'Anuvanuvuna Jwalinchina O Hrudayana'
New Telugu Web Series introduction
Written By Pandranki Subramani
'అణువణువున జ్వలించిన ఓ హృదయాన' తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
(నవల పరిచయ వాక్యం)
పక్షులవి పలు రంగులు. మనవి పలు మనస్తత్వాలు. పలు రకాలు. ఆ రీతిన చూస్తే జీవన కోణాలు కూడా అనేకం, చాలా మంది విషయంలో కాకపోయినా కొందరి విషయంలో జీవితం బొంగరంలా తిరుగుతూ అదుపుకి అందకుండా ఆమడ దూరానికి వెళ్ళి ఆగిపోతుంటుంది. దగ్గరకి వెళ్లి కుదురుగా ఉంచాలనుకుంటే మరింతగా గిర్రు గిర్రున తిరుగుతూ పట్టుకి అందకుండా దొర్లు పోతుంటుంది. ఇది యువకుడైన జైలు డిప్యూటీ సూపరింటండెంటు అశ్వథ్ విషయంలోనూ, అతడి భార్యామణి మంగళ విషయంలో యధాతథంగా జరిగిందనాలి.
మంగళ నిజానికి విద్యాధికురాలు, లా కూడా చదువుకున్నది. కాని స్వభావరీత్యా మృదు మనస్కురాలు, సున్నిత హృదయురాలు విత్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కమిట్ మెంట్. ఒక రోజు జైల్లు స్టాఫ్ క్వార్టర్సులో ఉంటూన్న అశ్వథ్, భార్యను జైలు పరిసరాలలో జరగబోయే ఒక సాంఘిక కార్యక్రమానికి తనతో రమ్మని పిలుస్తాడు, అక్కడ జరగబోయే హ్యూమన్ రైట్స్ డే దినోత్సవ సందర్భాన.
కాని అతడి భార్య మంగళ సుముఖుత చూపించదు. తనను అక్కడకు పిలవకని బ్రతిమాలి బామాలు తుంది. అక్కడకి వెళ్లి వచ్చిన తరవాత తను ఖిన్నురాలైపోతుంటుందని, అకారణంగా మూడ్ పాడుచేసుకుంటుందని, అంచేత రమ్మనమని బలవతం చేయకని నచ్చచెప్తుంది. ఆమె ధోరణికి నిరసిస్తూ “ఒక పోలీసు ఆఫీసర్ భార్య- డిగ్రీ హోల్టర్ ఐన స్రీ అలా బెంబాలు పడిపోయేలా కనిపించకూడదు“ అని నొక్కవక్కాణిస్తూ కారణం ఏమిటని గుచ్చి అడుగుతాడు అశ్వథ్. అప్పుడు జంతు ప్రేమికుల సంఘంలో క్రియాశీలక సభ్యురాలైన మంగళ చెప్తుంది; జైలు ఖైదీలను చూసినప్పుడల్లా తిరగడానికి సరైన చోటు లేకుండా ఉన్నచోటనే వాటి వాటి ఎన్ క్లోజర్ లలో ఇబ్బందికరంగా తిరుగాడే జంతువులు గర్తుకు వస్తాయని చెప్తుంది.
అప్పుడు మరింత తీవ్రంగా నిరసిస్తాడు అశ్వథ్. విద్యాధికురాలై ఉండి భార్య అలా ఏమీ ఎరగని అమాయకురాలిలా మాట్లాడ కూడదని, ఆవిడ గాని కాపురానికి రాకుండా లీగల్ ట్రైనీగా చేరి న్యాయవాద కోర్సుని కొనసాగించి ఉంటే ఆమె ఈ పాటికి క్రిమినల్ లాయర్ గా మారి ఉండునుని— అప్పుడు ఆవిడకు ఇష్టం ఉన్నా లేకున్నా కటకటకాల వెనుక ఉన్న కొందరు కరుడు గట్టి న ఖైదీలతో సరాసరి బేటీ తీసుకోవలసి వస్తుందని వివరాణత్మకంగా చెప్తాడు.
