#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Appatlo, #అప్పట్లో, #TeluguStories, #తెలుగుకథలు

Appatlo - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 25/01/2025
అప్పట్లో - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమిట్రా.. ! ఆ ఫోన్ అలా చూడకపోతే, అలా బయటకు వెళ్లి ఆడుకోవచ్చుగా.. " అన్నాడు సుబ్బారావు.
"బయట బోర్ నాన్న.. ! ఇక్కడ ఫోన్ లో గేమ్స్ సూపర్.. " అన్నాడు కొడుకు కార్తీక్.
"మా టైం లో మీరు పుట్టి వుంటే ఎలా ఉండేవారో పాపం.. !"
"ఏం నాన్న.. ! అప్పట్లో ఫోన్స్ లేవా.. ? గేమ్స్ లేవా.. ?"
"ఎందుకు లేవు.. ఉన్నాయి.. కాకపోతే అవి వేరే.. "
"అంటే.. అర్ధం కాలేదు"
"అప్పటి విషయాలు తెలియాలంటే, మనం అప్పటి కాలానికి వెళ్ళాలి. అప్పట్లో విషయాలన్నీ చెబుతాను"
"సరే నాన్న.. ! టైం ట్రావెల్ అనమాట.. "
"అదే.. కాకపోతే, అప్పటి విషయాలు నీకు కళ్ళకు కనిపించే విధంగా చూపిస్తాను.. అప్పుడే నీకు బాగా అర్ధమవుతుంది "
"భలే.. భలే.. సరదాగా ఉంటుంది.. "
తండ్రీ కొడుకు టైం మెషిన్ సాయం తో అప్పటి కాలం లోకి వెళ్లారు..
"నాన్నా.. అదిగో చూడండి.. ! మీరే అక్కడ ఉన్నారు.. అమ్మతో"
"అవును బాగానే పోల్చావే.. "
"అప్పుడు మీరు సినిమా హీరోలాగ ఉన్నారు.. ఇప్పుడు చూడండి ఆ బట్ట, పొట్ట వేసుకుని.. ఎలా ఉన్నారో.. "
"ఏం చెయ్యను చెప్పు.. ! పెళ్ళైన కొత్తలో మీ అమ్మ చేసే వంట తినలేక, బయట తినడం చేత పొట్ట వచ్చింది. అది అలాగే కంటిన్యూ అయిపోయింది"
"మరి బట్టతల.. పేనుకొరుకుడా?"
"మీ అమ్మ బుర్ర కొరుకుడు బాబు.. ! అది కొను, ఇది కొను అని పెట్టే టెన్షన్ కి తలపై వెంట్రుకలు ఆవిరైపోయాయి"
"అమ్మ చెప్పబట్టే మీరు బంగారం కొన్నారుగా.. అమ్మ చెప్పింది.. "
"బంగారం కొన్నది నిజమే. ఆ తర్వాత మీ అమ్మ కొన్న చీరలకి అప్పులు ఎక్కువై, వడ్డీలు కట్టలేక, మళ్ళీ బంగారం అమ్మేసాను.. ఆ విషయం నీకు మీ అమ్మ చెప్పలేదేమో.. ! బీరువాల నిండా ఆ చీరలే. పాతవి కట్టదు.. అమ్మితే పైసా రాదు.. "
"పాపం నాన్న.. !"
"అయినా మీ అమ్మ మాత్రం బాగుందేమిటి చెప్పు.. ? అప్పుడేమో సన్నగా ఉండేది.. ఇప్పుడేమో రుబ్బురోలు లాగ లేదూ.. ? మీ అమ్మ కోసం మన గుమ్మం కూడా వెడల్పు చేయించాను.. నీకు తెలుసు కదా.. ?"
"అవును లే నాన్నా.. ! ఎవరి కష్టాలు వారివి. నాకు చెప్పకండి.. 'ఐ యాం స్టిల్ సింగిల్'. ఏదైనా అమ్మే నీ కన్నా కొంచం బెటర్.. "
"ఆపరా.. ! నువ్వు ఇలా కామెంట్ చేస్తే, నిన్ను ఫ్యూచర్ లోకి తీసుకుని వెళ్తా.. నాకైనా నెత్తిమీద రెండు వెంట్రుకలు ఉన్నాయేమో గానీ.. అప్పుడు నీ పెళ్ళాం పెట్టే టార్చర్ కి నువ్వు నా కన్నా దారుణంగా ఉంటావులే.. చూస్తావా.. ?"
"వద్దులెండి.. ! ఇప్పుడు నన్ను హ్యాపీ గా ఉండనివ్వండి ప్లీజ్.. ! కామెడీ లైఫ్ లోంచి హారర్ లైఫ్ చూపించకండి. దణ్ణం పెడతాను నాన్నా.. !"
