top of page
Writer's picturePitta Govinda Rao

'అన్నయ్యా..' అన్నావంటే..



 'Annayya Annavante' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 21/08/2024

'అన్నయ్యా.. అన్నావంటే..' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


అమ్మలో ఒకటో పదం, నాన్నలో రెండో పదం కలిపితే అన్న. 


అన్న అంటే అందరికీ మక్కువ, దైర్యం. ఏ పని తలపెట్టినా, ఎక్కడ ఉన్నా మనం దైర్యంగా ఉన్నమంటే ఖచ్చితంగా మనకు అన్న అండ ఉందనే అర్థం. ఇద్దరు అన్నదమ్ముల్లో ఉన్న ప్రేమాభిమానాల కంటే ఇద్దరు అన్నా చెల్లెళ్లు, లేదా ఇద్దరు అక్కా తమ్ముళ్లు మద్య ప్రేమాభిమానాలు మరింత ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే వారి ప్రేమకు కొలమానాలుండవు. 

ఇది అన్నా చెల్లెల్ల అనుబంధం. 


ఒక చెల్లికి మంచి అన్న దొరకటం నిజంగా అదృష్టమే కదా.. ?


వాణి రాఖీ పండగ రోజు రాఖీ పట్టుకుని అన్నయ్య లోకేష్ ఇంటికి వచ్చింది. అన్నయ్య ఇల్లు చిన్న రెండు గదులు ఇల్లు. వాణి మెడలో పుస్తెలు బంగారంతో చేయబడ్డాయి. అంతేనా.. మంచి చీర, ఎత్తు చెప్పులు ఒకటేమిటి.. ? చెల్లెలు లోపలికి వెళ్ళగానే అన్న ఎదురు వచ్చాడు. చెల్లెలు ఎందుకు వచ్చిందో తెలియక బిక్క ముఖం వేశాడు లోకేష్.


వదినమ్మ వంటింట్లోకి వెళ్ళి తాగటానికి ఏదో పానీయం కలిపి తెచ్చింది. వదిన తెచ్చిన పానియాన్ని ఇష్టంగా తాగింది వాణి. తర్వాత తన చేతిలో ఉన్న రాఖిని చూపించింది అన్నకు. పాపం బరువు, బాధ్యతలతో తడిసి ముద్దవుతున్న లోకేష్ కి ఈరోజు రాఖి పండగనే తెలియదు. రాఖీ చేతిలోకి తీసుకుని అన్న చెయ్యి అందుకుని కట్టి ఆశిర్వదించమని కాళ్ళ పై పడగా.. 


లోకేష్ మాత్రం భార్యను ‘చేతిలో డబ్బులు లేవు, లోపలికెళ్ళి డబ్బులు తీసుకురా, చెల్లికి ఇవ్వాలి’ అన్నట్లు సైగా చేశాడు. ఆవిడ లోపలికి వెళ్ళిందే తప్పా డబ్బులు తీసుకురాలేదు. ఎందుకంటే.. ! ఆ ఇంట్లో డబ్బులు లేవు కనుక. ఎప్పుడు తెచ్చిన డబ్బులు అప్పుడే ఖర్చు అయిపోతాయి కనుక. 

అయితే అన్న జేబులో నుండే రెండు వేల రూపాయల కాగితం తీసుకుని వెళ్ళటం లోకేష్ భార్య చూసింది. 


"నా చెల్లెలు ఎంత మంచిదో చూడవే.. నా పరిస్థితి అర్థం చేసుకుని తానే ఆ నోటు నా జేబులో పెట్టి తానే తీసుకుంది నేనే ఇచ్చినంత ఆనందంతో " అంటూ కళ్ళనీళ్ళు పెట్టాడు. తర్వాత తన ఫ్యాంటు జేబులో ఉన్న నోకియా ఫోన్ రింగ్ అయింది. 


