'Anuraga Dayyam' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 10/09/2024
'అనురాగ దయ్యం' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
అమెరికా టెక్సాస్ లోని డాలస్ నగరం లో 'లెగసివెస్ట్ మాల్' లో అద్దాల లోంచి అందరిని ఆకర్షిస్తూ రకరకాల రంగులు డిజైన్స్ లో కంపెనీ కార్ల షోరూమ్స్ ప్రక్క ప్రక్కనే ఉన్నాయి.
లోనికి వెళ్లి చూచి వద్దామా అనుకున్నారు ముగ్గురూ..
ఓకే అంటు లోపలికివెళ్లారు. అక్క తన్వి, తరుణ్, తను ప్రేమించిన అమ్మాయి ప్రియా.
“తరుణ్! నువ్వు తీసుకున్న టెస్లా కార్ ఈ మోడలేకదా..” అని అడుగుతున్న అక్కతో “అవును..” అన్నాడు తరుణ్.
“సార్! ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ సైడ్ డోర్స్ కూడా పైకి వెళ్ళేట్టు, చేసినటు వంటి డిజైన్లు ఎన్నో వస్తున్నాయి. ".. అంటూ కస్టమర్స్ వచ్చారని అక్కడున్న డీలర్ వచ్చి శ్రద్ధా పూర్వకంగా వివరించి చెపుతున్నాడు.. ఏమీ అర్ధం కాకున్నా వింటోంది తన్వి.
అంతలోనే మధ్యలో తరుణ్, ప్రియ బయటికి వచ్చి నవ్వుకుంటున్నారు.
తన్వి వెనక్కి తిరిగి చూచి వీళ్లిద్దరూ వెళ్లి పోయారు.. అనుకుని అతనికి థ్యాంక్స్ చెప్పి వచ్చి..
‘మీలో మీరే ఇద్దరూ ఎందుకు నవ్వుకుంటున్నారు? నాకు కూడా చెప్తే నేనూ నవ్వుతానుగా..” అంది.
“నీకు చెప్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏమో?”
“ఇప్పటివరకు నీ సాఫ్ట్వేర్ కోణంలో నువ్వు ఆలోచిస్తావు. ఎంతైనా కంప్యూటర్ మైండ్ కదా.. అన్నిటికీ విపరీతంగా పరిశీలిస్తూ నువ్వు చెప్పిన తర్వాత నిర్ణయం కావాలి కానీ.. ముందే ప్రకటన చేస్తావా? ఉడికించక చెప్పేది చెప్పెయ్యిరా.. నాన్చకు బాబు.. చెప్పు” అంటున్న అక్క తో. “నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. ఇప్పుడు చెప్తే ఎలా అర్థం చేసుకుంటావో ఏమో?” అన్నాడు తరుణ్.
“నేను ఈ షాప్స్ ముందు తిరిగే హ్యాండ్సమ్ బాయ్స్ ను చూస్తున్నాను వదినా.. ఒకరిని మించి ఒకరున్నారు.. ‘నీతో డేట్ కి వస్తాను అని అడిగితే ఆ గయ్స్(బాయ్స్) ఒప్పుకుంటే నేను సరే అంటే నువ్వేమంటావు తరుణ్?’ అంటున్నాను” అన్నది ప్రియ బిడియం లేకుండా.. ,
సన్నగా నవ్వాడు తరుణ్ “అంతే వదినా..”
“ ఇదేనా మీరిద్దరూ లోలోపల నవ్వుకున్నది.. అంతేనా? మీరిద్దరే నవ్వుకుంటూ కనిపించారు.. నాకు చెప్పా లి కదా..” నవ్వుతూ తన్వి చెప్పగానే ముగ్గురు కలిసి నవ్వుకున్నారు..
పెళ్లి కోసమని కోటి కళ్ళతో ఎదురు చూస్తూ తరుణ్ ప్రియా తో ఆమెకి ఇష్టమైన షాపింగ్ అంతా చేస్తూనే ఉన్నాడు.. నచ్చినవి ఉండే షాప్ లో 'బిబా' షోరూంలోకి వెళ్దాం అంటూ చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళింది. నేనేమీ పారిపోను.. ప్రియా అంటున్నాడు. మీద చేయి వేసి లోపలికి నడిచాడు.
నవ్వు ముఖంతో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే “మీ అక్క గారు పక్కనే ఉన్నారు” అంది.
