top of page
Writer's pictureGadwala Somanna

అంతే కదూ!!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#అంతేకదూ, #AntheKadu


Anthe Kadu - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 11/11/2024

'అంతే కదూ!!' తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


సూర్యోదయమైతేనే

పారిపోవును చీకట్లు

గుండె ధైర్యముంటేనే

తలవంచును ఇక్కట్లు


క్రమశిక్షణ ఉంటేనే

బాగుపడును జీవితాలు

పుస్తకాలు పఠిస్తేనే

ఉల్లసించును హృదయాలు


సాహసం చేస్తేనే

సాధ్యమగును విజయాలు

కష్టాన్ని నమ్మితేనే

వరించును సత్ఫలితాలు


శత్రుత్వం జయిస్తేనే

చెలిమి పూలు పూసేది

క్షమాగుణం చాటితేనే

ఏక కుటుంబమయ్యేది


గద్వాల సోమన్న  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

1.పేరు:గద్వాల సోమన్న

2.ఊరు:మొలగవల్లి

3.మండలం:ఆలూరు

4.జిల్లా:కర్నూలు

5.విద్యార్హతలు:BTech(Mechanical engineering): BSC: BEd

7.వృత్తి:గణితోపాధ్యాయుడు[SA(MATHS)]

8.అర్ధాంగి:గద్వాల సుశీల

9.సంతానం:గద్వాల రచన,గద్వాల రిచ్

9.ప్రవృత్తి :సాహిత్య సృజన ,సాంఘిక సేవాకార్యక్రమాలు'విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడం,మాతృభాష పై మమకారం పెంపొందించడం మొ.వి

7.పనిచేస్తున్న ఊరు:కాంబదహాళ్

8.పనిచేస్తున్న మండలం:పెద్దకడబూర్

9.బాలరంజని కర్నూలు జిల్లా అధ్యక్షులు

10a)Gurajada foundation:కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు

10b)స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు

11.

----------------------------------------

ముఖ్యాంశాలు:

---------------------------------------

గద్వాల సోమన్న గారికి

గౌరవ డాక్టరేట్ ప్రదానం

--------------------------------------

కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్నను,వారు అనతి కాల వ్యవధి లో 57 పుస్తకాలు వ్రాసి,ముద్రించడమే కాకుండా బాలసాహిత్యంలో విశేష కృషికి గాను గౌరవ డాక్టరేట్ వరించింది. ఇందిర ఆర్ట్ ఫౌండేషన్ మరియు ఫ్రెండ్ షిప్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సంస్థలు,తెలంగాణ ఆధ్వర్యంలో, మిర్వ కాఫీ హోటల్ దగ్గర,అల్లైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియం,హిమాయత్ నగర్,హైదరాబాద్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో గౌరవ డాక్టరేట్ గద్వాల సోమన్న అందుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కవులు,కళాకారులు పాల్గొన్నారు.గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా.గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.


*వృత్తి ప్రభుత్వ గణితోపాధ్యాయుడు

ప్రవృత్తి సాహిత్య సృజన

*36పుస్తకాలు ముద్రణ,

45 పురస్కారాలు,సత్కారాలు

పలు పుస్తకాలకు సమీక్షలు, ముందు మాటలు రాయడం

*మూడు వేలు పై చిలుకు కవితలు,గేయాలు,పద్యాలు,కథలు,వ్యాసాలు,వ్యంజకాలు, నానీలు,వెన్నెలమ్మ పదాలు,హైకూలు...రాయడం

*విద్యార్థులచే "చిట్టిచేతులు-గట్టిరాతలు" బాలగేయాల సంకలం,హిస్సారమురవణి బడిపిల్లల కథల పుస్తకానికి కీలక పాత్ర వహించడం

*పిల్లల మనసులను  మాతృభాష వైపు మళ్లించడం

*మాతృభాష తెలుగుభాషాభివృద్ధి కి కృషి చేస్తూ..రాణింపు..