"అన్నయ్య, నేను నీ ముద్దుల చెల్లెల్ని. నేను మీ ఇంటికి వచ్చి అక్కడ పొరపాటున ఒక బ్యాగ్ ని మర్చిపోయాను. ముందుకు వెళ్ళాక తిరిగి వెనక్కి రాకూడదు కాబట్టి నేను మరలా వెనక్కి రావటం లేదు. ఇప్పటికే నేను చాలా దూరం వెళ్ళిపోయాను. నాకు ఆ బ్యాగ్ అవసరం లేదు. ఆ బ్యాగ్ లో ఉన్న వస్తువులు కూడా అవసరం లేదు. మీ బావగారు వాటిని మరలా తెచ్చి పెట్టగలరు. వాటిని మీరు వినియోగించుకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని నాకు పంపకండి. అలా చేస్తే మీ చెల్లి మీద ఒట్టు. బై అన్నయ్య.." ఇది ఫోన్ సంభాషణ. 


అక్కడే ఉన్న బ్యాగ్ ని చూశాడు. 


‘బ్యాగ్ అంటే తన పర్స్ లాంటిది అనుకున్నా.. ఇంత పెద్దగా ఉంది’ అని ఆశ్చర్యపోతు తెరిచి చూశాడు. అందులో ఒక లేఖ, నగలు, డబ్బులు కట్టలు చాలా ఉన్నాయి. 


హుటాహుటిన ఒక అబ్బాయిని పిలిచి ఆ లేఖని చదివమన్నాడు. ఎందుకంటే.. తనకు తన భార్యకు చదువు రాదు కాబట్టి. 


"ప్రియమైన నా ప్రాణం, నా సర్వస్వం అయినటువంటి నా ముద్దుల అన్నయ్యకు నమస్కారం. అమ్మానాన్నలు చిన్నప్పుడే మనల్ని వదిలి పరలోకం వెళ్ళిపోయినా అన్నీ తోడునీడై నీవే నడిపించావు. నాకోసం నీ చదువు అనే పదం కూడా తెలుసుకోలేకపోయావు. నన్ను చదివించి, నువ్వు నిరక్షరాస్యుడివి అయినావు. డబ్బు కోసం చూసుకోకుండా నేను ప్రేమించిన వాడితో ఘనంగా పెళ్లి చేసి నీ విలువైన జీవితం నా కోసం త్యాగం చేశావు. 


నీవు నాకు అన్నయ్యవే కాదు, దేవుడివి. అందుకే ఈరోజు నీకు నేను పంపిన ఈ డబ్బు కంటే, నా సంతోషం కోసం ఆస్తులు, ఇల్లు తాకట్టు పెట్టి నా పెళ్ళి జరిపించిన ఆ డబ్బుకే విలువ. అన్నయ్య, ఈ రాఖీ పండగ నుండి నీ జీవితం వేరే లేవల్ లో ఉంటుంది. అన్నయ్య అన్నానంటే చాలు, నా కష్టం నా బాధ మటు మాయం చేసేస్తావు. నీ బాధని నేను తెలుసుకోలేనా.. ? 


ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టు నీవు నా కోసం అమ్ముకున్న ఆస్తులు కొను. కష్టంలో తోడుగా ఉన్న వదినమ్మని బాగా చూసుకో. నీ వెనుక ఇప్పుడు నేను ఉన్నాను అన్నయ్యా! అంతమాత్రాన నీకంటే నేను ఎక్కువ కాదు. నీకోసం ఏమి ఉంచుకోకుండా అన్నీ వదులుకున్న గొప్ప అన్నయ్యవి నువ్వు. ఒక గొప్పింటికి కోడలినయ్యాక సహాయం చేశాను. చెల్లెలు కోసం నువ్వు చేసిన త్యాగం కంటే నేను చేసింది గొప్పేం కాదు అన్నయ్యా. ప్రేమతో నీ వాణి. 


ఇది.. లేఖ సారాంశం. 


 లేఖలో ఒక్కో మాట లోకేష్ గుండెకు తాకాయి. కళ్ళలో ధారాళంగా కన్నీరు ఉట్టుతు నేలజారుతోంది. 