“ఉంటే ఏమీ కాదు? ఆడబిడ్డ అర్థమగడే అయినా కొంచెం దూరంలో ఉంది.. నీ కళ్ళు ఇప్పటి కిప్పుడు మారినట్టు కనిపిస్తున్నాయి. నీలం రంగు నుండి పసుపులోకి మెరుస్తున్నాయి.. అంత ఎండగా కూడా ఏం లేదు?” అంటున్న తరుణ్ తో “ఇక్కడ ఉన్న లైట్స్ వల్ల నీకలా అనిపిస్తుండ వచ్చు. కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది తరుణ్. నీ కళ్ళుకూడఅలాగే కనిపిస్తున్నాయి”.
“అక్క వచ్చింది కదా అక్కా! నీ కళ్ళు చూస్తాను. స్ట్రెయిట్ గా నన్ను చూడు. "
“ కళ్ళ పరీక్షలు ఎందుకురా?”
“ఉండు” అంటూ పరీక్షగా చూసి “నీ కళ్ళు మారలేదు”
“మారడం ఏమిటి? కళ్ళకు రంగులు ఉంటాయా ?”
“ప్రియా కళ్ళు చూడు, ఎలా ఉన్నాయి?”
“బాగానే ఉన్నాయి. ఎప్పటిలాగానే కన్పిస్తున్నాయి”.
తేడా ఉందని చెప్తే పెళ్లి వద్దూ అంటాడు అని అలా చెప్పింది.
“తరుణ్! నీ అనుమానం తీరిందా?”
ఈ కాంప్లెక్స్ లో మంచి రెస్టారెంట్ ఉంది. డిన్నర్ టైం అయింది. అక్కడికి వెళ్దాం. వేడి వేడి బాడీలో కూల్ కూల్ జ్యూస్ లు పదండి పండుగ చేసుకుందామంటూ..
అక్కతో తొందరగా వెళ్ళుతూంటే చుట్టూ పలకరిస్తున్నట్టున్న చెట్ల మధ్య నడుస్తూ, అడుగులో అడుగు వేస్తూ వెనుకకు తిరిగి చూసిన ముఖంతో పాటుక్రింద పొడువైన పాదాలు కూడా తన వైపే కనబడ్డాయి.
ఆగి, ‘ప్రియా’ అన్నా వడివడిగా నడుస్తుంది..
ఆగింది.
“ఏమిటి తరుణ్ భయపడ్డావా? నావి రివాల్వింగ్ షూస్ న్యూ మోడల్. వెనుకకు చూచినప్పుడు అవి మెరుస్తాయి”.
ఇప్పుడు అక్కకు చెప్పినా నమ్మదు. స్టడీస్ కోసం అమెరికాకు వచ్చినప్పటి నుండి ప్రియను చూస్తోంది.. తనకంటే తనతో ఎమ్మెస్ చేసిన ఫ్రెండ్ లాస్య సిస్టర్ ప్రియ గా నాకంటే తనకే చాలా దగ్గర అనీ ఆలోచిస్తుండగానే రెస్టారెంట్లోకి వెళ్లారు.
నాలుగు సీట్స్ ఉన్న టేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓ పక్కగా డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ప్రక్కన పూలతోటలా గోడoతా నిండి, రియల్ గా ఉంది కానీ ఆర్టి ఫిషియల్ పువ్వులు.
ఇది చూసినా, ఎవరిని చూసినా వింతగా కాస్త భయంగా ఉంది. చెప్పుకోలేని నిజం. అందరి ముందున్న మెను లిస్టులో తనకు ఏది కోరుకోవాలో అనే ఇష్టం కూడా చచ్చిపోయింది.
అక్క, ప్రియా రెడీగా ఉండి బేరర్ రాగానే మెడిటేరియటన్ టెస్ట్ కదా.. అని మళ్ళీ మెను కోసం వెతుకు తున్నారు.
కళ్ళలో వంకర తిరిగిన పాదాలే కనిపిస్తున్నాయి. గోలికాయలు.. అంటే కళ్ళు.. మెరుస్తున్నాయి. బెదిరి
పోయి చూస్తున్నాడు.
“నీకు ఇష్ట మైనవి ఆర్డర్ చేయి అంటే అలా బేలగా చూస్తు న్నావు రా..”