*అనాథ పిల్లలకు,వృద్ధులకు అన్నదానం, నిత్యావసర వస్తువులు పలుమార్లు పంపిణీ

*శ్రమదానం, శుభ్రత,పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం

*పిల్లలకు ప్రోత్సాహకాలగా బహుమతుల ప్రదానం, ప్రైజ్ మనీ,క్విజ్ ,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ

*విద్యార్థులకు మాతృభాష పై అభిరుచి పెంపొందించి, వారిలోని ప్రతిభను వెలికితీయడం

*వినూత్న కార్యక్రమాలు నిర్వహణ(విద్యార్థులకు)

* పాఠశాల అభివృద్ధి పనులకు దాతలచే విరాళాల సేకరణ

*పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం మున్నగునవి

 ---------------------------------

13.రచనలు:ముద్రితాలు

--------------------------------

1.పసిడి హృదయాలు

2.ఓ తెలుగు బాల

3.వెన్నెల బాల పదాలు

4.బ్రహ్మవాక్కు శతకము(ఆట వెలది పద్యాలు)

5.రత్నాల సరాలు

6.గద్వాల మణిపూసలు

7.చిత్తిచేతులు-గట్టిరాతలు

(బాలల సంకలనం)

8.గద్వాల కైతికాలు

9.గద్వాల చెప్పిన నీతి కథలు

10.వెన్నెలమ్మ పదాలు-1

11.సోమ నాఖ్యుమాట శతకము (ఆట వెలది పద్యాలు)

12.అక్షర నక్షత్రాలు(బాలగేయాలు)

13.బాలల ముత్యాల హారాలు

14.హృదయ స్పందన

15.ముత్యాల హారాలు-జీవిత సత్యాలు

16.వెన్నెలమ్మ పదాలు-2

17.గుణింత గేయాలు

18.ఒత్తులు గేయాలు

19.సుభాషితాలు-ముత్యాల హారాలు

20. స్పందన-తేటగీతి పద్యాలు

21.అచ్చుల పద గేయాలు

22.పర్ణశాల

23.విద్యా విజ్ఞాన కుసుమాలు

24.చిట్టి చందమామ

25.కొత్త చిగురు

26.మహనీయులు

27.జీవ ప్రపంచం

28.సోమన్న మధురిమలు

29.కన్న తల్లి-కల్పవల్లి

30.పాలపుంత

31.అక్షర గేయాలు

32.తేనెధారలు

33.పాలుతేనెలు

34.తుషార బిందువులు

35.సమతా సాహితీ సుమాలు

36.e-తరం బాలలు

37.అమ్మ ఒడి-ప్రేమ బడి

38.నిండు జాబిలి

39.అమ్ముల పొది

40.వెన్నెల వాన

41.జయహో! చంద్రయాన్-3

42.ప్రతిబింబాలు

43.అక్షర పద గేయాలు

44.అనుబంధాలు

45.ముద్ద మందారాలు

46.మల్లె పూవు

47.స్వగతాలు

48.జ్ఞాపకాల దొంతరలు

49.చిట్టి చిలుకమ్మ

50.నిండు జాబిలి

51.లేత గులాబీలు

52.పాల బుగ్గలు-లేత మొగ్గలు

53.కాంతి కిరణాలు

54.కడలి కెరటాలు

55.చిట్టి చిట్టి కమలాలు

56.ప్రాస పద గేయాలు

57.చిరు మువ్వలు(ముద్రణలో ఉన్నది)

----------------------

*.జాతీయ ఉత్తమ బలసేవక్-2017,బలానందం,విజయనగరం వారిచే

*.ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారం-2017,ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, విజయనగరం వారిచే

*.సహస్ర కవిమిత్ర-2018,తెలుగు కవితావైభవం,హైదరాబాద్ వారిచే

*.సహస్ర కవిరత్న-2018,తెలుగు కవితా వైభవం, హైదరాబాద్ వారిచే

*.బాలరంజని కవిమిత్ర-2018,బాలరంజని సంస్థ,శ్రీకాకుళం వారిచే

*.బాలసాహితీ భూషణ్-2018,బాలరంజని,శ్రీకాకుళం వారిచే

*.ఉత్తమ కవిత సాహితి పురస్కారం-2018,శ్రీకిరణ్ సాంస్కృతిక సమాఖ్య'హైదరాబాద్ వాటికే

*మాతృభాషాభివృద్ధి పద్య గాన ప్రక్రియకు-2018,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సత్కారం