చిన్ననాటి గతాన్ని కళ్ళముందుకు తెచ్చుకున్నాడు. 


 వాణికి ఒక అన్నయ్య ఉన్నాడు. అతడి పేరు లోకేష్. పాపం ఆ ఇద్దరు అన్నా చెల్లెల్ల బ్యాడ్ లక్ వలన చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. వారి భారం మనకెందుకు అని బంధువులు వెనుకడుగు వేశారు. వాళ్ళకి వేరే దిక్కు లేకుండా పోయింది. కర్మకాండలకు మాత్రం బంధువులు సహకరించారు. ఆ తర్వాత వాణి లోకేష్ లు అనాథలుగా మిగిలారు. 


చివరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల సమాచారంతో ఓ స్వచ్ఛంద సంస్థ వాణి లోకేష్ ల యోగక్షేమాలు చూసుకునేందుకు ముందుకు వచ్చింది. 


వాళ్ళు తమ ఇంటికి వచ్చి లోకేష్ కి విషయం చెప్పారు. లోకేష్ వాణి ఎంతో ఆనందించారు. అయితే.. !


 వారి ఒక్క మాటతో ఆ అన్నా చెల్లెల్ల ఆనందం ఆవిరి అయిపోయింది. అది ఏంటంటే.. ?


 ఆడపిల్లలను, మగపిల్లలను వేర్వేరుగా ఉంచటం. 

" అన్నయ్యని విడిచి ఉండలే"నని వాణి

" చెల్లిని దూరం చేసుకోలే"నని లోకేష్ ఏడవసాగారు. 


చివరకు లోకేష్ తన పంతం నెగ్గాడు. "నా తండ్రికి ఉన్న ఎకరా పొలం ఉపయోగించుకుని ఎలాగైనా తానే చెల్లిని పోషించుకుంటా"నని సంస్థ సభ్యులను ఒప్పించాడు. 


అప్పటి నుండి తానే వ్యవసాయంతో పాటు అన్ని పనులు చేస్తు తాను బడి ముఖం చూడకుండా చెల్లిని బడికి పంపేవాడు. ‘అన్నయ్యా’ అంటే చాలు పరిగెత్తుకొస్తాడు. తనకు ఏం కావాలంటే అది కొనిచ్చాడు. యుక్త వయసుకొచ్చాక ఒక ఆర్మీ జవాన్ ని వాణి ప్రేమించింది. 


పేదవాళ్ళం ఉద్యోగస్తులకు ఇచ్చి పెళ్ళి చేయగలమా.. ? కట్న కానుకలు భారీగా ఇచ్చుకోవల్సిన పరిస్థితి ఈరోజుల్లో ఉంది. లోకేష్ మాత్రం చెల్లినే తన ప్రాణంగా పెంచాడు. తనకంటూ ఏమీ ఉండదని తెలిసినా.. చెల్లి జీవితం ఆనందంగా ఉండాలని కట్నం కోసం ఎకరాం పొలం అమ్మేశాడు. పెళ్ళి ఖర్చులు, పెళ్ళి సామగ్రి కోసం తన ఆరు గదుల ఇంటిని అమ్మి రెండు గదుల ఇంటికి మారాడు. 


ఇంత కట్నం పోసి చెల్లెలు పెళ్లి చేసినందుకు వాణి భర్త లోకేష్ పై ఎంతో అభిమానం పెంచుకున్నాడు. ఆ అభిమానం ఈరోజు అతడి ఋణం తీర్చుకునేలా చేసింది. కష్ట సుఖాల్లోనే కాదు.. జీవితాన్నే త్యాగం చేయటంలో ఈ అన్నా చెల్లెల్లు ఒకరికి ఒకరు మించిపోయారు. ఈ అనుబంధం ఇలా కొనసాగాలని కోరుకుందాం. 


*** *** *** *** *** *** ***


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం



47 views0 comments

Comments


bottom of page