“అక్క.. నువ్వు చెప్పావుగా లెమన్ జ్యూస్.. మార్మారా, చిక్ ఫీలె”
“ఏమైనా తరుణ్ టెస్ట్ వేరు. ఇంకా కొత్తవి ఆర్డర్ చేస్తాడను కున్నాను. పంచుకుందాం అన్ని రుచులు అనుకుంటే అంటూ..” చిన్న ఎర్రని నాలుకను జానెడు చేసి చూపించింది బయటికి.
“ప్రియా! స్టాప్ " అని గట్టిగా అరిచాడు.
వెంటనే “ఏమైందిరా.. సంతోషంగా ఉండు. రేపు ఇండియా పోతున్నాం కదా. ఇలాంటి రుచులు దొరుకుతాయా.. అసలే పల్లెటూరు. ఎక్కడి ఆనందాలు అక్కడే” అని అంటూనే దగ్గడం.. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యింది.
అక్కకు వెంటనే గ్లాస్ తో నీళ్లు ఇచ్చి త్రాగమని ఓకేనా అంటూ మళ్ళీ తినడం ప్రారంభించారు. అందరూ ప్రక్కన ప్లేట్లో నుండి అవ కాడో పై తీసుకొని తినబోతుంటే ముందుగా ప్రియ చేతితో పట్టుకొని తరుణ్ నోట్లోకి అందించే సమయంలోనే పూర్తిగా ఉన్న రంగు మారి మట్టి రంగు చూడగానే నాకొద్దు అంటూ కింద పెట్టాడు.
“ఎందుకురా తిను”
తరుణ్.. ఛీచీ అనగానే “మళ్ళీ ఆర్డర్ చేద్దాం” అని ప్రియా అనగానే నో నో అని బయటికి వచ్చారు.
నా ఒక్కడికే ఇలా అవుతుంది అని ఆలోచిస్తుంటే.. ఇది చెప్పుకోలేని విషయం.
“నేనే చేశా” అని పెద్ద కళ్ళు తెరిచింది ప్రియ.
“ఎందుకంటే ఆ ట్రాన్స్పరెంట్ ప్లేట్ క్రింద నీకు కనిపించకుండా ఒక చిన్న బ్యాటరీ పెట్టి వెంటనే రంగు మారేలా చేశా.. అంతే ఒక్కసారేగా నీకు కనిపిoచిoది. తరుణ్ "ఏప్రిల్ ఫూల్" అయ్యాడు” అంటూ గలగలా నవ్వింది ప్రియ.
“నాకు అసలే కనిపించలేదు. నేనైతే కాలేదు” అంది తన్వి.
సరేలే చెప్పుకోలేని విషయం నాకు.
‘నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాను’ అని లోలోపల అనుకున్నాడు.
*************
ముగ్గురూ ఇండియాకిరావడం. రెండు కుటుంబాల వాళ్ళు తరుణ్, ప్రియ పెళ్లికి అన్ని రెడీ చేస్తు న్నారు.
తరుణ్ మాత్రం జ్వరం వచ్చినట్టు ముసుగు తన్ని పడు కుంటున్నాడు.
అమెరికా నుండి వచ్చిన వాడివి అడవికి వెళ్లడమే తప్పు.
ఊరికే వెళ్ళానానేను.. ఫోటోగ్రఫీ కోసం ఆఫీస్ ప్రాజెక్టు పని, అలాగే మా ఫ్రీవెడ్డింగ్ షూటింగ్ కోసం లొకే షన్స్ చూద్దామని వెళ్లడం తప్పనిసరి అయింది.
సెలవుపెట్టిఇంట్లో ఉండక తెలవని ప్లేస్ కు వెళ్లడం వల్లే ఇదంతా జరిగింది.
ప్రియకు తెలుసు అక్కడఏప్రమాదము ఉండదు.. చుట్టూ ఇళ్లుకూడా ఉంటాయి.. అని..
అయినా నేను అక్కడికి వెళ్ళినట్టు ప్రియకు తప్ప ఎవరికీ తెలియదు.
వెళ్ళగానే ఒక పెద్ద మర్రి చెట్టు కింద నా లాప్టాప్ బ్యాగ్ తెరిచి ప్రక్కన పెట్టి కూర్చున్నాను.
లోలోపలఅనుకుంటున్నాను ఇలాంటి వాతావరణాల్లో ఏనాడు ఒంటరిగా నేను రాలేదు. చుట్టూ చెట్లు దూరంగా ఉన్న దట్టమైన అడవి చీకట్లో ఉన్నట్టు ఉంది పట్టపగలే.