*2018,జిల్లా రచయితల సంఘం,అనంతరం వారిచే,జాతీయ యువకవి సమ్మేళనంలో సన్మానం

*.కవి శిరోమణి-2019,కాగ్నా కళాసమితి,తెలంగాణ వారిచే

*.గుర్రం జాషువా సాహితీ సేవాపురస్కారం-2019,తెలుగు సాహితీ వేదిక,చిత్తూరు వారిచే

*సాహితీ సేవా పురస్కారం-2019,చిన్నయ సూరి సాహితీ సమితి,నంద్యాల,కర్నూలు జిల్లా వారిచే

*.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు-2019,కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యాన్ గారిచే

*.మెరుపుమిత్ర-2020,అమ్మానాన్న సాహితీ సేవా సంస్థ,వరంగల్ వారిచే

*.తెలుగు తేనీయ కవిమిత్ర-2020,తెలంగాణ వారిచే

*.దాశరథి పురస్కారం-2020,మహతీ సాహతీ

*.శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.వచన పద సరస్వతీ పుత్రులు పురస్కారం-2020,తెలంగాణ వారిచే

*.స్వర సరస్వతీ పుత్రులు పురస్కారం-2020,తెలంగాణ వారిచే

*.SP బాలు సుబ్రమణ్యం పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.కవిశేఖర పురస్కారం-తెలుగు కళా నిలయం,తెలంగాణ వారిచే

*.వాణిశ్రీ పురస్కారం-2020,తెలంగాణ తెలుగు కళానిలయం,నిర్మల్ జిల్లా వారిచే

*.మధురవాణి కవిరత్న-2020,తెలుగు కళా నిలయం,తెలంగాణ వారిచే

*.సిరిమాంజరి కవిమిత్ర-2020,ఉషోదయ సాహితీ వేదిక, చిత్తూరు వారిచే

*.రాగ గీతిక కవిమిత్రపురస్కారం-2020,ఉషోదయ 

*.రాగశ్రీ పురస్కారం-2020,ఉషోదయ సాహితీ వేదిక, చిత్తూరు వారిచే

*.సినారె పురస్కారం-పున్నమి పత్రిక వారిచే

*.పద్మరత్న కవిమిత్ర-2020,పద్మరత్నాలు సాహితీ వేదిక,కర్నూలు వారిచే

*.పంచరత్న కవిమిత్ర-2020,తెలుగు సాహిత్య వేదిక,ఖమ్మం వారిచే

*.పంచరత్న కవిరత్న-2020,తెలుగు సాహిత్య వేదిక,ఖమ్మం వారిచే

*.సర్ ఆర్థర్ కాటన్ దొర పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.హరివిల్లు పురస్కారం-2020,భద్రాద్రి సాహితీ వేదిక,భద్రాద్రి  కొత్తగూడెం వారిచే

*.కోడి రామకృష్ణ పురస్కారం-2020,పున్నమి వారిచే

*.కైకాల సత్యనారాయణ పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.రాజశ్రీ పురస్కారం-2020,అఖిల భారత సాహిత్య పరిషత్,మంచిర్యాల వారిచే

*.డా.చింతోజు బ్రహ్మయ్య-బాలమణి పురస్కారం-2020,రాజన్న సిరిసిల్ల, తెలంగాణ వారిచే

*షాడో కవి శేఖర

*షాడో కవి భూషణ

*షాడో కవికుల రత్న

*పర్యావరణ మిత్ర

*సాహితీ ముత్యాల హారం

*షాడో కవి తిలక

*ముత్యాల హారం సహస్ర కవిరత్న

*వెలుగు దివ్వె పురస్కారం

*బాలబంధు బిరుదు

*గురజాడ స్పూర్తి రత్న అవార్డు

*తెలుగు బంధువు పురస్కారం

-------------------------------------

15.రచనా వ్యాసంగం:

