'Aparthalu Tolagi' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 12/06/2024
'అపార్థాలు తొలగి..' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“ప్రకాష్! నీకు విశాఖ పట్నం ట్రాన్స్ ఫర్ అయిందిరా. రెండు రోజులలో ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడే డిఎం ఆఫీస్ లో టేబుల్ పైన లిస్ట్ చూసి వస్తున్నాను”.
“ఏమంటున్నావ్? సుధాకర్.. నేను రాష్ట్రం వదిలి పోవడమేమిటి? జిల్లాలో మారుస్తుండవచ్చు. ఇద్దరo ప్రకాశ్ అనే పేర్లతో ఉన్నాము. కె. ప్రకాష్ అని చూసావేమో?”
“నాకేమి గ్రుడ్డి కన్నులు లేవు ఎమ్. ప్రకాష్ అనే చూసానురా..”
“అయితే తట్ట బుట్ట సర్దుకోవాలా నేను? ఇంకా మన వాళ్లు ఎందరు ఉన్నారో?”
“ప్రకాష్, ఫ్యామిలీ తో వెళ్ళు. కొత్త ప్లేస్ బాగుంటుంది. సముద్రతీరం, షిప్పింగ్ యార్డు, ప్రకృతి అందాలకు లేదు సాటి. చుట్టూ సాగర తీరం, ఎటు చూసినా పచ్చని కొండలు, అందాల నగరం విశాఖ పట్నం. మీరు వెళ్లి చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి. బీచ్ లు ఉద్యాన వనాలు, ఆలయాలు, బౌద్ధారామాలు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పట్టణo సొంతం.
మేము పోయిన సంవత్సరం అక్కడే ఉన్నామురా. అవన్నీ తిరిగి చూసామురా. నువ్వు బిజీగానే ఉంటావురా. ఇప్పుడు అక్కడ వీట్ (wheat) ఎక్స్పోర్ట్ (export) చేయాలిరా. అదనపు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఆదాయo కూడా బాగానే ఉంటుంది లేరా! ఏం అధైర్య పడకు?"
**********************
“హాయ్ అనితా!” అంటూ రెండు చేతులతో ఎత్తి గిర గిరా త్రిప్పుతుంటే, “కళ్ళు తిరిగి పడిపోయే లా ఉన్నాను అండీ ! ఏమిటీ అంత స్పెషల్? చెప్పకుండా.. ఏమిటండీ ఆపండీ! కింద పడి పోయేలా ఉన్నా నండీ !" అంటుంటే ఆపి నిలబెట్టాడు.
“నాకు ట్రాన్స్ఫర్ అయింది. భూమి నుండి ఆకాశానికి ఎగిరినట్టు, ఈ పల్లెటూరు ను విడిచి పెద్ద పట్టణానికి అదే విశాఖ పట్టణానికి వెళ్తున్నాం. త్వరగా సామాను సర్దుకో. నీకు చూపిస్తా భూమి మీద స్వర్గాన్ని” అంటూ బుగ్గ మీద ముద్దులు పెట్టాడు ప్రకాష్.
“కొత్తగా హానీ మూన్ లా ఫీల్ అవుతున్నారా?మనకు ఏడాది పాప ఉoది గుర్తుంచుకోండి”.
“అవునా ఆ పాప తో బాటు ఈ బుజ్జి పాప కూడా ఉంది”.
“డాడీ ! ఏమితీ.. పాప అoతున్నారు" అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎత్తుకుని ముద్దు పెట్టాడు ప్రకాశ్.
ముందు సంసారానికి కావలసిన సామాను అంతా ట్రాన్స్పోర్ట్ లో పంపించి, విశాఖ పట్టణం స్టేషన్ లో దిగారు.
“అనితా! ఇది దేశంలో రద్దీగా ఉండే స్టేషన్లలో, తూర్పు తీర రైల్వే జోన్ లోని, ప్రధానమైన రైల్వే స్టేషన్లు లోనూ ఒకటి. "
“అమ్మా! కూలీ కావాలా?” అని అడగడం తో తెచ్చుకున్న సామాను కూలీ తల మీద పెట్టి వెంట నడవడం ప్రారంభించారు.
“ఆటో మాట్లాడాలా సార్?”
“హల్లో ఆటో! ద్వారం వారి వీధి ఇంటినంబర్ 32-8 కస్ప అప్పారావు ఇంటికి పోనియ్యి బాబూ!”