అందులో నుండి విదేశీవస్త్రాలు అక్కడక్కడ చిరుగులు, కీచు కీచు పీచ్ పీచ్ అనే శబ్దంతో మాట్లాడు కుంటూ ఫారిన్ నైలాన్ తెల్లటి పొడువాటి లాంగ్ ఫ్రాక్స్ లో పిశాచాలు ఆ భూత్ బంగ్లా వైపు దారితీసాయి.
అందులో ఉన్న నల్ల పిశాచాలు ఒకటి చేతిలో ఉన్న కర్రను గిరగిరా త్రిప్పుతూ తన దగ్గరికి వస్తున్నట్లుంది.
తనకు ఒళ్లంతా చెమటలు బట్టి, కాళ్లు చేతులు వణుకుతు న్నాయి. తప్పించుకునే ప్రయత్నం చేస్తు న్నాడు. అంతలోనే విదేశీభాషలో పిశాచo ఒకటి వచ్చి “ఎక్కడికి పోతావురా? మనo విదేశాలకు పోదాం. నేను నువ్వు ఒకటేనా?” అంది
భయమేస్తోంది.
ఆ నల్లపిశాచాలు వెళ్లిపోతున్నాయి అనగానే వణుకుతున్న ఒళ్ళు చల్ల బడిపోయింది. దాని తెల్లజుట్టు అంతా ముఖం మీదకి కప్పుకున్నది.
ఆ జుట్టు నుండి పసుపు పచ్చ గోలీ లాంటి కళ్ళు బెదిరి స్తున్నాయి.
“భయపడుతున్నావా? నువ్వు భూతు బంగ్లా గురించి సినిమా తీద్దామని ఇక్కడికి వచ్చావు కదా..”
“అయినాపిశాచాలకు ఎలా తెలిసింది? అని అనుకుంటు న్నావు కదా.. నీవు ఏది చేసినా మాకు తెలుస్తుంది. ఫోన్ తీసి పైన పెట్టు”.
ఫోను సిగ్నల్ పోయింది.
బ్యాగ్ లో పెట్టాను.
కాసేపటికి “గుర్తొచ్చిందా నీకు.. అదే రోజు రాత్రి ఆ భూత్ బంగ్లాలో సారంగధర నాట్యం ప్రాక్టీస్ చేయిస్తున్నాడు మా నాట్య ఆచార్యుడు.
ఇక్కడచుట్టూ ఉన్న లొకేషన్స్ లో మేము షూటింగులు చేస్తు న్నాము. ఆసమయంలో మా సాంప్రదాయపు దుస్తులన్నీ మాయమైనాయి. రాత్రికి రాత్రే మాయ అవడంతో ఆ నాట్య రూపకం అంతటితో ఆగి పోయింది.. అని బాధపడ్డారు మానాట్య ఆచార్యుడు”.
“అయితే ఇప్పుడు ఎందుకు నాకు చెప్తున్నావ్ ?దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు”.
“అవునా! ఎంత ముద్దుగా చెప్తున్నావ్ రా. నీ అందమైన బుగ్గలను కొరికేయాలి అనిపిస్తుంది..” అని వింతగా మీదకి వస్తుంటే “నువ్వు పిశాచానివి.. నా పైకి రావద్దు” అన్నాడు తరుణ్..
“అలాగా.. అయితే పారిపో.. చూస్తా.. ఆనాడు మీరు పదిమంది వచ్చి తప్పించుకున్నారు.. కానీ ఈనాడు ఒక్కడివి మా చేతికి దొరికావు రా..”
“నేను ఆనాడు లేను” అనే లోపల ఫోన్లో మెసేజ్ సౌండ్ వినిపించినా సిగ్నల్ ఉండదు అనిచూడకపోతే..
“ఆన్ చెయ్యి వీడియో” అన్నది.
“నీకు తెలుసు. అందుకే ఆన్ చేయాలి.. ఇక్కడ నీకు మొత్తం తెలియాలి” అనగానే ఓపెన్ చేశాడు.
అందులో..
‘తొమ్, తొం, తొత్తోమ్
నాట్యమే నాఊపిరి..
నాలో లేదు అలిపిరి..’
గజ్జెల డాన్స్ అని నృత్యం చూస్తూ నన్ను గేలి చేసి నాకు ఏడుపు వచ్చేలా చేసింది నువ్వు.
