివరిస్తావా? అందరూ వింటారు".
బాబు మొహం సంతోషం తో వెలిగి పోయింది. ఇలా అన్నాడు, "నేను పక్క తడిపిన.. విసర్జించిన కూడా తుడుస్తుంది. ఈసడించుకోదు. ఒక్క మాట అనదు".
"నేను రాత్రి పూట ఎప్పుడు లేచినా నన్ను బుజ్జగిస్తూ పాట పాడుతుంది. పాలు కలిపి ఇస్తుంది. నా ఆకలి తీరుస్తుంది. అస్సలు విసుగు చూపించకుండా".
"ఏమి తెచ్చినా ముందు నాకు పెడుతుంది. ఆమె ఆకలిగా ఉన్నా ముందు నా ఆకలి తీరుస్తుంది. ఏమి మిగలకుంటే పస్తు పడుకుంటుంది. నాకు ఏమి కావాలన్న.. ఆట వస్తువులు, తిను బండారాలు వగైరా.. కొని పెడుతుంది. డబ్బు లేకుంటే ఇంకా చెమటోడ్చి ఎక్కువ పని చేస్తుంది.. అక్కడ - ఇక్కడ తిట్లుతిని కూడా ఓర్పు - సహనం వహిస్తుంది, పని మటుకు మానదు, ఎందుకు? నా కోసం.. నా సంతోషం కోసం. నా ఆకలి దప్పులు తీర్చటం కోసం"
"నాకు జబ్బు చేసినా.. నా బరువు మోస్తూ నన్ను ఆసుపత్రికి మోసుకు పోతుంది.. ఎత్తుకుని పోతుంది. రాత్రంతా మేలుకుని ఉంటుంది. నాకు చల్ల నీటిలో ముంచిన బట్ట తో నా నుదుట తుడుస్తుంది.. జ్వరం తగ్గాలని. అన్ని దేవుళ్ళకు మొక్కుకుంటుంది. అన్ని దేవాలయాలకు పరిగెడుతుంది".
"మీరే చెప్పండి.. ఈ లోకం లో నా అమ్మను మించిన అందగత్తె ఎవరైనా ఉన్నారా?".. అంటూ సభ ను సవాలు చేశాడు ఆ బాబు.
నిర్వాహకుడు కళ్ళు తుడుచు కున్నాడు, "ఉన్నారు బాబు.. లేకేమి?", అన్నాడు.
"ఎవరు", అడిగాడు బాబు ఆశ్చర్యంగా, ఏదో కొత్త విషయం విన్నట్టు.
"అందరూ అమ్మలూ అంతే బాబు.. త్యాగ మూర్తులు, నిస్వార్ధపరులు.. నా అమ్మ కూడా ఇలాగే నా కోసం చేసేది.. అమ్మ ఎవరికైనా అమ్మే బాబు.. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు.. ఏ జీవికైనా", అన్నాడు నిర్వాహకుడు కళ్ళు తుడుచుకుంటూ జేబు-రుమాలుతో.
బాబు కూడా కళ్ళు తుడుచుకున్నాడు, "ఔనా.. అవును, అవును.. మా ఇంటి దగ్గర చాలా సార్లు ఆవును చూసాను, తన దూడను లాలిస్తూ - దూడకు పాలు ఇస్తూ. వేరే పక్షులను, వేరే జంతువులను కూడా చూసాను తమ పిల్లలకు ప్రేమ గా - అనురాగం తో తినిపిస్తూ.. బుజ్జగిస్తూ" అన్నాడు గద్గద కంఠంతో.
------X X X ------
3). న్యాయ మూర్తులు అందం పోటీ విజేతల పేర్లు ఖరారు చేసారు కూడ పలుక్కుని.
స్టేజీ మీదకు వచ్చారు. మైక్ లో ఇలా అన్నారు న్యాయ నిర్ణేతలు..
"ఈ రోజు అందాల పోటీలలో విజేతలు ఎవరు అనగా.. "
అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు.. హాల్ అంతా నిశ్శబ్ధం..
"ఇక్కడ ఉన్న అందరూ అమ్మలూ, అమ్మమ్మలు, నాయినమ్మలు, తాతమ్మలు.. స్టేజీ పైకి వచ్చి బహుమతులను తీసుకోవాలి అని మా ప్రార్థన.. విన్నపం"
ఇప్పటి నుండి ' అందాల పోటీలు నిర్వహించేది అమ్మల కొరకే, అమ్మల గన్న అమ్మల కొరకే, అమృత వర్షిణి లకే.. ఆ నిస్వార్థ సేవా మణి లకే. ఇప్పటినుండి వయ్యారి భామలకు, యువతులకు కాదు. ఎందుకంటే ఇది తరిగి పోయే అందం.. అమ్మల గన్న అమ్మలది, అందరి అమ్మల ది తరగని అందం.. అమ్మ యొక్క ప్రేమ బంధం, ఎంత మధురం.. అది చెరిగి పోదు - తరిగి పోదు జీవితాంతము", .. అంటూ ముగించారు బాధా స్వరంతో.
ఆ హాల్ చప్పట్లతో చాలాసేపు దద్దరిల్లింది.. అరే, భూకంపం వచ్చిందా?.. అన్నట్టు. అందరి కళ్ళలో ఆనంద భాష్పాలు స్పష్టంగా కనిపించాయి.. "అమ్మ అందం నిజమైన - అసలైన అందం" అనటానికి నిదర్శనంగా.
---- X X X -----
నీతి:
అమ్మ అందం తిరుగులేని అందం. అమ్మ మాట తిరుగులేని మాట.
అంటే ???.. నిజమైన 100% ప్రేమ బంధం, ఆత్మీయత, అనురాగం, అభిమానం, అనుబంధం, నిస్స్వార్ధ ప్రేమ, త్యాగం, స్నేహం, అమృత వర్షం, దయా-మణి వెలుగు - కరుణ - ప్రేరణ, ఎన లేని ఉత్సాహం - ఉల్లాసం - శక్తి ఇచ్చే కంచు కోట, అనురాగ - మాలిక.
------ X X X --- సమాప్తం --- X X X ------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Kommentare