-------------------------------------

నా కవితలు,గేయాలు,కథలు,వ్యాసాలు వివిధ ప్రత్రికలలో ప్రచురణ.1.సాక్షి 2.ఈనాడు,3.ఆంధ్రజ్యోతి, 4.ఆంధ్రప్రభ, 5.ఆంధ్రభూమి, 6.ప్రజాశక్తి 7.వార్త,8.విశాలాంధ్ర,9.సూర్య,10.అక్షర సాయంకాలం పత్రిక,11.తెలంగాణ కేక,12.నేటినిజం, 14.నవతెలంగాణ,15.నమస్తే తెలంగాణ, 16.బాలసుధ మాసపత్రిక,17 జనశక్తి, 18.గణేష్,19.జనవారధి, 20.ఎన్కౌంటర్,, 21.ఆంధ్ర ఫోకస్,22.మెట్రో గలుము, 23.ప్రజాకలం, 24.అంకురం,25.అల,26.కస్తూరి(మాసపత్రిక),27.మొలక మాసపత్రిక, 28మొలకన్యూస్(ఆన్లైన్ వెబ్ పేపర్),29..స్వర్ణపుష్పము మాసపత్రిక,30.నగరనిజం ,31.కోస్తాప్రభ ,32.నవ్య మీడియా,33ఫస్ట్ న్యూస్ ,34.తరణం,35.వార్త వీక్లీ ,36.ప్రజాశక్తి వీక్లీ ,37.సేన (అక్షర సైన్యం),38.త్రిశూల్ సమాచార్,38.పల్లెబాట 39హర్షన్యూస్ 40 చిత్తూరు ఫస్ట్ న్యూస్ 41.ప్రజామంటలు 42.ప్రవాహిని 43.తెలుగుప్రభ 44.మరో కిరణాలు 45.పరిమళము.46.జనదీపిక 47సత్తెనపల్లి న్యూస్48.సరికొత్త సమాచారం49.బొబ్బెలి సామ్రాజ్యం..50.వార్తాప్రభ 51.ప్రజానేత్రం52.స్నేహ వార్త53.Ak telu media  54.తెలుగులోకం55.సారథి 56.రాయల కాకతీయ 57. మా వారధి 58.ప్రజాఎస్ప్రెస్ 59.సూర్య ఉదయం60

.నవ భూమి 61.హంస వాయిస్ 62.ప్రజా సంచలనం63.జోర్డార్64.ప్రజా సాక్షి 65.ఆంధ్ర పత్రిక66..తపస్వి.మనోహరం.. వెబ్ పేజీలో 67.అక్షర ఉదయం 68.సాక్షి సండే69.సంచిక వెబ్ పత్రిక70..జయ ధ్వని71.మన జన ప్రగతి72.జనవాదం73.ఉన్నమాట 74.బాధ్యత 75.ప్రజా మలుపు 76.Today telugu daily77.my..bangalore.78.chinnaramanjaney ulu పత్రిక knl 79..జన గొంతుక 80.బహు జన వాయిస్ 81.అనంత జనశక్తి 82.జనం సాక్షి83.పల్లె వెలుగు 84.విశాఖ టు డే85.అనంత ప్రభ 86.కలం(ఆన్లైన్ పత్రిక)87.దివిటి పత్రిక 88గో తెలుగు.కామ్  online paper 89.తెలంగాణ వాణి 90.పబ్లిక్ pulse 91. విజయానికి అభయము 92.కొత్త తరంగం

93. నేటి గళము

94.నేటి రాయలసీమ

95-చెన్నై తెలుగు న్యూస్ టైమ్స్ 96.దిక్సూచి మాసపత్రిక 97.ఘంటారావమ్98.న్యూస్ రీడర్ ,hyd 99.జనోదయ100.ప్రకంపన పత్రిక 101.my tales102.పీపుల్స్ లీడర్

103.కృష్ణ జ్యోతి

104.ప్రభాతదర్శిని.105)ఆంధ్ర సింహం.106)వైజాగ్ ఎక్స్ప్రెస్ 107)మనం 108)కవి పయనం109)టైమ్ టుడే 110)నినాదం111)వార్తాప్రపంచం112)lokal app--జన వాదం113)express daily114)జన ప్రతి ధ్వని115)న్యూస్ chanel116)అక్షర 117)నల్లా సమాచార్ 118)ఆలాపన119)3rd eye.. news paper 120)సీమ కిరణం 121)భావపురి మాసపత్రిక 122)సృజన క్రాంతి 123)చిన్నారి నేస్తం (e-మాస పత్రిక) 124)దళపతి

మొదలగు దిన, వార,మాసపత్రికలలో ముద్రితం.