"అలా రా దారిలోకి.. "
"ఈ ఇల్లు చాలా పాత ఇల్లు లాగ ఉందే.. "
"అప్పట్లో అంతే రా.. గదులన్నీ తిన్నగా ఉండేవి.. అందుకే అప్పట్లో పెళ్ళాం.. మొగుడుతో తిన్నంగా ఉండేవారు.. చెప్పేది వినేవారు. ఇప్పుడు రూమ్స్ వంకరే, వారి బుద్ధీ అలానే ఉంది "
"మీ పెళ్ళి కష్టాలు ఆపండి. ఏదో సౌండ్ వస్తోంది. టీవీ అనుకుంటా.. పదండి చూద్దాం"
"ఏమిటిది.. ఇంత చిన్నగా ఉంది.. అది కుడా బొమ్మ కలర్ లేదు.. నలుపు తెలుపు.. ఛ.. ఛ.. "
"అవును.. అప్పట్లో అదే లేటెస్ట్ మోడల్ టీవీ. అప్పుడు ఒక్కటే ఛానల్ ఉండేది.. అదే చూసేవాళ్ళం. ఇప్పటిలాగ కుప్పలు ఛానెళ్లు మార్చే గోల లేదు.. ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఛానల్.. చూస్తే చూడడం.. లేకపోతే కట్టెయ్యడం.. కరెంటు బిల్ ఆదా "
"మరి మీకు బోర్ కొట్టేది కాదా.. ?"
"వారానికి ఒకసారి టీవీ లో వచ్చే ఒక పాత సినిమా కోసం వారమంతా ఎదురు చూసేవాళ్ళం.. అదే మహా ప్రసాదం మాకు అప్పట్లో. ఇక వారానికి ఒక్కసారి వచ్చే కొత్త సినిమా పాటల కోసమైతే, టీవీ కి అతుక్కుపోవడమే"
"మరి కొత్త సినిమా కావాలంటే.. ?"
"సినిమా హాల్ కి వెళ్ళాలి.. అంతే "
"మీరు చాలా గ్రేట్ నాన్నా.. "
"అప్పట్లో అదే గ్రేట్ రా నాన్న.. "
"అదేమిటి టీవీ సరిగ్గా రావట్లేదు.. ?" అడిగాడు కార్తీక్.
"గాలికి యాంటెన్నా కదిలితే, అలాగే వస్తుంది. చూడు ఇప్పుడు నేను మేడ మీదకు వెళ్లి దానిని కదుపుతాను.. కింద మీ అమ్మ టీవీ లో బొమ్మ చూసి నాకు చెబుతుంది.. "
"కష్టమే నాన్నా.. !"
"ఇదింకా నయం.. మీ మావయ్య పల్లెటూరిలో ఉంటాడు.. అక్కడ సిగ్నల్ ఎప్పుడూ పోవడమే. సాయంత్రమైతే ఆయనకి మేడ మీద యాంటెన్నా తిప్పడంతోనే సరిపోతుంది.. చూసేది తక్కువ.. తిప్పేది ఎక్కువ పాపం"
"ఇక్కడ బోర్ నాన్నా.. వైఫై ఓపెన్ చేయచ్చుగా.. చక్కా బ్రౌస్ చేసుకోవొచ్చు.. గేమ్స్ ఆడుకోవొచ్చు"
"అప్పటికి ఇంటర్నెట్ లేదు.. ఇంక వైఫై ఎక్కడిది చెప్పు.. ?"
"మరి న్యూస్ ఎలా తెలిసేది.. ?"
"రాత్రి వరకు ఆగు.. చూపిస్తా.. ! టీవీ లో ఒక అరగంట న్యూస్ ఇస్తారు అంతే.. ! ఇప్పటిలాగ అన్ని న్యూస్ ఛానల్స్ లేవు.. చెప్పించే చెప్పడమూ లేదు.. ప్రశాంతంగా ఉండేది.. "
"అయ్యో కరెంటు పోయిందే.. ఇప్పుడెలా.. ?"
"జనరేటర్ లేదు.. కరెంటు పొతే బయటకో, మేడ మీదకో వెళ్ళేవాళ్ళం.. లైట్ కావాలంటే క్యాండిల్ లేక కిరోసిన్ బుడ్డీ వెలిగించుకోవడమే.. "
"పాపం అమ్మ నాన్న.. ఎలా బతికారో.. ? పోనీ కరెంటు ఆఫీస్ కి ఫోన్ చెయ్యొచ్చుగా.. "
"నో స్మార్ట్ ఫోన్.. ఓన్లీ ల్యాండ్ లైన్.. అది కూడా బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరే ఉండేది. అయినా, ఇది పవర్ కట్.. ఎప్పుడు వస్తుందో తెలియదు"
"అయితే కష్టమే.. !
