top of page
Writer's pictureBVD Prasada Rao

అందరిలో ఉన్నా ఒంటరి



'Andarilo Unna Ontari' - New Telugu Story Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 11/03/2024

'అందరిలో ఉన్నా ఒంటరి' తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు 

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



చావు అనివార్యం.

చావు తర్వాతి స్వర్గం, నరకం అనేవి అస్పష్టం.

జీవిగా చేసినవే చావు తర్వాత చెలామణియగును.

తన చేతకు పొగడిక ఐనా, తెగడిక ఐనా తను జీవిగా ఉన్నప్పుడు లభించగలిగితేనే అట్టివి సారవంతమయ్యేది.


చావు తర్వాతివి ఎట్టివైనా ఆ జీవిని ప్రోత్సహించలేవు లేదా మార్చలేవు. 

ఇదంతా.. నా నాన్నమ్మ నా అమ్మమ్మకు చెప్పగా, నా అమ్మమ్మ నా అమ్మకు చెప్పగా, నా అమ్మ నాకు చెప్పగా.. నాకు తెలిసింది. మీకు ఇప్పుడు చెప్పుతున్నాను. మార్పుకై ఎదురెళ్తున్నాను. అంతే.


ఆలోచిస్తే, నా చర్య వృధా కాదు అనిపిస్తోంది. ఎప్పటికైనా నా వ్యధ తీరకపోదా అనిపిస్తోంది. 

ఇందుకు రుజువు లేకపోలేదు అనిపిస్తోంది.. సుబ్రహ్మణ్యుడు వ్యవహారం అవగతం కాగా.


సుబ్రహ్మణ్యుడు మా ఊరి మోతుబరి. 

మధ్యస్థ పల్లెటూరు ఐన మా ఊరికి.. సుబ్రహ్మణ్యుడు చొరవతో ఆధునికత అబ్బేసింది.

సుబ్రహ్మణ్యుడు మాకు చేరువున ఉన్న పట్నంకి తరుచు వెళ్లి వస్తుంటాడు. అందుకు కొందరు అతడికి అక్కడ మరో కాపురం ఉందంటారు.. కొందరు వ్యాపార పనుల నిమిత్తం అంటారు.. కొందరు అతడి వ్యసనాలు కారణం అంటారు.. మిగతా అందరు ఇవన్నీ అంటారు. 

ఏమైనా అతడు మాత్రం పట్నం సౌకర్యాలను మా పల్లెకు చాలా మటుకు సమకూర్చేసాడు.

దాంతో మా ఊరులో చాలా మంది అతనికి మరింత గాఢమయ్యారు. అతడు అన్నదానినే తమ వంతుగా ఎత్తుకోడంలో పోటీలు పడుతున్నారు.


సుబ్రహ్మణ్యుడుకు అట్టి వారు జాస్తీగానే తారసపడుతుండడంతో తన మేలును గుంభనంగా పెంచి పోషించుకుంటున్నాడు. 

ఆ తోవనే పొరుగున ఉన్న పట్నంని తొక్కేసి, దానిని ఆనుకొని ఉన్న మహా నగరంన పక్కా తిష్ట ఏర్పర్చుకున్నాడు.


సుబ్రహ్మణ్యుడు శైలిని దగ్గర నుండి ఎఱిగిన నేను ప్రేక్షకుడు మాదిరినే. నా వల్ల సుబ్రహ్మణ్యుడుకు తరిగేది ఏమీ లేదు.. ఆగేది ఏమీ లేదు. 

 నేను చేతకాని వాడిని, చేష్టలుడిగిన వాడిని. కాకపోతే ఉండలేక చెవులు కొరుకుతుంటాను. ఉద్యమించలేక ఉపమానాలు వెతుక్కుంటుంటాను.

 ఆ ధోరణి సారమే నేను మొదట్లో చెప్పిందంతా.

 మీకు అర్ధం కావడానికి మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దీని తర్వాత ఐనా నా గోసను గుర్తించండి.


 సుబ్రహ్మణ్యుడు తన చాతుర్యం పరదా మాటున తన స్వలాభేక్షను తనివితీరా తీర్చుకుంటూనే, అడపాదడపా తను విదిలించే కొసరులకు మురిసిపోయి జేజేలు పలికిన జనం ఆసరాతో అతడు శిఖరాల పొలిమేరలకు ఎగతోయబడ్డాడు. చివరాఖరుకు చావుతో అడ నుండి దబేలున కుప్పకూలాడు.


 సుబ్రహ్మణ్యుడు చచ్చేక.. మెల్లి మెల్లిగా అతడు వెనుకేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయలవుతున్నాయి.


 దాంతో.. 

 కొంత మంది.. సుబ్రహ్మణ్యుడుపై శాపనార్థములు చిమ్ముతున్నారు మెల్లి మెల్లిగా.

 కొంత మంది.. తమకెందుకులేలా బ్రతికేస్తున్నారు.


 కొంత మంది.. విస్మయమై అంతలోనే మామూలయ్యిపోతున్నారు. 

 కొంత మంది మాత్రం.. సుబ్రహ్మణ్యుడు అంతటి వాడు, ఇంతటి వాడు అంటూ తమ తమ పబ్బాలుకై ప్రాకులాడుతున్నారు.


 నేను మాత్రం ఇప్పటికీ ఏమీ లేదా ఏదీ చేపట్టలేక, ఉపోద్ఘాతాల్లాంటివి వల్లిస్తున్నాను. 

 వినే వాళ్లలో మార్పు వచ్చే వరకు చెప్పే వాళ్లు ఉండనే ఉంటారు, నాలా. 

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.




174 views0 comments

Comentários


bottom of page