**********
పచ్చని చెట్ల మధ్య పెద్ద స్థలమున్న వీధి వాకిలి, పెంకుటిల్లు అయినా మూడు అద్దె పోర్షన్లు ఉన్న పెంకుటిల్లు, ముందు భాగం లో కొబ్బరి చెట్లు, జామ చెట్టు ఉండి చల్లదనం తో సూర్యుని కప్పేసే మండుటెండ నైనా మరపించే ఇల్లు.
ఆరోజు సామాను ఇంటిలో దించి రెస్టారెంట్ లో భోంచేసి వచ్చారు. పాపకు క్రొత్త ప్రదేశం కొత్త మనుషులు అయినా అందరి దగ్గరికి చనువుగా వెళ్తుంది. ఆ ఇంటి ఓనర్ అప్పారావు రిటైరైన డెబ్భై సంవత్సరాల తాత. ఇరవై ఏoడ్లు మనవరాలు, పదిహేను ఏండ్లు మనుమడు తో ఉంటూ తమాషా చేసే మనిషి. మనుమరాలు వంట చేసి పెడితే తినీ విశ్రాంతి తీసుకునే వాడు.
**********"*******************
ఒకరోజు సాయంత్రం పీట వేసుకుని ముందర బజ్జీల ప్లేట్ పెట్టుకుని, లోపలికి వెళ్ళి వెన్నె బొట్టు( సారాయి) గాజు గ్లాస్ లో పోసుకుని వచ్చే లోపల ప్రకాశం పాప బజ్జీలు ఎత్తుకుని వచ్చేది.
“అమ్మ బుజ్జీ ఎంత పని చేసావు” అని పాపకు దొరక కుండా దాచుకునే వాడు.
పక్క పోర్షన్ లో ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేసే రాందాస్ కు కూడా రెండేండ్ల పాప ఉంది.
“ఏమండీ రాందాస్ గారు మీరు మంచి సింగర్ అని తెలిసింది. పాటలు పాడొచ్చుకదా!" మాకోసమని అడిగిన ప్రకాశ్ తో “తప్పకుoడా సార్! అలాగే పాడుతాను”.
మంచి భక్తి గీతం "శివ శoకరి శివానంద లహరి" అని సంగీత యుక్తమైన పాట పాడాడు. అందరూ అభినందించారు.
************************
అనిత, ప్రకాశ్ కొరకు రక రకాల వంటలు చేస్తుంటే, అప్పారావు మనుమరాలు సౌమ్య ఆంటీ!" మీరు అంకుల్ కోసం వంటలు బాగా చేస్తున్నారు" అనగానే..
ముభావంగా నవ్వి ఊరుకుంది అనిత.
అప్పుడప్పుడూ సౌమ్య కూడా కొత్త వంటలు తెచ్చి రుచి చూపించేది.
“సౌమ్య! రేపు మా పిన్ని కొడుకు ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంది.. వాళ్ల కోసం పిండి వంటలు చేస్తున్నాను".
“అలాగా.. మీరు ఇక బిజీ అన్నమాట. వాళ్ళు.
రెండు రోజులే ఉంటారు సౌమ్య”.
***************************
“హాయ్ ! సాయంత్రం తొందరగా వస్తాను. నువ్వు, పాప రెడీ గా ఉండండి. రామకృష్ణా బీచ్ కి వెళదాం"
“సరే నండి, పాపను రెడీ చేస్తాను. ఆంటీ ! మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేస్ లు ఉన్నాయి. "
************
పాప సముద్ర అలలను చూసి సంతోష పడ్తూ, వాటిని పట్టుకోడానికి పరుగెత్తడం, బీచ్ లో పిచ్చుక గూళ్ళు కడ్తూ చక్కగా ఆడుతుంది.
“అనితా! నిన్ను చూస్తే అలలకు అలజడి ఎక్కువైంది”.
“అలాగా! మీలో కూడా అలజడి ఎక్కువవు తున్నట్లు ఉంది. "
“అవునవును. నా మనసు నీకు తెలుసుకదా! ప్రోత్సాహ మిస్తున్నావ్. సర్లెoడి. ఇలాంటి వాటికి ఏమీ తక్కువ లేదు. చాలా పొద్దు పోయింది. పాపకు నిద్ర టైం అవుతుంది వెళదాం పదండి”.