అప్పుడు మంగళ మరింత ఉద్వేగ పూరితంగా స్పందిస్తూ తన వాదనను వినిపిస్తుంది; తను చింతించేది హత్యలూ అత్యాచారాలు చేసి జైలు గోడల వెనక్కి చేరిన నేరస్థుల గురించి కాదని, ఊళ్ళో- వాళ్లను నమ్ముకొని ఉన్న వాళ్ళ కట్టుకున్న భార్యల గురించని, వాళ్ళ విడుదల కోసం ఎదురు చూస్తూ న్న వాళ్ళ బిడ్డా పాపల కోసమని. దీనికి అశ్వథ్ ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ “యు గోట్ ఎ పాయింట్“ అంటూ ఎటువంటి పరిస్థితిలో తను భార్యతో సహా హ్యూమన్ రైట్స్ ఉత్సవానికి వెళ్ళవలసి వచ్చిందో వివరించి చెప్తాడు.
అంతేకాక హ్యామన్ రైట్స్ ఫంక్షన్ ఖైదీలున్న బ్యారెక్స్ లో జరగబోవడం లేదని, ఓపెన్ జైలులో అది జరగబోతుందని వివరిస్తాడు. అప్పుడు తప్పని సరిగా వేరే గత్యంతరం లేక జైలు ఫంక్షన్ కి రావడానికి అంగీకరిస్తుంది మంగళ సగం మనసుతో.
అప్పుడక్కడ మంగళకు ఎదురవుతుంది ఎప్పుడూ కలలో కూడా ఎదురు చూడనిది.. షాక్ ఆఫ్ హెర్ లైఫ్..
ఆమె జీవితంలో మాటలతో చెప్పనలవి కాని పాత్ర వహించిన కాలేజీ మేట్ పవన్ కుమార్ కారాగార ఏకరూప దుస్తులలో చెట్లకు నీళ్లు- పైపులతో పిచకారీ చేస్తూ ఎదురవుతాడు. నిజం చెప్పాలంటే— ఆమె పవన్ కుమార్ ని ప్రేమించిందని చెప్పడం కంటే మనసా వాచా కర్మణ: ప్రాణ ప్రదంగా ఆరాధించిందని చెప్పాలి. ఎందుకంటే అతడితో జీవితం పంచుకోవాలని ఒకనాడు అణువణువే తపించింది. కాని అతడేమో కాలేజీనుండే కాక ఆమె జీవితం నుండే కనుమరుగయాడు; ఆమె సున్నితమైన మనసుని రేకులు చిదిమిన పువ్వులా చిన్నాభిన్నం చేస్తూ—
అప్పుడామెకు ఎదురైన సందిగ్ధావస్థ ఇది— తను మళ్లీ పవన్ కుమార్ వద్దకు వెళ్లలేదు. కనీసం దగ్గరకు చేరి కష్ట సుఖా లు తెలుసుకోలేదు కూడాను. కాని అదే సమయాన అతణ్ణి ఆ పరిస్థితిలో ఏమీ తెలియని మూడవ వ్యక్తిగా తన మానాన తను తొలగి పోలేదు. ఆమె వరకూ అలా చేయడం ఆత్మద్రోహమవుతుంది. ఎందుకంటే ఆమెకు బాగా తెలుసు; పవన్ కుమార్ వ్యక్తిగతంగా ఎటువంటివాడో.. అటువంటి ఘోర నేరం నిజంగా చేసి వెళ్లగలవాడో కాదోనని. మరైతే అత్యాచారం కేసు క్రింద బంధించబడ్డ ఖైదీకి ఆసరాగా ఎలా వెళ్లడం; తన భర్త స్వయంగా జైలు సీనియర్ పర్యవేక్షణాధికారిగా ఉన్నప్పుడు—
ఎట్టకేలకు ఆమె నిర్ణయం తీసుకుంటుంది- ఏదీ ఏమైనా సరే పవన్ కుమార్ ని అలా నిస్సహా స్థితిలో విడిచి పెట్టకూడదని. దానికి ఆమె వేసిన మొదటి అడుగు—మెట్టింటిని విడిచి తను ప్రేమిస్తూన్న భర్తకు సహితం దూరంగా ఉండాలని, ఫుల్ ఫ్లెడ్జ్ క్రిమినల్ లాయర్ గా మారాలని; తన గురువు వేంకట్రావుగారి దిశాదిర్దేశంతో. ఆమెలో జ్వలించే కృతజ్ఞతా భావం ఎంతటి తీవ్రమైనదంటే ఆమె పవన్ కుమార్ కోసమే కాదు— ఊళ్లో ఇక్కట్లు పడుతూన్న అతడి కుటుంబాన్ని సహితం ఆదుకోవటానికి పూనుకుంటుంది. ఆ తీరున అనుకోకుండానే ఆమె భర్త అసహనానికి, అనుమానపు చూపుకి కూడా లోనవుతుంది మొదటి దశన. పవన్ కుమార్ అంతర్గత ఔన్నత్యాన్ని అశ్వథ్ పూర్తిగా తెలుసుకోలేని తరుణాన..
