top of page

అన్నగారి అండ


'Annagari Anda' - New Telugu Story Written By Pitta Gopi

'అన్నగారి అండ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


శ్యాం తాను కూర్చున్న వీల్ చైర్ ను తన చేతులతో గబగబా తోసుకుంటు బాధపడుతూ వెళ్తున్నాడు.


ఎందుకో.. కానీ శ్యాం మనసులో త్వరగా గమ్యం చేరాలనే ఆత్రత, అతని కళ్ళలో తన అన్నగారు సిద్దుకి వచ్చి పడిన కష్టం కనపడుతుంది.


అన్నగారి కి యాక్సిడెంట్ అయిందనే వార్త వినగానే ఆసుపత్రికి వెళ్ళిన శ్యాం తన వదిన సుశీలకి, డాక్టర్ కి జరిగిన సంభాషణ విన్నాడు.


"మీ భర్త కు తల పై బలంగా గాయం కావటంతో మెదడు పై ప్రభావం చూపుతుంది. అతను నెల పాటు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు కానీ.. ఏమీ మాట్లాడకూడదు అలా మాట్లాడితే మెదడు పై బారం పడుతుంది. తర్వాత కోలుకోవటానికి రెండు మూడు నెలలు పడుతుంది. మరో వారం పాటు ఆసుపత్రిలో ఉంచితే మంచిది. మా ఫీజు త్వరగా చెల్లించండి. లేకపోతే ఇతను బతికే చాన్స్ లేదు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా.. ఇదే ట్రీట్మెంట్ ఇదే ఖర్చు వస్తానమ్మా " అంటూ వెళ్ళటం.


సుశీల దేవుడిని తలుచుకుని

"దేవుడా.. ఇంత నరకంలో పడేశావేంటీ.. ఆయన సంపాదించిన డబ్బులు ఇప్పటికే వైద్యానికి ఖర్చు చేశాను. ఇప్పుడు డబ్బులు లేవు ఏం చేయాలో మీదే దయ " అంటూ సిద్దు కాళ్ళపై పడి ఏడవటం శ్యాం వింటాడు.


ఎలాగైతేనేం గమ్యం చేరుకుని ఆసుపత్రిలో కి అతికష్టం మీద వెళ్ళి

"వదినా.. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఇవి చాలకపోతే మళ్ళీ వెళ్తాను తెస్తానని చెప్పు డాక్టర్ కి అన్నయ్య కి నేను ఉన్నాను. ఎలాగైనా కోలుకోవల్సిందే " అంటూ మరలా బయటకు వెళ్తాడు శ్యాం.


శ్యాం పగలంతా సైకిల్ ఫంక్చర్స్ వేస్తూ.. రాత్రి ట్యూషన్ చెప్తూ వచ్చే డబ్బులును వదినకు ఇచ్చాడు. తాను వైకల్యం తో ఉన్న ఇప్పుడు కూడా అదే పని చేస్తూ వైద్యానికి నేను ఉన్నాననే భరోసా ఇచ్చాడు శ్యాం.



ఆసుపత్రిలో సిద్దు కి తమ్ముడుతో మాట్లాడాలని అతడికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని ఉన్నా.. నరాలు చిట్లుతాయనే భయంతో మాట్లాడలేదు. అసలు తమ్ముడికి వైకల్యం తన వలనే వచ్చింది అని మనసులో గతాన్ని నెమరవేసుకున్నాడు.


శ్యాం, సిద్దుకన్నా వయసులో కేవలం రెండేళ్ళు చిన్న. అల్లారు ముద్దు గా పెరిగి, చెట్టు పుట్టల్లో వీధి వాడల్లో కలిసి తిరుగుతూ ఉండేవారు. ఒకనాడు పిప్పిరిమెంటు బిళ్ళ కొని తెస్తూ రోడ్డు మధ్యలో అదుపుతప్పి పడిపోయి నేలపాలైన బిళ్ళలు ఏరుకుంటు వాహనాలు రాకపోకలు గమనించలేదు సిద్దు.


దూరంలో శ్యాం దీన్ని గమనించి వేగంగా పరిగెత్తుకు వచ్చి సిద్దుని కాపాడేక్రమంలో తన రెండు కాళ్ళపై నుండి భారీ వాహనం వెళ్ళిపోయి కాలి ఎముకలు పగిలిపోగా మోకాలి ఎముక కాస్తా పక్కకు వెళ్ళింది.


