'Anthena' - New Telugu Story Written By M. Laxma Reddy
Published In manatelugukathalu.com On 27/05/2024
'అంతేనా....' తెలుగు కథ
రచన: M. లక్ష్మా రెడ్డి
అంతేనా.... ఒక్క క్షణం.. ఆ ఆలోచనకే ఒళ్ళు జలదరించింది
కాని.. ఆ తర్వాత జరిగే పరిణామాలు గుర్తొచ్చి.. పెదాలపై జీవం లేని నవ్వు కనబడింది.. రేర్ వ్యూ మిర్రర్ లో..
అంతే కదా.. అలానే జరుగుతుంది... నిజమేగాఇంకా ఏం జరుగుతుందా అనికూతుహలంతో.. ఒక్క నిమిషం ఆ ఆలోచనల్నిఅలానే కంటిన్యూ చేసాను..
తెలిసిన వాళ్ళందరూ ప్చ్.. అనుకుంటారుఅయిన వాళ్ళందరూ.. అయ్యో అని ఓదార్పు కొస్తారు.. దగ్గరి వాళ్ళు దగ్గరుండి అన్ని జరిపిస్తారు.. ఎవరు మన బంధమో.. ఎవరికి మనం భారమో... తెలుస్తుంది కదా... కానీ అలా నిర్ణయించడం భావ్యం కాదు కదా.
మనకోసం వస్తేనే.. మన అవుతారా.. రాలేకుంటే.. నే వారికి ఏం కాకుండా పోతానా.. ఇలా బాలేదు..
ఇంకా నాకు కాస్త టైం ఉందేమో. ఎర్ర లైటు ఇంకా అలానే ఉన్నట్టుంది.. ఛలో.. మన ఆలోచనల్లోకి వెళ్లిపోదాం.. ఇంకా... నా అనుకున్న వాళ్ళ కన్నీట్లో కూడా నా రూపమే కనిపిస్తుంది.. అయినా.. ఈ ఆలోచనే పిచ్చిగా ఉంది. కాని.. జీవిత సత్యం ఇదేగా.. ఏదో రోజు జరగాల్సిందిదేగా...
తర్వాత.. ఏం జరుగుతుంది.. నెమ్మదిగా నిమిషాలు కరిగిపోతాయి.. గంటలు జ్ఞాపకాల్లో బందీ అవుతూ.. రోజుల్లోకి మారిపోతాయి.. జ్ఞాపకాలు మరపు అనే మహాద్భుత శక్తితో పోరాడిఅలసి ఓడిపోతాయి..
నిన్నటిదాకా నవ్వులతో ఉన్న నా రూపం.. ఎక్కడో మసగ్గా కనిపిస్తూ ఉంటుంది వారి కోసం..
కాని నిజమైన చిత్రం ఏంటంటే.. మనకోసం ఏదీ ఆగదు.. కాలమూ ఆగదుగా.. మనవారూఆగరు.. ఆగితే ఈ లోకం సాగదుగా..
ఒంటరి గానే వచ్చాం.. అలానే వెళ్ళాలి..
మద్యలోబోలెడు బంధాలు.. లెక్క తేలని అనుబంధాలు.. లెక్కేలేని అనురాగాలు.. లెక్కలేనన్ని అభిమానాలు.. కొన్ని ఛీత్కారాలు.. ఇంకొన్ని సత్కారాలు.. .. అలా అలా సాగిన జీవన గమనంలో ఏదీ శాశ్వతం కాదు. నా వాళ్ళు.. నెమ్మదిగా అలవాటు పడిపోతారు.. నేను లేకుండా..
నా మాటలు.. నా నవ్వులు. నా సాయం.. నా ఆలన.. కొన్నాళ్ళు వాళ్ళని ఏడిపిస్తూనో.. కళ్ళలో నీళ్ళు తెప్పిస్తూనో.. గుండెని బరువెక్కిస్తూనో.. కానీ.. కాలం ఆగదు.. వారూ ఆగరు..
ఇలా ఎన్నాళ్ళు... ???కొన్నాళ్ళు ప్రేమగా గుర్తుకొస్తానేమో...
తర్వాత.. మరణంతో దూరమైన.. నా జ్ఞాపకాలుఅడుగున పడిపోతాయి.. కొత్త అనుబంధాలు.. వాళ్ళ జీవితంలో ఆనందంగా చేరుతుంటాయి..
అంతేనా.. ఇదేనా జీవితం.. అంతే.. ఇదే జీవితం.. ఇదే నిజం..
ఎవరి తప్పు లేని.. పయనం ఇది.. నేను అంతేగా.. ఇలాగేగా ఉన్నది.. ఎక్కడి నుండి వచ్చామో తెలీదు.. ఊపిరి ఆగిన క్షణం.. పయనమెటో తెలీదు.. ఈ బంధాలు అనురాగాలు.. కనీసం జ్ఞాపకాల్లో కూడా ఉంటాయో లేదో తెలియదు..
అసలేమవుతమో తెలియదు.. అంతేనా.. జీవితం.. ఇదేనా.. నిజమైన నిజం
అయ్యబాబోయ్.. పిచ్చెక్కేలా ఉంది.. ఏం అయింది నాకు. అసలేంటి ఇదంతా.. ఎందుకిలా అనిపించింది..
హా.. గుర్తొచ్చింది.. ఇంత ట్రాఫిక్ లో ఎవరైనా అతి ప్రేమగా నన్ను గుద్దేస్తే..
ఏ మృత్యు శకటమో.. నను ఇష్టంగా వాటేసుకుంటే..
ఏదో రకంగా.. అనూహ్యంగా నా చావు చెలి చెంతకొస్తే..
అయ్య బాబోయ్.. ఆ తర్వాతి క్షణం నుండి.. ఇలా ఉంటుందా..
నిజమే కదా.. కాని అలా అనుకోవడమే బాలేదు..
ఇది నిజమే.. కాని నిజమెప్పుడూ ఎవరికీ నచ్చదు.. అందుకే అది నిజమయ్యింది.. మనకి దూరమయింది.. తప్పుడు భ్రమలే ఇష్టం అందరికి.. కానీ. కానీ జరిగేదిదే.. ఇదే సత్యం.. మార్చలేని నిజం.. మారలేని రేపటి రూపం. మరవలేని.. అలాగని ఏనాడూ వాస్తవంగా నువు చూడలేని కల.. అంతేగా... అబ్బా..... అయినా ఇలాంటి పచ్చి... కాదు కాదు.. పిచ్చి ఆలోచనలొద్దు.. అనుకుంటూ... గేర్ మార్చాను.. ఎదురుగా గ్రీన్ లైట్ చూసి..
***
M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను లక్కీ.. లక్మారెడ్డి
రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..
అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..
నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..
నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...
ధన్యవాదాలు...
Commentaires