అలా ప్రతి వీకెండ్ బీచ్ లో సరదాగా గడుపుతూ, ఒకరోజు దీపావళి పండుగ నాడు యారాడ కొండ చూడడానికి వెళ్ళారు. పడవలో బంగాళా ఖాతంలోప్రయాణం చేశారు. చుట్టూ పచ్చని చెట్లతో నిండిన కొండల గుట్టల మధ్య ఉల్లాసంగా నీళ్లను చూస్తూ కొండను చేరుకున్నారు కొండ మీద దేవతను పూజించి అమ్మ వారి అనుగ్రహ ప్రాప్తులయ్యారు. చీకటి పడుతుందని అసలే దీపావళి పండుగ టపాకాయలు, చిచ్చుబుడ్లు, బాంబులు వెలిగిస్తారు అని ఇంటికి బయలు దేరారు.
దారిలో నడుస్తుండగా దీపావళి తారాజువ్వ అనిత ప్రక్క నుండి పోయింది. దాని మిరుగులు చీరపై పడి కొంత కాలిపోయింది. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పి పోయిందని ఊపిరి పీల్చుకున్నారు.
“అనితా! నువ్వు కాటన్ చీర కట్టుకున్నావూ కాబట్టి అంతగా దేహానికి గాయాలు కాకుండా కాపాడింది”.
******************************
“ఏమండీ! శ్రీవారు.. మీరి మళ్లీ తండ్రి కాబోతున్నారు”.
“అవునా.. ఎంత మంచి వార్త చెప్పావు. నీ నోట్లో లడ్డు పెడతా. ఇప్పుడు బాబును ఇస్తావుగా..”
“మమ్మీ! నాకు తమ్ముడు వస్తాడా? నేను తమ్ముడి తో ఆడుకుoటా"
చూస్తుండగా నెలలు నిండే రోజులు దగ్గర పడి ప్రసూతికి అమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళాలని అనుకుంది. ఇక్కడ ఉంటే చేసే వాళ్ళెవరూ లేరు, అమ్మ ఉత్తరంలో అక్కడికి రమ్మని వ్రాసింది అని చెప్పింది.
“శ్రీమతిని వదిలి పెట్టి ఉండాలా? నాకు వంట తంటా ఏమీ రాదు. ఎలానమ్మా? నీకేం, తల్లిగారి ఇంట్లో అన్నీ ఉండి నేను గుర్తు వస్తానో లేదో? పాప బెంగ పడకుండా చూసుకో”.
“దానికేo! అమ్మమ్మ తాత ఉండగా, మీగురించే ఎవరూ చూసే వాళ్లు లేరు. రోజూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను లెండి”.
************************
అనిత ఊరెళ్ళిన తరువాత ఒంటరిగా ఉన్న ప్రకాష్ వంట నేర్చుకుంటూ ఎలాగో కడుపు నింపుకుంటున్నాడు.
“అయ్యో అంకుల్! ముందుగా గిన్నెలో నూనె వేయాలి, కొంచెం వేడయిన తర్వాత మిగతా వస్తువులు వేయాలి” అంటూ అప్పు డప్పుడూ వచ్చి వంటలో సహాయం చేస్తూ, మాటలు కలపడం, చనువుగా మసలడం ప్రకాశ్ కు ఇబ్బంది అనిపించి, కొంచెం దూరం పెట్టాలని చూస్తున్నాడు.
ఏదో చిన్న పిల్ల అని, అనిత ఉన్నప్పుడు ఎక్కువగా రానివ్వడం, ఇంటి ఓనరు మనుమరాలు అని మొహమాటం తో వద్దనలేక కలుపుగోలుగా ఉండడం అవకాశం తీసుకుంది.
“అంకుల్ ! కుళాయి వస్తుంది. మంచినీళ్ళు అందరూ సమానంగా పంచుకోవాలి. అంకుల్ మీ వంటింట్లో బిందెలు తెచ్చి పెట్టండి. "
“ఓహో! మీకు అలవాటు లేదు కదండీ, నేను తీసుకొస్తాను లెండి”, అని బిందెలు తెచ్చి నీళ్ళు నింపి ఒయ్యారంగా నడుస్తూ, నీళ్లు మోస్తూ, మధ్య లో అంకుల్ అని పిలుస్తూ, “కాస్తా బరువుగా ఉంది, మోయండి” అని సహాయం అడగడం,
“సౌమ్య! నీకెందుకు శ్రమ? నేను మోసుకెలతా” అంటూ దగ్గరగా వస్తుంటే చేతులు తాకించడం చేస్తుంది.