డాక్టర్ గారు "చిన్న వయసులో సర్జరీ చేసేందుకు ఒప్పుకోలేదు.మరో పదేళ్లు వీల్ చైర్ పై ఉండాలని, తర్వాత ఎముకలు పగుళ్లలో కాస్త మార్పు వస్తే సర్జరీ చేస్తామని చెప్పారు.


అప్పటి నుండి శ్యాం ను మంచిగానే చూసుకున్నాడు సిద్దు. తాను ఓ ప్రవేటు కంపెనీలలో జాబ్ చేస్తూ సెటిల్ అయ్యాడు.


అయితే అతనికి పెళ్ళి కావటం తల్లి వృద్ధురాలు కావటంతో, భార్య మాటలు విని మొదట తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చాడు సిద్దు.


శ్యాం కి యాక్సిడెంట్ అయి పదేళ్లు దాటడంతో ఒకనాడు "అన్నయ్యా! సర్జరీ కి వయసు దాటింది కదా.. వెళ్దామా " అన్నాడు.


కానీ.. వదిన "ఇప్పుడెందుకు సర్జరీ.. అనవసర ఖర్చులు దండగ. అయినా వాడ్ని మనమేగా చూసుకుంటున్నాం. సర్జరీ కి ఇంకా టైం ఉందని చెప్పేయండి" అని ఒప్పించింది.


దీంతో సిద్దు “తమ్ముడూ! సర్జరీ కి కాస్త టైం తీసుకుందామని డాక్టర్ చెప్పారు. కాస్త ఓపిక పట్టు. అయినా ప్రస్తుతం నా దగ్గర డబ్బు కూడా లేదు. నిన్ను చూసుకుంటుంది కూడా మేమే కదా" అన్నాడు.


ఆ మాటలకు ఆ రోజు నుండి అన్న ఇంటి పక్కనే ఉన్న తమ చిన్ననాటి పాడుపడిన పూరి గుడిసెలో ఉంటూ సైకిల్ రిపేర్లు, ట్యూషన్ డబ్బులు తో కాలం వెచ్చిస్తున్నాడు. అలా గతాన్ని, తాను చేసిన తప్పును తెలుసుకుని మాట్లాడకుండానే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు సిద్దు.


సిద్దు ఏడుపును అర్థం చేసుకున్న బార్య సిద్దుని గుండెకు హత్తుకోగా.. మనసులో బాధను ఛెప్పలేక డబ్బులు ఇచ్చి తమ్ముడు వెళ్ళిన దారిని సుశీల కు చూపిస్తూ.. చిన్నపిల్లాడిలా ఏడ్చాడు సిద్దు.


వైద్యానికి డబ్బులు లోటు రానివ్వకుండా శ్యాం చూసుకోవటంతో అనుకున్నదాని కంటే ముందే సిద్దు కోలుకున్నాడు. అన్నయ్య కోలుకున్నాడనే ఆనందంతో తనకు సర్జరీ ఇప్పటికైనా చేయిస్తాడనే ఆశతో ఉన్నాడు.


కానీ.. సిద్దు బాధ కేవలం ఆసుపత్రి బెడ్ వరకే పరిమితం అయింది. వదిన సుశీల మనసు కాస్త కరగటంతో సిద్దుని నిలదీసింది, బతిమాలింది. దీంతో తెలివి తెచ్చుకున్న సిద్దు శ్యాం కి సర్జరీ కి ఏర్పాట్లు చేసి వీల్ చైర్ నరకాన్ని తప్పించాడు.


శ్యాం నిజంగా తనను కష్టాల నుండి తప్పించాడని, శ్యాం లేకపోతే తాను భర్తను బతికించుకోవటం దాదాపు అసాద్యమని, సర్జరీ అయ్యాక శ్యాం కంటే ముందే అత్తగారిని ఇంటికి తెచ్చి శ్యాం ని మరింత ఆనందం లోకి నెట్టింది సుశీల.


శ్యాం ని చూసి ఆ ముగ్గురు, ఆ ముగ్గురిని చూసి శ్యాం ఆనందించసాగారు.


‘ఆనందం అయినా విచారం అయినా, జీవితమైనా అసలు ఏదైనా తల్లిదండ్రులు తర్వాత అన్నా వదినల లోనే ఉంటుంది అని, వారి సహకారం లేకపోతే ఎంతటి వారైనా ఏం సాధించలేరని, అన్న వదినల సహకారం తనకు లభించటం వలనే తాను సాధారణ స్థితి కి వచ్చా’నని మనసులో అనుకున్నాడు శ్యాం.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం






1 Comment


sudershanap44
Aug 26, 2023

కథ బాగుంది-అభినందనలు


Like
bottom of page