ఆ తరవాత ఆమె జీవితంలో పెక్కు మలుపులు, పెక్కు మార్పులు. చివరికామె అనుకున్నదానిని సాధించడానికి వేషం మాత్రమే కాక పేరు కూడా మార్చుకుంటుంది. డేషింగ్ ఆధునిక విమన్ లా హావభావాలు కూడా మార్చుకుంటుంది. గృహిణి రూపం నుండి ముంబాయి మోడల్ రూపంలోకి కూడా మారుతూంది. గృహ ప్రాంగణం నుండి బయటి ప్రపంచ ప్రాంగణంలో ప్రవేశిస్తుందన్నమాట. ఆ విధంగా దుష్ట గ్రహాలనుండి తప్పుకుంటూ ప్రాణాలరచేత పట్టుకుని పవన్ కుమార్ కేసుని తనే డీల్ చేస్తుంది. విషయాన్ని అర్థం చేసుకున్నఅశ్వథ్ కూడా ఉన్నత హృదయంతో ఆమెకు సహకరించనారంభిస్తాడు; తన ఉద్యోగ ధర్మానికి భంగం వాటిల్లకుండా చూసుకుంటూ—
ఇక ఇక్కడ పేర్కొనదగ్గ మరొక విషయం పవన్ కుమార్ చేత రేప్ చేయబడ్డదని కంప్లెయినెంటుగా పిలవబడ్డ శ్రీనిత్య తండ్రి జోగయ్య ఊరులో ప్రసిధ్ది పొందిన గ్యాంగస్టర్. కళ్లబడ్డ భూములన్నిటినీ కబ్జా చేస్తూ అమాయకులైన వారిపైన వ్యాజ్యాలు వేయడంలో, వాళ్ళను తన దారికి తేవడంలో సిధ్ధ హస్తుడు. నేరారోపణకు పొరపాటు పూర్తిగా పవన్ కుమార్ పైన లేదని తెలిసి కూడా, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ధన బలంతో పవన్ కుమార్ ని బైలు దొరకనివ్వని కేసుతో ఇరికించి కటకటాల వెనక్కి తోస్తాడు. ఇటువంటి అడ్డంకిని కూడా మంగళ తెలివిగా మెళకువగా దాటి ముందుకు సాగుతుంది.
శ్రీనిత్య పెద్దమ్మ(జోగయ్య పెద్దభార్య) సుభద్దమ్మను సహితం ముగ్గులోకి లాగి ఆమె జోక్యంతో సత్యం నిత్యమై వెలిగేటట్టు కేసుని పరిష్కరిస్తుంది. ఎలా పేరు పెట్టి పిలిచినా ఏ విధంగా నిర్వచించినా, చిట్ట చివరన అనంత కాల ప్రవాహానికి అతీతంగా ధర్మం “నీరు పల్లమెరుగు” అన్న రీతిన న్యాయం వైపే కదా మొగ్గుతుంది! పవన్ కుమార్ కి బైలు దొరికేటట్టు పరిస్థితుల్ని ధర్మం దీవిస్తుంది. జోగయ్యనూ అతడి రెండవ భార్యనూ శిక్షిస్తుంది.
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
コメント