“అయ్యయ్యో! అంకుల్ మీ షర్ట్ తడిచింది” అంటూ తుడవ బోతుంటే తడబడ్డాడు ప్రకాశ్.
ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుoది? ఏమిటీ ఈ అమ్మాయి మరీ ఫాస్ట్ గా ఉంది అనిత ముందు కూడా ఇలాగే చేస్తే చెంప పగుల గొట్టేది.
చిన్న విషయాన్ని ఎక్కువగాఆలోచించటం తన బాధలకు మూలకారణం అవుతుందేమో? తీరిక ఉంటే ఆలోచనలు రాక పోవు. అనేక రకాలైన ఆలోచనలతో మదన పడి చివరకు ఆలోచించటమే తప్పనే నిర్ణయానికి వచ్చాడు. తీరిక లేకుండా చేసుకోవటానికి ఏదో ఒక పని కల్పించుకుని చేయడం మొదలెట్టాడు. ఇంటి వెనుక జాగాలో చెట్ల పాదులు పెట్టీ నీళ్ళు పోస్తూ కూర్చునేవాడు. ఈ పని చేస్తున్నా సహాయం చేస్తానని సౌమ్య రావడం, నీళ్లు పోసే టప్పుడు పైపు పట్టుకుంటానని చేతులు కలపడం గిల్టీగా ఫీల్ అయ్యేవాడు.
సౌమ్యను చేయనిచ్చేవాడు కాదు. ఆఫీస్ పనులు ఇంటి పనులు ఎక్కువయి ఇంట్లో నీరసం, నిస్సత్తువ రాసాగాయి. ఇంట్లో పనులు తప్పించు కోవడానికి, రెండు రోజులకోసారి సినిమా చూడ్డానికి బయటి కి వెళ్లేవాడు.
అది కనిపెట్టిన సౌమ్య “అంకుల్! నేనుకూడా వస్తాను సినిమాకు"
“నీకు రావాలని ఉంటే రామ్మా! కానీ ఎవరైనా చూస్తే మీ వాళ్లు"
“మాకు బంధువులు ఎవరూ లేరు అంకుల్ ఇక్కడ. తాతయ్య ఏమీ అనరు. వెళ్ళే మన ఇద్దరిలో ఏ ఉద్దేశ్యం లేనప్పుడు ఎవరు ఏమను కుంటే మనకేమిటి ?”
సినిమా లో ప్రక్క ప్రక్కనే కూర్చుని సినిమా చూస్తున్న ప్రకాశ్ కు ఆఫీస్ కొలీగ్ రాందాస్ కూడా వచ్చాడు. ప్రకాష్, సౌమ్యను చూసి ఏమీ అనలేక పోయాడు.
మరునాడు అనితకు ఫోన్ చేసి సినిమాలో వారిద్దరినీ చూసిన సంగతి చెప్పాడు. ఆ విషయానికి స్పందించిన అనితకి వాళ్ళిద్దరి పై అనుమానం మొదలయింది, ఇంకా ఆలస్యం చేస్తే ముందు ముందు ఏ పరిణామాలు చూడాలిసి వస్తుందో ఏమోనని.
ఎంతైనా మగ బుద్ధి దేనికైనా తెగిస్తుంది. అనిత సౌమ్య మీద అనుమాన పడలేదు.
*************************
వెంటనే విశాఖ పట్టణం బయలుదేరి వచ్చింది. ఏమీ తెలియనట్టు నటించింది. రోజటి లాగే సౌమ్యా అని పిలిచి పనులు చెప్పడం చూసిన అనిత సౌమ్యను నిలదీసింది.
“ఆంటీ! నేను పనులలో సహాయం చేసింది నిజమే, అదే అలవాటున నా పేరు పిలిచారు అంకుల్.. అంకుల్ శ్రీరాముడు లాంటి వ్యక్తి ఆంటీ. "
“ఒకే భార్య ఆయన వ్రతం. అందులో సందేహం లేదు.. మీరు మీ శ్రీవారిని నమ్మండి” అని నమస్కారం చేసింది.
“ఏమండీ!" మీరు ఎప్పటికైనా నావారే అండి" అంటూ బాబును చేతికిచ్చి అపార్థాలు తొలగించుకుని వెనుకనుండి కౌగిలించుకుంది అనిత.
శుభం
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments