#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #Apurupam, #అపురూపం
Apurupam - New Telugu Poem Written By K. Lakshmi Sailaja
Published In manatelugukathalu.com On 17/01/2025
అపురూపం - తెలుగు కవిత
రచన: కే. లక్ష్మీ శైలజ
అపురూపం
నాకు
అక్షరాలు దిద్ధించిన అమ్మ
ఆలనా, పాలన చూసిన అమ్మ
అణకువ నేర్పిన అమ్మ
అనురాగం తో కట్టేసిన అమ్మ …..
నేను
అక్కయ్యతో ఆడిన అట్లతద్ది
అక్కతో కలిసి చూసిన ‘అక్క-చెల్లెలు’ సినిమా
అన్నయ్యతో ఆడిన అష్టాచెమ్మా
అన్నయ్య చెప్పిన చార్లీ చాప్లిన్ కథ…
నాకు
నాన్న నేర్పిన సైకిల్
నాన్న ఇచ్చిన ఇంకు పెన్ను
నాన్న చెప్పిన వేమన పద్యాలు
నాన్న కొనిచ్చిన చెక్క లక్కపిడతలు ….
నాకు
నాన్నమ్మ చెప్పిన చందమామ కథలు
నాన్నమ్మ చేసిన నేతిపూరీలు
నాన్నమ్మ ఇచ్చిన మువ్వన్నెల పట్టుచీర
నాన్నమ్మ వేసిన జాజిపూల జడ ….
నాకు
అంగరంగ వైభవంగా కళ్యాణం చేసి
అమాయకపు అమ్మాయినయిన నన్ను
ముచ్చటగా చూసే అత్తయ్యకు అప్పగించేంతవరకూ
అన్నీ అపురూపమైన జ్ఞాపకాలే, అందరూ అపురూపమే
***
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
సమాప్తం
రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
కర్ణం లక్ష్మి శైలజ గారి కవిత "అపురూపం" .. నిజంగా అపురూపం గా ఉన్నది.
అన్న చెల్లి అక్క తమ్ముళ్ళ - అమ్మ నాన్న - తాత అవ్వ .. బంధాలు - అనుబంధాలు బాగా ఇమిడ్చారు .. ఒక్క చిన్న కవుతలో .. ఆట వస్తువులు - తిను బండరాలతో సహా.
Excellent.
కుంబాలంటే ఇలా ఉండాలి.
దూరం దూరం వహిస్తే .. జోక్యం లేకుండా .. అప్పుడే కుటుంబాలలో ఐక్యత ఉంటుంది.
జాగ్రత్తలు లిఖిత పూర్వకంగా చెప్పుకోవచ్చు ఒకరి కొకరు (ఒక నోట్ పుస్తకం పెట్టుకొని) ... నోటి మాటలు ఉండక పోతే ... మనస్పర్ధలు - జగడాలు ఉండవు.
పి. వి. పద్మావతి మధు నివ్రితి