"అప్పట్లో మాకు అలవాటే.. !" అన్నాడు సుబ్బారావు నవ్వుతూ
"ఇప్పుడు కిచెన్ లో నాన్న.. ! అమ్మకు ఒంట్లో బాగోలేనట్టుంది.. అందుకే అప్పుడు మీరు వంట చేస్తున్నారు కదూ.. ? ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవొచ్చుగా.. "
"బయట ఫుడ్ తక్కువ.. అప్పుడు ఇన్ని హోటల్స్ లేవు. అప్పుడు ఆన్లైన్ ఆర్డర్ అంటే ఏమిటో మాకు తెలియదు. అయినా మీ అమ్మ ఎప్పుడు వంట చేసిందని చెప్పు.. ? అప్పుడు, ఇప్పుడు నువ్వు తింటున్నది మీ నాన్న చేతి వంటే బాబూ.. ! అందుకే ఆరోగ్యంగా ఉన్నావు.. గుర్తుపెట్టుకో"
"ఒప్పుకుంటున్నా.. ! మరి ఆటలు గురించి చెప్పండి"
"సెలవు వస్తే చాలు.. గ్రౌండ్ లో ఆడే ఆటలు, ఇంట్లో ఆడే ఆటలు చాలా ఉండేవి. ఆ ఆటల లిస్టు పెద్దదే. ఇప్పుడు మీకు వాటిలో చాలా పేర్లు కుడా తెలియదు.. పదా ఆ ఆటలన్నీ చూపిస్తాను.. " అంటూ ఆటలు చూపిస్తూ వివరించాడు సుబ్బారావు.
"ఇవన్నీ నా వల్ల కాదు.. ఈ వాతావరణంలో ఒక్క క్షణం కుడా ఉండలేను. ప్రశాంతంగా లేకపోయినా.. మన కాలానికే పోదాము.. అక్కడ ఏసిలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటా.. ! మీరు గ్రేట్ అని ఒప్పుకుంటున్నాను నాన్నా.. !" అంటూ దణ్ణం పెట్టేసాడు కార్తీక్.
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
"అప్పట్లో" కథలో, రచయిత మోహనకృష్ణ తాత గతం, ప్రస్తుతం ఉన్న కాలం మధ్య తేడాలను ఆకట్టుకునే విధంగా చిత్రించాడు. ఈ కథలో ప్రధానంగా తండ్రి, సుబ్బారావు, కొడుకు కార్తీక్ మధ్య సంభాషణల ద్వారా గతం, ఈ కాలం మధ్య ఆర్థిక, సాంకేతిక, సామాజిక మార్పులను వివరిస్తాడు.
పాత్రలు సాంకేతికత, ఆటలు, భోజనం, టెలివిజన్ వంటి జీవితంలోని సాధారణ విషయాలపై తేడాలను వ్యక్తం చేస్తాయి. కార్తీక్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, వైఫై వంటి సాంకేతిక పరిజ్ఞానంతో జీవిస్తున్నప్పుడు, సుబ్బారావు పాత కాలంలో తన జీవితాన్ని, అప్పుడు ఉన్న కొరతలను, సంతోషాలను చెబుతాడు. ఈ సంభాషణల ద్వారా, పాత కాలం కంటే ప్రస్తుత కాలం ఇంకా ఆధునికంగా మారినప్పటికీ, ఆ కాలంలో ఉన్న అనుబంధాలు, గుణాలు, మనోభావాలు కూడా ఎంత గొప్పవో మనం గుర్తించగలుగుతాము.
ప్రస్తుతం ఉన్న పలు సౌకర్యాలు, సాంకేతికత, సమాజంలో జరిగే మార్పులు చాలా వేగంగా మారిపోతున్నాయి. కానీ, ఆ పాతకాలపు సంప్రదాయాలు, జీవన విధానాలు, వాటితో కూడిన సంతోషాలు కూడా గుర్తుంచుకోవడానికి అవసరమని కథ ద్వారా రచయిత సూచిస్తున్నాడు.
సో, "అప్పట్లో" కథ అనేది ఒక పూర్వకాలపు…
అప్పట్లో: మోహన్ కృష్ణ టాటా
ఆదిత్య 369 (టైం మెషీన్) సినిమా గుర్తుకు తెచ్చింది ... అలాగే మా చిన్న నాటి రోజులు కూడా ... గ్రౌండ్ కు వెళ్లి ఆటలు - పాటలు - మానస వికాసం
Ii) పుస్తక పఠనం (కామిక్స్, పత్రికలు, చిన్న కథలు ఇతరత్రా)
పి.వి. పద్మావతి మధు నివ్రితి