#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #AnubandhaluSagipovali, #అనుబంధాలుసాగిపోవాలి
'Anubandhalu Sagipovali' - New Telugu Story Written By Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 21/10/2024
'అనుబంధాలు సాగిపోవాలి' తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“మూడు రోజులు సెలవలు వస్తున్నాయి. ఎక్కడికయినా వెల్దామా మమ్మి” అని అడుగుతాడు చరణ్.
“సరే! సాయంత్రము నాన్న వచ్చిన తర్వాత అడుగుతాను” అని జవాబు ఇస్తుంది తల్లి సుగుణ.
సుగుణ, నాగేశ్వరరావు దంపతులకి ఇద్దరు మగసంతానం. చరణ్ కి ఏడు సంవత్సరాలు
విక్రమ్ కి ఐదు సంవత్సరాలు.
నాగేశ్వరరావు ప్రైవేట్ కంపెనీలో సూపర్ వైసర్ గ పని చేస్తున్నాడు. వీరిది మధ్య తరగతి కుటుంబము. సుగుణ అన్న నిరంజన్ బ్యాంకులో ఆఫీసర్, వదిన ప్రభుత్వ కార్యాలయములో అసిస్టెంట్ గా పని చేస్తోంది.
వీరి గారాల పుత్రుడు రాకేష్.
నిరంజన్ చెల్లెలు సుగుణకి కాల్ చేసాడు. సుగుణ సెల్ ఆన్ చేసింది.
“బాగున్నావా” అని అడిగాడు నిరంజన్.
“ఇన్నాళ్ళకి నేను గుర్తుకి వచ్చానా” అని నిష్టురంగా జవాబిస్తుంది సుగుణ.
“వరుసగా మూడురోజులు సెలవలు వస్తున్నాయి గదా, సోమవారం మీరంతా మాఇంటికి భోజనానికి రండి. నేను బావ గారికి ఫోన్ చేసి చెప్తాను” అని అంటాడు.
“అంత ఆప్యాయముగా పిలిచేసరికి ‘తప్పకుండ వస్తాము’ అని జవాబిస్తుంది సుగుణ.
అనుకొన్నవిధముగా నలుగురు నిరంజన్ ఇంటికి వెళ్తారు.
“బాగున్నావా సుగుణ” అని నిరంజన్ భార్య స్వాతిని పలకరిస్తుంది.
“మీరు రావడము చాల సంతోషము అన్నయ్య గారు” అని సుగుణ భర్తని కూడా పలకరించి వంటింట్లోకి వెళ్లి పోతుంది.
“రాకేష్! మీ ముగ్గురు కలసి నీ గదిలో బొమ్మలతో ఆడుకోండి” అని నిరంజన్ పిల్లలను పంపించేస్తాడు. పెద్ద వాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్న సమయములో స్వాతి, ‘మీరు ఒకసారి వస్తారా’ అని నిరంజన్ ను పిలుస్తుంది.
“మీకేమయినా బుద్దుందా, అంత ఖరీదయిన కీ బొమ్మలతో ఆడుకుంటే అవి పాడయి పోతాయని తెలియదా”.
“వాళ్ళు మన వాళ్లే కదా అని ఆడుకోమని చెప్పాను. అందులో తప్పే ముంది” అంటాడు నిరంజన్.
“మనవాళ్లే, కాదనను. ఆ బొమ్మలు పాడయితే వాళ్ళు కొని ఇవ్వగలరా? అంత ధర అయిన బొమ్మలు ఎప్పుడయినా
చూసిన మోహాలా..” అని నిరంజన్ మీద విసుక్కొంటుంది. స్వాతి.
“సుగుణ వింటే బాగుండదు, సరే ఇప్పుడేమంటావు?” అని అడుగుతాడు నిరంజన్.
“పిల్లలని తీసుకొని, గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకోండి లేదా క్యారం బోర్డు ఆడుకోండి” అని వంటింట్లోకి వెళ్లి పోతుంది.
అనుకోకుండా వీళ్ళున కిచెన్ వరండా దగ్గరనుంచి అన్నయ్య వదినల సంభాషణ వింటుంది సుగుణ. సుగుణకి కోపము వచ్చినా తమాయించుకొని, అన్నావదినాలతో ఏమి తెలియనట్టు భోజనాలు కానిచ్చుకొని వెళ్ళిపోతుంది.
కాలచక్రములో ఇరువయి ఐదు సంవత్సరాలు గడచిపోయాయి.
చరణ్, మెడిసిన్ చదివి అమెరికాలో ఉంటున్నాడు
విక్రమ్ కి పెళ్లయి తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. విక్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యొగము. మరియు ఇద్దరు మగ పిల్లలు.
నిరంజన్ కొడుకు రాకేష్ ని గారాబముగా పెంచినందువలన సరిగ్గా చదువు అబ్బలేదు. డిగ్రీ ఐన తర్వాత ప్రైవేట్
కంపెనీలో సాధారణ ఉద్యొగము చేస్తున్నాడు. రాకేష్ కి ఇద్దరు అబ్బాయిలు. రాకేష్, విక్రమ్ పిల్లలు దాదాపు ఒకే వయసు.
ఒకరోజు విక్రమ్ తల్లి సుగుణతో, “అమ్మా! నిరంజన్ మావయ్య వాళ్ళని మన ఇంటికి భోజనానికి పిలుద్దామా” అంటాడు.
“సరే! వచ్చే ఆదివారము పిలుద్దాము” అని, అన్నయ నిరంజన్ కి ఫోన్ చేసి ఆహ్వానిస్తుంది.
నిరంజన్ కుటుంబ సమేతముతో సుగుణ ఇంటికి వస్తారు.
పెద్దవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటుండగా నలుగురు పిల్లలు రిమోట్ బొమ్మలు ఆడుకుంటున్నారు. విక్రమ్ పిల్లలు, రాకేష్ పిల్లలకి రిమోట్ తో ఎలా ఆడాలో నేర్పుతున్నారు. అదీకాకుండా బ్యాటరీ కారు లో కూర్చునే విధానము రాకేష్ కొడుకుకి చూపించి, కారులో కూర్చోమని భయపడకుండా కారు నడపమంటాడు. రాకేష్ కొడుకు భయముగా బ్యాటరీ కారు నడుపుతాడు. నడిపే కంగారులో కారుని గోడకి గుద్దేసాడు.
నిరంజన్ భార్య స్వాతి మనుమడి మీద కసురుకో బోతుంది. ఇంతలో సుగుణ “వదిన, పిల్లలని ఏమి అనవద్దు, వాళ్ళని ఆడుకొనియ్యి. ఒకవేళ కారు పాడయితే ఇంకోటి కొనుకోవచ్చు, ఒకసారి నీవు నాతో వరండాలోకి రా వదిన” అని స్వాతిని తీసుకు వెళ్తుంది.
“వదినా! పిల్లల మధ్య అనురాగాలు, అనుబంధాలు కొనసాగాలి. అంతేగాని బొమ్మలు, ఆటవస్తువులు మొదలగు వాటి గురించి పట్టించుకోకూడదు. వస్తువులు పాడయి పొతే మరలా కొనుక్కో వచ్చు. అంతేగాని వారిమధ్య బేధభావాలు ఏర్పడితే మన అందరి మధ్య అనుబంధాలు దూరమవుతాయి” అంటుంది.
“నీవు చెప్పింది నిజమే సుగుణా, నన్ను క్షమించు. సరిగ్గా మీరు పాతిక సంవత్సరాలు క్రితము మాఇంటికి వచ్చినప్పుడు నేనే చరణ్ విక్రమ్ లకి ఆడుకునేందుకు బొమ్మలు ఇవ్వనివ్వ లేదు. అప్పుడు నేను చాలా పెద్ద పొరపాటు చేసానని ఇప్పుడు అర్థమయ్యింది” అని బాధ తో చెప్తుంది.
“వదినా! ఇప్పుడు బాధపడి లాభములేదు, రాబోయే తరాలతో ఇటువంటి పొరబాట్లు రాకుండా చూసుకోవాలి” అని, “భోజనము చేద్దాము వదినా” అని వంటగదిలోకి తీసుకు వెళ్తుంది.
--------------------------------------------------------------------------------------------------------------------------
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Comments