ఈ నాట్యం చేయడం ఇష్టం లేదు అని నన్ను రోజు ఫాలో అవుతూ నన్ను ప్రేమలోకి నీమాయమాటలతో దింపింది నువ్వే”.
కళ్ళ ముందు రీలులాగా కనిపిస్తుంది తరుణ్ కు.
“ఎందుకురా నన్ను అలాచేశావు..” అంటూ.. తెల్ల జుట్టు పిశాచి దాని మోడ్రన్ డ్రెస్తో మరింత భయపెడుతున్నట్టు ఉంది.
“గుర్తుందా అలాంటి డ్రెస్సులే వేసుకొని రమ్మని, నన్ను ఫారిన్ కి తీసుకపోతాను అని నా వెంట పడ్డావు”.
ఒక్కసారిగా ఒళ్ళుగగుర్పొడిచింది తరుణ్ కు.
“నేనుమారట్లేదు అని నాకు ఇష్టమైన నాట్యాన్నిమర్చిపోలేదని, నన్నువదిలిపెట్టి నువ్వు ఎంతగానో ప్రేమించిన నన్నువదిలి వెళ్ళి పోయావు కదూ..”
“రేఖా ! నువ్వేనా.. నిజం చెప్పు. ఏమైనా ఆత్మహత్య చేసుకుని నన్ను వెంబడిస్తున్నావా?"
ఆహాహా అని నవ్వుతూ.. “అవునురా. నేనే అని ఇప్పుడు తెలిసిందా?
“కొన్ని రోజుల నుండి నన్ను భయపెట్టిస్తున్నావు. నాలవర్ ప్రియలో ఇలాంటివి చూస్తున్నాను”.
ఆ ఆకారం చీకట్లో కలిసి పోగానే ఇంటికి చేరుకుని ముసుగు తన్ని పడుకున్నాడు.
************
“ఇంట్లో కలిసిమెలిసి ఉంటామని చెప్పుకోవడానికి ఆపదకు సంపదకు అన్ని రకాలుగా వెంట ఉంటేనే కదా! ఇప్పుడా వచ్చేది.. చట్టుపక్కల వాళ్ళు, దూరపు బంధువులు కూడా వచ్చి చూసి పోతున్నారు. ఒక ఇంటి వాళ్ళo, తోటి కోడలువు. పక్కన ఊర్లో ఉండి కూడా పది రోజుల తరువాతనా వచ్చేది?
అంతే. పెద్ద వాళ్ళ మీదగౌరవం, మర్యాద లేకుండా పోయింది”.
“అదేమిటి అక్కయ్య! చంటి పిల్లతో రావడం, ఇక్కడ ఉండడం ఎంతకష్టమో ఆలోచించండి. మీ మరిది వచ్చి అన్ని విధాల సహాయం చేస్తున్నారుగా..
ఇంతకు తరుణ్ కు ఏమైంది? జ్వరం అని చెప్పారుగా.. డాక్టర్స్ వచ్చి మందులు ఇస్తున్నారుగా.. ఎందుకు తగ్గడం లేదు. వైద్యం కోసం వేరే చోటికి తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ లో చూపించండి. డాక్టర్లు ఏమంటున్నారు అక్కయ్య”.
“ఏమి చెప్పడం లేదు. వాళ్లకు అర్థం కాని పరిస్థితి ఉంది. అన్ని పరీక్షలు చేశారు ఏమీ లేదంటున్నారు. రాత్రంతా కలవరింతలు, ప్రొద్దున అంతా ఎవరిని చూసినా భయపడుతున్నాడు. ఎంతైనా చెట్టు అంత కొడుకు నడిమంచంలో ఇలా పడుకుని నిద్ర, ఆహారాలు మాని జీవచ్చవం లా అయ్యాడు” అని కళ్ళు తుడుచుకుంటూ కొడుకును గది నుండి బయటికి రమ్మని బ్రతిమి లాడింది.
“ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటావు, అయోమయంగా కనబడతావు, బెదిరి పోయినట్లు భయపడతావు శరీరం మీద ధ్యాస లేదు. పది సార్లు అరిస్తేనే కానీ స్నానం చేయవు? ఎందుకు .. నీకేమవుతుంది నాన్నా” అంటూ
“కారణం చెప్పు. మూగదయ్యంలా మాట్లాడవు?”
“అలా ఏం చేయట్లేదు. నామీద కావాలని చెప్తున్నారు. కొత్తగా మళ్ళీ నాకు పెళ్లి చేస్తామంటున్నారు. ఎందుకు? నేను పెళ్లి చేసుకోను.. నేను ఇప్పుడు నిజంగా దయ్యాన్ని” అంటూ దయ్యం మాస్క్ వేసుకుని..
“నాకు ప్రియ ఇష్టం లేదు..” అనగానే
“ప్రియా నిన్నుప్రేమిస్తుందిరా.. పెళ్లి అయితే సంతోషంగా ఉంటావు నాన్నా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతో షంగా ఉంటాను”.
“భార్య వల్లనే సంతోషంగా ఉంటారా? మీ అమ్మ వాళ్లు కట్నం తీసుకొని నన్ను కోడలుగా చేసుకుంటున్నారని నన్ను బెదిరిస్తోంది”.
“నీ కట్నం నేనేమీ కడుక్క తాగను. నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఒకదాని పెళ్లి నీకట్నం డబ్బు తోనే చేయాలి..
నువ్వేమో విదేశాలకు అని అక్కడే ఉన్న పిల్లను చేసుకుంటానని అనగానే ప్రియ తల్లితండ్రితో మాట్లాడి కట్నం అడిగాము”.
ఇంతలో ప్రియ ఫోన్ రాగానే గడ గడ వనుకుతున్నాడు.
“మాట్లాడు తరుణ్. ప్రియ ఇష్టపడ్డప్పుడు నీకేం కష్టం”.
అమ్మ.. నీకు ఎలా చెప్పాలి? ఒకప్పుడు నేను రేఖను ప్రేమిం చాను. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అమెరికా వెళ్లిపోయాను. ఇప్పుడు ఇక్కడే భూత్ బంగ్లాలో ఆత్మ హత్య చేసుకుంది. దయ్యo అయి ప్రియలో చేరింది.
“ఏమైందిరా” అంటూ పడుకోబెడుతుండగా ఇంటి ముందుకు పోలీసులు రావడం తో అంతా నిశ్శబ్దమైంది.
“హాల్లో సార్! ఇక్కడ వరకట్నం కోసం ప్రేమించుకున్న జంటను విడదీయాలని కట్నం కోసం మళ్లీ కొడుక్కి పెళ్ళి చేయవచ్చని అనుకుంటున్నారట.. "
వెంటనే తల్లిని “నువ్వు ఒక ఆడదానివేనా, సాటి ఆడపిల్లకు అన్యాయం చేద్దామని చూస్తావా? రేఖా అనే అమ్మాయిని కట్నం తెమ్మని కాల్చుకు తిన్నావట. కాష్మోరా లా ప్రవర్తి స్తావా?” అని వెనుక ఉన్నఇద్దరు అంటుంటే తెల్లముఖం వేసింది తరుణ్ తల్లి..
“వరకట్నం నేరం. శిక్ష వేస్తాం” అన్న పోలీసులతో..
మా అమ్మను ఏమీ చేయవద్దని, తప్పంతా నాదే అని ఒప్పుకుని తరుణ్ బ్రతిమి లాడటం తో పోలీసులకు నిజం చెప్పాడు.
“మేము రేఖ అమ్మ నాన్నలము. రేఖ చనిపోలేదు. రేఖ స్నేహితురాలు ప్రియ. నీ నిజ స్వరూపం బయట పెట్టటానికి ప్రియ నిన్నుప్రేమించినట్లు నాటకమాడింది. నిన్ను భయ పెట్టించిన పిశాచాలు మామూలు మనుషులే. నిన్ను బాగా భయపెట్టించి నీ గతం గుర్తుచేశారు”.
కాసేపట్లో ప్రియ, రేఖ ఇద్దరూ కలిసి వచ్చారు.
“సారీ తరుణ్. నేనే.. ఇలా చేయక తప్పలేదు. నిన్ను మార్చడానికి..”
“ఇట్స్ ఓకే ప్రియా. ముందుగా నేనే సారి చెప్పాలి”.
దూరంగా నిలబడ్డ రేఖ దగ్గరికి వెళ్లి “క్షమించవా? నిన్ను మోసం చేశాను..” అని చేతులు పట్టుకుని “నువ్వు నా ‘అనురాగ దయ్యా’నివి అన్నా డు. అందరూ సంతోషం తో రేఖ, తరుణ్ పెళ్లి జరిపించారు.
శుభం
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Bình luận