----------------------------------------

16.ముందుమాటలు-పుస్తక సమీక్షలు చేయడం

----------------------------------------

1.తేనె ధారలు,2.పోకూరి దివిటీలు,3.మధురవాణిలు,4.కైతికాలు,5.మణిపూసలు 6.మదిలోని భావాలు7.బాలగేయాలు8.విరులు8)శ్రామిక నానీలు 10)నానోలు 11)కవి నేత్రం 12)యుగ పురుషులు13)వైద్య మధురిమలు14)చెన్నారావు ముత్యాల హారాలు15)భువన విజయం16)తొలకరి చినుకులు 17)కవి పుంగవులు-జాతి నేతలు 18)అక్షర శ్రామికుడు 19)రాధా మధురిమలు 20)ఓగన్న శతకం 21మున్నగు పుస్తకాలకు ముందు మాటలు,సమీక్షలు రాయడం జరిగింది

----------------------------------------

17.రచన , స్వరకల్పన: నేను రాసిన వేలాది వెన్నె లమ్మ పదాలకు ,బాలగేయాలకు,పాటలకు స్వరకల్పన చేసి ప్రముఖ గాయనిగాయకులచే పాడించడం జరిగింది

----------------------------------------

18.నా పుస్తకాలపై పరిశోధనలు(Phd, Mphil స్కాలర్స్ చే)

----------------------------------------

19.పలు సంకలనాలలో నా పద్యాలు,కవితలు,గేయాలు ముద్రణ:

----------------------------------------

1.అది నుంచి అనంతం దాకా(చారిత్రిక వచన కావ్యంలో నాకవిత. పల్లెప్రజలు-వలసలు)

2.స్నేహం(చెలిమి విలువ)

3.దాశరథి సంకలనం(మహా కవి దాశరథి)

4.సినారె సంకలనం(విశ్వంభరుడు సినారె)

5.పద్యరత్నాలు(అన్నదాత)

6.మణిపూసలు(రైతు గోస)

7.హరివిల్లు(గురువే దేవుడు)

8.ఉ. సా.వే. సంకలనం-1(త్రిపదలు)

9.దళిత పద్య కవులు(ఆట వెలది పద్యాలు)

10.ఉ. సా.వే సంకలనం-2(రోడ్డు భద్రత )

11.తేనీయలు(చిన్న పిల్లలు వేల్పులు)

12.కరోనా. కల్లోలం (సరికొత్త సమాచారం వారి) 

--------------**********----------

20.మూడువేలు పై చిలుకు కవితలు,గేయాలు,పద్యాలు, కథలు,వ్యాసాలు రాశా...

----------------------------------------

అన్నావదినల (గద్వాల ఆనంద్,మరియమ్మల)పెంపకంలో,సహకారంతో, భాషాపాధ్యాయులు  కీ.శే.ఈరన్న,మిత్రుల ప్రోత్సహంతో హైస్కూలు చదివే రోజుల్లోనే సాహిత్యం వైపు మొగ్గుచూపాను.తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు 'మానతా విలువలు''అనే నేను రాసిన వ్యాసం ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది.ఇటీవల కాలంలో గురువు చక్రవర్తి గారి సలహా, సూచనలతో కవితలు, గేయాలు,పద్యాలు,కథలు, వ్యాసాలు,నానీలు, వ్యంజకాలు,వెన్నెలమ్మ పదాలు  వెరసి దాదాపు మూడు వేలు పై చిలుకు సాహిత్య రచనలు చేశాను.పలు పత్రికలలో ప్రచురింపబడ్డాయి.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాను.జిల్లా కలెక్టర్ గౌ.వీరపాండ్యాన్ గారి చేతులు మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు సొంతం చేసుకున్నాను.ఈ అవార్డు ఉపాధ్యాయూనిగా ఎంతో తృప్తి నిచ్చింది."ఏ దేశ మేగినా,ఎందుకాలిడినా.." ఘనతనొసగి,ఆదరించిన  మాతృభాష తెలుగుకు నా వంతు కృషి చేస్తా.మాతృభాష పట్ల మోజు తగ్గి, మోడుబారిన మనసుల్లో చైతన్య చిగురులు చిగురింపజేస్తా.

-గద్వాలసోమన్న, గణితోపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కంబదహాళ్, పెద్దకడబూర్-మం ,కర్నూలు జిల్లా.


27 views0 comments

Comentarios


bottom of page